Showing posts with label కవిత. Show all posts
Showing posts with label కవిత. Show all posts

Friday, 24 December 2021

ఇల్లు


                    ఇల్లు                 
                 ********
పూరి గుడిసె పెంకుటిల్లు
ఎడంతస్తుల మేడైనా?
మానవుడి నివాస నిలయం!
భార్య భర్తల సృష్టి కార్యానికి
స్వర్గ దామము!
బంధాలు అనుబంధాలకు
మహోన్నత ఆలయం!
శ్రమైక జీవనానికి సౌందర్యం!
షడ్రుతలకు అమృత కలశం!
సిరి సిరి నవ్వులకు బృందావనం!
సుఖ దు: ఖాలకు సాగరం!
ఆశల కోరికలకు వైకుంఠ పాళీ!
వేడుకలకు వేదనలకు జాతర!
జనన మరణాలకునిలువెత్తు సాక్ష్యం!
కాల ఘమనాలకు వైజ్ఞానిక నిలయం!
విప్లవాత్మక మార్పులకు మైలు రాయి!
ఎందరినో తన హృదయంలో
దాచుకున్న ఇల్లు
జ్ఞాపకాల గాథలను నెమరు వేసుకుంటే
మది బాల్యమై పోతుంది!
ఒడలు పులకరిస్తూ మైమరచి పోతాను!
జైహింద్.
ఆకుల రాఘవ.
7382441792.





Wednesday, 29 September 2021

కలంఎంచుకొని నేను


కలం ఎంచుకొని నేను
తప్పుచేసినానేమో?
బుర్రనిండ అక్షరాల
రాశులేన్నో ఉన్నగాని?
జెబులోన డబ్బు లేక
ఎన్నాళ్లీ పోరాటం?!

అక్షరాలు కాగితాల్లో
రాశులుగా పోసేసి
అంగళ్ళలో కూర్చుండి
బేరానికి పెట్టినా?
చిల్లిగవ్వ కు గొరగాక?
పేరుకుపోయి ఇల్లు నిండే!
ఎలుకలకు పురుగులకు
భలే మేతగా మిగిలే!
నా కడుపు కాల్చిన అక్షరాలతో
ఎన్నాళ్లీ పోరాటం?!

అక్షరాలతో అల్లుకున్న
అనుబంధం కాబోలు!
ఎన్ని జన్మల ఋణ బంధమో?
పేనుకొని ముడివేసే!
కలం దించ నివ్వదు?
పైస రాల్చ నివ్వదు?
ఆకలి మంటలు నీకే కాదు?
పూట గడవనోల్లెందరో?
కలం పట్టి దారి చూపు?
నీకు ఒక దారి దొరుకు!
వెనకా ముందు తేడా అంతే?
ప్రస్థానం సాగించు!?
జైహింద్
ఆకుల రాఘవ.

Monday, 27 September 2021

తెగి అతికెసంబంధం!


తెగి అతికే సంబంధం!
*******************

బొడ్డు పేగు తెగగానే?
సంబంధం తెగుతుంది!
చనుబాలతో ఆ బంధం
తిరిగి పుంజుకుంటుంది!
అది తల్లి బిడ్డల సంబంధం!
జన్యుపర ఋణబంధం!

యుగాలెన్నో గడిచినా?
తరతరాలు మారుతున్న
తల్లి బిడ్డల సంబంధం
సాగుతుంది కల కాలం!
విడదీయుని మమకారం!
ముద్దు మురిపాల అనుబంధం!
సకల ప్రాణుల్లో ఇదే సూక్తి!
మానవతకు పరమార్థం!
తల్లిదండ్రుల విధి ధర్మం!
పాటించుటే సృష్టి కార్యం!

చదువు సంధ్యలతో పిల్లలు
తమకు దూరముంటున్నా?
బతుకు దెరువుకు తమ బిడ్డలు
ఇల్లు విడిచి దూరమైనా?
పెళ్లిళ్లతో తమ పిల్లలు
మెట్టి నింటికి పుట్టి నింటికి
దూరమై బతుకు తున్నా?
పండుగలకు పబ్బాలకు
వేడుకలకు వేదనలకు
కలిసి మెలిసి వారంతా?
పాలు పంచుకొంటూనే
బంధాల అమృతాన్ని
మది నిండా సేవిస్తూ
మురిసి ముద్దై పోతరు!
జైహింద్.
ఆకుల రాఘవ,
సెల్:7382441792.

వరంగల్ వెలుగు!


వరంగల్ వెలుగు..!
****************
వరంగల్ జిల్లా
వాసికెక్కిన గడ్డా
లెంకపెళ్లి గ్రామం
రేయి లేని ఖ్యాతి
వరంగల్ వెలుగు
మణి హారపు కీర్తనం!
చ:_మూడు రంగుల నేల
మణులు దొర్లే దరహాసం
కాకతీయుల ముందు చూపు
నిండు కుండ తటాకములు
ఎడమ కొంగు గోదావరి
సిరులు చిందే చైతన్యం!
చ:_వేయి స్థంబాల వెలుగు
రాతి కోట రాజసం
తోరణాల సోయగం
రాళ్ళలో రమణీయం
శృంగారాల రామప్ప
భద్రకాళి భద్రత!
చ:_అడవి బిడ్డ సమ్మక్క
బంగారపు తూకాలు
శివసత్తుల పూనకాలు
జంపన్న యేటి ఘోష
కోర మీసాల కొమురన్న
ఐనవోలు ఆచారం!
చ:_ఆది మానవుల సమాధులు
పాండవుల గుట్ట చిత్రాలు
పెంబర్తి కాంశ్యాలు
చేర్యాల కలంకారి
చేతి వృత్తుల ఘన కీర్తి
వరంగల్ వైభవం!
చ:_పోతన పాళి లోన
భాగవతం లీల లెన్నో
పాలకుర్తి సోమన
ద్విపద వెలుగు లెన్నో
బూద రాజు పరిశోదన
జానపద వాంగ్మయం!
చ:_దాశరధీ అగ్ని ధార
కాళోజీ గొడవ గొడవ
గడీల ఆలయాల్లో
చిల్లర దేవుళ్ళఆట కట్టు
రంగాచార్య దీశాలి
వేదాల తెలుగు కర్త!
చ:_అడుగడుగున కవిత్వం
వెళ్ళి విరిసే సాహిత్యం
కుల వృత్తు గళాల్లో
ఉద్యమాల పాటల్లో
జాలువారే తెలుగు పాట
తెలంగాణ పద సంపద!
చ:_వైద్యులను తీర్చి దిద్దే
కాక తీయ కాలేజీ
రోగులకు ఇలవెలుపు
గాంధీ దవాఖాన
విజ్ఞానపు నిధులున్న
కాకతీయ విద్యాలయం!
చ:_రజాకార్ల రక్త దాహం
పిండారీల పైచాచికం
సాయుధ పోరాటంతో
తెగనరికిన ధీరత్వం
వరంగల్ తెగువ అది
జయశంకర్ ఓ సాక్ష్యం!
చ:_ఏనుమావుల మార్కెట్టు
పేరెన్నిక రైతులకు
రాష్ట్రాలను కలుపు బాట
ఖాజీపేట రైలు మార్గం
నిత్య అంగల్లతోటి
తిరణాల్లా వర్ధిల్లు!
చ:_పచ్చ నైన అడవులు
దట్ట మైన కొండలు
వన్య మృగాల పరుగులు
ప్రాణి కోటి నడయాడే
జిల్లాకే సౌభాగ్యం!
చ:_మలి ఉద్యమ తరంగం
అహింసకే పరమార్థం
ఎగసి పడిన జన జాతర
ఉలికి పడిన కేంద్రము
సిద్ధించిన తెలంగాణ
వరంగల్ కీలకం!
జైహింద్.
ఆకుల.రాఘవ.


Friday, 28 May 2021

అప్పగింతలు!


 అప్పగింతలు!
*************
కన్న కడుపు తెంచుకొని
మెట్టి నింటికి పంపుతున్నం!
ఓ... బంగరు కూతురా?
అత్తమామలు తల్లిదండ్రులు
తుది వరకు నీకు రక్ష!
తెలుసుకొని మసలుకొంటే?
నీ బతుకు స్వర్గమవును!

కని పెంచి పెద్ద చేసి
విద్య బుద్దులెన్నో నేర్పి
తీర్చి దిద్దిన అమ్మానాన్న
రెండిండ్లా పేరు మోసే
బహుమానం ఆ బ్రహ్మ
నా కిచ్చిన వరమా?
స్త్రీ జాతికి శిక్షనా?!

సృష్టికి నువ్వు మూలమమ్మ?
పున సృష్టికి దైవమమ్మ!
అందుకే ఆ బ్రహ్మ
రెండిండ్లా పేరు మోసే
బాధ్యత నీ కప్పగించి
దీపంగా వెలగ మనీ
నిన్ను తీర్చి దిద్దాడు!

కన్న ఇంటిలోన బతుకు 
స్వేచ్చా విహంగ మైతే?
మెట్టి నింటిలోన బతుకు
హద్దుల చట్రంలో బందీ!
ఎన్నాళ్ళని ఈ బతుకు
స్త్రీ జాతి మోయగలదు?
మార్పు ఎప్పుడో...బ్రహ్మ?

పెగుతెంచి నీ మెడలో
వేసినాము చూడయ్య!
చెయ్యి తీసి నీ చేతిలో
పెట్టినాము కనవయ్య!
నూరేళ్ళు తోడుగా...
బతుకంతా నీడలా...
చూసుకో...అల్లుడా!?
పది వేల దండాలు!!
జైహింద్.

Monday, 18 January 2021

మట్టి తోనే పరిమళం


మట్టితోనే పరిమళం!
******************
మట్టితోనే అల్లుకున్న
అనుబంధం రైతుది!
బతుకంతా సాగుతోనే
గడుపుతున్న ఋణ బంధం!
అదే రైతు జీవితం!
మట్టితోనే పరిమళం!!

మట్టిని నమ్మిన రైతుకు
వాన తోడు నిల్వగా
ఎండ తన వెంట రాగా
గాలి ఊపిరి పోయగా
చెమట రాలుస్తు రైతు సదా
విత్త నాలు విత్తుతూ...
పంట చేళ్లు పెంచుతూ...
కంటికి రెప్పల కాచి
సిరుల రాశు లెన్నో పోసు!

కాలం పగ పట్టినా?
భూమి నష్ట పరిచినా?
రెక్క లిరిగి ముక్కలైన
రాలింది చెమటే కదా?
అనుకున్నా రైతన్నా
హలం పట్టి ప్రతి రోజు
శ్రమ సమరం చేస్తు రైతు
పగలు రేయి చేళల్లో
పొద్దు పొడుపై వెలుగును!
అదే రైతు జీవితం!
మట్టితోనేపరిమళం!!
జైహింద్.

Wednesday, 23 December 2020

కాలానికి తలవంచని దీపం..!


కాలానికి తల వంచని దీపం!
************************
దీపం!
మానవుడు కనుగొన్న
మొట్ట మొదటి
ప్రత్యాన్మయ వెలుగు!
అది చీకట్లో...
మిణుకు మిణుకు మంటూ...
వెలుగుతూ... కాంతినిస్తుంది!
అది తళతళ వెలుగులు చిమ్ముతూ...
పగలును తలపించక పోవచ్చు?
కాని,కొండంత ధైర్యాన్నిస్తూ...
కాంతిని పంచుతుంది!
దీపం నుండి కాగడా
లాంతరు పెట్రోమాక్స్
ఇలా...ఎన్నెన్నో..?
రూపాంతరాలు చెందినా?
అవి కాలానికి తలవంచక తప్పలేదు?
దీపం మాత్రం కాలానికి
తల వంచ లేదు?
అది నేటికి ప్రతి ఇంట్లో
దేవాలయాల్లో
దేదీప్య మానంగా
వెలుగుతూనే వుంది!
కొన్ని ఆలయాల్లో
సంవత్సరం పొడవునా
గండ దీపంగా వెలుగుతూ...
దాని ప్రతిభను బాధ్యతను
చాటుతూ వెలుగు తుంది!
మానవుడు బొగ్గు నుండి
అణువిద్యుత్తును
జలం గాలి నుండి
జల పవన విద్యుత్తును
సృష్టించుకొని
ఎన్నెన్నో తళుకు బెళుకుల
రంగు లీనుతు...
చీకట్లో పగలను పంచినా?
కాలమాన పరిణామాల మార్పులకు
ఇట్టే ఆగిపోతుంది!
ప్రపంచాన్ని చీకట్లో
మగ్గెలా చేస్తుంది!
అది కాలానికి తల వంచక తప్పదు?
దీపం ఒక్కటే
కాలానికి తల వంచక
చీకట్లో కాంతి పుంజమై
తన వెలుగును పంచుతూ...
మన వెన్నంటి సాగుతుంది!
అదే దీపానికి వున్న గొప్పదనం!
దీపమా నీకు జోహారు!!
జైహింద్
ఆకుల.రాఘవ.

Saturday, 10 October 2020

కలం ఎంచుకొని నేను!


కలం ఎంచుకొని నేను!
*******************
కలం ఎంచుకొని నేను
తప్పు చేసినానేమో?
బుర్ర నిండ అక్షరాల
రాశులెన్నో వున్నగానీ
జెబులోన డబ్బు లేక
ఎన్నాళ్ళీ పోరాటం?

అక్షరాలు కాగితాల్లో
రాశులుగా పోసేసి
అంగళ్ళలో కూర్చుండి
బేరానికి పెట్టినా?
చిల్లి గవ్వకు గొరగాకా?
పేరుకు పోయి ఇల్లు నిండే!
ఎలుకలకు పురుగులకు
భలే మేతగా మిగిలే!
నాకడుపు కాల్చిన అక్షరాలతో
ఎన్నాళ్ళీ పోరాటం?

అక్షరాలతో అల్లుకున్న 
అనుబంధం కాబోలు!
ఎన్ని జన్మల ఋణ బందమో?
పేనుకొని ముడి వేసే!
కలం దించ నివ్వదు?
పైస రాల్చ నివ్వదు?
ఆకలి మంటలు నీకే కాదు?
పూట గడవ నోలెందరో?
కలం పట్టి దారి చూపు!
నీకు ఒక దారి దొరుకు!
వెనకా ముందు తేడా అంతే?
ప్రస్థానం సాగించు!
జైహింద్.
ఆకుల.రాఘవ.


Sunday, 13 September 2020

వీణా వాణి

వీణా వాణి వినయ విదేహిని
కరుణా వాణి స్వరఝరివర్షిణి

అక్షర జలదిత కెరట విన్యాసిని
శ్రుతి లయ స్వరముల గాన వినోదిని
శబ్ద భూషణి పద గళ భాషిని
అక్షర జ్ఞానం నొసగే జననీ

సరిగమ పదనిస శ్రావ్య సుధామృత
రస రమ్య పదముల తేనెల వాణి
నీ పదములె పలికి గానము చేయుచు
నిను కొలిచెదము సదా స్వరామి
చదువుల తల్లి భాషల భూషని

జైహింద్.

Wednesday, 3 June 2020

మన పిల్లలు దూరమైతే..?


మన పిల్లలు దూరమైతే..?
**********************
మన పిల్లలు దూరమైతే?
ఎలా బతక గలమంటూ
బాధపడే తండ్రు లార?
కుమిలి ఏడ్చే తల్లులారా?
ఎడవ కండేడవ కండి?
మిమ్ము మీరు నమ్ముకొని
మును ముందుకు సాగండి?
ఇరుగు పొరుగును నమ్ము కొండి?
  కని పెంచి పెద్ద చేసి
  విద్య బుద్దు లెన్నోనేర్పి
  ఓ ఇంటి వాళ్ళను చెయ్యగానే
  ఇల్లు ముక్కలు చేసేసి
  వేరుపడి సాగుతుండే
  తొంగి చూడ కుండ వుండే
  కుమిలి కుమిలి ఏడుస్తూ
  బాధపడితే లాభ మేంది?
  మిమ్ము మీరు నమ్ముకొని
  మును ముందుకు సాగండి?
తరతరాల పరంపర
సాగుతున్న వైనమిది!
పెళ్లి కానంత వరకు
మన పిల్లలు మనకు తోడు!
అదుపు అజ్ఞలతో సాగుతూనే
కుటుంబానికి సహాయపడును!
పెళ్లి తోనే పరిస్థితులు
తారు మారు అవుతాయి!
భార్య చేతిలోనే కొడుకు
బంధి అయిపోతాడు
తరతరాల పరంపర
సాగుతున్న వైనమిది!
  మన లాగా మన పిల్లలు
  కని పెంచి పెద్ద చేసి 
  విద్య బుద్దు లెన్నోనేర్పి
  వారి బాధ్యతలు నిర్వహిస్తే
  తిరిగి వారి పరిస్థితి
  మన లాగే అవుతుంది!
  మిమ్ము మీరు నమ్ముకొని
  మీలోన మనిషి తోడ
  అనుభవాలు నెమరు వేస్తూ
  జ్ఞాపకాలు తల్చు కుంటూ
  మురిసి పోతే ఎంతో హాయి!
  బాధలన్నీ హుష్ కాకి!
  కడవరకు మీ వెంట
  తోడు సాగే నలుగురిని
  కలిగి వుంటే మీ బతుకు
  దన్యమౌ తండ్రులారా? తల్లులారా?
జైహింద్.
ఆకుల రాఘవ
9440971792.


Saturday, 18 April 2020

కదిలిందికరోనా..!



కదిలింది కరోనా..!
**************
కదిలింది కరోనా
ఉప్పెనలా ఎగసి పడుతు
మనో వేగాన్ని మించి
పరుగు లెత్తి సాగుతూ
ప్రపంచాన్ని చుట్టేసి
ప్రజల చంపెస్తు వుంది
  ఎలా పురుడు పోసుకుందో?
  ఎలా బలం పుంజు కుందో?
  ఆయుధాన్ని పట్టకుండా
  స్వైర విహారం చెస్తువుంది
  అర్థం కాని ప్రపంచం 
  దిక్కు తోచక చస్తువుంది
గెలువ లేక ప్రపంచం
బెంబలెత్తిపోతున్నది
ఓడి పోయిన సైనికుల్లా
నిర్భంధం పాటిస్తూ
ఇళ్లలోనే దాగుతుండే
అదే విజయ రహష్యం
ఆచరిస్తే మనకు మేలు
  జైహింద్.



Thursday, 23 January 2020

సాంకేతిక విప్లవం..!


సాంకేతిక విప్లవం..!
*****************
సాంకేతిక విప్లవమిది
ఆపలేవు సోదరా?
ప్రపంచం గుప్పిట్లో
కదలాడు తున్నది
బతుకులన్ని వలసలై
తిరుగుతూనే వున్నవి!

నేటి మార్పు బంధాలను
తుంచి వేసే సోదరా?
డబ్బుకొరకు ఎంతకైన
తెగించి సాగు తుండే
కన్నవాళ్ళ వీధిలోన
వదిలేసి పోతుండే!

మీకేమీ తెలియదంటు
విర్ర వీగుతుండేరా?
అనుభవ ముంటే చాలదు?
కోట్లు కూడా బెట్టారా?
గంజి నీళ్లతో గడిపే
మీ కాలం మాది కాదు?

డబ్బు మయం నేటి తరం
విచ్చల విడి చేష్టలు
పెడ ధోరణి పద్ధతులు
విష సంస్కృతి పోకడలు
కాలుష్యపు అలవాట్లు
ఈ తరం సిద్ధాంతం!
జైహింద్.
ఆకుల.రాఘవ.


Wednesday, 15 January 2020

వరంగల్ వెలుగు..!





వరంగల్ వెలుగు..!
****************
వరంగల్ జిల్లా
వాసికెక్కిన గడ్డా
లెంకపెళ్లి గ్రామం
రేయి లేని ఖ్యాతి
వరంగల్ వెలుగు
మణి హారపు కీర్తనం!
చ:_మూడు రంగుల నేల
మణులు దొర్లే దరహాసం
కాకతీయుల ముందు చూపు
నిండు కుండ తటాకములు
ఎడమ కొంగు గోదావరి
సిరులు చిందే చైతన్యం!
చ:_వేయి స్థంబాల వెలుగు
రాతి కోట రాజసం
తోరణాల సోయగం
రాళ్ళలో రమణీయం
శృంగారాల రామప్ప
భద్రకాళి భద్రత!
చ:_అడవి బిడ్డ సమ్మక్క
బంగారపు తూకాలు
శివసత్తుల పూనకాలు
జంపన్న యేటి ఘోష
కోర మీసాల కొమురన్న
ఐనవోలు ఆచారం!
చ:_ఆది మానవుల సమాధులు
పాండవుల గుట్ట చిత్రాలు
పెంబర్తి కాంశ్యాలు
చేర్యాల కలంకారి
చేతి వృత్తుల ఘన కీర్తి
వరంగల్ వైభవం!
చ:_పోతన పాళి లోన
భాగవతం లీల లెన్నో
పాలకుర్తి సోమన
ద్విపద వెలుగు లెన్నో
బూద రాజు పరిశోదన
జానపద వాంగ్మయం!
చ:_దాశరధీ అగ్ని ధార
కాళోజీ గొడవ గొడవ
గడీల ఆలయాల్లో
చిల్లర దేవుళ్ళఆట కట్టు
రంగాచార్య దీశాలి
వేదాల తెలుగు కర్త!
చ:_అడుగడుగున కవిత్వం
వెళ్ళి విరిసే సాహిత్యం
కుల వృత్తు గళాల్లో
ఉద్యమాల పాటల్లో
జాలువారే తెలుగు పాట
తెలంగాణ పద సంపద!
చ:_వైద్యులను తీర్చి దిద్దే
కాక తీయ కాలేజీ
రోగులకు ఇలవెలుపు
గాంధీ దవాఖాన
విజ్ఞానపు నిధులున్న
కాకతీయ విద్యాలయం!
చ:_రజాకార్ల రక్త దాహం
పిండారీల పైచాచికం
సాయుధ పోరాటంతో
తెగనరికిన ధీరత్వం
వరంగల్ తెగువ అది
జయశంకర్ ఓ సాక్ష్యం!
చ:_ఏనుమావుల మార్కెట్టు
పేరెన్నిక రైతులకు
రాష్ట్రాలను కలుపు బాట
ఖాజీపేట రైలు మార్గం
నిత్య అంగల్లతోటి
తిరణాల్లా వర్ధిల్లు!
చ:_పచ్చ నైన అడవులు
దట్ట మైన కొండలు
వన్య మృగాల పరుగులు
ప్రాణి కోటి నడయాడే
జిల్లాకే సౌభాగ్యం!
చ:_మలి ఉద్యమ తరంగం
అహింసకే పరమార్థం
ఎగసి పడిన జన జాతర
ఉలికి పడిన కేంద్రము
సిద్ధించిన తెలంగాణ
వరంగల్ కీలకం!
జైహింద్.
ఆకుల.రాఘవ.


Tuesday, 7 January 2020

సాంకేతిక విప్లవం..!


సాంకేతిక విప్లవం..!
*****************
సాంకేతిక విప్లవమిది
ఆపలేవు సోదరా?
ప్రపంచం గుప్పిట్లో
కదలాడు తున్నది
బతుకులన్ని వలసలై
తిరుగుతూనే వున్నవి!

నేటి మార్పు బంధాలను
తుంచి వేసే సోదరా?
డబ్బుకొరకు ఎంతకైన
తెగించి సాగు తుండే
కన్నవాళ్ళ వీధిలోన
వదిలేసి పోతుండే!

మీకేమీ తెలియదంటు
విర్ర వీగుతుండేరా?
అనుభవ ముంటే చాలదు?
కోట్లు కూడా బెట్టారా?
గంజి నీళ్లతో గడిపే
మీ కాలం మాది కాదు?

డబ్బు మయం నేటి తరం
విచ్చల విడి చేష్టలు
పెడ ధోరణి పద్ధతులు
విష సంస్కృతి పోకడలు
కాలుష్యపు అలవాట్లు
ఈ తరం సిద్ధాంతం!
జైహింద్.
ఆకుల.రాఘవ.


Sunday, 5 January 2020

మనిషి


మనిషి
------
చక్కర పరిశ్రమగా
మారిపోతున్నాడు !
పక్షవాతంతో
వంకర్లు తిరుగుతున్నాడు !
మూత్ర పిండాల్లో
రాళ్లు ఏరుకోలేక చస్తున్నాడు !
నరాలకాలువలు పూడుకుపోయి
గుండెతడి ఆరి పోతున్నాడు !
మోకాళ్ళ నొప్పులతో
కీలు గుఱ్ఱంలా నడుస్తున్నాడు !
తనువు రోగాల పుట్టగా
మారిపోతున్నది !
అన్నింటికి కారణం
ఆహారపు అలవాట్లే !
కల్తీల కాలుష్యమే !
మందుపదార్థాల
మాయాజాలమే !
మనిషి త్వరగా మేలుకుంటే
ఆరోగ్యం
మహా భాగ్యాంగా వెలుగుతుంది !
        జైహింద్ 

Thursday, 2 January 2020

దోమలు..!


దోమలు..!
*********
చంప లేరు దోమల?
మనల చంపుతుండెను!

దోమ కాటు వలన ఎన్నెన్నో రోగాలు!
ప్రాణాంతక వ్యాధులోచ్చి
జగతి ప్రజలు చస్తుండెను!
మందు లెన్నో కని పెడుతూ
దోమలపై చల్లుతున్నా?
మరణించక దోమలు
లక్షల్లో పుడుతుండెను!

ప్రకృతిలో ప్రాణులెన్నో
కను మరుగై పోతున్నా?
చిరంజీవులై దోమలు
మనల పీక్కు తింటున్నవి
కాలుష్యమే కారణము
అపరి శుభ్రతే మూలము
కళ్ళు తెరచి శుభ్రమైతే
కొంతైనా మేలులే!
జైహింద్.
ఆకుల.రాఘవ.

Monday, 16 April 2018

                                                       రాత
                                                      *****
కన్న కడుపు ఒకటైనా ?
జన్మించిన వారి రాత
ఒక్కతీరు ఉండ లేదు 
ఒకేలాగ సాగలేదు   
అదిరాతలోనిమర్మము!
సృష్టిలోని రహస్యము !
రూపు దిద్దే అమ్మకడుపు
అచ్ఛు పోసేయంత్రమైనా ?
పుట్టిన తనబిడ్డలంత
ఒకేఅంద ముండలేరు!
ఒకే నడత నడవలేరు!
గుణ గ నాలు వేరు వేరు!
బుద్ధి శుద్ధి వేరువేరు !
అది అమ్మకడుపు మహిమానా ?
నాన్నబీజ వైనమా?
అర్థం కాని సృష్టిరా ?
యుగ యుగాల పరంపర!
పేగుతెంచుకున్న వారు
తల్లిపాలుతాగి ఎదిగి
అమ్మ ఒడిలో ఆడిపాడి
సుద్దులెన్నోనేర్చినా ?
వారి పద్ధతులే వేరు వేరు !
నాన్న వెలుపట్టినడచి
బతుకు బాట  తెలుసుకున్నా?
పుఱ్ఱె కొక్కబుద్ధిరా!
జివ్వ కొక్క రుచిరా!
టేస్టు ట్యూబ్ బేబికైనా?
ఇవే లక్ష ణాలు రా!
జైహింద్ . 

Saturday, 24 February 2018

మనిషి
------
చక్కర పరిశ్రమగా
మారిపోతున్నాడు !
పక్షవాతంతో
వంకర్లు తిరుగుతున్నాడు !
మూత్ర పిండాల్లో
రాళ్లు ఏరుకోలేక చస్తున్నాడు !
నరాలకాలువలు పూడుకుపోయి
గుండెతడి ఆరి పోతున్నాడు !
మోకాళ్ళ నొప్పులతో
కీలు గుఱ్ఱంలా నడుస్తున్నాడు !
తనువు రోగాల పుట్టగా
మారిపోతున్నది !
అన్నింటికి కారణం
ఆహారపు అలవాట్లే !
కల్తీల కాలుష్యమే !
మందుపదార్థాల
మాయాజాలమే !
మనిషి త్వరగా మేలుకుంటే
ఆరోగ్యం
మహా భాగ్యాంగా వెలుగుతుంది !
        జైహింద్ 

Friday, 29 December 2017

అద్భుతం
 ======
రంగులు చిమ్మిన ఆకాశం 
చిగురులు తొడిగిన భూగోళం 
రంగుల కేళి రవి మోము 
చిగురుసరాగం భూగోళం 
అంతే దొరకని రవి హృదయం 
సకల సృష్టికి తనే మూలం 
సిరులకు నిలయం భూగోళం 
ప్రాణుల మనుగడ కదినిలయం 
విశ్వఖగోళపు వింతలతో 
అబ్బురపరుచును అంబరము 
అందాలొలికే భూగోళం 
ఆదిమన వృద్ధికి భూతల స్వర్గం 
          జైహింద్ 

Sunday, 3 December 2017

లంచం ఒక అంటువ్యాధి ..!
================
లంచం ఒక అంటువ్యాధి !
అరికట్టే వైద్యుడేడి ?
జగమంతావ్యాపించి
పీడించి చంపుతుంది !
పుడమి పైన ప్రతి మనిషి
జన్మించిన నాటినుండి
పెన వేసుకు పుడుతూనే
చావకుండా బతుకుతుంది !
యుగాలన్ని గతించినా ?
తరాలెన్నో మారుతున్నా ?
ప్రగతి పథంలో మనిషి
వైజ్ఞానిక దారుల్లో
సాంకేతిక విప్లవాల్తో
విజ్ఞానిగా వెలుగుతున్నా ?
లంచమనే అంటువ్యాధి
చావకుండ నేటికి
చిరంజీవిగ బతుకు తుంది !
వైభవంగ వెలుగుతుంది !
నవ సిద్ధాంతాలెన్నో వచ్ఛే
ప్రజాప్రభుత్వాలు వెలసే
చట్టాల సంకెళ్ళు ఎన్నెన్నో అడ్డేసి
శిక్షించి అరికట్టిన
ఆలంచమే ఎరగా మారి
చట్టాలను చుట్టాలుగ
మలుచుకొని బయటపడి
మీసాలు మెలివేసి తిరిగే !
మనిషి ప్రకృతిని జయించి
ప్రాణాంతక వ్యాధులెన్నో
అరికడుతు సాగుతున్నా?
లంచమనే వ్యాధిని
అరికట్టలేక పాయే ?
తల్లి దండ్రులే ఈవ్యాధికి
మూలపురుషులై పోయే !
మేలుకొని వారిప్పుడు
తమపిల్లలకు సోకకుండ
అరికడితే కొంతమేలు !
జైహింద్ .