Monday, 4 September 2017

స్వచ్ఛ భారత్
========
నోరు శుభ్రమైతే
మాట మధువు లారబోస్తుంది !
తనువు శుభ్రమైతే
మనిషి పరిమళించును !
శుభ్రమైతే దేశము
దివ్వ తేజమై వెలుగు !
అదే స్వచ్ఛ భారతం !
హరిత హరిత నందనం !!
చెట్ల నిండ దుమ్ము పట్టి
బోరున విలపించగా
గాలి చేతులు పట్టి
శుభ్రంగా దులుపును !
వానతలకు పోసి
శుభ్రంగా కడుగును !
చెట్లు పరిసరాలు
మురికితొలిగి మురిసి
పచ్చని సింగార మొలకు !
హాయి హాయి ఆమని
వసంత గీతి పాడును !
అదే స్వచ్ఛ భారతం !
అరిత అరిత నందనం !!
గాలివాన బాధ్యత
మనిషిగుర్తించవలే !
వీధులన్నీ శుభ్ర పరిచి
తళ తళ మెరిపించవలే !
దుర్గంధపు కాలువల
సుమగంధముగా మలిచి
గల గల పారించవలే !
కాలుష్యం తొలిగిపోయి
మనదేశం పరవశించు !
ఆరోగ్యం వెల్లివిరియు !
అదే స్వచ్ఛ భారతం !
హరిత హరిత నందనం !!
       జైహింద్ .