Wednesday, 23 December 2015

చరిత్ర
------
నిన్న 
అభివృద్ధి !
నేడు 
ప్రసిద్ధి !

Sunday, 6 December 2015

                            బడి
   --------------------------------
నాదేహం అక్షరాల బడి !
నాగుండె నిరంతరం
అక్షరాల ఆలాపన చేస్తూ వుంది !
నానాడులు దేహమంతాఆడుతూ
అక్షర గానం చేస్తూ వున్నాయి !
నా ఇంద్రియాలు అక్షర
 జపం చేస్తూ వున్నాయి !
నా ఉచ్వాశ నిశ్వాస
అక్షరాల ఊపిరి తో అలరారుతుంది !
నా అణువణువు దేహపు బడిలో
నిత్య విద్యార్థులే !విజ్ఞాన విధాతలే !
నాదేహపు బడిని మించిన బడి
జగతిలో వేరెందు కలదు ?!
         జైహిందు

Tuesday, 1 December 2015

నమ్మకాలు 
--------------
దేవుడనినమ్మే టోడు 
దేవుడనినమ్మనోడు 
ఇద్దరు బతికేది పుడమిపైనే !
తుదకు ఇద్దరు కలిసేది 
మట్టిలోనే .... ఈ మట్టిలోనే !!
     నిత్య పూజచేస్తునోకడు భక్తి బాటలో 
     పూజ చేయకుండ నొకడుబతుకు బాటలో 
     ఎవరిదారి వారిదైన,నమ్మకాలు వేరైనా 
     ఇరువురుబతికేది పొట్ట కూటికే 
     అది జగమెరిగిన సత్యమనితెలుసుకొండిరా !
దైవమని ఒక వర్గం లేడు అని ఒక వర్గం 
వాదులాడి వాదులాడి గొడవలెందుకు ?
వర్గాలుగ విడిపోయి చచ్చు డెందు కు ?
ఎవడి నమ్మకాల్లో వారే బతుకు గడపరా !
అదే పరమార్థమని తెలుసుకొండిరా !
          జైహింద్ 

Monday, 2 November 2015

వ్యవసాయం
-------------
ఎండిపోతుంది !
రియల్ సేద్యం
మహావేగంగా పండుతుంది !
పంట భూముల్లో
అంతస్తుల రాశులు
ఆకాశం ఎత్తు పెరిగి పోతున్నాయి !
నేడు రైతులంతా
కూళిలుగా మారిపోయి
అంతస్తుల పంటలను
ఏ పుగా పెంచుతున్నారు !
కార్పోరేట్ సంస్తల
కబంద హస్తాలు
భూమిని గట్టిగా
కౌగిలించు కుంట్టున్నాయి !
వేలకొలది ఎకరాల భూమి
ఫాం హౌసులుగా ,రిసర్ట్ లుగా
వర్దిల్లు తున్నాయి !
భూములు కోల్పోయిన రైతులు
ఫాం హౌసుల ,రిసర్ట్ ల గేట్లముందు
దిష్టి బొమ్మల్లా కాపల కాస్తున్నారు !
భూమితో అనుబంధాన్ని
విడలేని కొందరు రైతులు
భూమిని పట్టుకొని వెడులా డు తున్నారు
కాలం తోచే తోపులతో
రైతులు దిక్కు తోచక చస్తువున్నారు !
అతి వృష్టి ,అనా వృష్టి తో
తాళలేక రైతులంతా పురుగుల మందు
పుణ్య తీర్థం సేవిస్తున్నారు !
రసాయన ఎరువులు
ఎప్పుడైతే రాజ్య మేలయో ?
అప్పుడే సేద్యం
చెదలు పట్టిపోయింది !
యంత్రాల రాకతో
పశు సంపద కబెలాల
పాలైపోతుంది !
నేడు రైతులంతా
భూమిని డబ్బుతో కొలుస్తున్నారు !
ఇక రియల్ పంటలు పండకుండా
ధాన్యం పంటలు పండుతాయా ?
తిరిగి రైతులంతా
పూర్వపు పద్దతులు పాటిస్తే
భూములు పచ్చగా పండుతాయి !
భూమిని డబ్బుతో కాకుండా ?
ధాన్యం తో కొలిచి నప్పుడే
సిరుల రాశులు చిందు తాయి !
దేశం అన్నపూర్ణగా వర్ధిల్లు తుంది !!
          జైహింద్

Thursday, 27 August 2015

తనువు వ్యాపరమయమే !
------------------------
పనికి రానిదంటు నేడు
లోకాన ఏముంది ?!
మనిషి చచ్చికూడా
మరో మనిషిని బతికించవచ్చు !
                     /  పని /
    మనిషిలోని అవయవాలు
    నిత్యావసర సరుకులయ్యే !
     కడుపుకాలి కొందరు
     అమ్ముకొని బతుకుతుండే
     కీర్తికొరకు కొందరు
     దానమిస్తుదాతలైరి
     రక్తమైన ఇంద్రియమైన
     బ్యాంకులుగా విస్తరించి
     వ్యాపారం చేస్తూనే
     వైభవంగ వేలుగుతుండే !
                       /పని/
శవం కూడా వైధ్యులకు
జ్ఞాన గ్రంథ మవుతుంది !
అణువణువును కోసి చూస్తే
నిర్మాణపు శక్తి తెలుసు !
మెదుడులోని అల్లికలో
ఇంద్రియాల మహిమలెన్నో !
జీర్ణా శయ ప్రక్రియనే
ఆయువుకి ప్రమాణం !
తెలుసుకుంటే మానవుడు
మరో పరబ్రమ్మనే !!
                 /   పని/
జైహింద్

Monday, 3 August 2015

ఉత్తరాది ఎండలు
దక్షినాది వానలు
దంచి కొట్టే దేశంలో
తల్లడిల్లే జనమంతా!

Sunday, 5 July 2015

అక్షరమా నీకు జోహార్ !
--------------------
ధ్వని గొంతులోనుండి అక్షరమా
ఇలకు జారిపడతావే అక్షరమా !
                                 /  ధ్వని /
    ప్రతిరోజు ధ్వనిస్తూనే
    ప్రకృతిలో గానమై
     సకల ప్రాణుల మేలుకోలుపుతూ
      అక్షర బిక్ష పెడుతూనే
     భాష జ్ఞాన మందించి
     అక్షర జ్యోతిగ వెలిగేవు
                         /ధ్వని /
మనసు పెట్టిన ప్రతి మనిషి
గొంతు లోంచి సెలయేరుల
జాలు వారు తుంటా వు
అక్షరాల అలలుగా
తుళ్ళి తుళ్ళి పడతావు
జ్ఞాన సింధు వవుతావు
                        /ధ్వని/
        మనిషి మరచి పోకుండా
       లిపి గానే నిలిచావు
       ఆలిపితో భాషకు
       బంగరు బాటలు వేశావు
       ఆబాటలో మానవతను
       మునుముందుకు నడిపావు
                                 /ధ్వని/
మనిషి మనో ఫలకం పై
భాష ముద్ర పడిపోయిన
మనిషి మట్టిలోపల
కలువకుండ వుండ గలడా ?
అనుకున్న అక్షరమా
శిలా శాశన మయ్యవా ?
                         /ధ్వని/
        తర తరాల మనుగడకై
        తాళ పత్రాల పైన
       కునుకు దీస్తూ వున్నావు
       కాగితాల పైన నేడు
       కాలంతో సాగుతూ
       పయనిస్తూ వున్నావు
                           /ధ్వని/
అదే నీఅమరత్వం
అక్షర జ్ఞాన ద్రాత్రుత్వం
అక్షరాల అన్వేషణలో
కవిత లల్లు వాడేప్పుడు
ప్రజల గళాల్లో నిత్యం
నడయాడు తుంటాడు !
                    /ధ్వని/
జైహింద్

                         
  

Thursday, 2 July 2015

రౌడీలు గుండాలు రజ్యమెలు తుంటే
రాజధర్మం ఎలా వుంటుంది ?
న్యాయస్తానాలు విశ్వ తనీయత
ఎలా కలిగివుంటాయి ?
డబ్బుంటే తప్పులన్నీ ఒప్పే !

Friday, 29 May 2015

వేసవికాలం ఎండలకు ,చెరువులు ,వాగులు ,వంకలు ఎండి నెర్రెలు పారిపోతాయి . కాని మామిడి ,తాటి ముంజలు
ఇంకా ఎన్నో రకాల పండ్లు రసాలు కారుతూ ,కమ్మగా కడుపునింపు తాయి . బాల్యంలోనేను మామిడి పండ్లు తిన్న
పిక్కలను ఎండినతరువాత ఒక పిక్క అడ్డంగా కోసి దానిలోని జీడి తీసి ,మధ్యలో రంద్రం చేసి ,రంద్రంగుండా దారం
తీసి దానికి కట్టి ,మరోపిక్కకు చిన్న పుల్లను గుచ్చి ఆపుల్లకు ఈదారం కట్టి ఆపుల్లను గొట్టంలా ఉన్న పిక్కలో దించి
ఆదారంతో ముందకు లాగి వెనకకు విడిస్తే గిర్రున తిరిగేది . ఆలా గిర్రున తిప్పుతూ ఆ ఎండాకాలం ఆడేది . 

Tuesday, 26 May 2015

పరిజ్ఞానం
---------
చదువుకొనే రోజుల్లో బలపం ,పెన్సిల్ ,ఆపైన పెన్ను వాడేది . ఐతే అప్పుడు ఇంకు పోయాలటే ఐదు పైసలకు పోసేవారు . అప్పుడు ఇళ్ళల్లో దాన్యం తప్ప డబ్బులు ఉండేవికావు . ఏపనికైనా దాన్యమే ఇచ్చి పనులు చేయించే వారు . చూచి వ్రాత రాయక పొతే టీచర్ కొట్టేవాడు . ఒకరోజు మాఇంటి వెనకాల పాత బావిలో పులిచేరు పండ్లు తెంపి తినుచుండగా ,అందులో నుండి ద్రవం నీలంగా కారింది . నేనువెంటనే చాలా పండ్లు తెంపి రసం పిండి దానిని పెన్నులో పోసి రాశాను . ఇంకేముంది ఇంకులాగానే రాసింది . నాకు ఒకటే ఆనందం !ఒక ఆలోచన పరిజ్ఞానం ఎంత మేలుచేసిందో ?చూడండి . అది నేను అందరికి చెప్పి అందరి చేత ఆలా చేయించాను .
     ఇంకు లేనప్పుడు అందరం అదేపని గా నోట్స్ రాసేవాళ్ళం . గుర్తుకొచ్చినప్పుడల్లాభలే ఆనందం వేస్తుంది . పరిసరాలెకదా పసివాళ్ళకు మేధ !

Sunday, 17 May 2015

ర్యాగింగ్
-----
ర్యాగింగ్ అనేది స్కూల్ లో ,కాలేజిలో మాత్రమే చేసేది కాదు . పల్లెల్లో ,పట్టణాల్లో మన చుట్టు ప్రక్కల ఉన్నవాళ్ళు
అప్పుడప్పుడు మనల ర్యాగింగ్ చేసి మనం ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతూ ఆనందిస్తుంటారు . నా అనుభవం ఒక
సారి చెబుతాను వినండి .
    నేను 1972సంవత్సరం ఐదవ తరగతి చదువుతున్నాను . బడి ఐపోగానే ,రోజు సాయంత్రం చేనుకాడికి కావలి
వెళ్ళాలి అది మాడ్యుటి . ఒక రోజు సాయత్రం నేను చేనుకాడికి కావలి వెళ్ళాను . అక్కడ మాజీతగాడు ,మా పెద్ద
నాన్న కొడుకు ఇంకా కొందరు పశువుల మేపుతూ కాపలా వున్నారు .
    నన్ను చూడగానే పిలిచి ,నువ్వు చలి చీమ ముడ్డి మోయగలవా ?నువ్వు మోస్తే మేము మీచేను కాపలా
కాస్తాము . మేముగేలిస్తే మాపశువుల నువ్వు కాపలా కాయాలి . మేము చిర్ర గొనె ఆడు కుంటాము . శరత్
పెట్టారు . నేను ఆచిన్నదాన్ని మోయలేనా ?నేనురేడి అన్నాను . ఓయ్ నువ్వు మోయలేవు . అది పుట్టెడు
వడ్ల బరువు వుంటుంది !అంటే ఎనబై కుంచాలు ఐతే పుట్టెడు . అంటే ?ఎనబై క్వింటా ల్లు అన్నమాట !ఏయ్
నువ్వు మోయలేక ఓడిపోతావు అన్నారు . అయినా ?నేను పట్టుబట్టాను . వాళ్ళు చలిచీమను పట్టుకొని
నడుం వరకు విరిచి ,ముడ్డి భాగం నా కుడి చేయి మడతలోపెట్టి ,మడచి పట్టుకోమన్నారు . అంతే . ఒక్కసారే
తేలుకుట్టినట్లు భ గ్గున మంట పుట్టి ,లబో ,దిబో అని చేయి విదిలిచి కొట్టాను . అయినా ?దాని ముడ్డిరాలి
కిందపడలేదు . నేను గట్టిగా దాన్ని పట్టి పీకాను . అది దాని ముళ్ళు శరీరంలో దింపింది . దాని విషానికి చర్మం
పొంగ్గి బొబ్బలేక్కి ఒక్కటే మంట . నేను ఏడుస్తుంటే ,వాళ్ళు ఒక్కటేనవ్వు నవ్వుతున్నారు .
     చీమలు తలలో వున్న కొండ్ల తోకుడుతాయని అనుకున్ననుకాని ,ముడ్డి భాగంలో ముళ్ళు తో కుడుతాయని ,
నాకు అప్పటివరకు తెలియదు . తేనె టీగ ,చలి చీమ ,కందిరీగ ,తుమ్మెద లాంటికొన్ని ముడ్డి వద్ద వున్న కొండితో
కుడుతాయి . నేటికి కూడా ఇలా మన ప్రక్కవాళ్ళు రాగింగ్ చేస్తూనే వుంటారు . అది ప్రాణాంతకమై నప్పుడే చట్టం
జ్యోక్క్యం చేసుకుంటుంది . 

Thursday, 14 May 2015

నేను 8వ తరగతి చదువు తున్నప్పుడు మా క్లాస్ లో కాజమోహిద్దిన్ అనే ముస్లీం అబ్బాయి
ఉండేవాడు . మాతరాగతిలో ,అతనే చాలపోడుగ్గా ,లావుగా ఉండేవాడు . అతనికి మీసాలు కూడా
వచ్చాయి . ఐతే అందరు బడే బాయి ,బడె బాయి అని ఏడిపించేవారు . నర్సింగం అనే టీచర్
ఐతే సాహేబుకు సాడేతీన్ ,నాకు మూడున్నర అని ఏడిపిస్తూ ,ఎప్పుడు అతన్నే ప్రశ్న లడుగుతూ ,
చదవమని అనేవాడు . పాపం అతనికి తెలుగు సరిగా చదువరాక ,ప్రశ్నలు తెలియక బాధపడుతుండేవాడు .
ఐతే ,అతనికి అన్నింటికీ మూలకారణం మీసాలె అని వాటిని రాకుండా ఏం చెయ్యాలని ఒకడిని అడిగాడు .
 వాడు ఏం లేదు . పడుకునే ముందు సున్నం ,జీడి నూనె కలిపి పెదాల పై రాయి అంతే . తెల్లారేసరికి
వచ్చిన మీసాలుకూడా రాలిపో తై ,అనగానే అతడు అలానే చేసేశాడు .
   ఇంకేముంది ?పై పెదవులు ఎర్రగా పొంగి పుండై పోయింది . తెల్లారి మూతికి కర్చిప్ కట్టుకొని రాగానే
అందరు అదేమిటని అడిగారు . అతను చెప్పిన విషయం విని అందరు ఒకటే నవ్వు. న రసింగంటీ చరైతే
పడిపడి నవ్వాడు . పాపం అతనికి సున్నం ,జీడి నూనె పెడితే పుండు అవుతుందని తెలియదు .
అదిగుర్తు కొచ్చినప్పుడల్లా ,రాగింగ్ ఇలా కూడా చేసి కసి దీర్చుకుంటా రా అని అనిపిస్తుంది .    

Sunday, 10 May 2015

ఆటల్లో కళా నైపుణ్యం!
---------------
బాల్యంలో ఆడే ప్రతి ఆటలో కళా నైపుణ్యం ఉండేది . తాటి ఆకులతో బూరలుచేసి ఊ  దుకోవడం,పాడుకోవడం ,
గిరకలు చేసి గాలికి గిర్రున తిప్పుకోవడం ,ఆకులతో గడియారాలు చేసి చేతికికట్టుకోవడం ,చిన్న మట్టలతో
రెండుగా చీరి చెటాల్ అంటే టిక్కు టిక్కుకొట్టటం ,ముంజలు తీసిన కాయలతో ఎడ్ల బండి చేసి ఆడటం ,పెద్ద
మట్టలతో బండి లాగడం ,చెప్పులుచేసి కాళ్ళకువేసుకొని తిరగడం !అమ్మో!ఒక్కటా ,రెండా ఎన్నెన్నో చేసి
ఆడేది. రేగడి మట్టితో జంతువుల ,పక్షుల ,మనుషులబొమ్మలు చేసి ఆడుకోవడం . చొప్పబెండ్లతో బండ్లు ,
అగ్గిపెట్టేలతోరైళ్ళు ,కాగితాలతో పడవలు చేసిఆడు కునేది . నాడు ఒక్కపైసాకూడ కర్చులేకుండా ,చుట్టు
ఉన్నపరిసరాలలో దొరికే వాటి తోనేఎవరికీవారే తయారు చేసుకొని ఆడేది. రానివాడు సైతం చూసి నేర్చుకునే వాడు .
ఆనైపున్యమేవేరు !ఈ తరానికి అవితెలుసా?

Friday, 8 May 2015

గొలీల ఆటలు
---------------
చిన్నప్పుడు గొలీల ఆటలంటే పడిచచ్చేది మేమంతా . సీసం గోలీలు కొనాలంటే డబ్బు ఉండేది కాదు ,
ఎండిపోయిన జామకాయలు ,సున్నం రాయిని గుండ్రంగా చేసి ఆడేది . అప్పుడు జానలు ,మూరలు
అనే ఆట ఆడేది . చిన్న బద్ది అంటే గుంట తవ్వి దానికి ,పదిఅడుగుల దూరం ఒక గీత గీసి ,బద్ది దగ్గర
నుండి ఆగీత దగ్గర గోలివేయాలి . ఎవరిది ముందువుంటే వారే మొదలు ఆడాలి . గెలిచినవాడు బద్ది
దగ్గరనుండి గోలీని కొడితే ఓడినవాడు మోచేయి మడతపెట్టి గోలీని బద్దిలోకి నెట్టాలి . నెట్టే టప్పుడు
వాడి మోచేయి నెలకు చెక్కుకొని పోయి రక్తం కారేది .
         ఆదిచూసి మేము పడిపడి నవ్వుకోనేవాళ్ళం . అప్పుడప్పుడు నాకుకూడా ఆతిప్పలు తప్పేది
కాదు . ఆటలంటే అదోసరదాకదా ?!గోలీలతో లక్కు అనే ఆట కూడా ఆడేది . నాలుగు మూలల
బాక్స్ లా గీసి ,అందులో గోలీలు పోసి గోలీతో కొట్టాలి . గోలీలు గీత దాటితే అవివాడు గెలిచినట్లు లెక్క .
ఇప్పుడు ఆలాంటి ఆటలు ఈ తరానికి తెలుసా ?

Wednesday, 6 May 2015

పురాణ కథల్లో నమ్మలేని నిజజాలు!
-------------------------------------
కృత యుగంలో హిరణ్యాక్షుడు అనే రక్కసుడు ఉండేవాడు .
అతనికి ఇంద్రుడి సింహాసనం ఎక్కి లోకాలను ఏలాలని కోరికా !
కాని ,అతనికి విష్ణువు అడ్డు పాడుతుండేవాడు . దానితో రక్కసుడికి
కోపం వచ్చి భూమిని చాపల చుట్టి సముద్రంలో వేశాడు .
     వెంటనే విష్ణువు వరహా అవతారం ఎత్తి భూమిని పైకి లేపాడు .
 ఇది వినటానికి బాగానే వున్నా ,భూమిని సముద్రంలో విసిరివేస్తే
హిరణ్యా క్షుడు అతని పరివారం ,సంపద ఎక్కడ నిల్చుండి వున్నట్లు ?
విష్ణువు ఎక్కడ నిలబడి భూమిని పైకి ఎత్తి నట్లు ?సముద్రం వున్నది
భూమి పైనెకదా ?!ఆనడురాసిన రచయితలకే తెలియాలి !?
    వామనుడు భలి ని మూడు వరాలు అడిగాడట ,అవి మూడడుగుల
స్తలం . సరెభలి ఒప్పుకున్నాడు . మూడు అడుగులు తీసుకో అనగానే ,
ఒక అడుగు నేలమీద ,మరోఅడుగు ఆకాశం పైన పెట్టాడు . మూడో అడుగు
అనేసరికి తన తలచూపాడు . వినటానికి బాగానేవున్నది . ఐతే భలి ఎక్కడ
కూర్చున్నట్లు ?తన పరివారం ఎక్కడ వున్నట్లు ?నేటికీ అర్థంకాని విషయాలే
ఒక్కొక్క సారి నవ్వాలో ,ఏడవాలో అర్థం కాదు ఆకథలనె వల్లెవేస్తాం !

Friday, 1 May 2015

ఆటల్లో నాటకీయత
--------------

చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందటే చాలు ,పిల్లలమంతా చింత,వేపచెట్ల క్రింద చేరి,

ఆటలు ఆడుకునేటో ల్లం. ఒక్కొక్కప్పుడు దొర ,దొంగలు అనే ఆట ఆడె టోల్లం . అప్పుడు
ఒకడు దొరగా వుంటేకొందరం దొంగలుగా వుండేటోల్లం . మేముదొరపచ్చజొన్న చేల్లోకంక్కులు
ఊస బియ్యం కోసందొంగ తనంగా ,దొరచెండ్లోకో సినట్టు చేసేటో ల్లం. దొర మమ్ములపట్టుకొని ,
కొట్టాలి . అదిఆట. ఐతేమేము వాయిలిపుల్లలు గజంపొడుగుగావిరుచుకొని ,వాటికి
మలం పూసుకొని ,కంకులుకోసినట్టు ఆడేటో ల్లం. మమ్ముల పట్టుకోనడానికిదొర గా ఆడే
వాడు వచ్చీ పట్టుకొండటుండ  గా ఆకర్రలకుఉన్న మలం వాడికి అంటేది . అది వాడు గమనించే
వాడు కాదు. మేము ఒకటే నవ్వు నవ్వు తుంటే,వాడు ఇంకారెచ్చి పోయిమా కర్రలు
లాగుకుంటూ కొట్టేలాఆడేటో డు . దొర అంటేమజాకానా?అది వాడి దీమ. ఒరేయ్  నీ
చేతులు చూసుకోరా?అని పడిపడి నవ్వు తుంటే ,అదిచూసి వాడు అంతాతొండి అని
మలం ఆకులతోతూడుచుకుంట ఏడిచే టో డు .అదిఇప్పుడు గుర్తు కొస్తే భలె నవ్వు
వస్తుంది . 

Wednesday, 29 April 2015

ముప్పై సంవత్సరాల క్రింది మాట . చిన్నప్పుడు పిల్ల ల మంతకలిసి ఆడుకొంటుండగా ,యాబై సంవత్సరాల యాకూబ్ ,అతనికొడుకు పదియేను సంవత్సరాలు ఇద్దరు కలిసి పత్తాలు ఆడేవాళ్ళం . పత్తలంటే ప్యాక కాదు?సిగరెట్ డబ్బాలను చింప్పి ఆడేవాళ్ళం !అవి మట్టిలో పెట్టి ఒక బాక్స్ గీసి ,అందులో పత్తాలు పెట్టి,నాప రాయి బిళ్ళతో  కొట్టేటో ల్లం .డబ్బదాటి బైటికి వెళితే అవి వాడు గెలిచి నట్లు !అప్పుడు చార్ మినార్ ,బర్కిలీ సిసర్ సిగరెట్లు వచ్చేవి . వాటినే మేము రూపాయలుగా పెట్టి ఆడేటో ళ్ళం !  ఎవడన్న మాపత్తలు దొబ్బితే డబ్బు పోయిన లెక్క ఏడ్సె టో ళ్ళం!యాకూబ్ అతని కొడుకైతే కలే బడేటో ల్లు ఆదిసూసి మేం నవ్వేటో ల్లం.ఆజ్ఞాపకాలు ఇప్పటికి గమ్మత్తే !  

Sunday, 26 April 2015

                పెళ్లి
          --------------
పెళ్ళంటే ఆటకాదురా ?
శపదం చేసే యుద్ధం కాదురా?
పెళ్ళంటే రెండుగుండే లు
ఒకటై సాగేసంసారం !
మానవ సృష్టికి మూల స్వరూపం !
    ఇరువురి చూపుల కలయికలో
    పెద్దలు పెట్టినముహూర్తంలో
    అంగీకారపుశుభలేఖలతో
    బంధుమిత్రులఆహ్వానం!
    మేళతాతాళల వైభోగం!
    ఎదురుకోళ్ళసందడే సందడి !
    జిలకర బెల్లాల ప్రమాణము!
    తలంబ్రాల తల స్నానం!
   అక్షింతల తో ఆశీర్వాదం!
తల వంచితనుకూర్చుంటే
నడుం వంచినువు కట్టేవు
మూడే ముళ్ళు ఏడే అడుగులు
అప్పగింతలుఊరేగింప్పులు
శాంతిముహూర్తం సరససరాగం!
ముద్దుల మురిపాలవయసులస్నానం!
వలపుల కులుకుల మంచు వానలో!
హాయ్ హాయ్ గా సంసారం !
        జైహింద్

Saturday, 25 April 2015


  దేహమే సంగీతం !   

---------------
గాలి సోకితే గుండె
గానమై పాడుతుంది!
పల్లవిస్తే నాడులు
తనువు నాట్యమాడుతుంది !
గాన లయల దేహము
సదా సంగీత సంగమం !
        ఉచ్వాశ నిశ్వాశ
        సర జీవ శృతిలో
        పవన జల ప్రాణ పుష్టి !
         జీర్ణా శయ రస సౌరభ
        ఉప్పొంగే రాగము
        గుండె గొంతు గానము !
శ్రమ సాధన గీతము
బతుకు రాగ వైభవము !
మేధ మెరుపు ఆలోచన
ఇంద్రియాల పరిశోధన
ప్రకృతిలోన మానవ దేహం
సంగీత సుధల ఝరి !
        కాయ మున్నంత వరకు
         మాట గాన కచ్చేరి !
         మధువు లోలికే మాటల్లో
         మృధు పాలు పొంగు పాట !
         మాట పాట జీవన బాట !
         గుండె గొంతు పాడుతుంది !!
                 జైహింద్ 

Sunday, 19 April 2015

ఒకే కుటుంబం!
తండ్రి ఒక పార్టీ
తల్లి ఒక పార్టీ
కొడుకు ఒక పార్టీ
కూతురుఒక పార్టీ
 ఏ పార్టీఅధికారంలోవున్నా
ఆకుటుంబం
పచ్చగా వర్దిల్లుతుంది
అదేనేటిరాజనీతి!

Wednesday, 15 April 2015

చేతి నిండా డబ్బుందా ?
దేవుడు దిగి 
నీచెంత కొచ్చి
 దర్శనం ఇస్తాడు !
చేతిలో డబ్బు లేదా?
దేవుడి దర్శనం 
నరక ప్రాయమే!

Monday, 13 April 2015


 యుద్దం
-----------

నీకు నాకు ఉన్నది
లింగబేదమే !
నువ్వు నేను కలువకుంటే
సృష్టి లేదు !మానవ సృష్టి లేదు !!
       జాతి కులం మతం వల్ల
      యుద్దాలేఅనుకుంటే
      నీకు నాకు మధ్యన
      యుద్దమే మొదలయ్యే !
      ఆగిపోని పోరాటం
      ఎంతవరకో చెప్పలేం ?!
మెడ వంచితే ముడి వేస్తివి !
గంగి గోవుల వెంటవస్తే
ఇంట్లోనే బంధించి
దాసిగా నన్ను చేస్తివి !
పట్టు పరుపుగ నన్ను చేసి
దొర్లి దొర్లి ఆడితివి !
    పురిటి నొప్పుల బాధను
    నాకంట గడితివి !
   పిల్లల ఎదుగుదలకు
   నన్ను ఎరువుగ వాడితివి !
   ఇల్లే లోకమై
   కృషించి కుంగిపోతి !
మూడు ముళ్ళ సంకేల్లెంది  ?!
నీచేతిలో బంధి నెందుకు ?!
ఇంటి జైలులో నన్ను నువ్వు
ఎన్నాళ్ళు వుంచుతావు ?
ప్రతి రోజు నిలదీస్తూ
యుద్దమే చేస్తుంటివి ?
      నాలుగు  గోడల పంజరంలో
     నాకెందుకు ఈశిక్షా ?
     నీకన్నా రెండురేట్లు
     సంపాదించి తేగలను !
    ఇల్లాలుగ నాలెక్క
   ఇంట్లోనే దాసిగుండు !
పురిటి నొప్పుల బాధేంటో
నువ్వు కని పెంచిచూడు !
కాదంటే నీకు నాకు
రాం ... రాం ... లాల్ సలాం !
మూడు ముళ్ళ ముడివిప్పి
నాముఖం పై విసిరేస్తివి !
    నీకు నాకు కలయిక
  మూడు ముళ్ళతోనే మొదలు !
   ఆముడులే బంధానికి
   కలకాలం గుర్తుగా
   చేసుకున్న ప్రమాణం !
   ముడిపడిన మన బంధం !
సంపాదన నాద్యేయం
ఇంటి బాధ్యత నీధర్మం
అనుకున్న ఒప్పందం
సాగుతున్న సంసారం
ఇప్పుడీ నిందేలేంటి ?
నీకు నాకు యుద్దమేంటి ?
    ప్రకృతి యే కామ కేళీ !
    అదే స్పూర్తి మనలో సాగే !
     పురిటి నొప్పుల బాధకూడా
     ప్రకుతి ధర్మమే !
     అవునన్నా ?కాదన్నా ?
    ఎవ్వరేమి చెప్పలేరు !
ఆడ అయిన మగ అయిన
నీ గర్భ సృష్టియే కదా ?!
ఆడ తనం అంటూ నువ్వు
నీకు నువ్వే చులకనై
నన్ను రచ్చ కీడు చుకుంటూ
యుద్దమే చేస్తుంటివి ?
    నువ్వు నేను ఒంటరై
    ఎన్నెన్ని సాధించిన
    కలయిక లేని మన తనువులు
   ఒంటరిగా మన గలవా ?!
   తిట్టు కున్న కొట్టు కున్న
   సర్దుకు పోతేనే కాపురం !
మేధలోన నువ్వు నేను
ప్రకృతికే తల మానికలం !
శక్తిలోన యుక్తిలోన
ప్రగతి పధ సారదులం !
పరిపాలన దక్షతలో
నువ్వు నేను మహోన్నతులం !
    నీ చేయి పైన అయిన
    నాచేయి పైన అయిన
     కాపురానికి నవ్య క్రాంతి !
     అభివృద్దికి మహా వారధి !
     గుర్తెరిగి నువ్వు నేను
     సాగిపోతే జయం!జయం!!
          జైహింద్ 


 

Saturday, 28 March 2015

జాతి
కులం
మతం
మూడుకలసిన
ముప్పురితాటితో
మానవుడు
ఉరితీయబడుతున్నాడు!

Monday, 23 March 2015

సమరనాదం
-------------
ఆతను వేకువ సూర్యుడిలా
నిద్రనుండి లేచినప్పుడు
ఆమె ఎన్నడు సంతోషించింది లేదు !
ఆతను కిరణాల కొలిమిలో
తన రెక్కల ఆయుధాలు సానపడుతున్నప్పుడు
ఆమె ఎన్నడు ప్రోత్స హించింది లేదు !
ఆతను శ్రమ సమరం చేస్తూ
విజ్రుం భిస్తున్న ప్పుడు
ఆమె ఎన్నడు ఉత్స హపరిచిందిలేదు !
ఆతను స్వేద వర్షంలో
తడిసి ముద్దైనప్పుడు
ఆమె ఎన్నడు ఆనీళ్ళు పిండింది లేదు !
ఆతను మూడు ముళ్ళ బరువుకు
జీవితాంతం శిలువైనప్పుడు
ఆమె ఎన్నడు ఆశిలువను కనికరించింది లేదు !
ఆతను తన ప్రతి రూప బవ బంధాలకు
చెరుకు గడలా నుజ్జైనప్పుడు
ఆమె ఎన్నడు ఆనుజ్జును
పోగు చేసుకున్నదిలేదు !
ఆతని దేహం
చితికిన నీటి బుడగాల ఆవిరైనప్పుడు
అప్పుడామే
మాకు దిక్కేవ్వరంటూ ?
ఓ కన్నీటి చుక్క ఆతని చితి ముందు రాల్చుతుంది !
ఆకన్నీళ్ళకు ఆచితి మంట లారుతాయా?!
         జైహింద్ 

Saturday, 14 February 2015

ఆశ్రమాలు
------------
ప్రవచనాల పలుకుల
ప్రసాదాలు అమ్ముకొంటు
కాసులు పోగేసుకుంటున్నవి !

Sunday, 1 February 2015

పురిటి నొప్పుల జాడ
నేటి గర్భిణి లకు లేదు
కత్తెర కోతలతోనే
పురుడు పోసుకొనే రాఘవ !!

Friday, 23 January 2015

ఎండను కమ్మగా తిని
వానను తియ్యగా తాగి 
చలిని వెచ్చగా కప్పుకొని 
పవన తేరుపై ఊగు తున్నవు రాఘవ !
ఇళ్ళు శుభ్రత ఈశ్వరుడు మెచ్చు !
వీధి శుభ్రత విష్ణువు మెచ్చు !
దేశం శుభ్రత ధన లక్షిమి మెచ్చు !
శుభ్రతే సిరులు రాఘవ !