Tuesday, 31 October 2017

కవిత్వం క్రాంతి మయం !
================
నేను సూర్యున్ని
గొడుగుగా కప్పుకున్నాను !
నేను చీకటిని
కనురెప్పల మాటున దాచుకున్నాను !
నేను చీకట్లో వెలుగును చూడగలను !
నేను కవితా క్రాంతిని కదా !
కవిత్వం కల్పిత మైతే
దృశ్యం అవాస్తవ మవుతుంది
కవిత్వం వాస్తవ మైతే
దృశ్యం సజీవంగా నిలుస్తుంది !
నేను పాలక పక్షం వయిస్తే
యాచకుడిగా మిగిలి పోతాను !
నేను ప్రజా పక్షము వయిస్తే
జనహృదయాల్లో దర్పణ మైవె లు గుతాను !
కవిత్వం కాసులు కురిపించే
ఖార్కాన మాత్రం కాదు ?
కవిత్వం క్రాంతిని వెదజల్లే
అక్షర నవీన క్రాంతి !
ఆక్రాంతిని ఆస్వాదించేవాళ్ళు
భావ పుష్టిలో పునీతులు కాగలరు !
వాళ్ళ నడతను సరిదిద్దుకోగలరు !
ఆదికవిత్వానికున్న
బలమైన అక్షర జ్ఞాన శక్తి !
నేను ప్రతి నిత్యం కవిత్వాన్ని జపిస్తూ
కవిత్వంతో కరచాలనం చేస్తున్నవాడిని !
నేను కవితాక్రాంతిని కదా !?
జైహింద్ .


Thursday, 12 October 2017

కవి
==
కవితనై వెలిగాను !
కష్టాల్లో మునిగాను !
కవితక్రాంతి మాయమైనా
నాబతుకు తిమిరమయ్యేను !!
కవితపురుడు పోయాలంటే
ప్రసవవేదన తప్పదు ?
రూపు దిద్దుకున్న కవిత
అచ్ఛు పడి పోవాలంటే
జేబుగుల్ల కావాలి
సత్కారాల పేరిట
చేతి చమురు రాలాలి
అప్పుడే కవి తాను
నలుగురిలో వెలుగుతాడు !
కష్టాల్లో మునుగుతాడు !
కవిత కీర్తి చంద్రికైనా
కడుపు నింపగలదా ?
తినే వేళలో కూడా
పట్టే డన్నము దొరకదు
మరణాంతరం జనం ప్రభుత
సభలు పెట్టి కీర్తించి
సొమ్ముచేసుకుంటారు
మహా కవుల కెందరికో
తప్పలేదు దుస్థితి
కడుపు నిండ వలెనంటే
కవిత కాసు లవ్వాలి
కవి బతుకు పండాలి
కవిత క్రాంతి అవ్వాలి
సమాజాన్ని దిద్దాలి !!
హైహింద్ . 

Tuesday, 3 October 2017

భాషా? యాసానా... ఏది ప్రామాణికం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భాష ప్రకృతిలో ధ్వనించే శబ్దాలనుండి పురుడు పోసుకుంటుంది. ఆ శబ్దాల పలుకులలో నుండే భూమిపై ఆవిర్భవించిన మానవులు వాటిని, మాటలుగా అల్లుకున్నారు. అలా ప్రపంచంలో ఎన్నో దేశాల ప్రజలు వారి కనుగుణంగా భాషను తీర్చిదిద్దుకున్నారు. అలా దేశానికి ఒక భాషగా వెలసిన భాష, ప్రాంతాలుగా విస్తరించి ప్రాంతానికి ఓ భాషగా ఏర్పడింది.
అలా మాటల్లోనుండి పుట్టిన భాష, మాటగా, పాటగా, నాటకంగా రూపుదిద్దుకొని, సమాజంలో తన పాత్ర నిరంతరంగా పోషిస్తూ వస్తున్నది. భాషలో నుండే సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు పుట్టుకొచ్చి వారి వారి జీవన విధానాలను తెలియపరిచింది.
ఎప్పుడైతే మాట, పాట, కథ, ఛాయాచిత్రాల్లో ప్రవేశించాయో- అప్పుడే ఆయా దేశాల కథలు, చరిత్రలు దృశ్యరూపాలుగా మారి ప్రేక్షకులను ఆనందడోలికల్లో ఓలలాడించాయి.
సినిమా బలమైన మీడియా అయినందున, అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా, ప్రాంతీయ భాషల్లో కూడా తన ప్రస్థానం కొనసాగిస్తుంది. నేడు ఎన్నో సాంకేతికపరమైన మార్పులో సినిమా దినదిన ప్రవర్థమానంగా వెలుగుతుంది. ఎందరో కొత్తవారు చిత్ర పరిశ్రమలో అడుగిడి తమ తమ అభిరుచిని, వ్యాపార ధోరణిని చాటుకుంటున్నారు.
తెలుగు భాషలో ఎన్నో జోనర్లమీద చిత్రాలు నిర్మించబడి, స్వర్ణయుగంగా భాసిల్లాయ! అయితే సినిమా పండితులను, పామరులను రంజింపచేసే దృశ్యకావ్యం కాబట్టి, ఆ రెండు వర్గాలను దృష్టిలో పెట్టుకొని, తేలిక మాటలతో పాటలతో నవరసాలను జొప్పించి ఆ చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకులకు చూపిస్తారు. సినిమా తెలుగు భాషకు సంబంధించినదే అయినా, తెలుగులో వున్న మూడు ప్రాంతాలకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు అనువుగా వుండేలా చూసుకొని సినిమాలు నిర్మించారు. సినిమాలోని ప్రధాన పాత్రలకు వాడుక భాషను, కామెడీ, విలన్ పాత్రలకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మాండలిక యాసలను ప్రవేశపెట్టారు. అయితే.. భాష విషయంలో తెలుగు సినిమాల్లో కొన్ని ప్రాంతాలకు ద్రోహం జరిగిన మాట వాస్తవమే అయినా, అందుకు మిగిలిన ప్రాంతాల వాళ్ళు చిత్రరంగానికి రాకపోవటం కారణం అయితే, వచ్చిన ఏ కొద్దిమందో చిత్రరంగంలో నిలదొక్కుకోకపోవటం రెండవ కారణం? ఇక్కడ ఎవరిని తప్పు పట్టవలసిన పనిలేదు. సినిమా వ్యాపారమన్నప్పుడు, పెట్టిన ప్రతి పైసాకు లాభం వచ్చేలా చూసుకోవటమే ముఖ్యం. కాబట్టి ప్రతి నిర్మాత, దర్శకుడు లాభాపేక్షతోనే చిత్రం తియ్యాలనుకుంటాడు. కాని యాస, సంస్కృతి, ఆచార వ్యవహారాలు కావాలని కోరుకోడు. అది ధర్మం కూడా కాదు. అలా అయితే ఆ నిర్మాత నెత్తిన చెంగు వేసుకొని వెళ్ళవలసిందే! దర్శకుడు రోడ్డున పడి ఆకలితో అలమటించవలసిందే!
నేడు చిత్ర పరిశ్రమలో ఒక ధోరణి మొదలైంది. తెలంగాణ భాషలో సినిమాలు తీస్తే విజయవంతమవుతాయని! ప్రభుత్వం పన్ను రాయితీలు ఇస్తుందని! అసలు తెలంగాణ భాష అంటే ఏమిటో అలా అనేవాళ్లకే తెలియాలి. తెలుగు అనేది ఒక భాష. తెలుగు తల్లి అనేది భాషకు సంబంధించిన తల్లి. తెలంగాణ తల్లి అనేది ప్రాంతానికి సంబంధించిన తల్లి. భాషావేత్తలు ఇది గుర్తించాలి. అప్పుడే తెలుగు భాష అంటే ఏమిటో? యాస అంటే ఏమిటో తెలుస్తుంది.
తెలుగు రాష్ట్రం సమైక్యంగా వున్నపుడు ప్రతి జిల్లాకు ఓ మాండలిక యాస వుంది. నేడు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అవే మాండలిక యాసలు కొనసాగుతున్నాయి. విజ్ఞులు గుర్తిస్తే సరి!
తెలుగు రాష్ట్రం సమైక్యంగా వున్నపుడు తెలంగాణ ప్రాంతం నుండే ఎక్కువ ఆదాయం విడుదలైన ప్రతి సినిమాకు వచ్చేది. నేడు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, తెలంగాణ ప్రాంతం నుండే ఎక్కువ ఆదాయం ప్రతి సినిమాకు వస్తుంది. పైగా సిఎం, తెలంగాణ చరిత్రను, సంస్కృతిని ఆవిష్కరించేలా సినిమాలు తీస్తే పన్ను రాయితీలు, బహుమతులు ఇస్తానని ప్రకటించారు. ఆ మాట ప్రకారమే ‘రుద్రమదేవి’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాలకు పన్ను రాయితీ ఇచ్చారు. ఇక నాటినుండి తెలంగాణ భాషా సినిమాలని మొదలైంది! అది నిజం కాదు?
సినిమాల్లో ఒక ప్రాంతం యాస, సంస్కృతి సంప్రదాయం తొణికిసలాడుతూ ఆ ప్రాంతం ఆత్మ ఆ చిత్రం పరిపూర్ణంగా ఆవిష్కరించబడాలి! అప్పుడే అది ఆ ప్రాంతం చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది. మాండలిక భాషావేత్తలను ఆకట్టుకుంటుంది. అలా నిర్మించిన చిత్రాలే ‘చిల్లర దేవుళ్ళు, మాభూమి, రంగులకల, దాసి’ ఇలా కొన్ని చిత్రాలు తెలంగాణ చిత్రాలుగా ముద్ర వేసుకున్నాయి. ప్రపంచ గుర్తింపును తెచ్చుకున్నాయి. అంతేకాని తెలంగాణ యాసను మాటలుగా రాసి తెలంగాణ వాళ్ళు తీసి నటిస్తే, తెలంగాణ యాస చిత్రాలు కావు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే చిత్రాలుగానే పరిగణింపబడినాయి. ఇకనైనా వాదోపవాదాలు మాని, యాస, సంస్కృతి, చరిత్ర ఆవిష్కరింపబడేలా చిత్రాలు తియ్యాలని ఆశతో..
-ఆకుల రాఘవ