Sunday, 31 March 2013

పట్నం ఇరుకుల గల్లీ
కుమ్మరి వాంలో కుండలు
కాలిపోతున్నట్లు
కాలుష్యపు కంపుతో
కాలిపోతువున్నది !

Friday, 29 March 2013

మతాది పతులు
భక్తులకు
బతుక నేర్పాలి !
దేవుళ్ళ మహిమలుకాదు ?
సేద్యమంటేనే రైతు 
కంటతడి పెడుతున్నాడు !
రియల్టర్ పంటభూమూలు 
ప్లాట్స్ చేసి 
కోట్లు గడిస్తున్నాడు !
మాటలు నేర్చినవాడు
నగరంలో మహారాజు !
మాటలు రానివాడు
నగరంలో ఒంటెద్దు !

Saturday, 23 March 2013

          శ్రమ సౌందర్యమే సంగీతము
         -------------------------పాట
మట్టిలో రాగాలు తియ్యంగా
గింజలే మొలకెత్తి మురువంగా 
రాళ్ళల్లో తాళాలు వేయంగా
అవి బొమ్మలై నాట్యమాడంగా
శ్రమ సౌందర్యమే సంగీతం
బ్రతికేటి ప్రాణుల కానందం
     తొలిపొద్దు కిర ణాల రాగాల్లో
     చిరుగాలి తాళాల నాదాల్లో
     ఆమని మేల్కొని హాయీ గా ఆడంగా
     జగతి జనులంతా దిన చర్య మొదలెట్టే
     స్రమలోని పలితాలు ఆకలి తీర్చంగా
     ఆనంద మానందమే జగమంత ఆనందమే
కెరటాల నాట్యాల తుళ్ళింత లో
మేఘాల మెరుపుల కవ్వింతలో
ముత్యాల జల్లులు పువ్వులై పొంగగా
మట్టిలో గింజ్జలు నేల తన్నుకొని
తల ఎత్తి ఆడుతూ పచ్చదనం పంచె
పచ్చదనమే జగతి జనుల బతికించు
         జైహింద్ 

Wednesday, 20 March 2013

ఆకాశం నవ్వితే తరువులకు అన్నము !
తరువులు నవ్వితే ప్రజలకు అన్నము !
     చిరుగాలి నవ్వితే కెరటాలకు అన్నము
    కెరటాలు నవ్వితే మేఘాలకు అన్నము
    మేఘాలు నవ్వితే పుడమికి అన్నము
   పుడమి నవ్వితే మొక్కలకు అన్నము
   మొక్కలు నవ్వితే ప్రజలకు అన్నము
  అదికని మనిషి బ్రతికేను ధరణి
        సూర్యుడి నవ్వులే లోకాలకు ఆధారము
        పుడమి పుణ్యమే మనుగడకు అర్థము
       పవన పయనమే ప్రాణులకు శ్వాశ
      వరుణుడి రాకే ప్రాణులకు జీవము
      కాలమే అనుభందాల చక్రము
     ప్రకృతికి మనిషికి ఋణాను భంధము
      జైహింద్ 

Monday, 18 March 2013

ఒంటికంటిన దురద
మందుతో పోతోంది
మన సుకంటిన దురదకు
మందేలేదు !

Saturday, 16 March 2013

జంతువులకు పక్షులకు
సరిహద్దులు లేవు
వీసాల గుర్తింపు లేదు
మానవుడి కెందుకు
సరి హద్దుల కట్టుబాట్లు ?
వీసాల గుర్తింపు ?!
సూర్యుని ఎండను రా యీ
ఎదలో కప్పుకోను
ఆరా యీ ని గిల్లిచూ డు
నిప్పు రవ్వలురాలు !
చెట్టు మొదలు నరికితే
తిరిగి జీవం పోసుకుంట్టుంది !
మనిషి తలనరికితే
తిరిగి జీవం పోసుకోగలడా ?!