Monday, 17 February 2020

ఏది ప్రామాణికం..?



ఏది ప్రామాణికం..?
****************
  జోతిష్యశాస్త్రము, సామాన్య శాస్త్రము ఏది ప్రామాణికం?అన్న వాద ప్రతి వాదాలు నిత్యం,ఏదో...ఒకవేదిక పైన జరుగుతూనే..
వున్నాయి.మాశాస్త్రమే గొప్పాంటే?మాశాస్త్రమే గొప్ప అని గొంతులు పగిలిపోయేలా,అరుస్తూ... పిడివాదం చేస్తున్నారు.రెండు శాస్త్రాలు రైలు పట్టాల లాంటివే!వాటిపై సాగి పోవడమే మనిషి పని.అంత మాత్రాన వాదులాడుకోవడం
అవసరమా? అయితే..?ఈ రెండు శాస్త్రాలు
వాటి విధి విధానాలను ఎలా..? నిర్వహిస్తు న్నాయో...ఒకసారి పరిశీలన చేసి తెలుసుకుందాం.
  జోతిష్య శాస్త్రం అంచనా వేసి చెప్ప బడుతుంది.అది ఒకసారి నిజం కావచ్చు
కాకపోవచ్చు.అంతమాత్రానకొట్టిపారేయలేం.మన పూర్వీకులు కాలగమనాన్ని లెక్కలు కట్టి,రోజులు,వారాలు,నెలలు,సంవత్సరాలుగా,విభన చేశారు.పౌర్ణమి, అమావాస్యగా
విభజించి చూపారు.తితి, నక్షత్రంగా గుర్తులు పెట్టారు.దీనిని ఎవరు కాదన లేరు.
  పూర్వ కాలం నాటి నుండి నేటి వరకు ఈ
లెక్కల విధానాలే అమలు జరుగుతున్నాయి
ఇవి అన్ని కాల గమనం,గ్రహాల స్థితి గతులను బట్టే జరుగు తున్నాయి.సూర్య గ్రహము, ఇది సకల ప్రాణులకు జీవం పోస్తుంది.సూర్య గ్రహము లేక పోతే సృష్టినే
లేదు.భూ గ్రహము కూడా సకల ప్రాణులకు బతుకు నిస్తుంది.ఎన్నో వనరులు సంపదలు ధార పోస్తుంది.ఇలా... ఏ గ్రహం ఆ గ్రహం
యొక్క ప్రత్యేకతలు కలిగి, మానవ జీవనోపాధికి ఉపయోగ పడుతూ వున్నాయి
ఇది ఎవరు కాదన లేని నిజం!
  పంచ భూత నిర్మితమైన ప్రకృతి విధి విధానాలను పొందు పరిచి మానవులకు
అందించినదే జ్యోతిష్య శాస్త్రం.ఇది ఎన్నో అనుభవాలతో రంగరించి రూపు దిద్దుకుంది.
దీనిని నమ్మిన వాళ్ళైనా..?నమ్మక పోయిన వాళ్ళైనా..?ఈ అనంత సృష్టిలో సాగిపోవలసిందే!ఎవరి కొంపలెం మునిగిపోవు.
 సామాన్య శాస్త్రం ఇది నిరూపించి చెప్ప బడేది. ఆ శాస్త్రం కూడా కాల గమనం,గ్రహ స్థితి గతులనులెక్కలు కట్టి చూసింది. ఆ
లెక్కలు కూడా జ్యోతిష్య శాస్త్రానికి సరి తూగి పోయాయి. ఆ లెక్కలు ఈ లెక్కలు ఎప్పుడు తేడా రాలేదు.వచ్చే తేడా అంత 
మూడ నమ్మకాలు,మూర్ఖపు ఆలోచనల
వలనే వస్తున్నాయి.ఒక్కొక్క సారి సామాన్య
శాస్త్రం అంచనాలు కూడా లెక్క తప్పుతుంటాయి. ఒక సారి వాతావరణ శాఖ తెలిపింది గమనిస్తే మీకే తెలుస్తుంది.
అంతే కాదు?ఎంతో పకడ్బందీగా నిర్మాణం
చేసిన యంత్రాలు కూడా లెక్కలు తప్పుతాయి.పని కూడా చెయ్యవు.అంటే,ప్రకృతిలోని శక్తులు ఎప్పుడు ఎలా..!పరివర్తన చెందు తాయో...? ఏ శాస్త్రాలు కూడా చెప్పలేక పోతున్నాయి.ఎంతో...వైజ్ఞానికంగా,ఎదిగి
సాంకేతిక విప్లవ మార్గంలో గ్రహాంతరాలలో నడుస్తున్న మానవుడు ప్రకృతి శక్తుల ముందు నిర్వీర్యం అవుతున్నాడు.ఇది కాదన లేని సత్యం.అంచనాతో చెప్ప బడే
జ్యోతిష్య శాస్త్రమైనా..?నిరూపించి చెప్ప
బడే సామాన్య శాస్త్రమైనా..?దేని మార్గం దానిదే చూపిస్తుంది.సరియైన మార్గం ఎంచుకొని నడవడమే మానవుడి పని.
మూఢ నమ్మకాలు,మూర్ఖపు ఆలోచనలతో
నడవ కూడదు.అప్పుడే అనర్థాలు సంభవిస్తాయి.వాటిని శ్శాస్త్రాలమీద రుద్ది
గగ్గోలు పెడితే ఏం ప్రయోజనం?
  ఎవరి నమ్మకాలతో వాళ్ళు ఎవరి ఆలోచన
ధోరణిలో వాళ్ళు నడవడం చాలా మంచిది.
ప్రకృతిలో కాలగామనాన్ని అనుసరించి సాగటం ఎంతో శ్రేయస్కరం. ఏ శాస్త్ర మైనా..? ఏ శక్తి ఐనా..? ప్రకృతి లోంచే ఏర్పడ్డాయి తప్ప మానవుడి జేబులోంచి కాదు?ఈ విషయం గ్రహిస్తే మానవుడు పరిపూర్ణుడే!
జైహింద్.
ఆకుల.రాఘవ.