Friday, 28 May 2021

అప్పగింతలు!


 అప్పగింతలు!
*************
కన్న కడుపు తెంచుకొని
మెట్టి నింటికి పంపుతున్నం!
ఓ... బంగరు కూతురా?
అత్తమామలు తల్లిదండ్రులు
తుది వరకు నీకు రక్ష!
తెలుసుకొని మసలుకొంటే?
నీ బతుకు స్వర్గమవును!

కని పెంచి పెద్ద చేసి
విద్య బుద్దులెన్నో నేర్పి
తీర్చి దిద్దిన అమ్మానాన్న
రెండిండ్లా పేరు మోసే
బహుమానం ఆ బ్రహ్మ
నా కిచ్చిన వరమా?
స్త్రీ జాతికి శిక్షనా?!

సృష్టికి నువ్వు మూలమమ్మ?
పున సృష్టికి దైవమమ్మ!
అందుకే ఆ బ్రహ్మ
రెండిండ్లా పేరు మోసే
బాధ్యత నీ కప్పగించి
దీపంగా వెలగ మనీ
నిన్ను తీర్చి దిద్దాడు!

కన్న ఇంటిలోన బతుకు 
స్వేచ్చా విహంగ మైతే?
మెట్టి నింటిలోన బతుకు
హద్దుల చట్రంలో బందీ!
ఎన్నాళ్ళని ఈ బతుకు
స్త్రీ జాతి మోయగలదు?
మార్పు ఎప్పుడో...బ్రహ్మ?

పెగుతెంచి నీ మెడలో
వేసినాము చూడయ్య!
చెయ్యి తీసి నీ చేతిలో
పెట్టినాము కనవయ్య!
నూరేళ్ళు తోడుగా...
బతుకంతా నీడలా...
చూసుకో...అల్లుడా!?
పది వేల దండాలు!!
జైహింద్.