Monday, 16 April 2018

                                                       రాత
                                                      *****
కన్న కడుపు ఒకటైనా ?
జన్మించిన వారి రాత
ఒక్కతీరు ఉండ లేదు 
ఒకేలాగ సాగలేదు   
అదిరాతలోనిమర్మము!
సృష్టిలోని రహస్యము !
రూపు దిద్దే అమ్మకడుపు
అచ్ఛు పోసేయంత్రమైనా ?
పుట్టిన తనబిడ్డలంత
ఒకేఅంద ముండలేరు!
ఒకే నడత నడవలేరు!
గుణ గ నాలు వేరు వేరు!
బుద్ధి శుద్ధి వేరువేరు !
అది అమ్మకడుపు మహిమానా ?
నాన్నబీజ వైనమా?
అర్థం కాని సృష్టిరా ?
యుగ యుగాల పరంపర!
పేగుతెంచుకున్న వారు
తల్లిపాలుతాగి ఎదిగి
అమ్మ ఒడిలో ఆడిపాడి
సుద్దులెన్నోనేర్చినా ?
వారి పద్ధతులే వేరు వేరు !
నాన్న వెలుపట్టినడచి
బతుకు బాట  తెలుసుకున్నా?
పుఱ్ఱె కొక్కబుద్ధిరా!
జివ్వ కొక్క రుచిరా!
టేస్టు ట్యూబ్ బేబికైనా?
ఇవే లక్ష ణాలు రా!
జైహింద్ . 

Saturday, 24 February 2018

మనిషి
------
చక్కర పరిశ్రమగా
మారిపోతున్నాడు !
పక్షవాతంతో
వంకర్లు తిరుగుతున్నాడు !
మూత్ర పిండాల్లో
రాళ్లు ఏరుకోలేక చస్తున్నాడు !
నరాలకాలువలు పూడుకుపోయి
గుండెతడి ఆరి పోతున్నాడు !
మోకాళ్ళ నొప్పులతో
కీలు గుఱ్ఱంలా నడుస్తున్నాడు !
తనువు రోగాల పుట్టగా
మారిపోతున్నది !
అన్నింటికి కారణం
ఆహారపు అలవాట్లే !
కల్తీల కాలుష్యమే !
మందుపదార్థాల
మాయాజాలమే !
మనిషి త్వరగా మేలుకుంటే
ఆరోగ్యం
మహా భాగ్యాంగా వెలుగుతుంది !
        జైహింద్