Wednesday, 22 October 2014

మాఊరి చెరువు మాకన్నతల్లి!
-----------------------------
 మాఊరిచెరువు మాకన్నతల్లి !
మేఘాల కోక అందంగా కట్టి 
మిల మిల మెరిసేటి పగడాల పైటేసి 
తూర్పు సింధూరం తిలకంగా దిద్ది 
విరిసిన తామరలు సిగలోన తురిమి 
అలల ఊయల్లో హాయిగా ఊగే ను !
                         /  మా /
మేఘాల జల్లులు గిలిగింత పెడుతుంటే 
ఊరి చెరువు నిండి నిండు ఘర్భిణి లాఉండే !
మత్తడి పడుతుంటే సుఖప్రసవ బాలింత !
మత్తడి వరదెంట ఎగిరొచ్చి చేపలు 
ఊరి చెరువులో చేరి ఎగిరెగిరి పడుతుండే !
పారేటి వరదకు వలలన్నీ అడ్డేసి 
ఎగిరోచ్చే చేపల ముదిరాజులు పట్టేది 
కొత్త చేపలపులుసు ఎంతో కమ్మగనుండు !
రంగురంగుల కప్పలు ఊరి చెరువునిండా 
బెక బెక రాగాలు గొంతు చించుకుపాడే !
ఏ అడవి పక్షులో ఊరి చెరువులో వాలి 
బతుకు దెరువు పాటలుపా డు కొనుచుండే
ఓర చూపుకొంగ ఒంటికాలుపై నిల్చి 
మెడవంచి నీళ్ళల్లో కప్పనుపట్టేసి 
గుటుక్కున మింగేసిఎరుగనట్లుండే !
రివ్వున ఎగిరొచ్చి చెరువులోన మునిగి 
చేపను పట్టితినే లకు ముఖి పిట్ట !
                       /మా/
మీసాలు ముందేసి గూనిముసలిలాగా 
నడుస్తుసాగెను నత్తగుల్ల !
నత్తవదిలినగుల్ల సమశంఖమయ్యె !
గునగున నడుస్తు ముసిముసి నవ్వుతు 
ఊరి చె రువులోఆడు ఎండ్రి కా యలెన్నో!
ఎండ్రి కాయల పులుసు మగసిరిని మేలుకొలుపు !
తనువు విల్లుగ వంచి చెరువులోన ఈదు 
చెడు రక్తం పీల్చు మంచి డాక్టరు జలగ !
చెరువు పొట్టనిండా వేలకొలది ప్రాణులు 
మనుగడ సాగిస్తు మనిషికేన్నో నేర్పు !
పిల్లలమంతా కలసి నిండు చెరువులోన
 ఆటలెన్నోఆడి ఈతలెన్నో కొట్టి 
రేగడి మట్టితో టి తల రుద్ది కడిగితే 
తల చుండ్రు రాలి పెళ్లన్ని చచ్చేవి !
చెరువు మట్టికి సాటి ఇలలోన కల దా ?!
ఊరి చెరువు నీళ్ళు తల్లి చనుబాలు !
మనుషుల పశువుల పక్షుల దాహన్ని తీర్చే !
                           /మా/
కట్టసింగా రించి కంక ణం కట్టి 
కట్ట మైసమ్మకు పొట్టేలును కోసి 
చెరువంత బలి చల్లి తూములుతీస్తే 
అమ్మ పాల లెక్క పొలాలు తాగేసి 
పచ్చగా పైరెదిగి సిరులు రాశులు చిందే !
చెరువును నమ్మి రైతు రాజుగా వర్దిల్లె !
చెరువుకు చాకలికి తల్లి కొడుకుల బంధం !
కొడుకు రాకకోసం ఎదురు చూస్తున్నట్లు 
దిగులు పడుతూ చెరువు ప్రతి రోజు చూసే !
ప్రతి రోజు చాకలి మైల బట్టల మూట
 ఊరి  చెరువుకు తెచ్చి నీళ్ళల్లో ముంచేసి 
 సోయ్ సోయ్ బండపై బాదేసి నీళ్ళల్లో జాడిస్తే 
మైల మింగి చెరువు బట్టల తళ తళ  లాడించే !
బైరు భూమికి వచ్చే ఊరి ప్రజల నందర్నీ 
శుభ్రంగ కడిగేసి సాగనంపు చెరువు !
కర్మకాండకు చెరువు కాశీ గంగాయమునే !
                                /మా/
ఊరి చేరువుకూడా దృశ్యాలను చిత్రించు !
తలక్రిందులుగ ఎన్నో బొమ్మలను చిత్రించే !
చెరువు ఘనత మనిషి గమనించి నాడే 
ఊరి కొక్కచెరువు తవ్వుకొని బతికే !
రాజ్యాలు ఏ లిన రాజులు సైతం 
చెరువులు తవ్వించి ప్రజల మేలుకోరే !
రియల్ భూతం నేడు చేరువులమింగేసి 
ఆకాశం ఎత్తుగా ఎదిగిపోయీ చూస్తుండే !
కన్నతల్లిని కొడుకు వీధిలో తోసినట్లు 
ఊరి ప్రజలు చెరువును ఎప్పుడో వదిలేసే !
సమైక్య పాలనలో ఊరి చెరువు గుర్తు 
నాయకులు వదిలేసి బోరు బావులుకు సిగోలిపే !
కన్నతల్లి లాంటి చెరువు జాడ లేక 
బతక లేకజనులు వలస బాటపట్టే 
నవ తెలంగాణాలోజనులు చెరువు ఘనతకని 
చేయి చేయి కలిపి చెరువులను తవ్వుకొని 
పూర్వ వైభవంతోటి చెరువుల కళ కళ లాడిస్తూ 
పాడి పంటలతోటి పసిడి రాశు లతోటివర్ధిల్ల వలే !!
                              /మా/
 జైహింద్ 
ఆకులరాఘవ ,కవి ,సినీ రచ యి త ,దర్శకుడు /
8-3-228/878/5-1,
వీడియో గల్లి ,
రహమత్ నగర్ ,
హైదరాబాద్ -500045'
సెల్ -9440971792   మాఊరి చెరువు మాకన్నతల్లి!
-----------------------------
 మాఊరిచెరువు మాకన్నతల్లి !
మేఘాల కోక అందంగా కట్టి 
మిల మిల మెరిసేటి పగడాల పైటేసి 
తూర్పు సింధూరం తిలకంగా దిద్ది 
విరిసిన తామరలు సిగలోన తురిమి 
అలల ఊయల్లో హాయిగా ఊగే ను !
                         /  మా /
మేఘాల జల్లులు గిలిగింత పెడుతుంటే 
ఊరి చెరువు నిండి నిండు ఘర్భిణి లాఉండే !
మత్తడి పడుతుంటే సుఖప్రసవ బాలింత !
మత్తడి వరదెంట ఎగిరొచ్చి చేపలు 
ఊరి చెరువులో చేరి ఎగిరెగిరి పడుతుండే !
పారేటి వరదకు వలలన్నీ అడ్డేసి 
ఎగిరోచ్చే చేపల ముదిరాజులు పట్టేది 
కొత్త చేపలపులుసు ఎంతో కమ్మగనుండు !
రంగురంగుల కప్పలు ఊరి చెరువునిండా 
బెక బెక రాగాలు గొంతు చించుకుపాడే !
ఏ అడవి పక్షులో ఊరి చెరువులో వాలి 
బతుకు దెరువు పాటలుపా డు కొనుచుండే
ఓర చూపుకొంగ ఒంటికాలుపై నిల్చి 
మెడవంచి నీళ్ళల్లో కప్పనుపట్టేసి 
గుటుక్కున మింగేసిఎరుగనట్లుండే !
రివ్వున ఎగిరొచ్చి చెరువులోన మునిగి 
చేపను పట్టితినే లకు ముఖి పిట్ట !
                       /మా/
మీసాలు ముందేసి గూనిముసలిలాగా 
నడుస్తుసాగెను నత్తగుల్ల !
నత్తవదిలినగుల్ల సమశంఖమయ్యె !
గునగున నడుస్తు ముసిముసి నవ్వుతు 
ఊరి చె రువులోఆడు ఎండ్రి కా యలెన్నో!
ఎండ్రి కాయల పులుసు మగసిరిని మేలుకొలుపు !
తనువు విల్లుగ వంచి చెరువులోన ఈదు 
చెడు రక్తం పీల్చు మంచి డాక్టరు జలగ !
చెరువు పొట్టనిండా వేలకొలది ప్రాణులు 
మనుగడ సాగిస్తు మనిషికేన్నో నేర్పు !
పిల్లలమంతా కలసి నిండు చెరువులోన
 ఆటలెన్నోఆడి ఈతలెన్నో కొట్టి 
రేగడి మట్టితో టి తల రుద్ది కడిగితే 
తల చుండ్రు రాలి పెళ్లన్ని చచ్చేవి !
చెరువు మట్టికి సాటి ఇలలోన కల దా ?!
ఊరి చెరువు నీళ్ళు తల్లి చనుబాలు !
మనుషుల పశువుల పక్షుల దాహన్ని తీర్చే !
                           /మా/
కట్టసింగా రించి కంక ణం కట్టి 
కట్ట మైసమ్మకు పొట్టేలును కోసి 
చెరువంత బలి చల్లి తూములుతీస్తే 
అమ్మ పాల లెక్క పొలాలు తాగేసి 
పచ్చగా పైరెదిగి సిరులు రాశులు చిందే !
చెరువును నమ్మి రైతు రాజుగా వర్దిల్లె !
చెరువుకు చాకలికి తల్లి కొడుకుల బంధం !
కొడుకు రాకకోసం ఎదురు చూస్తున్నట్లు 
దిగులు పడుతూ చెరువు ప్రతి రోజు చూసే !
ప్రతి రోజు చాకలి మైల బట్టల మూట
 ఊరి  చెరువుకు తెచ్చి నీళ్ళల్లో ముంచేసి 
 సోయ్ సోయ్ బండపై బాదేసి నీళ్ళల్లో జాడిస్తే 
మైల మింగి చెరువు బట్టల తళ తళ  లాడించే !
బైరు భూమికి వచ్చే ఊరి ప్రజల నందర్నీ 
శుభ్రంగ కడిగేసి సాగనంపు చెరువు !
కర్మకాండకు చెరువు కాశీ గంగాయమునే !
                                /మా/
ఊరి చేరువుకూడా దృశ్యాలను చిత్రించు !
తలక్రిందులుగ ఎన్నో బొమ్మలను చిత్రించే !
చెరువు ఘనత మనిషి గమనించి నాడే 
ఊరి కొక్కచెరువు తవ్వుకొని బతికే !
రాజ్యాలు ఏ లిన రాజులు సైతం 
చెరువులు తవ్వించి ప్రజల మేలుకోరే !
రియల్ భూతం నేడు చేరువులమింగేసి 
ఆకాశం ఎత్తుగా ఎదిగిపోయీ చూస్తుండే !
కన్నతల్లిని కొడుకు వీధిలో తోసినట్లు 
ఊరి ప్రజలు చెరువును ఎప్పుడో వదిలేసే !
సమైక్య పాలనలో ఊరి చెరువు గుర్తు 
నాయకులు వదిలేసి బోరు బావులుకు సిగోలిపే !
కన్నతల్లి లాంటి చెరువు జాడ లేక 
బతక లేకజనులు వలస బాటపట్టే 
నవ తెలంగాణాలోజనులు చెరువు ఘనతకని 
చేయి చేయి కలిపి చెరువులను తవ్వుకొని 
పూర్వ వైభవంతోటి చెరువుల కళ కళ లాడిస్తూ 
పాడి పంటలతోటి పసిడి రాశు లతోటివర్ధిల్ల వలే !!
                              /మా/
 జైహింద్ 
ఆకులరాఘవ ,కవి ,సినీ రచ యి త ,దర్శకుడు /
8-3-228/878/5-1,
వీడియో గల్లి ,
రహమత్ నగర్ ,
హైదరాబాద్ -500045'
సెల్ -9440971792   మాఊరి చెరువు మాకన్నతల్లి!
-----------------------------
 మాఊరిచెరువు మాకన్నతల్లి !
మేఘాల కోక అందంగా కట్టి 
మిల మిల మెరిసేటి పగడాల పైటేసి 
తూర్పు సింధూరం తిలకంగా దిద్ది 
విరిసిన తామరలు సిగలోన తురిమి 
అలల ఊయల్లో హాయిగా ఊగే ను !
                         /  మా /
మేఘాల జల్లులు గిలిగింత పెడుతుంటే 
ఊరి చెరువు నిండి నిండు ఘర్భిణి లాఉండే !
మత్తడి పడుతుంటే సుఖప్రసవ బాలింత !
మత్తడి వరదెంట ఎగిరొచ్చి చేపలు 
ఊరి చెరువులో చేరి ఎగిరెగిరి పడుతుండే !
పారేటి వరదకు వలలన్నీ అడ్డేసి 
ఎగిరోచ్చే చేపల ముదిరాజులు పట్టేది 
కొత్త చేపలపులుసు ఎంతో కమ్మగనుండు !
రంగురంగుల కప్పలు ఊరి చెరువునిండా 
బెక బెక రాగాలు గొంతు చించుకుపాడే !
ఏ అడవి పక్షులో ఊరి చెరువులో వాలి 
బతుకు దెరువు పాటలుపా డు కొనుచుండే
ఓర చూపుకొంగ ఒంటికాలుపై నిల్చి 
మెడవంచి నీళ్ళల్లో కప్పనుపట్టేసి 
గుటుక్కున మింగేసిఎరుగనట్లుండే !
రివ్వున ఎగిరొచ్చి చెరువులోన మునిగి 
చేపను పట్టితినే లకు ముఖి పిట్ట !
                       /మా/
మీసాలు ముందేసి గూనిముసలిలాగా 
నడుస్తుసాగెను నత్తగుల్ల !
నత్తవదిలినగుల్ల సమశంఖమయ్యె !
గునగున నడుస్తు ముసిముసి నవ్వుతు 
ఊరి చె రువులోఆడు ఎండ్రి కా యలెన్నో!
ఎండ్రి కాయల పులుసు మగసిరిని మేలుకొలుపు !
తనువు విల్లుగ వంచి చెరువులోన ఈదు 
చెడు రక్తం పీల్చు మంచి డాక్టరు జలగ !
చెరువు పొట్టనిండా వేలకొలది ప్రాణులు 
మనుగడ సాగిస్తు మనిషికేన్నో నేర్పు !
పిల్లలమంతా కలసి నిండు చెరువులోన
 ఆటలెన్నోఆడి ఈతలెన్నో కొట్టి 
రేగడి మట్టితో టి తల రుద్ది కడిగితే 
తల చుండ్రు రాలి పెళ్లన్ని చచ్చేవి !
చెరువు మట్టికి సాటి ఇలలోన కల దా ?!
ఊరి చెరువు నీళ్ళు తల్లి చనుబాలు !
మనుషుల పశువుల పక్షుల దాహన్ని తీర్చే !
                           /మా/
కట్టసింగా రించి కంక ణం కట్టి 
కట్ట మైసమ్మకు పొట్టేలును కోసి 
చెరువంత బలి చల్లి తూములుతీస్తే 
అమ్మ పాల లెక్క పొలాలు తాగేసి 
పచ్చగా పైరెదిగి సిరులు రాశులు చిందే !
చెరువును నమ్మి రైతు రాజుగా వర్దిల్లె !
చెరువుకు చాకలికి తల్లి కొడుకుల బంధం !
కొడుకు రాకకోసం ఎదురు చూస్తున్నట్లు 
దిగులు పడుతూ చెరువు ప్రతి రోజు చూసే !
ప్రతి రోజు చాకలి మైల బట్టల మూట
 ఊరి  చెరువుకు తెచ్చి నీళ్ళల్లో ముంచేసి 
 సోయ్ సోయ్ బండపై బాదేసి నీళ్ళల్లో జాడిస్తే 
మైల మింగి చెరువు బట్టల తళ తళ  లాడించే !
బైరు భూమికి వచ్చే ఊరి ప్రజల నందర్నీ 
శుభ్రంగ కడిగేసి సాగనంపు చెరువు !
కర్మకాండకు చెరువు కాశీ గంగాయమునే !
                                /మా/
ఊరి చేరువుకూడా దృశ్యాలను చిత్రించు !
తలక్రిందులుగ ఎన్నో బొమ్మలను చిత్రించే !
చెరువు ఘనత మనిషి గమనించి నాడే 
ఊరి కొక్కచెరువు తవ్వుకొని బతికే !
రాజ్యాలు ఏ లిన రాజులు సైతం 
చెరువులు తవ్వించి ప్రజల మేలుకోరే !
రియల్ భూతం నేడు చేరువులమింగేసి 
ఆకాశం ఎత్తుగా ఎదిగిపోయీ చూస్తుండే !
కన్నతల్లిని కొడుకు వీధిలో తోసినట్లు 
ఊరి ప్రజలు చెరువును ఎప్పుడో వదిలేసే !
సమైక్య పాలనలో ఊరి చెరువు గుర్తు 
నాయకులు వదిలేసి బోరు బావులుకు సిగోలిపే !
కన్నతల్లి లాంటి చెరువు జాడ లేక 
బతక లేకజనులు వలస బాటపట్టే 
నవ తెలంగాణాలోజనులు చెరువు ఘనతకని 
చేయి చేయి కలిపి చెరువులను తవ్వుకొని 
పూర్వ వైభవంతోటి చెరువుల కళ కళ లాడిస్తూ 
పాడి పంటలతోటి పసిడి రాశు లతోటివర్ధిల్ల వలే !!
                              /మా/
 జైహింద్ 
ఆకులరాఘవ ,కవి ,సినీ రచ యి త ,దర్శకుడు /
8-3-228/878/5-1,
వీడియో గల్లి ,
రహమత్ నగర్ ,
హైదరాబాద్ -500045'
సెల్ -9440971792   

Friday, 17 October 2014

విప్లవం 
--------
ఉదయమే విప్లవం !
మానవులను మేలుకొలిపి 
శ్రమ కొరకు పురికొలిపి 
బతుకు బాటపైన డిపే 
ఉదయమే విప్లవం !
               /  ఉ /
తూరుపు సింధూరం 
చీకటి తెరచింప గా 
ఆమని ధరహాసం 
కాంతులు వెదజల్లగా 
పక్షుల పలుకుల్లో 
సరాగాలు దొర్లగా 
జంతువుల అరుపుల్లో 
ఉల్లాసం పొంగగా 
మానవులు శ్రమ కొరకు 
నడుములు బిగించగా 
పొలాలన్నీ చిగురించే 
గని ఖని మారుమ్రోగే 
ఉత్పత్తుల రాశులే 
ఇండ్లనిండ తొణికిసలాడే!
                       /ఉ /
ఉదయమే మనుగడకు 
మార్గ దర్షిగా సాగగా 
ఆమార్గంలో మనిషి 
ప్రగతి రధం పైసాగగా 
చీకటి తన కడ్డుపడి 
అణిచి వెస్తున్నకాని 
ఉదయాన్ని ఒడిసి పట్టి 
చీకటిని పారద్రోలి 
ముప్పొద్దుల మానవుడు 
శ్రమ సమరం చేస్తుండే 
విజయం సాదిస్తువుండే 
సౌభాగ్యం వెల్లివిరియా 
సుఖశాంతుల తోడ మనిషి 
నిత్యం వర్దిల్లుతుండే !
              /ఉ /
జైహింద్   

Sunday, 12 October 2014

కాలరధం 
-------
కాలరధం పై కూర్చున్నాను !
సవ్వారి చేస్తూ వెళ్తున్నాను !
రాత్రి -పగలు 
రోజులు -వారాలు 
నెలలు -సంవత్స రాలు 
యుగము -యుగాలు 
దాటుతు దాటుతు వెళ్తున్నాను !
               /కాల /
ప్రకృతి ఒడిలో నేకళ్ళు తెరచి 
ప్రాణుల నడతను నేననుకరించి 
ప్రకృతి పెట్టిన అన్నం తింటు 
ప్రకృతి ఎదపై నే పవళించి 
ప్రకృతి ఒడిలో పాటాలు నేర్చి 
విజ్ఞాన జ్యోతిగ నేవెలుగొంది 
ప్రకృతి శక్తుల నేచేతపట్టి 
శక్తుల సేవలు నేవాడుకుంటు 
మానవమనుగడకు విధాత నేనై 
మానవాలిని ముందుకు నడుపుతు 
కాలరధం పైకూర్చున్నాను !
సవ్వారి చేస్తూ వెళ్తున్నాను !
               /కాల /
అడవులలోన ఆడుతు పాడుతు 
పర్వతాలను ఎక్కుతు దిగుతు 
నదులలోన మునుగుతు ఈ దుతు 
సముద్రాలలో తేలుతు దాటుతు 
గాలిలోన నింగిలో ఎగురుతు 
గ్రహాలతోటి బంతులు ఆడుతు 
విశ్వంలోన విజేత నేనై 
ఎల్ల లోకాలు తిరుగుతు వున్నా 
గమ్యం దొరకని దారుల్లో 
కాలరధం పై సవ్వారి చేస్తూ
సాగుతు సాగుతు వెళ్తున్నాను !
అంతే దొరకని ప్రస్తానంలో !
               /కాల /
మరోప్రపంచం మనుషుల కోసం 
విశ్వాన్నే జల్లెడ పడుతు 
ఆధా పాతాళం లోతులు తోడుతు 
సృష్టి మొదలు తుదిని వెదుకుతు 
పుట్టుక గిట్టుక మూలాలు లాగుతు 
అలసట ఎరుగని అన్వేషణలో 
అణువణు వును పరిశోదిస్తూ 
లక్ష్య సాధనకై పరుగులు దీస్తూ 
వైజ్ఞానిక కాలవీధిలో 
భువన భాండవ ములు కలియదిరుగుతు 
అంతేదో రకని కాలవీధిలో 
సాగుతు సాగుతు వెళ్తున్నాను !
                 /కాల/
భగ భగ మండే కాలవీధిలో 
ముందుకు సాగని నాప్రస్తానం 
వెనక్కి తిరిగి నేచూ సుకుంటే  
ఎన్నో దశల పరిణామాల్లో 
ఎన్నో జాతుల జగడాల్లో 
ఎన్నో కూలాల కురు క్షేత్రాలలో 
ఎన్నో మతాల మారణ హోమాల్లో 
బతుకు సమరాల రక్తపు టేరుల్లో 
మానవత్వం మట్టిలో కలిపిన 
వైజ్ఞానిక మానవుడిని నేనేనా ?
దేవుడికి దెయ్యానికి పురుడే పోసి 
వేడుక సలిపే వైజ్ఞానిక మానవుడిని నేనేనా ?
                 /  కాల/
జైహింద్