Friday, 29 December 2017

అద్భుతం
 ======
రంగులు చిమ్మిన ఆకాశం 
చిగురులు తొడిగిన భూగోళం 
రంగుల కేళి రవి మోము 
చిగురుసరాగం భూగోళం 
అంతే దొరకని రవి హృదయం 
సకల సృష్టికి తనే మూలం 
సిరులకు నిలయం భూగోళం 
ప్రాణుల మనుగడ కదినిలయం 
విశ్వఖగోళపు వింతలతో 
అబ్బురపరుచును అంబరము 
అందాలొలికే భూగోళం 
ఆదిమన వృద్ధికి భూతల స్వర్గం 
          జైహింద్ 

Sunday, 3 December 2017

లంచం ఒక అంటువ్యాధి ..!
================
లంచం ఒక అంటువ్యాధి !
అరికట్టే వైద్యుడేడి ?
జగమంతావ్యాపించి
పీడించి చంపుతుంది !
పుడమి పైన ప్రతి మనిషి
జన్మించిన నాటినుండి
పెన వేసుకు పుడుతూనే
చావకుండా బతుకుతుంది !
యుగాలన్ని గతించినా ?
తరాలెన్నో మారుతున్నా ?
ప్రగతి పథంలో మనిషి
వైజ్ఞానిక దారుల్లో
సాంకేతిక విప్లవాల్తో
విజ్ఞానిగా వెలుగుతున్నా ?
లంచమనే అంటువ్యాధి
చావకుండ నేటికి
చిరంజీవిగ బతుకు తుంది !
వైభవంగ వెలుగుతుంది !
నవ సిద్ధాంతాలెన్నో వచ్ఛే
ప్రజాప్రభుత్వాలు వెలసే
చట్టాల సంకెళ్ళు ఎన్నెన్నో అడ్డేసి
శిక్షించి అరికట్టిన
ఆలంచమే ఎరగా మారి
చట్టాలను చుట్టాలుగ
మలుచుకొని బయటపడి
మీసాలు మెలివేసి తిరిగే !
మనిషి ప్రకృతిని జయించి
ప్రాణాంతక వ్యాధులెన్నో
అరికడుతు సాగుతున్నా?
లంచమనే వ్యాధిని
అరికట్టలేక పాయే ?
తల్లి దండ్రులే ఈవ్యాధికి
మూలపురుషులై పోయే !
మేలుకొని వారిప్పుడు
తమపిల్లలకు సోకకుండ
అరికడితే కొంతమేలు !
జైహింద్ .