Friday, 29 December 2017

అద్భుతం
 ======
రంగులు చిమ్మిన ఆకాశం 
చిగురులు తొడిగిన భూగోళం 
రంగుల కేళి రవి మోము 
చిగురుసరాగం భూగోళం 
అంతే దొరకని రవి హృదయం 
సకల సృష్టికి తనే మూలం 
సిరులకు నిలయం భూగోళం 
ప్రాణుల మనుగడ కదినిలయం 
విశ్వఖగోళపు వింతలతో 
అబ్బురపరుచును అంబరము 
అందాలొలికే భూగోళం 
ఆదిమన వృద్ధికి భూతల స్వర్గం 
          జైహింద్ 

Sunday, 3 December 2017

లంచం ఒక అంటువ్యాధి ..!
================
లంచం ఒక అంటువ్యాధి !
అరికట్టే వైద్యుడేడి ?
జగమంతావ్యాపించి
పీడించి చంపుతుంది !
పుడమి పైన ప్రతి మనిషి
జన్మించిన నాటినుండి
పెన వేసుకు పుడుతూనే
చావకుండా బతుకుతుంది !
యుగాలన్ని గతించినా ?
తరాలెన్నో మారుతున్నా ?
ప్రగతి పథంలో మనిషి
వైజ్ఞానిక దారుల్లో
సాంకేతిక విప్లవాల్తో
విజ్ఞానిగా వెలుగుతున్నా ?
లంచమనే అంటువ్యాధి
చావకుండ నేటికి
చిరంజీవిగ బతుకు తుంది !
వైభవంగ వెలుగుతుంది !
నవ సిద్ధాంతాలెన్నో వచ్ఛే
ప్రజాప్రభుత్వాలు వెలసే
చట్టాల సంకెళ్ళు ఎన్నెన్నో అడ్డేసి
శిక్షించి అరికట్టిన
ఆలంచమే ఎరగా మారి
చట్టాలను చుట్టాలుగ
మలుచుకొని బయటపడి
మీసాలు మెలివేసి తిరిగే !
మనిషి ప్రకృతిని జయించి
ప్రాణాంతక వ్యాధులెన్నో
అరికడుతు సాగుతున్నా?
లంచమనే వ్యాధిని
అరికట్టలేక పాయే ?
తల్లి దండ్రులే ఈవ్యాధికి
మూలపురుషులై పోయే !
మేలుకొని వారిప్పుడు
తమపిల్లలకు సోకకుండ
అరికడితే కొంతమేలు !
జైహింద్ .

Thursday, 16 November 2017

కనిపించే దేవుళ్ళు ..!
=============
నెత్తిమీద దేవుడు !
కాళ్ళ క్రింద దేవతా!
ఆదేవుడు సూర్యుడు
ఈదేవత భూదేవి
కనిపించే దేవుళ్ళ
చెయ్యెత్తి మొక్కకుండ
కానరాని దేవుళ్ళ
గుళ్ళ చుట్టు తిరుగుతూ
ఇల్లు గుల్ల చేసుకునే
మానవుడా !ఓపామరుడా !?
సూర్యుడే ప్రాణ దాత !
భూదేవి అన్నదాత !
గాలి నీరు నీజీవం
శ్రమయే నీఆస్తి పాస్తి
శ్రమిస్తే నీకు ముక్తి !
బతుకంతా జయం !జయం !!
ఆ దేవతల కరుణ లేందే
బతుకలేవు ఒక్క క్షణం !
చెయ్యెత్తి మొక్కారా?
ప్రతినిత్యం తల్చుకోరా ?
మానవుడా!ఓపామరుడా!
సూర్యుడంటే సూన్యం కాదు?
సకల సృష్టికి మూలము!
భూదేవి అంటే మట్టి కాదు?
సిరులు చిందే లక్ష్మీరా!
గాలినీరు దయ్యాలు కావు?
నీఆయుష్షుకి ప్రాణము !
ఈసత్యం నీకుతెలుసు !
ఎందుకింక ఆలస్యము ?
చెయ్యెత్తి మొక్కారా!
ప్రతినిత్యం తల్చుకోరా!
ప్రకృతియే నీకువరం !
నీబతుకు ధన్యము !!
జైహింద్ . 

Tuesday, 31 October 2017

కవిత్వం క్రాంతి మయం !
================
నేను సూర్యున్ని
గొడుగుగా కప్పుకున్నాను !
నేను చీకటిని
కనురెప్పల మాటున దాచుకున్నాను !
నేను చీకట్లో వెలుగును చూడగలను !
నేను కవితా క్రాంతిని కదా !
కవిత్వం కల్పిత మైతే
దృశ్యం అవాస్తవ మవుతుంది
కవిత్వం వాస్తవ మైతే
దృశ్యం సజీవంగా నిలుస్తుంది !
నేను పాలక పక్షం వయిస్తే
యాచకుడిగా మిగిలి పోతాను !
నేను ప్రజా పక్షము వయిస్తే
జనహృదయాల్లో దర్పణ మైవె లు గుతాను !
కవిత్వం కాసులు కురిపించే
ఖార్కాన మాత్రం కాదు ?
కవిత్వం క్రాంతిని వెదజల్లే
అక్షర నవీన క్రాంతి !
ఆక్రాంతిని ఆస్వాదించేవాళ్ళు
భావ పుష్టిలో పునీతులు కాగలరు !
వాళ్ళ నడతను సరిదిద్దుకోగలరు !
ఆదికవిత్వానికున్న
బలమైన అక్షర జ్ఞాన శక్తి !
నేను ప్రతి నిత్యం కవిత్వాన్ని జపిస్తూ
కవిత్వంతో కరచాలనం చేస్తున్నవాడిని !
నేను కవితాక్రాంతిని కదా !?
జైహింద్ .


Thursday, 12 October 2017

కవి
==
కవితనై వెలిగాను !
కష్టాల్లో మునిగాను !
కవితక్రాంతి మాయమైనా
నాబతుకు తిమిరమయ్యేను !!
కవితపురుడు పోయాలంటే
ప్రసవవేదన తప్పదు ?
రూపు దిద్దుకున్న కవిత
అచ్ఛు పడి పోవాలంటే
జేబుగుల్ల కావాలి
సత్కారాల పేరిట
చేతి చమురు రాలాలి
అప్పుడే కవి తాను
నలుగురిలో వెలుగుతాడు !
కష్టాల్లో మునుగుతాడు !
కవిత కీర్తి చంద్రికైనా
కడుపు నింపగలదా ?
తినే వేళలో కూడా
పట్టే డన్నము దొరకదు
మరణాంతరం జనం ప్రభుత
సభలు పెట్టి కీర్తించి
సొమ్ముచేసుకుంటారు
మహా కవుల కెందరికో
తప్పలేదు దుస్థితి
కడుపు నిండ వలెనంటే
కవిత కాసు లవ్వాలి
కవి బతుకు పండాలి
కవిత క్రాంతి అవ్వాలి
సమాజాన్ని దిద్దాలి !!
హైహింద్ . 

Tuesday, 3 October 2017

భాషా? యాసానా... ఏది ప్రామాణికం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భాష ప్రకృతిలో ధ్వనించే శబ్దాలనుండి పురుడు పోసుకుంటుంది. ఆ శబ్దాల పలుకులలో నుండే భూమిపై ఆవిర్భవించిన మానవులు వాటిని, మాటలుగా అల్లుకున్నారు. అలా ప్రపంచంలో ఎన్నో దేశాల ప్రజలు వారి కనుగుణంగా భాషను తీర్చిదిద్దుకున్నారు. అలా దేశానికి ఒక భాషగా వెలసిన భాష, ప్రాంతాలుగా విస్తరించి ప్రాంతానికి ఓ భాషగా ఏర్పడింది.
అలా మాటల్లోనుండి పుట్టిన భాష, మాటగా, పాటగా, నాటకంగా రూపుదిద్దుకొని, సమాజంలో తన పాత్ర నిరంతరంగా పోషిస్తూ వస్తున్నది. భాషలో నుండే సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు పుట్టుకొచ్చి వారి వారి జీవన విధానాలను తెలియపరిచింది.
ఎప్పుడైతే మాట, పాట, కథ, ఛాయాచిత్రాల్లో ప్రవేశించాయో- అప్పుడే ఆయా దేశాల కథలు, చరిత్రలు దృశ్యరూపాలుగా మారి ప్రేక్షకులను ఆనందడోలికల్లో ఓలలాడించాయి.
సినిమా బలమైన మీడియా అయినందున, అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా, ప్రాంతీయ భాషల్లో కూడా తన ప్రస్థానం కొనసాగిస్తుంది. నేడు ఎన్నో సాంకేతికపరమైన మార్పులో సినిమా దినదిన ప్రవర్థమానంగా వెలుగుతుంది. ఎందరో కొత్తవారు చిత్ర పరిశ్రమలో అడుగిడి తమ తమ అభిరుచిని, వ్యాపార ధోరణిని చాటుకుంటున్నారు.
తెలుగు భాషలో ఎన్నో జోనర్లమీద చిత్రాలు నిర్మించబడి, స్వర్ణయుగంగా భాసిల్లాయ! అయితే సినిమా పండితులను, పామరులను రంజింపచేసే దృశ్యకావ్యం కాబట్టి, ఆ రెండు వర్గాలను దృష్టిలో పెట్టుకొని, తేలిక మాటలతో పాటలతో నవరసాలను జొప్పించి ఆ చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకులకు చూపిస్తారు. సినిమా తెలుగు భాషకు సంబంధించినదే అయినా, తెలుగులో వున్న మూడు ప్రాంతాలకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు అనువుగా వుండేలా చూసుకొని సినిమాలు నిర్మించారు. సినిమాలోని ప్రధాన పాత్రలకు వాడుక భాషను, కామెడీ, విలన్ పాత్రలకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మాండలిక యాసలను ప్రవేశపెట్టారు. అయితే.. భాష విషయంలో తెలుగు సినిమాల్లో కొన్ని ప్రాంతాలకు ద్రోహం జరిగిన మాట వాస్తవమే అయినా, అందుకు మిగిలిన ప్రాంతాల వాళ్ళు చిత్రరంగానికి రాకపోవటం కారణం అయితే, వచ్చిన ఏ కొద్దిమందో చిత్రరంగంలో నిలదొక్కుకోకపోవటం రెండవ కారణం? ఇక్కడ ఎవరిని తప్పు పట్టవలసిన పనిలేదు. సినిమా వ్యాపారమన్నప్పుడు, పెట్టిన ప్రతి పైసాకు లాభం వచ్చేలా చూసుకోవటమే ముఖ్యం. కాబట్టి ప్రతి నిర్మాత, దర్శకుడు లాభాపేక్షతోనే చిత్రం తియ్యాలనుకుంటాడు. కాని యాస, సంస్కృతి, ఆచార వ్యవహారాలు కావాలని కోరుకోడు. అది ధర్మం కూడా కాదు. అలా అయితే ఆ నిర్మాత నెత్తిన చెంగు వేసుకొని వెళ్ళవలసిందే! దర్శకుడు రోడ్డున పడి ఆకలితో అలమటించవలసిందే!
నేడు చిత్ర పరిశ్రమలో ఒక ధోరణి మొదలైంది. తెలంగాణ భాషలో సినిమాలు తీస్తే విజయవంతమవుతాయని! ప్రభుత్వం పన్ను రాయితీలు ఇస్తుందని! అసలు తెలంగాణ భాష అంటే ఏమిటో అలా అనేవాళ్లకే తెలియాలి. తెలుగు అనేది ఒక భాష. తెలుగు తల్లి అనేది భాషకు సంబంధించిన తల్లి. తెలంగాణ తల్లి అనేది ప్రాంతానికి సంబంధించిన తల్లి. భాషావేత్తలు ఇది గుర్తించాలి. అప్పుడే తెలుగు భాష అంటే ఏమిటో? యాస అంటే ఏమిటో తెలుస్తుంది.
తెలుగు రాష్ట్రం సమైక్యంగా వున్నపుడు ప్రతి జిల్లాకు ఓ మాండలిక యాస వుంది. నేడు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అవే మాండలిక యాసలు కొనసాగుతున్నాయి. విజ్ఞులు గుర్తిస్తే సరి!
తెలుగు రాష్ట్రం సమైక్యంగా వున్నపుడు తెలంగాణ ప్రాంతం నుండే ఎక్కువ ఆదాయం విడుదలైన ప్రతి సినిమాకు వచ్చేది. నేడు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, తెలంగాణ ప్రాంతం నుండే ఎక్కువ ఆదాయం ప్రతి సినిమాకు వస్తుంది. పైగా సిఎం, తెలంగాణ చరిత్రను, సంస్కృతిని ఆవిష్కరించేలా సినిమాలు తీస్తే పన్ను రాయితీలు, బహుమతులు ఇస్తానని ప్రకటించారు. ఆ మాట ప్రకారమే ‘రుద్రమదేవి’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాలకు పన్ను రాయితీ ఇచ్చారు. ఇక నాటినుండి తెలంగాణ భాషా సినిమాలని మొదలైంది! అది నిజం కాదు?
సినిమాల్లో ఒక ప్రాంతం యాస, సంస్కృతి సంప్రదాయం తొణికిసలాడుతూ ఆ ప్రాంతం ఆత్మ ఆ చిత్రం పరిపూర్ణంగా ఆవిష్కరించబడాలి! అప్పుడే అది ఆ ప్రాంతం చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది. మాండలిక భాషావేత్తలను ఆకట్టుకుంటుంది. అలా నిర్మించిన చిత్రాలే ‘చిల్లర దేవుళ్ళు, మాభూమి, రంగులకల, దాసి’ ఇలా కొన్ని చిత్రాలు తెలంగాణ చిత్రాలుగా ముద్ర వేసుకున్నాయి. ప్రపంచ గుర్తింపును తెచ్చుకున్నాయి. అంతేకాని తెలంగాణ యాసను మాటలుగా రాసి తెలంగాణ వాళ్ళు తీసి నటిస్తే, తెలంగాణ యాస చిత్రాలు కావు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే చిత్రాలుగానే పరిగణింపబడినాయి. ఇకనైనా వాదోపవాదాలు మాని, యాస, సంస్కృతి, చరిత్ర ఆవిష్కరింపబడేలా చిత్రాలు తియ్యాలని ఆశతో..
-ఆకుల రాఘవ

Monday, 4 September 2017

స్వచ్ఛ భారత్
========
నోరు శుభ్రమైతే
మాట మధువు లారబోస్తుంది !
తనువు శుభ్రమైతే
మనిషి పరిమళించును !
శుభ్రమైతే దేశము
దివ్వ తేజమై వెలుగు !
అదే స్వచ్ఛ భారతం !
హరిత హరిత నందనం !!
చెట్ల నిండ దుమ్ము పట్టి
బోరున విలపించగా
గాలి చేతులు పట్టి
శుభ్రంగా దులుపును !
వానతలకు పోసి
శుభ్రంగా కడుగును !
చెట్లు పరిసరాలు
మురికితొలిగి మురిసి
పచ్చని సింగార మొలకు !
హాయి హాయి ఆమని
వసంత గీతి పాడును !
అదే స్వచ్ఛ భారతం !
అరిత అరిత నందనం !!
గాలివాన బాధ్యత
మనిషిగుర్తించవలే !
వీధులన్నీ శుభ్ర పరిచి
తళ తళ మెరిపించవలే !
దుర్గంధపు కాలువల
సుమగంధముగా మలిచి
గల గల పారించవలే !
కాలుష్యం తొలిగిపోయి
మనదేశం పరవశించు !
ఆరోగ్యం వెల్లివిరియు !
అదే స్వచ్ఛ భారతం !
హరిత హరిత నందనం !!
       జైహింద్ .

Sunday, 23 April 2017

Akasham bhugolam

ఆకాశం-భూగోళం..! *************** మండుతున్నఆకాశం నిండుకుండభూగోళం ప్రేమతోనేజతకడితే సకలప్ర్రాణిసృస్టిసదా పురుడుపోసుకుంటుంది! ప్రకృతిగర్భము అదోవింతరహస్యము! ఎప్పుడెలామార్పుచెంది వింతసృస్టిచేస్తుందో?! మండుతున్న ఆకాశం నిండుకుండభూగోళం చేసుకున్నఒప్పందం వ్రాసుకున్నప్రమాణం మనిషికెలాతెలుస్తుంది? అగ్నిలోననీరుపుట్టి నీటిలోనఅగ్నిపుట్టి సాగుతున్నకాలం వీచేగాలిఊపిరి తాగునీటివైకరి చూస్తేనీకేతెలుస్తుంది సకలప్రాణులజీవనం ఆకాశంభూగోళం బుద్ధిపుట్టిచేసేసృష్టి !! జైహింద్.

Wednesday, 19 April 2017

Vidhidharmam

విధిధర్మం -------- కంటేనేపిల్లలనిఆనందిస్తే పుట్టిపెరిగిగుండెలమీదతన్నిపోదురుపిల్లలుతన్నిపోదురు! కనటమేయంత్రాలైతేఆలుమగలు లెక్కలేనిసంతానంపుట్టిపెరుగును తిండిలేకపిల్లలంతసచ్చిబతుకును అనుకున్నాఅలుమగలు ఇద్దరేముద్దనీ ఇంటికేవెలుగనీఆపైనవద్దుఅని కనకుండాత్ల్లిదండ్రులు పద్ధతులుపాటించిరి లోకాన్నిఅరికడుతుమునుముందుకుసాగిరి మురిపెంగాఇద్దరినిపువ్వుల్లాపెంచివాళ్ళు చక్కగాచదివించిపెళ్లిచేసిమురిసిపోగామీకుమాకుదూరందూరంఅనుభవించేవయసుమాది కొత్తపల్లవిఎత్తుకుంటగుండెలమీదతన్నిపోదురు ఆడపొందుమహిమఅదిఆపబ్రహ్మతరంకాదు! తరతరాలనైజమిదివంతెనమెట్లబాటఇది !కన్నకర్మానికిఅనుభవించుటే విధిధర్మం! జైహింద్.

Bommalata

బొమ్మలాట! ********** మనిషిమారడు! తనమనసుమారదు! రాళ్ళనుబొమ్మలుచేసి దేవుళ్ళుగనిలబెట్టి పూజలెన్నోచేస్తాడు మొక్కులెన్నోమొక్కుతాడు రాతిబొమ్మలాట మనిషిరాతమార్చునా? పూజలతోమనిషికున్న వేదనతీరునా? మొక్కులతోమనిషిబతుకు మొగ్గతొడుగునా? అన్నసంగతేమరచి మనిషిమాయలోపడి తనచేతుల్లోరూపు దిద్దుకున్నదేవుళ్ళను వరములిచ్చిబ్రోవుమని పంతంపట్టిఅడుగుతేలా?! బొమ్మలాట్లోమనిషి దేవుళ్ళకుబదులుగా దేవుళ్ళపెళ్లితంతులో మనిషితాళికట్టుడేంది? అంగరంగవైభవంగా జరిపేవేడుకమర్మమేందో? దేవుళ్ళకేఅర్థంకాక మూగరాతిబొమ్మలైరి! మనిషిచేష్టలర్థంకాక ఆలయాల్లోకూర్చుండిరి ఏమిటోమనిషివేడుక తరతరాలబొమ్మలాట!! జైహింద్.

Thursday, 6 April 2017

Oshivalinga

రాయినితెచ్చిబొమ్మగాచెక్కి ఆబొమ్మలోనిన్నేప్రతిష్టచేసి నిత్యంపూజలునేచేస్తువున్నా కరుణించవేరాఓశివలింగా! ప్రత్యక్షమేకావుఓశివలింగా!? ఏడేడులోకాలునువ్వుఏలుతున్నా స్మశానమేనీకుచల్లనిఇల్లంటా!ఎన్నేన్నోవరహాలునువ్వుఇస్తువున్నా ఇల్లిళ్ళుతిరుగుతుబిక్షఅడుగుతుంటావు ఏమిటోనీమాయ?ఏమిటోనీలీల ? నాకేలతెలుసురా? ఓశివలిఅంగా? బద్దశత్రువులైననీఇంటకొలువుండే నందిబెబ్బులినెమలినాగు ఎలుకఏకమైనీకునీసతికి పుత్రులకెప్పుడువాహానాలుగానవిసేవలేచేస్తుండేకలసిమెలసితిరుగాడే!ఏమిటోనీలీఎల?ఓశివలింగా! మనుషులమంతామేముఒకటనితెలిసినా ? ప్రతిరోజుమేమంతచంపుకుచస్తువున్నా వేడుకనువుచూస్తుతాండవమాడేవు! ఏమిటోనీమాయ?ఏమిటోనీలీల? నీఇంటివాహానాల్లమమ్మెందుకుంచవు ?ఓశివలింగా?కాపాడవేరాఓశివలింగా!! జైహింద్.

Wednesday, 5 April 2017

Neethi-avineethi

నీతి-అవినీతి..! ************* నీతితప్పితేమనిషినియంతనే! తనఇంటినిండసంపదలుదండిగుండును! నీతికినిలబడితేమనిషినిత్యదరిద్రుడే ! తనఇంటినిండఆకలితాండవమాడును! లోకమంత ఈపోకడసాగుతుండెను! తెలుసుకుంటేమనిషికొంతమార్పుచెందును ! నీతిగాధనవంతులుకారుఎప్పుడు? తోడులేందేపెరుగెప్పుడుగడ్డకట్ట దు ! తెలుసుకున్నవారంతధనవంతులు ! నీతివెంటనడిచెటోళ్ళుబీదవాళ్ళు !లోకమంతౖతేడాతోసాగుతున్నది న్యాయమెప్పుడుగెలుస్తుందోతెలువకున్నది? ధనవంతులులోకాన్నిశాసింతురు ! వారిచెప్పుచేతుల్లోసమాజాన్నితొక్కిపడుదురు! ప్రజలచేతసేవలెన్నోపొందుతుందురు మీకంతాదిక్కుమేమనిచెప్పుకుందురు ! అ నాదిగాసాగుతున్నమానవనైజము !తెలుసుకుంటేమనిషికొంతమార్పుచెందును !! జైహింద్.

Friday, 24 March 2017

Kavitha

ఆకలి..! ****** ప్రాణమున్నప్రతిప్రాణికి ఆకలొకటిఏడ్చెను ఆకలికిప్రతిప్రాణి మిగితప్రాణులచంపితిను ఇదిసృష్టిధర్మమా?! ఆకలితత్వమా?! సాగుతున్నకాలానికే సమాధానంతెలుసును!! మనిషిమాత్రమొక్కడే శ్రమచేస్తుబతుకును శ్రమించనియెడలమనిషి కడుపుమాడిచచ్చును అందుకేప్రతిమనిషి ఏదోఒకపనిచేసి కడుపునింపుకొనిబతుకును శ్రమనుకూడదోచుకొనే మనుషులున్నలోకము ఒల్లువంచకుండఎపుడు బతుకుతున్నవారెందరో?! కడుపుమాడిచస్తున్న ప్రజలెందరోలోకంలో! కర్మాంటుకొందరు ప్రాప్తమంటుమరికొందరు సర్థిచెప్పుకొంటున్నా? ఆకలిమంటచల్లారునా? మేలుకోరమానవుడా? మనిషినిమనిషినిత్యము దోచుకొనేసంస్కృతికి స్వస్తిపలికిమనిషిలాసాగు !! జైహిద్.

Monday, 20 March 2017

Akharalagani

అక్షరాలగని..! ************ ఎక్కడో...ఎక్కడో...లేదులే అక్షరాలమాటలగనినే! నాబుఱ్రలో...బుఱ్రలోవుందిలే అక్షరాలమాటలగనినే! మదినిగొంతునుపెకిలిస్తే అధరాల్లోంచిజాలువారును!! అక్షరాలేతేనెలధారలై సరిగమపదనిసస్వరలయలై నవరసభరితతాళనాదమై మమతలుపంచిసమతనుపెంచి అనుబంధాలసుమగంధాలై వర్థిల్లేతెలుగులోగిల్లో భాషలభావసంద్రములై ఘోషించేసదాజగతిలో మనిషేనిజముమాటేరుజువు ! మాటేకలుపునుమనిషినిఎపుడు మాటేపెంచునుపెన్నిధినెపుడు అక్షరాల్లోంచేఈజగతి విజ్ఞానగనిగాకీర్థిగడించే చదువేరానిమనిషిసైతము మాటలునేరిస్తేబ్రహ్మనే! మాటలమర్మంతెలిసినమనిషికి బతుకంతాసుఖమయమే!! జైహింద్.

Ugadhi

ఉగాది 
 ****** 
 భూమిపుట్టిననుండి 
వస్తుందిపోతుంది 
 ఉగాదికాంత! 
 ఎన్నితరములోయేమో?
 చరిత్రనులెక్కలుకట్టే
 వారికేఎరుక?! 
 యుగారంభంనుండి
 ఉగాదికాంత !
 నిప్పులఎండను
 నెత్తినఎత్తుకొని 
 వడివడిగావచ్చి
 తెలుగులోగిళ్ళలో
 నిల్చుండిపోతుంది ! 
 నిప్పులఎండతో
 తానమాడినతరులు
 పచ్చనిపరిమళాల
 స్వాగతాలుపలుకు
 ఉగాదికాంతకు!
 కొమ్మల్లోకోయిలలు
 కమ్మనిరాగాల
 గానకచ్చేరిచేయు
 ఉగాదికాంతకు! 
 పచ్చనిచిలుకలు
 కొమ్మలవింజామరలతో
 విసురుతునుండు
 ఉగాదికాంతకు ! 
 మండేఎండలోఆమని
 వసంతగీతమై 
 నర్థించిమురిపించు
 ఉగాదికాంతను!
 పల్లెజనులంత
 వాకిళ్ళుశుభ్రపరిచి
 రంగవల్లులుదిద్ది
 మామిడితోరణాలు 
 గుమ్మాలకుగట్టి 
 షడ్రుచులపచ్చడి
 బహుకమ్మగాచేసి 
 ఉగాదికాంతకు
 సమర్పించివారంత
 చల్లంగచూడాలి
 సంవత్సరమంతమమ్ము 
 వేడుకొనిమ్రొక్కి
 సేవించుజనమంత !
 కాలగతులనుతెలిపే
 పంచాంగశ్రవణము
 ఆలకించిజనమంత 
 రాశులఫలితాల 
 రహష్యాలనుకని 
 భవిష్యత్తుకాలానికి
 బాటలువేసుకొను ! 
 ఆధాయవ్యయాల
 ప్రణాలికలతోజనం 
 బతుకులుదిద్దుకొని
 సంవత్సరమంతసాగు 
 ప్రగతిపథాన ! 
 జైహింద్.

Sunday, 19 March 2017

Mesege

మార్పుఅనివార్యమైతే? ఎంతటివారైనాతలవంచాల్సిందే! అదిప్రకృతిసిద్ధాంతం!

Friday, 3 March 2017

Avineethimahaavineethi

అవినీతిలోమహాఅవినీతి..! ******************* అవినీతికిఅడ్డుకట్ట నోట్లరద్దేమేలనీ ప్రభుతతలచిరద్దుచేస్తే అవినీతిపెరిగిపోయి తారాస్తాయినందుకునే ! ప్రజాసేవకుఅంకితమై బాధ్యతగాతమసేవలు ఇన్నాళ్ళుచేసినట్టి తంతితపాళబ్యాంకులు నోట్లరద్దులాభాల్లో అవినీతితలుపులుతెరచి బడాబాబులజేబులునింపి ప్రజలరోడ్లపైనెట్టే రాజకీయాండగల ధనవంతులబలవంతుల నల్లడబ్బుతెల్లగయ్యి నీతిమంతులైవెలిగే రాజకీయఅవినీతిని అరికట్టనిప్రభుత్వం సామాన్యులపాలిట పెనుశాపంగామారే సామాన్యులజేబులుపిండి బ్యాంకుల్లోజమచేసి రోడ్లపైనప్రజలను నిలబెట్టిచోద్యంచూసే డబ్బులుండిపస్తులున్న భారతప్రజానీకము అవినీతికిమందువేశ భవిష్యతంతపండగే నామాటనమ్మండి అంటుప్రభుతదీమగుండే ఏదినీతినో?ఏదిఅవినీతినో? ప్రభుతకర్థమవ్వలేదు ?ఎన్నుకున్నకర్మానికి చావుఒక్కటేదిక్కు ?! జైహింద్. ఆకులరాఘవ .9440971792.

Avineethimahavaradhi

అవినీతిమహావారధి..! ********** అమ్మకడుపులోనపిండం తల్లిదండ్రులబోధకంటు అభ్యాసపుఎదుగుదలతో ఈలోకంచూస్తుంది! పుట్టుకతోకవచాల్లా అంటిపెట్టుకొనివచ్చే అబద్దాలుఅవినీతికి అమ్మఉగ్గుపాలుపడుతు పెంచిపెద్దచేస్తుండే! మారాముచేస్తేపిల్లలు లంచంగాఅమ్మనాన్న కొనిపెడుతుమురిపించు! తల్లిదండ్రులేఆదిగురువులు అబద్దలుఅవినీతికి మానవతామనుగడలో వారధిగావిస్తరించి వైభవంగావర్ధిల్లే ! అవినీతినిర్మూలనకు మొదలెక్కడ?తుదిఎక్కడ మనిషినీతిమంతుడై వెలుగొదిసాగాలంటే గర్భదశస్థితిలోనే నీతిబోధచెయ్యాలి న్యాయధర్మసూత్రాలు విడమరచిచెప్పాలి అప్పుడేఅవినీఅంత్తమొది జగతివర్ధిల్లుతుంది!! జైహింద్.

Messege

మనంవిదేశాలకు బతుకపోయినప్పుడు ఒదిగిఉండాలి. వాళ్ళదేశఅంతర్గతవిషయా ల్లో జోక్యంచేసుకుంటేముప్పే?

Messege

ఎవరిదేశంవాళ్ళకుముద్దు! ఎవరిప్రజలువాళ్ళకుబొద్దు!కాదనేహక్కుమనకెక్కడిది?

Friday, 24 February 2017

Kavushika

కవుశిక ***** నత్తవదిలినగుల్ల! నాడుప్రతిఇంట్లోముఖ్యపాత్ర! ఉగ్గుపాలకునాంది! పసరుమందులకుపునాది! ప్రతిఇంట్లోఇల్లాళ్ళ చేతుల్లోతిరుగుతు అల్లారుముద్దుగా తనవిధులునిర్వహించే ! అడుగుమాడినకుండల పాచిపట్టినగోళాల శుభ్రంగాగీకేసే ఆలుచిప్పేకవుశిక! నాడుసేవలెన్నోచేసి వేనోళ్ళకీర్థినొందే ! నేడుస్టీలుస్ఫూనులు వచ్చి కవుశికనుమింగేసి రాజ్యమేలుతుండే ! ప్రకృతివరంగలభించినకవుశిక నేడుఅందరికిచులకనే ! పాతఒకరోత!కొత్తొక వింతేకదా?! జైహింద్ .

Sunday, 19 February 2017

Mini

పైకెందుకుచూస్తావు?అంతాశూన్యమే!అంటారుఅందరు. అదితప్పు?పైనవెలుగుందికదా?! అదినీబతుక్కిదిక్శూచి!!

Thursday, 16 February 2017

Mini

మనిషిప్రకృతినిజయించాడు! కాలుష్యంమనిషినిమింగింది! గెలుపుఎవరిది?!

Wednesday, 15 February 2017

ముప్పైసంవత్సరాలు నీతోసహజీవనంచేస్తే నాకుమిగిలిందిచిప్పకూడే! అమ్మసమాధిపైతనకోపం వెల్లగక్కినశశికళ!

Monday, 13 February 2017

Dukkam

దుఃఖం +++++ దుఃఖంతరగనిసముద్రం! ప్రతిప్రాణికళ్ళల్లోపొంగేజీవధార! బాధలుమదినితొలిచినప్పుడే దుఃఖంఉవ్వెత్తునఎగిసివస్తుంది! దుఃఖంతోకళ్ళుఏరులైపారుతాయి! దుఃఖంతోతడిసినమదినానిముద్దవుతుంది! తడిసినమదినిండాకొత్తఆశలుమొలకెత్తుతాయి! దుఃఖంజీవనమధురఫలాలకుసంకేతం! దుఃఖంవచ్చినప్పుడు కడుపారదుఃఖించాలి ! మనసుఅమృతసంద్రమవుతుంది! దుఃఖాన్నిదిగమింగితే దుఃఖంగరళసింధువై మదినిమాయలోముంచుతుంది! మదిమాయలోమునిగితే ? నీమనుగడశూన్యమే?! సముద్రంకూడాదుఖిస్తుంది! ఆశోకమేమేఘాలై వర్షిస్తుంది! ఆఅమృతవ ర్షమేకదా?! పుడమిపండడానికిమూలం! సకలప్రాణులమనుగడకునిదర్శనం!శోకంలోంచేకదా?రామాయణం పుట్టింది! శోకంలోంచేకదా?కురుక్షేత్రయుద్ధంజరిగింది! శోకంలోచేకదా? దేశానికిస్వతంత్రంవచ్చింది! దుఃఖందుర్మార్గంకాదు?! నీజీవితగమనానికిమార్గనిర్దేశం !దుఃఖంవచ్చినప్పుడు కడుపారదుఃఖించాలి! ఇతరులనుచూసిదుఃఖిస్తే ? నీఉనికికేప్రమాదం ?! జైహింద్.

Thursday, 9 February 2017

మనిషితల్లికడుపులో వున్నప్పుడేసుఖం! భూమిమీదపడితే మట్టిలోకలిసేవరకుకష్టాలే!

Tuesday, 24 January 2017

Articule

ఇత్తారిగింతసద్దిగట్టుకొని,పనికిబయిలుదేరిండు.గల్లిలోంచి,మెయిన్ రోడ్ కిఅచ్చిండు.గారోడ్ అంతమోటర్లతోనిండిపోయింది.ఒక్కటికూడముందుకునడుత్తలేదు.గింతసందుంటేగాసందులోంచి,సైకిల్ మోటరోల్లు పాముబొక్కలోదూరినట్లు దూరిపోతాండ్లు .ఇత్తారి,ఎనుకకుపోకుండా, మ్ముం దుకుపోకుఉండాఅయ్యింది.గింతలోఒబఱే,ఇత్తారినిగుద్దిం ది.ఇత్తారికిందపద్దడు.మోకాళ్ళు,మోచేతులు కొట్టుకుపోయాయి.మల్లగ ఇత్తారిలేసిండు.రోడ్లగా,గొడ్లను,బఱె లనుసూడంగనేమస్తుకోపంవచ్చింది. గీగొరక్షకసమితివాల్లుఎక్కడ?జంతుప్రేమికులుఎక్కడ?గీగొడ్లు,బఱ్లు ,మేకలు, పందులుగీరోడ్ల మీదగిట్లతిరుగుతాంటే , ఎంజెత్తాండ్లు? అన్కొని,గాగొడ్లను,బఱ్లను, మేకలను, పందులను,జమజేసుకొనిగవాటిని తోలుకొని ,గోరక్షకసమితిదగ్గరికిపోయిండు .గవాళ్ళు ఇత్తారినిసూడగనే,ఏందిరబై గివిటినిగిటుతోలుకొచ్చినవ్?గివ్విరోడ్లోతిరుగు తుఎట్లపాణాలుదీస్తున్నయోసూడుండ్రి .అనిఅతనిదెబ్బలుసూయించిండు .గదానికి మేంఏంజెస్తంరా?అన్నరు.గొడ్లురక్షి స్తమన్నరుగదా !గొడ్లనుతింటే,పబ్లిక్ గానేబట్ట్లిలిప్పి తంతాండ్లుగదా!మరిగివిటిని ఎందుకురక్షిస్తలెరు?అరే పోరాబైగవాటినికాపాడాలంటే,గవాటికి గడ్డికావాలి,మేతకావాలి.గవ్విఅన్నిఎవ్వడు జేత్తర్రా? గవ్విజెయ్యలేకనే, గవాట్నిబెంచెటోల్లు గవాటినిరోడ్లమీద ఇడ్సిపెడ్తాండ్లు .పోరాపోఅన్నరు.నీ అవ్వగివిటినిపార్ల మెంట్ కుతోలుకుపోయి ,గన్డ్లగట్టెత్తెగాప్రధాన మంత్రేసూసుకుంటడు .అనివాటినితోలుకుపోతాండు .

Monday, 23 January 2017

Poet

కామంమనసుకుమధురం! కానుపుతనువుకుకష్టం! కామవాంచముందు కానుపుకష్టంగుర్తు తనువెక్కడగుర్థించు! అందుకేమాతృత్వం షృష్టిలోనేగొప్ప!

Mini

బాల్యంలోఊరేగు ఉయ్యాలలోమనిషి! యవ్వనంలోఊరేగు పల్లకిలోమనిషి! మరణాంతరంఊరేగు పాడెలోమనిషి!

Prakruthi ok yantram

ప్రకృతిఒకయంత్రం! పంచభూతాలిందనం! తనకుతానునడుస్తు సకలప్రాణునడిపించు! ప్రతిప్రాణిదేహాము యంత్రమునుపోలియుండే! వాటితనువుల్లోరక్తము ఇందనమైనడుపుతుండు! అదిగుర్తించినమనిషి ప్రకృతివనరులపోగుచేసి యంత్రాలెన్నోసృష్టించి పంచభూతాలచమురుపోసి తనునిత్యంవాడుతున్న నడపనిదేప్రతియంత్రం అడుగుముందుకేయదు! తనకుతానునడిచేటి ఏయంత్రమైనకూడా మనిషిమీటనొక్కకుంటే కదలలేనిమొద్దే! యంత్రాలతోశ్రమసులవై మనిషిముందుకెడుతున్నా? ఇందనమేకొరవడితే ఇట్టేఆగిపోతుండు! ప్రకృతిరుధ్రుడైతే ? యంత్రాలన్నిదుగ్గుదుగ్గే ! అయినా?మానవుడు తిరిగిమళ్లియంత్రాలెన్నో సృస్టిస్తునేవుంటాడు!!

Telangana

తెలంగాణ ..! +++++++++ తెలంగాణఅన్నపదం ఎవరినోటపుట్టేనో!? దివ్వతేజమైవెలిగి నలుదిశలమారుమ్రోగే!! అచ్చతెలుగుపలుకుబడి జానపదులనుడికారం మాండలికపుసోయగాల మమకారంపొంగిపొర్లే ! బతుకునిచ్చేబతుకమ్మ ఆడబిడ్డలపండుగై ప్రకృతినికొలిచేవేడుక జగతిలోవేరెందుకలదు? చుట్టమైనపక్కమైన అందరొక్కచోటకలసి పుష్టిగతినితాగేసంస్కృతి జగతిలోవేరెందుకలదు? కష్టమైనసుఖమైన కలిసిపంచుకునేగుణం తెలంగాణనిండకలదు! లోకానవేరెందుకలద్? అచ్చగాళ్ళబిచ్చగాళ్ళ వృత్తకళాకారుల నోళ్ళవెంటజాలువారే పాటలెన్నోగాధలెన్నో! మతాలెన్నోవున్ననేడు తెలంగాణమామతం! అంటుకలిసిసాగేజనం సఖ్యతకుముద్దుపేరు! తప్పుచేస్తేఎదురుతిరిగి రాజునైననిగ్గదీసి గద్దెదింపితరిమికొట్టే తెలంగాణవీరత్వం! వనరులతోపంటలతో విలసిల్లేతెలంగాణ ఆదరించికడుపునింపి కాపుగాయుతెలంగాణ!!
దర్శకులకు పెద్ద సవాల్?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 January 2017
రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం చేయడానికి ఏ ముహుర్తాన ‘బాబా’ సినిమా తీసి విడుదల చేసాడోగానీ, అది తుస్సుమంది. దాంతో సినిమా కొన్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. వాళ్లను ఆదుకోడానికి రజనీకాంత్ కొంత వదులుకున్నాడు. డబ్బును వాళ్లకు సర్దుబాటు చేశాడు. రాజకీయ అరంగేట్రం సైతం వాయిదా వేసుకుని హిమాలయాలకు వెళ్లిపోయాడు.
తిరిగొచ్చి ‘చంద్రముఖి’తో విజయం అందుకున్నాడు. కాకపోతే అది హీరోయిన్ జ్యోతిక ఖాతాలోకి వెళ్లిపోయింది. ‘లింగా’ చిత్రం మరో కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ సినిమా విషయంలోనూ నిర్మాతలు తిరిగి కొనుగోలుదార్లకు డబ్బులు చెల్లించి చేతులు ముడుచుకున్నారు. అలా తమిళ పరిశ్రమలో మొదలైన డబ్బు వాపస్ పరంపర తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కాలుమోపింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన లోఫర్ చిత్రం భారీ నష్టాలు మూటగట్టుకుంది. బయ్యర్లు పూరి ఇంటిముందు హంగామా చేశారు. డబ్బు చెల్లించమని గొడవకు దిగారు. ఆ దెబ్బతో పూరీ పోలీసు కేసు పెట్టాడు. ఇరువర్గాలు మీడియాకు ఎక్కి నానా గొడవ చేసుకున్నారు. పరిశ్రమ పెద్దలు ఇరువురినీ నివారించి సమస్యను పరిష్కరించారు.
లారెన్స్ దర్శకత్వం వహించిన రెబల్ సైతం పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగిందే. ఈ పద్ధతి టాలీవుడ్‌లో క్రమంగా అనధికార అగ్రిమెంట్‌గా మారుతోంది. ఈ మధ్య చిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులు కొందరు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. సినిమా ప్లాప్ అయితే, నష్టాన్ని నువ్వే పూడ్చాలంటూ డైరెక్టర్ పీకపై కత్తిపెడుతున్నారని తెలుస్తోంది. దర్శకుడు తన పారితోషికాన్ని వదులుకోవడమో, అప్పో సప్పో చేసి కట్టేసి బతుకు జీవుడా అని బయటపడటమో జరుగుతుంది. ఈ సంఘటనలు మీడియా, ప్రరిశ్రమ పెద్దల దృష్టికి రాకపోవడం గమనార్హం.
ఎన్టీఆర్, ఎఎన్నార్ కాలంలో అవాంతరాల వల్ల సినిమా నష్టపోతే, మరో సినిమాకు కాల్షీష్లు ఇచ్చేవారు. అంతేగానీ, పారితోషికం తిరిగి ఇచ్చేసే పరిస్థితి లేదు.
హైదరాబాద్ పరిశ్రమ తరలివచ్చిన కొన్నాళ్లకే -దర్శకులు పాకేజీ విధానం అమల్లోకి వచ్చింది. అదీ తమిళ పరిశ్రమ నుంచి తీసుకొచ్చిన విధానమే. అలా పాకేజీ విధానంతో మోహన్‌బాబు మరికొందరు చిత్రాలు నిర్మించినా హిట్‌కాక వదులుకున్నారు.
ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ‘అ ఆ’ చిత్రానికి పారితోషికంగా లాభాల్లో వాటా తీసుకున్నాడని వినిపించింది. రాజవౌళి కూడా అదే దారిలో పయనిస్తున్నట్టుంది. ఎపుడైతే దర్శకుడే అన్నీ తానై నిర్మాతను పట్టుకుంటున్నాడో అప్పుడే నిర్మాత పూర్తి బాధ్యత దర్శకుడిదే. అతను చెబితేనే సినిమా తీశాను, నష్టం వస్తే అతడే భరించాలి అని దర్శకుడి పీకపై కత్తిపెడుతున్నాడు. ఇది ఎటు దారి తీస్తుందో ఎవ్వరూ ఆలోచించడంలేదు. ఇకనైనా పరిశ్రమ పెద్దలు ఆలోంచి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు సాగితే అందరికీ మేలే లేనిచో పరిశ్రమ పోలీస్ స్టేషన్ల్ చుట్టు తిరుగుతునే వుంటుంది.
-ఆకుల రాఘవ
చిత్ర పరిశ్రమలో కొత్త పోకడ
చిత్ర పరిశ్రమలో కొత్త పోకడఒకప్పుడు-
ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల కాలంలో సినిమా దారుణ పరాజయం చవిచూసో, ఏదైనా కారణాల వల్లో నిర్మాతకు నష్టాలు సంభవిస్తే తరువాతి సినిమాకు కాల్‌షీట్లు ఇచ్చి ఆదుకునేవారు. కృష్ణ మాత్రం సొంత పూచీకత్తు మీద సినిమా విడుదలచేయించి నిర్మాతను ఆదుకునేవారు. అంతేగాని -అప్పటి గొప్ప నటులెవరూ ఏ రోజూ పారితోషికం చెల్లించిన దాఖలాలు కనిపించవు. అది అప్పటి మర్యాద.
***
ఇప్పుడు-
సినిమా అంటే డైరెక్టర్. ఆర్థికంగానైనా, హార్థికంగానైనా అన్నింటికీ అతనిదే బాధ్యత. దర్శకుడే అన్నీ తానై నిర్మాతను పట్టుకుంటున్నాడు కనుక -నష్టాలకూ అతను బాధ్యత వహించాలన్న ట్రెండ్ వచ్చింది. ఈ మార్పు ఎటు దారితీస్తుందోనన్న భయాందోళన దర్శకుల్లో లేకపోలేదు. సినిమా నిలబడితే సరే.. లేదంటే దర్శకుడు తన రెమ్యునరేషన్ సహా వదిలేసుకుని, ఇంకా కాదంటే అప్పులు చేసైనా నిర్మాతకు సరిపెట్టాలి. పైకి చెప్పుకోలేకపోతున్నా -పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు ఒకటొకటిగా పెరుగుతున్నాయని అంటున్నారు.దర్శకులకు పెద్ద సవాల్?

Sunday, 22 January 2017

Chettumanatallira?!

చెట్టుమనతల్లిరా! కడుపునింపిపెంచురా! చెట్టుమననీడరా! శ్వాసనిచ్చికాచురా! చెట్టుమనతోడురా! బతుకంతాసుఖంరా! అడవిలోనకళ్ళుతెరచి చెట్లతోనేబతుకుసాగి గ్రామాలైవెలసినీవు అడవులకేశాపమై తెగనరికిబీళ్ళుచేసి కాలాన్నికరువుచేసి కటికదరిద్రాన్నిపెంచి అల్మటించిచస్తవేంది? పుడమిలోనిగింజలు మొలకెత్తితరువులై నీవృద్ధికిపాటుపడి సేవలెన్నోచేస్తుండే రోగాలకునొప్పులకు చెట్లేవైధ్యులై ఎల్లప్పుడునయంచేస్తు ఆరోగ్యంతోనిన్నుంచే ! చెట్టునీకేతల్లికాదు?! ప్రాణికోటికితల్లిరా?! జంతుపక్షుకీటకాలు చెట్లవలనబతుకురా! తెలియకుంటేఒక్కసారి చెట్లచెంతనువ్వుచేరి గమనిస్తేతెలుస్తుంది సృష్టిలోనచెట్లవిలువ?! కంపుకొట్టేనీతనువును చితిమంట్ల్లోకాల్చిచెట్టు స్వర్గప్రాప్తికలిగించు ! నీవృద్ధికిపాటుపడే చెట్లనింకనరకకుండ మొక్కనాటువెనువెంటనే కన్నబిడ్డలాపెంచి నీబాధ్యతచాటుకో? తలంగాణహరితవనం! మరోతరానికినందనం!!

Saturday, 21 January 2017

సముద్రానికిపుడమిపుట్టిల్లు! ఆకాశంమెట్టినిల్లు! చుట్టంలాభువికి వస్తూవెళ్ళుతుంటుంది!
https://drive.google.com/file/d/0B_3vpikmOPONUE5uczRlSWtPRDJMSDJNWjVrVDQwc2FZcXhN/view?usp=docslist_api

Wednesday, 18 January 2017

మేధావులుఎప్పుడుబీదవాల్లే! వాళ్ళఆలోచనలనుసొమ్ము చేసుకున్నవాళ్ళుధనవంతులు!

Tuesday, 17 January 2017

పంచభూతాలువ్యాపారవస్తువులయ్యాయి! బలవంతులచేతుల్లోఅవి కనకవర్షంకురుపిస్తున్నాయి!

Sunday, 8 January 2017

Sandesham

మనబడ్జెట్ లోసగందేశరక్షణకోసం! మిగితాసగంలోరాకెట్ ప్రయోగాలకోసం! మిగిలినపావుసగంలో,పథకాలకోసం! అందులోఅధికార్లచేతివాటంవుంటుంది!
ప్రధానిగారికిపార్టిముఖ్యంకాదు!దేశంముఖ్యం! అందుకేదేశప్రజలను రోడ్లమీదనిలబెట్టిచంపుతున్నారు!
మాటలకుకూడారెక్కలొచ్చాయి! అవిగాలిలోఎగిరివచ్చి నీస్మార్టుఫోనులోవాలాయి! వాటినిఅపురూపంగాచూసుకో!!
నోట్లరద్దుతోప్రజలుసహనంకోల్పోతున్నారు.ఉద్యమానికిసిద్ధమైతే ప్రభుత్వపతనంకాయమే.
ప్రజలడబ్బులులాగిబ్యాంకుల్లోపెట్టించారుప్రధానిగరు. ఆడబ్బులుఏబడాబాబులకు అప్పుగాఇప్పిస్తారో?
నేటితరంమాటలుగాలిలోనే జరుగుతున్నాయి!వాటికివేదిక అంతర్జాలమే!
తల్లిభాషపిల్లలమెదడుకు మేతపెట్టి విజ్ఞానులుగా వికసింపచేస్తుంది!