Wednesday, 23 December 2020

కాలానికి తలవంచని దీపం..!


కాలానికి తల వంచని దీపం!
************************
దీపం!
మానవుడు కనుగొన్న
మొట్ట మొదటి
ప్రత్యాన్మయ వెలుగు!
అది చీకట్లో...
మిణుకు మిణుకు మంటూ...
వెలుగుతూ... కాంతినిస్తుంది!
అది తళతళ వెలుగులు చిమ్ముతూ...
పగలును తలపించక పోవచ్చు?
కాని,కొండంత ధైర్యాన్నిస్తూ...
కాంతిని పంచుతుంది!
దీపం నుండి కాగడా
లాంతరు పెట్రోమాక్స్
ఇలా...ఎన్నెన్నో..?
రూపాంతరాలు చెందినా?
అవి కాలానికి తలవంచక తప్పలేదు?
దీపం మాత్రం కాలానికి
తల వంచ లేదు?
అది నేటికి ప్రతి ఇంట్లో
దేవాలయాల్లో
దేదీప్య మానంగా
వెలుగుతూనే వుంది!
కొన్ని ఆలయాల్లో
సంవత్సరం పొడవునా
గండ దీపంగా వెలుగుతూ...
దాని ప్రతిభను బాధ్యతను
చాటుతూ వెలుగు తుంది!
మానవుడు బొగ్గు నుండి
అణువిద్యుత్తును
జలం గాలి నుండి
జల పవన విద్యుత్తును
సృష్టించుకొని
ఎన్నెన్నో తళుకు బెళుకుల
రంగు లీనుతు...
చీకట్లో పగలను పంచినా?
కాలమాన పరిణామాల మార్పులకు
ఇట్టే ఆగిపోతుంది!
ప్రపంచాన్ని చీకట్లో
మగ్గెలా చేస్తుంది!
అది కాలానికి తల వంచక తప్పదు?
దీపం ఒక్కటే
కాలానికి తల వంచక
చీకట్లో కాంతి పుంజమై
తన వెలుగును పంచుతూ...
మన వెన్నంటి సాగుతుంది!
అదే దీపానికి వున్న గొప్పదనం!
దీపమా నీకు జోహారు!!
జైహింద్
ఆకుల.రాఘవ.