వరంగల్ వెలుగు..!
****************
వరంగల్ జిల్లా
వాసికెక్కిన గడ్డా
లెంకపెళ్లి గ్రామం
రేయి లేని ఖ్యాతి
వరంగల్ వెలుగు
మణి హారపు కీర్తనం!
చ:_మూడు రంగుల నేల
మణులు దొర్లే దరహాసం
కాకతీయుల ముందు చూపు
నిండు కుండ తటాకములు
ఎడమ కొంగు గోదావరి
సిరులు చిందే చైతన్యం!
చ:_వేయి స్థంబాల వెలుగు
రాతి కోట రాజసం
తోరణాల సోయగం
రాళ్ళలో రమణీయం
శృంగారాల రామప్ప
భద్రకాళి భద్రత!
చ:_అడవి బిడ్డ సమ్మక్క
బంగారపు తూకాలు
శివసత్తుల పూనకాలు
జంపన్న యేటి ఘోష
కోర మీసాల కొమురన్న
ఐనవోలు ఆచారం!
చ:_ఆది మానవుల సమాధులు
పాండవుల గుట్ట చిత్రాలు
పెంబర్తి కాంశ్యాలు
చేర్యాల కలంకారి
చేతి వృత్తుల ఘన కీర్తి
వరంగల్ వైభవం!
చ:_పోతన పాళి లోన
భాగవతం లీల లెన్నో
పాలకుర్తి సోమన
ద్విపద వెలుగు లెన్నో
బూద రాజు పరిశోదన
జానపద వాంగ్మయం!
చ:_దాశరధీ అగ్ని ధార
కాళోజీ గొడవ గొడవ
గడీల ఆలయాల్లో
చిల్లర దేవుళ్ళఆట కట్టు
రంగాచార్య దీశాలి
వేదాల తెలుగు కర్త!
చ:_అడుగడుగున కవిత్వం
వెళ్ళి విరిసే సాహిత్యం
కుల వృత్తు గళాల్లో
ఉద్యమాల పాటల్లో
జాలువారే తెలుగు పాట
తెలంగాణ పద సంపద!
చ:_వైద్యులను తీర్చి దిద్దే
కాక తీయ కాలేజీ
రోగులకు ఇలవెలుపు
గాంధీ దవాఖాన
విజ్ఞానపు నిధులున్న
కాకతీయ విద్యాలయం!
చ:_రజాకార్ల రక్త దాహం
పిండారీల పైచాచికం
సాయుధ పోరాటంతో
తెగనరికిన ధీరత్వం
వరంగల్ తెగువ అది
జయశంకర్ ఓ సాక్ష్యం!
చ:_ఏనుమావుల మార్కెట్టు
పేరెన్నిక రైతులకు
రాష్ట్రాలను కలుపు బాట
ఖాజీపేట రైలు మార్గం
నిత్య అంగల్లతోటి
తిరణాల్లా వర్ధిల్లు!
చ:_పచ్చ నైన అడవులు
దట్ట మైన కొండలు
వన్య మృగాల పరుగులు
ప్రాణి కోటి నడయాడే
జిల్లాకే సౌభాగ్యం!
చ:_మలి ఉద్యమ తరంగం
అహింసకే పరమార్థం
ఎగసి పడిన జన జాతర
ఉలికి పడిన కేంద్రము
సిద్ధించిన తెలంగాణ
వరంగల్ కీలకం!
జైహింద్.
ఆకుల.రాఘవ.
No comments:
Post a Comment