Showing posts with label వ్యాసం. Show all posts
Showing posts with label వ్యాసం. Show all posts

Wednesday, 3 June 2020

గెరిల్లా యుద్ధం..!





కారల్ మార్క్స్,లెనిన్, మావోల ఆలోచనకుముందే...తపస్సు అనే సమ్మె మన భారతావనిలో..సమ్మె హక్కుగా కొనసాగింది!

ఒకసారి కృతయుగం,త్రేతాయుగం, ద్వాపారాయు గములను పరిశీలించి నట్లైతే..తపస్సు ద్వారా తమ హక్కులను
ఎలా... నెరవేర్చు కున్నారో తెలుస్తుంది.

పురాణ కాలంలో దేవ,దానవ,మానవులకు
ఎవరికైనా ...తీరని కష్టం,బాధలు కలిగి నప్పుడు,లోకాలను ఏలుతూ...తమను పరిపాలిస్తున్న వారిని,తమ తపస్సు శక్తి ద్వారా తమ వద్దకు రప్పించుకొని,తమ పనులు చక్క దిద్దు కొనేవారు.

తపస్సు అంటే...తను చేస్తున్న విధులను
బహిస్కరించి,అన్న పానీయాలు ముట్టు కోకుండా,ఒక ఏకాంత ప్రదేశంలో తమ సమస్యలు ప్రభువులకు మొర పెట్టు కోవటం. ఆ తపస్సు ఆనాడు ఓ సమ్మెనే!అది ఆతని జన్మ హక్కుగా వుండేది!

సమ్మె ప్రభావాన్ని గుర్తించిన ప్రభువులు తక్షణమే స్పందించి సమ్మె చేస్తున్న వారి వద్దకు వచ్చి వారి సమస్యకు సరైన పరిష్కారం చూపించి , సమ్మె విరమింపచేసిపంపించే వారు.నాడు అది వరముగా...భావించ బడింది.

ఒక వేళ తపస్సు చేసే వారి సమస్యలు పరిష్కారముచేయకుండా..భీష్మిమించుకొని, కూర్చున్నారనుకొండి?తపస్సు చేసే వ్యక్తి తిండి,తిప్పలు లేకుండా...కుళ్ళి కృషించి చని పోయాడను కోండి,అది లోక రక్షకుల 
బాధ్యతా రహితంగా జరిగిందని,లోకం నిందిస్తుంది.బాధ్యతలు సక్రమంగా నిర్వహించని ప్రభువులు వున్న ఒకటే,లేకున్నా ఒకటే.తక్షణమే... పదవులనుండి తప్పుకొండని,ప్రజలు నిలదీస్తారు.కాబట్టే,లోక రక్షకులు,పాలకులు
తపస్సు చేసే వారి సమస్యలు పరి ష్కరించి
పంపిస్తూ...వుంటారు.అది ధర్మ నీతి!పాలకుల బాధ్యత!

నాడు ముల్లోకాలను ఏలిన త్రిమూర్తులు,ఎందరికో...వరాలు ఇచ్చి సమస్యలు పరిష్కారం చేశారు.ఒకొక్క సారి అలవి కాని,వరములు ఎన్నో ఇచ్చి సమస్యలు కొనితెచ్చుకోవడం.ఎలాగో..లాగ,
వాటిలోంచి బయట పడి పోవటం జరిగింది. సమస్యకు పరష్కారాన్ని చూపటమే కాదు?
వాటిలో తను చిక్కు కోకుండా ,పరిష్కరించు కోవాలి.అప్పుడే ఆ పాలకుల లౌక్యం లోకానికి తెలుస్తుంది.కీర్తి ప్రతిష్టలు పెరుగు తాయి.

తపస్సు దేవ,దానవ, మానవులకే కాదు?
జంతు పక్షులకు కూడా హక్కుగా కొనసాగింది.గజేంద్ర మోక్షము కథ తెలుసు కదా?మొసలి చేతుల్లో చిక్కుకున్న  ఏనుగు 
 ఎలా? విష్ణువును వేడుకొని,బయట పడి ప్రాణాలు దక్కించుకున్నదో!అది తపస్సు కున్న గొప్ప శక్తి!

సరే.. సరే.అవి పురాణ కథలు. జరిగాయో?లేదో?ఎవరికి తెలుసు ?అనుకోని, కొట్టి పారేసినా...పర్లేదు!కాని,ఒకసారి మన భారత దేశ గ్రామీణవ్యవస్థనుక్షుణ్నంగా...పరిశీలించండి .
అప్పుడు తెలుస్తుంది. సమ్మెహక్కు ఎంత బలంగా కొనసాగింది.

గ్రామ వ్యవస్థ ఏర్పడి నప్పుడు ప్రతి గ్రామానికి కుల వృత్తుల వారు తప్పని సరిగా
ఉండేవారు.కుల వృత్తుల వారు లేక పోతే ఏపని
జరిగేదికాదు.కులవృత్తులవారుఅనగా...కుమ్మరి,కమ్మరి,వడ్రంగి,కంసాలి,చాకలి,మంగలి,మాదిగ,మాల,ఎరుకలి,మేదరి.

అట్టి వారితో,గ్రామ ప్రజలు పని కిందా సంవత్సరం పాటు చేసే వృత్తి పనికి గాను దాన్యం, లేదా?డబ్బులు ఒప్పందం చేసు కొని,సకాలంలో ఇచ్చేవారు.ఒక వేళ ఆ గ్రామ ఆసామి,సకాలంలో వృత్తి పని వారికి చెల్లించ వలసిన ధాన్యం,డబ్బులు చెల్లించని యెడల ,వృత్తి పని వారు అట్టి ఆసామి పనిని బహిష్కరించి,సమ్మె చేసే వారు.

ఆ ఆసామి తను నియమించుకున్న అతనితో,కాకుండా...వేరే వారి వద్ద కు వెళ్లి 
పని చేయించు కోవాలి అనుకున్నా,అతనికి
వేరే వృత్తి పని వారు,పని చేసే వారు కాదు.
ఆ ఆసామి మరో ఊరి వారితో, ఆ పని చేయించు కోవాలి అనుకున్నా,ఆ ఊరి వారు కూడా అతనికి పని చేసే వారు కాదు.నాడు వృత్తి పని వారు అలా సంఘటితంగా ఉండేవారు.

సకాలంలో పనులు పూర్తి కాక పోతే...ఇరువురు నష్ట పోవాల్సిందే.కాబట్టి అట్టి సమస్యను ఆ గ్రామ పెద్ద పరిష్కరించి,ఆ గ్రామ కట్టు బాటు నిబంధన ప్రకారం ఇరువురు నడుచు కునేలా చేసే వాడు.అది అనాదిగా గ్రామ వ్యవస్థలో వేళ్లూనుకుని పొయి,సమ్మె హక్కుగా వర్ధిల్లింది.

నేడు మన వ్యవస్థ యాంత్రిక మైపోయింది.
కుల వృత్తులు చెయ్యి జారి పోయాయి.అన్ని
 యంత్రాల ద్వారా తయారైన వస్తువులు సులువుగా అంగల్లలో దొరుకుతున్నాయి.

నేడు సాంకేతిక విప్లవం ద్వార ప్రతి వస్తువు
ఒక పోను కొడితే వచ్చి, ఇంటి ముందు వాలి
పోతుంది.

ఏనాడైనా?మనం మన శాస్త్రాలను అధ్యయనం చేయకుండా...పురాణాలను 
పరిశీలిం చకుండా,విదేశీయులు చెప్పిందే వేదంగా పాటిస్తూ...వస్తున్నాం. విదేశీయులు మన శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి,అందులోని జ్ఞాన సంపదను సేకరించి,మనకే తమదిగా చెబుతూ...అందిస్తువున్నారు.ఒక నాడైనా?మన గ్రామీణ మూలాలను క్షుణ్నంగా... పరిశీలించారా?లేదు.

ఈ నాడు సమ్మె చేస్తున్న వారంతా...ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తూ...రోడ్లను నిర్బందిస్తూ...ప్రయాణికులకు నరకం చూపిస్తున్నారు.సమ్మె అనేది, ఎవరి హక్కులకు భంగం కలగకుండా...శాంతియుతంగా ,అహింసా పద్ధతిలో చేసి ,తమ సమస్యలు పరిష్కరించు కోవాలి.అప్పుడే సమ్మెకుసంపూర్ణ సిద్ధి లభిస్తుంది.
జైహింద్.


Monday, 17 February 2020

ఏది ప్రామాణికం..?



ఏది ప్రామాణికం..?
****************
  జోతిష్యశాస్త్రము, సామాన్య శాస్త్రము ఏది ప్రామాణికం?అన్న వాద ప్రతి వాదాలు నిత్యం,ఏదో...ఒకవేదిక పైన జరుగుతూనే..
వున్నాయి.మాశాస్త్రమే గొప్పాంటే?మాశాస్త్రమే గొప్ప అని గొంతులు పగిలిపోయేలా,అరుస్తూ... పిడివాదం చేస్తున్నారు.రెండు శాస్త్రాలు రైలు పట్టాల లాంటివే!వాటిపై సాగి పోవడమే మనిషి పని.అంత మాత్రాన వాదులాడుకోవడం
అవసరమా? అయితే..?ఈ రెండు శాస్త్రాలు
వాటి విధి విధానాలను ఎలా..? నిర్వహిస్తు న్నాయో...ఒకసారి పరిశీలన చేసి తెలుసుకుందాం.
  జోతిష్య శాస్త్రం అంచనా వేసి చెప్ప బడుతుంది.అది ఒకసారి నిజం కావచ్చు
కాకపోవచ్చు.అంతమాత్రానకొట్టిపారేయలేం.మన పూర్వీకులు కాలగమనాన్ని లెక్కలు కట్టి,రోజులు,వారాలు,నెలలు,సంవత్సరాలుగా,విభన చేశారు.పౌర్ణమి, అమావాస్యగా
విభజించి చూపారు.తితి, నక్షత్రంగా గుర్తులు పెట్టారు.దీనిని ఎవరు కాదన లేరు.
  పూర్వ కాలం నాటి నుండి నేటి వరకు ఈ
లెక్కల విధానాలే అమలు జరుగుతున్నాయి
ఇవి అన్ని కాల గమనం,గ్రహాల స్థితి గతులను బట్టే జరుగు తున్నాయి.సూర్య గ్రహము, ఇది సకల ప్రాణులకు జీవం పోస్తుంది.సూర్య గ్రహము లేక పోతే సృష్టినే
లేదు.భూ గ్రహము కూడా సకల ప్రాణులకు బతుకు నిస్తుంది.ఎన్నో వనరులు సంపదలు ధార పోస్తుంది.ఇలా... ఏ గ్రహం ఆ గ్రహం
యొక్క ప్రత్యేకతలు కలిగి, మానవ జీవనోపాధికి ఉపయోగ పడుతూ వున్నాయి
ఇది ఎవరు కాదన లేని నిజం!
  పంచ భూత నిర్మితమైన ప్రకృతి విధి విధానాలను పొందు పరిచి మానవులకు
అందించినదే జ్యోతిష్య శాస్త్రం.ఇది ఎన్నో అనుభవాలతో రంగరించి రూపు దిద్దుకుంది.
దీనిని నమ్మిన వాళ్ళైనా..?నమ్మక పోయిన వాళ్ళైనా..?ఈ అనంత సృష్టిలో సాగిపోవలసిందే!ఎవరి కొంపలెం మునిగిపోవు.
 సామాన్య శాస్త్రం ఇది నిరూపించి చెప్ప బడేది. ఆ శాస్త్రం కూడా కాల గమనం,గ్రహ స్థితి గతులనులెక్కలు కట్టి చూసింది. ఆ
లెక్కలు కూడా జ్యోతిష్య శాస్త్రానికి సరి తూగి పోయాయి. ఆ లెక్కలు ఈ లెక్కలు ఎప్పుడు తేడా రాలేదు.వచ్చే తేడా అంత 
మూడ నమ్మకాలు,మూర్ఖపు ఆలోచనల
వలనే వస్తున్నాయి.ఒక్కొక్క సారి సామాన్య
శాస్త్రం అంచనాలు కూడా లెక్క తప్పుతుంటాయి. ఒక సారి వాతావరణ శాఖ తెలిపింది గమనిస్తే మీకే తెలుస్తుంది.
అంతే కాదు?ఎంతో పకడ్బందీగా నిర్మాణం
చేసిన యంత్రాలు కూడా లెక్కలు తప్పుతాయి.పని కూడా చెయ్యవు.అంటే,ప్రకృతిలోని శక్తులు ఎప్పుడు ఎలా..!పరివర్తన చెందు తాయో...? ఏ శాస్త్రాలు కూడా చెప్పలేక పోతున్నాయి.ఎంతో...వైజ్ఞానికంగా,ఎదిగి
సాంకేతిక విప్లవ మార్గంలో గ్రహాంతరాలలో నడుస్తున్న మానవుడు ప్రకృతి శక్తుల ముందు నిర్వీర్యం అవుతున్నాడు.ఇది కాదన లేని సత్యం.అంచనాతో చెప్ప బడే
జ్యోతిష్య శాస్త్రమైనా..?నిరూపించి చెప్ప
బడే సామాన్య శాస్త్రమైనా..?దేని మార్గం దానిదే చూపిస్తుంది.సరియైన మార్గం ఎంచుకొని నడవడమే మానవుడి పని.
మూఢ నమ్మకాలు,మూర్ఖపు ఆలోచనలతో
నడవ కూడదు.అప్పుడే అనర్థాలు సంభవిస్తాయి.వాటిని శ్శాస్త్రాలమీద రుద్ది
గగ్గోలు పెడితే ఏం ప్రయోజనం?
  ఎవరి నమ్మకాలతో వాళ్ళు ఎవరి ఆలోచన
ధోరణిలో వాళ్ళు నడవడం చాలా మంచిది.
ప్రకృతిలో కాలగామనాన్ని అనుసరించి సాగటం ఎంతో శ్రేయస్కరం. ఏ శాస్త్ర మైనా..? ఏ శక్తి ఐనా..? ప్రకృతి లోంచే ఏర్పడ్డాయి తప్ప మానవుడి జేబులోంచి కాదు?ఈ విషయం గ్రహిస్తే మానవుడు పరిపూర్ణుడే!
జైహింద్.
ఆకుల.రాఘవ.


Tuesday, 21 January 2020

ప్రకృతిలో శబ్దం వున్నంత వరకు తెలుగు భాషా దేదీప్యమానంగా వెలుగుతుంది.


ప్రకృతిలో శబ్దం వున్నంత వరకు తెలుగు భాష దేదీప్యమానంగా వెలుగుతుంది!
*************
  అవును..!ఇదినిజం!జంతువులు,పక్షులు,క్రిమి,కీటకాలు వున్నంత వరకుకూడా తెలుగు భాష దేదీప్యమానంగా వెలుగుతుంది!నీకు నమ్మకం లేదా?అయితే..
ఒక సారి క్షుణ్నంగా..పరిశీలిస్తే నీకే అర్థం అవుతుంది.
  ఉరిమితే..."చర..చర"పిడుగు పడితే..."ఢాం"అని తెలుగు భాష శబ్దాలే పలుకు తాయి.రెండు చేతులతో గట్టిగా చప్పట్లు కొడితే.."చ"అని తెలుగు భాష శబ్దమే పలుకు తుంది.ఇలా...ఎన్నెన్నో...
ఉదాహరణలు చెప్పవచ్చు.
  జంతువులు,పక్షులు,క్రిమి, కీటకాలు ప్రపంచంలో ఏ ప్రాంతంలో,మూలలో వున్నా
అవి పలికే పలుకుల్లో తెలుగు భాష పదాలే వుంటాయి!అవు"అంబా"అని,కుక్క"భౌ"అని
కాకి"కావ్"అని చిలక"కిల..కిల,కోయిల"కూ.. కూ"మేక"మే...మే"అని ఈ గ"జుయ్"అని, దోమ"గుయ్య్"అని, కీచురాళ్లు "కీచ్"అని,ఒక చిన్న పిట్ట అదే ట్విట్టర్ పైకి ఎగిరి ఏడు రకాల స్వరాలతో అరుస్తుంది. ప్రతి వాటి అరుపుల్లో తెలుగు భాష పదాలే వుంటాయి!
మరి తెలుగు భాష మృత భాష ఎలా...అవుతుంది?ఒకసారి విజ్ఞులు ఆలోచించాలి?కాకపోతే...నేటి తరం ఆంగ్లభాష మోజులో పడి,తెలుగు భాషను
నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతే?
  ప్రకృతికి,జంతువులు,పక్షులకు,క్రిమి ,కీటకాలకు లేనిది, జగతి ప్రజల్లోనే వుంది!
దేశానికి ఒక భాష,ప్రాంతానికి ఒక యాస,పలుకు బడి అయిపోయి,భాషలన్నీ 
గజి బిజి గందర గోళానికి గురి అయి పోతున్నాయి.కాబట్టి ప్రపంచ ప్రజలు మా భాషయే గొప్పంటే...లేదు...లేదు ?మా భాష యే గొప్పని, వాదులాడుతూ... పిడి వాదం చేస్తున్నారు.అది ఎంత మాత్రం సరియైన
పద్ధతి కాదు?
  ప్రపంచంలో ఏ స్త్రీ అయినా..?ప్రసవ వేదనలో "అమ్మా"అని అరుస్తుంది.కాని,మరో..విధంగా అరవదు?
పుట్టిన బిడ్డ కూడా "ఆ... ఆ"కేర్..కేర్"అని
అరుస్తుంది.ఎవరికి ఎలాంటి దెబ్బతగిలి నా
"అమ్మా"అని అరుస్తారు.ఇది తెలుసుకుంటే
తెలుగు భాష ఉచ్చారణ ప్రపంచ భాషలకు
మాతృక అని తెలిసిపోయింది కదా?
  ఆంగ్ల భాషలో ఏ అక్షరం పలికినా...?తెలుగు భాష లోని,ఆకారాలు, ఇకారాలు,ఎకరాలు, ఉకారాలు వుంటాయి.
అది ఒక సారి గమ నించండి చాలు!
  అంతెందుకు...?మనకు వున్న ఖండాల పేర్లు ఒక్కసారి చూడండి.వాటి పేర్లలో మన
తెలుగు భాష లోని మొదటి అక్షరాలు ఉన్నాయి చూడు!అమెరికా,ఆసియా,ఆప్రీకా,
ఆస్ట్రేలియా, అంటార్క్ టికా,యూరప్, ఐరోపా.ఇలా...ఎన్నెన్నో ఉదాహరణలు
పేర్కొనవచ్చు.ఇక...?తెలుగు భాష పై దిగులెందుకు?
  ప్రకృతిలో మానవుడు ఏదేశంలో కాని, ఏ ప్రాంతంలో కాని,జనిమిస్తే...అతనికి ఆ ప్రాంతం అమ్మ ఒడి,బడి అవుతుంది. ఆ బిడ్డకు అక్కడి మట్టితో అనుబంధం ఏర్పడుతుంది!అక్కడి పరిసరాల స్ఫూర్తితో
విజ్ఞానం వికసిస్తుంది.అక్కడి సంస్కృతి ,సంప్రదాయాలు,ఆచారాలు ఆలవడి పోతాయి.పాకులాడిన నేల,పరుగెత్తిన ప్రదేశాలు,కలిసి ఆడుకున్న ఆటలు అతని మనో ఫలకంమీద ముద్రపడి పోతాయి.అవే..అతను జీవితంలో ఎదగడానికి దోహద పడతాయి.కాబట్టి, ఎవరి ప్రాంతం వారికే ముద్దై,ఎవరి పలుకు బడి వారికే అందం.ఆరాద్యం.అనే...విషయం మరిచి పోకూడదు?మిగితా వారి భాషను,యాసను
హేళన చేయకూడదు?
  ప్రపంచంలో ఏ ప్రాంతం మనిషి అయినా..?
ఆ ప్రాంతం భాష అతన్ని తీర్చి దిద్ది విజ్ఞాన
వంతున్ని చేస్తుంది.అతను పలుకు బడితో
రాణిస్తే చక్కని విద్యావంతుడు కాగలడు.
లేనిచో మౌకిక భాష మాట్లాడే వాడుగా,అవిద్యాపరుడుగా మిగిలి పోతాడు.అయినా..? ఆ అవిద్యాపరుడు అక్కడి పరిసరాలు నేర్పిన విజ్ఞానంతో ఎంతో...తెలివైన వాడుగా రానిస్తాడు.  ఒక సారి అతను కూడి,గుణించి,తీసివేసి లెక్కలు కట్టే విధం చూడండి మీకే అర్థం అవుతుంది.నాణేలను గుర్తు పట్టే విధం చూడండి.మీకే తెలుస్తుంది.అట్టి అవిద్యాపరులు వారి యొక్క భాషకు ఎన్నడూ...ద్రోహం చేయరు.వారు వారి భాషను సరళంగా,సులువుగా,చాలా అందంగా మాట్లాడుతారు. చదువరులే..
వారి భాషను కూని చేసి ,మాటల్లో,చేతల్లో,
వ్రాతల్లో రక రకాల ప్రయోగాలు చేసి కలుషితం చేస్తున్నారు. సంకరం చేస్తున్నారు.
భాషావేత్త లతోటే...ప్రపంచ భాషలకు ముప్పు వాటిల్లింది!ప్రజలు అది గమనిస్తే 
మంచిది?
  ప్రాంతీయ భాష ఆ ప్రాంతంలో జీవనం సాగించే వాళ్లకు సరే...సరి.కాని, ఆ ప్రాంతాన్ని వదిలి ఎప్పుడైతే...వలస బాట పడతారో...అప్పుడే...అక్కడి భాషతో..అలవాటు పడి పోతారు.లేనిచో..
అక్కడ బతకడం చాలా...కష్టం అవుతుంది.
అలాంటి వలస దారుల వలనే మన తెలుగు భాష సంస్కృతి,సంప్రదాయాలు,ఆచారాలు
మారిపోతున్నాయి.ఇది అక్షర సత్యం!
  ఆంగ్లేయులు ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాల వరకు పరిపాలించి,పోతూ ...పోతూ..ఆంగ్ల భాషను గజ్జిలా తగిలించి
వెళ్లారు.అని వారి మీద నిందెలు వేస్తున్నాం
తప్ప మనం ఒరగబెట్టింది ఏమి లేదు?
  కాల గర్భంలో కలిసి పోయిన తెలుగు భాష ను తిరగదొడిన బ్రౌన్ దొర వేమన శతకం పునర్ ముద్రించి,దాన్ని ఆంగ్లంలో అనువాదం చేశాడు.ఏకంగా ఒక నిఘంటువుని రూపొందించి మనకు అందించాడు.అలాంటి ముందు చూపు మన
తెలుగు వాళ్లకు ఎక్కడుంది? నేటికి మన సాహిత్యం లండన్ మ్యూజియంలో భద్రపరిచారు. అది భాషాభిమానులకు వుండే విజ్ఞత!
  కాటన్ దొర ఏకంగా...గోదావరి, కృష్ణా నదులపై ఆనకట్టలు నిర్మించి ఆంధ్ర రాష్ట్రం ను అన్నపూర్ణగా నిలిపాడు. 
  ఆంగ్లేయులు భారత దేశ ప్రజలను ఎందరినో...విద్యావంతులుగా తీర్చిదిద్దారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద పార్లమెంట్
భవనం నిర్మించి ఇచ్చారు.కాశ్మీరు నుండి కన్యాకమారి వరకు రైలు మార్గం,ఎన్నో వంతెనలు నిర్మించారు.నేటికి ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. వాళ్ళ కింద తొత్తులుగా వున్న మనలో కొందరు కమీషన్ల 
కక్కుర్టితో మనల్ని హింసించారు తప్ప ,వారు ఎప్పుడూ...అన్యాయంగా ప్రవర్తించ
లేదు.
  ఇకనైనా...?మించి పోయింది లేదు.మనల్ని మనం .మన భాషను, యాసను తీర్చి దిద్దు కుంటే చాలా మంచిది!
జైహింద్.
ఆకుల.రాఘవ


Wednesday, 8 January 2020

అన్ని వెల్డిగ్ కథలే..!

అన్నీ వెల్డింగ్ కథలే!

-ఆకుల రాఘవ07/01/2016
నేడు తెలుగు చిత్రసీమలో వెల్డింగ్ సినిమా కథల హోరు జోరుగా కొనసాగుతుంది. కారణం తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చే యువతరం అందరూ ఆంగ్లంలో ఇంజనీర్లు, డాక్టర్లు చదివిన వారైనందున వారికి పూర్తిగా తెలుగు భాష తెలియక, తెలుగు సాహిత్యంతో పరిచయంలేక, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఏమాత్రం అర్థంగాక, అనుభవంలేని వారైనందున వెల్డింగ్ కథల హోరు కొనసాగుతుంది!
అలాంటి యువత ఏదోవిధంగా రచయితలుగా, దర్శకులుగా తెలుగు చిత్రపరిశ్రమలో నిలదొక్కుకునే సంకల్పంతో పరిశ్రమకు వస్తున్నారు. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంజనీర్లు తమ వృత్తిలో ప్లాన్లుగీసి ఆ ప్లాన్లలో ఎక్కడ అతకాలో, ఎక్కడ తెగ్గొట్టాలో సంపూర్ణ అవగాహన కలిగివుంటారు. అదే విధానాన్ని ఇక్కడ అవలంభిస్తున్నారు. డాక్టర్లు కూడా తమ వృత్తిలో ఒక రోగికి ఎలా శస్తచ్రికిత్సలు చేసి కొయ్యాలో, అతకాలో అదే విధానాన్ని ఇక్కడ అవలంభిస్తున్నారు.
నేడు వీరికి అనుభవంతో పనిలేదు. ఒక ఇంటర్‌నెట్‌తో ఉన్న కంప్యూటర్‌కాని, స్మార్ట్ఫోన్‌కాని ఉంటే చాలు. ప్రపంచ భాషలోవున్న చిత్రాలను యూ ట్యూబ్ ద్వారా డౌన్‌లోడు చేసుకొని చూస్తూ.. వారికి నచ్చిన సినిమాలోని సన్నివేశాలను ఏరుకొని, ఒకదానితో ఒకటి పేర్చి వెల్డింగ్ చేస్తున్నారు. సన్నివేశాలే కాదు, మాటలు, ఫ్రేమ్స్, గ్రాఫిక్స్, షాట్స్ అన్నీ మక్కికిమక్కి కాపీచేస్తూ ఒక సినిమాలా అతుకుతున్నారు. అలా అతికినది ఒక సినిమా కథలా, బౌండ్‌స్క్రిప్టులా తయారవుతుంది. అంతే!
నిర్మాతలు, హీరోలు కూడా కథ ఎలా తయారైతే ఏమిటి? అలా కాపీకొట్టి వెల్డింగ్‌లాగ అతికినవాడే మొనగాడు! అదే క్రియేటివిటి! అదే నేటితరం విజువల్ వండర్ అంటూ చంకలు గుద్దుకొని, వాటిని సినిమాలుగా మలుస్తున్నారు. అవి హిట్టయితే ఢంకా బజాయించి కేరింతలు కొడుతున్నారు. ఫట్‌మంటే దర్శకుల మీద, రచయితలమీద ఆ నెపంతోసి కుళ్లికుళ్లి ఏడుస్తున్నారు.
విమర్శలు ఎక్కువైతే వే
మే వెల్డింగ్ కథలు అందిస్తున్నామా? దర్శకత్వం చేస్తున్నామా? పూర్వపురోజుల్లో కూడా నాటి రచయితలు, దర్శకులు కాపీలు కొట్టలేదా? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు.
నాడు దర్శకులైనా రచయితలైనా ఏదేని భాషలో వచ్చిన సినిమా నచ్చితే, ఆ మూల రచయిత పర్మిషన్‌తో ఆ కథను కొని, తెలుగు నేటివిటీకి సరిపోయేలా మార్పులుచేర్పులు చేసి, తెలుగుభాష ఉట్టిపడేలా తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. నటీనటులు కూడా చక్కగా ఒదిగిపోయి నటించి తమ సత్తాచాటుకున్నారు. ప్రతి సన్నివేశం ఎంతో భావోద్వేగాలతో రసవత్తరంగా నవరసాలు ఉట్టిపడేలా వుండేవి. సంగీతం కూడా వీనులకు విందుగా అద్భుతంగా అమరేది. అది నాటి దర్శకులకున్న మర్యాద, జిజ్ఞాస!
ఆమాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు వెల్డింగ్ కథలతో సినిమాలు నిర్మించటం, ఆంగ్ల చిత్రాల్లోని యుద్ధ సన్నివేశాలను, అదేవిధంగా షాట్స్‌గాతీస్తు ప్రతిభమాదే! కంప్యూటర్ టెక్నాలజీ మాదేనని విర్రవీగితే ఎలా?!
నాడు ట్రిక్ ఫొటోగ్రఫీ ద్వారానే ఎన్నో అద్భుతాలు మనవాళ్ళు సృష్టించారు. ఎన్నో ప్రయోగాలుచేసి విజయాలందుకున్నారు. అది వారి గొప్పతనం! అలాంటివారి పాత సినిమాల్లోని సన్నివేశాలు, మాటలు, పాటలు, షాట్స్ కలిపి తెగగొట్టి వెల్డింగ్ చేస్తూ.. మేమో నవీన సాంకేతిక పరులమని విర్రవీగితే ఎలా? ప్రేక్షకులకు ఎవరు ఏమిటో తెలియదా? అందుకే స్టార్ హీరోల, స్టార్ డైరెక్టర్స్ చిత్రాలు కోట్లు కుమ్మరించి చిల్లర డబ్బులు ఏరుకున్న చందంగా ఉంది. ఇకనైనా తెలుగు కథ తెలుగులో పునర్నిర్మితమైతే మేలు!

Log in or register to post comments

Tuesday, 3 October 2017

భాషా? యాసానా... ఏది ప్రామాణికం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భాష ప్రకృతిలో ధ్వనించే శబ్దాలనుండి పురుడు పోసుకుంటుంది. ఆ శబ్దాల పలుకులలో నుండే భూమిపై ఆవిర్భవించిన మానవులు వాటిని, మాటలుగా అల్లుకున్నారు. అలా ప్రపంచంలో ఎన్నో దేశాల ప్రజలు వారి కనుగుణంగా భాషను తీర్చిదిద్దుకున్నారు. అలా దేశానికి ఒక భాషగా వెలసిన భాష, ప్రాంతాలుగా విస్తరించి ప్రాంతానికి ఓ భాషగా ఏర్పడింది.
అలా మాటల్లోనుండి పుట్టిన భాష, మాటగా, పాటగా, నాటకంగా రూపుదిద్దుకొని, సమాజంలో తన పాత్ర నిరంతరంగా పోషిస్తూ వస్తున్నది. భాషలో నుండే సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు పుట్టుకొచ్చి వారి వారి జీవన విధానాలను తెలియపరిచింది.
ఎప్పుడైతే మాట, పాట, కథ, ఛాయాచిత్రాల్లో ప్రవేశించాయో- అప్పుడే ఆయా దేశాల కథలు, చరిత్రలు దృశ్యరూపాలుగా మారి ప్రేక్షకులను ఆనందడోలికల్లో ఓలలాడించాయి.
సినిమా బలమైన మీడియా అయినందున, అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా, ప్రాంతీయ భాషల్లో కూడా తన ప్రస్థానం కొనసాగిస్తుంది. నేడు ఎన్నో సాంకేతికపరమైన మార్పులో సినిమా దినదిన ప్రవర్థమానంగా వెలుగుతుంది. ఎందరో కొత్తవారు చిత్ర పరిశ్రమలో అడుగిడి తమ తమ అభిరుచిని, వ్యాపార ధోరణిని చాటుకుంటున్నారు.
తెలుగు భాషలో ఎన్నో జోనర్లమీద చిత్రాలు నిర్మించబడి, స్వర్ణయుగంగా భాసిల్లాయ! అయితే సినిమా పండితులను, పామరులను రంజింపచేసే దృశ్యకావ్యం కాబట్టి, ఆ రెండు వర్గాలను దృష్టిలో పెట్టుకొని, తేలిక మాటలతో పాటలతో నవరసాలను జొప్పించి ఆ చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకులకు చూపిస్తారు. సినిమా తెలుగు భాషకు సంబంధించినదే అయినా, తెలుగులో వున్న మూడు ప్రాంతాలకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు అనువుగా వుండేలా చూసుకొని సినిమాలు నిర్మించారు. సినిమాలోని ప్రధాన పాత్రలకు వాడుక భాషను, కామెడీ, విలన్ పాత్రలకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మాండలిక యాసలను ప్రవేశపెట్టారు. అయితే.. భాష విషయంలో తెలుగు సినిమాల్లో కొన్ని ప్రాంతాలకు ద్రోహం జరిగిన మాట వాస్తవమే అయినా, అందుకు మిగిలిన ప్రాంతాల వాళ్ళు చిత్రరంగానికి రాకపోవటం కారణం అయితే, వచ్చిన ఏ కొద్దిమందో చిత్రరంగంలో నిలదొక్కుకోకపోవటం రెండవ కారణం? ఇక్కడ ఎవరిని తప్పు పట్టవలసిన పనిలేదు. సినిమా వ్యాపారమన్నప్పుడు, పెట్టిన ప్రతి పైసాకు లాభం వచ్చేలా చూసుకోవటమే ముఖ్యం. కాబట్టి ప్రతి నిర్మాత, దర్శకుడు లాభాపేక్షతోనే చిత్రం తియ్యాలనుకుంటాడు. కాని యాస, సంస్కృతి, ఆచార వ్యవహారాలు కావాలని కోరుకోడు. అది ధర్మం కూడా కాదు. అలా అయితే ఆ నిర్మాత నెత్తిన చెంగు వేసుకొని వెళ్ళవలసిందే! దర్శకుడు రోడ్డున పడి ఆకలితో అలమటించవలసిందే!
నేడు చిత్ర పరిశ్రమలో ఒక ధోరణి మొదలైంది. తెలంగాణ భాషలో సినిమాలు తీస్తే విజయవంతమవుతాయని! ప్రభుత్వం పన్ను రాయితీలు ఇస్తుందని! అసలు తెలంగాణ భాష అంటే ఏమిటో అలా అనేవాళ్లకే తెలియాలి. తెలుగు అనేది ఒక భాష. తెలుగు తల్లి అనేది భాషకు సంబంధించిన తల్లి. తెలంగాణ తల్లి అనేది ప్రాంతానికి సంబంధించిన తల్లి. భాషావేత్తలు ఇది గుర్తించాలి. అప్పుడే తెలుగు భాష అంటే ఏమిటో? యాస అంటే ఏమిటో తెలుస్తుంది.
తెలుగు రాష్ట్రం సమైక్యంగా వున్నపుడు ప్రతి జిల్లాకు ఓ మాండలిక యాస వుంది. నేడు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అవే మాండలిక యాసలు కొనసాగుతున్నాయి. విజ్ఞులు గుర్తిస్తే సరి!
తెలుగు రాష్ట్రం సమైక్యంగా వున్నపుడు తెలంగాణ ప్రాంతం నుండే ఎక్కువ ఆదాయం విడుదలైన ప్రతి సినిమాకు వచ్చేది. నేడు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, తెలంగాణ ప్రాంతం నుండే ఎక్కువ ఆదాయం ప్రతి సినిమాకు వస్తుంది. పైగా సిఎం, తెలంగాణ చరిత్రను, సంస్కృతిని ఆవిష్కరించేలా సినిమాలు తీస్తే పన్ను రాయితీలు, బహుమతులు ఇస్తానని ప్రకటించారు. ఆ మాట ప్రకారమే ‘రుద్రమదేవి’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాలకు పన్ను రాయితీ ఇచ్చారు. ఇక నాటినుండి తెలంగాణ భాషా సినిమాలని మొదలైంది! అది నిజం కాదు?
సినిమాల్లో ఒక ప్రాంతం యాస, సంస్కృతి సంప్రదాయం తొణికిసలాడుతూ ఆ ప్రాంతం ఆత్మ ఆ చిత్రం పరిపూర్ణంగా ఆవిష్కరించబడాలి! అప్పుడే అది ఆ ప్రాంతం చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది. మాండలిక భాషావేత్తలను ఆకట్టుకుంటుంది. అలా నిర్మించిన చిత్రాలే ‘చిల్లర దేవుళ్ళు, మాభూమి, రంగులకల, దాసి’ ఇలా కొన్ని చిత్రాలు తెలంగాణ చిత్రాలుగా ముద్ర వేసుకున్నాయి. ప్రపంచ గుర్తింపును తెచ్చుకున్నాయి. అంతేకాని తెలంగాణ యాసను మాటలుగా రాసి తెలంగాణ వాళ్ళు తీసి నటిస్తే, తెలంగాణ యాస చిత్రాలు కావు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే చిత్రాలుగానే పరిగణింపబడినాయి. ఇకనైనా వాదోపవాదాలు మాని, యాస, సంస్కృతి, చరిత్ర ఆవిష్కరింపబడేలా చిత్రాలు తియ్యాలని ఆశతో..
-ఆకుల రాఘవ