Sunday, 28 December 2014

ప్రేమ విలాపం
--------
చూపుల బడిలో కలిశాము !
కనుసైగల తరగతిలో చదువుకోవాలంటే
ఉపాధ్యాయులతో భయము !
బస్టాపుల్లో పలకరించు కుందామంటే
పోకిరి యెదవలతో భయము !
పార్కుల్లో పాటాలు నే ర్చు కుందా మంటే
పార్కుల్లోకి వచ్చే ప్రజలతో భయము !
ఆలయాల్లో ఆలోచించ్చు కుందామంటే
ఆలయాలకు వచ్చే భక్తులతో భయము !
లాడ్జీల్లో లాలింఛు కుందామంటే
పోలీసుల సోదాలతో భయము!
ఇళ్ళల్లో ఇష్టా ఇష్టాలు తెలుసుకుందామంటే
తల్లి దండ్రులతో భయము!
మరి మేమెక్కడ కలుసుకోవాలి ?
ప్రేమ పాటాలు ఎలా నేర్చుకోవాలి!
మనసు లోతుల్లోని మర్మాలు ఎలా తెలుసుకోవాలి?
స్పర్ష ల స్పందనలు   ఎలా తెలుసుకోవాలి?
గుండె లయల గుట్టును ఎలా కనిపెట్టాలి ?
ఏడడుగుల బాటలో
జతగా నూరేళ్ళు నడవాలికదా ?
కలుసుకోలేని సందిగ్దంలో
అర్తంకాని అవస్తలతో
విరహ వేదనలతో
విల విల లాడి పోతున్నాం !
ప్రభుత్వమా ?!
కులానికి ఒభవనము
మతానికి ఒభవనము
నిర్మించ్చి ఇచ్చి నట్లే
ప్రేమికులకు ఒభవనము
ప్రేమికులకు ఒపార్కు
నిర్మించ్చి ఇవ్వండి!
మేము రేపటి తరాన్ని
అభివృద్ధి పరిచే వారసులము !
మాప్రేమ విలాపాన్ని
విన్నవించుకుట్టున్నాము !
ఇదే మాప్రేమ ప్రార్థన !!
జైహింద్

Wednesday, 17 December 2014

సంద్రం విషమైన
వర్షం అమృతమైన
వడబోతల సుధ
జలం జీవ చలనం ప్రకృతి !!

Thursday, 4 December 2014

అనిర్వచనీయ అవస్థ!

  • 05/12/2014
  •  -ఆకుల రాఘవ
ఫార్ములాలు -ప్రయోగశాలల్లో ఫెటిళ్లుమన్నాయి. కాంబినేషన్లు -కలల్ని కుప్పకూల్చేశాయి. ప్రాఫిట్ ఈక్వేషన్లు పట్టుతప్పి -నిర్మాతల్ని ముంచేస్తే.. హీరో’చితం వికటించి హారర్ సన్నివేశాలై వెంటాడుతున్నాయి. దీనికంతటికీ కారణం -కోట్లు మింగిన పెద్ద సినిమాల బతుకు భళ్లున తెల్లారిపోవడమే. వాటినీడలో రీళ్లు చుట్టేసిన వంద పిల్ల ప్రాజెక్టులకూ ఊపిరి అందకపోవడమే. ఇప్పుడు -చిత్ర పరిశ్రమ పైకి కనిపించని అయోమయాన్ని ఎదుర్కొంటోంది. ఒక్కముక్కలో చెప్పాలంటే అనిర్వచనీయ అవస్థతో కొట్టుమిట్టాడుతోంది. స్క్రిప్ట్ స్టేజ్‌లో బావుందనుకున్న ఆగడు -ఔట్‌పుట్‌లో మరోలా వచ్చింది. ఎందుకలా జరిగిందన్నది ఎవ్వరికీ అంతుచిక్కదు. అంటే, మా జడ్జిమెంట్ ఎక్కడో తప్పయ్యందన్న మాట. ఆ పొరబాటు నుంచే పాఠం నేర్చుకుని ముందుకు వెళ్తున్నాం.. -అంటున్నాడట మహేష్‌బాబు. ఫెయల్యూర్‌ని అంగీకరించడానికి గట్స్ కావాలి మరి. నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లాపడ్డాయి. పరి‘శ్రమలో భవిష్యత్ వెతుక్కుంటూ అడుగులేసిన పిల్ల చిత్రాలూ పత్తాలేకుండా పోయాయ్. దీంతో చిత్ర పరిశ్రమ కొక్కుపట్టిన కోడిలా తయారైంది. ఆకలిదప్పులు లేక, కాలంతో పరిగెత్తే సత్తాకరవై గూట్లో ముణగదీసుకుని కునుకు తీస్తున్నట్టుంది. అవును -ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సడి, చప్పుడూ లేదు. హిట్స్ ఇచ్చినా, దర్శకులు హీరోల చుట్టూ అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నారు. హీరో‘చితంగా బతికేద్దామనుకున్న కోడె గిత్తలకు -్ఫర్ములాలు పని చేయడం లేదన్న విషయం అర్థమై కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ఈ పరిస్థితికి కారణం -నమ్ముకున్న ఫార్ములాలు, కలగలిపిన కాంబినేషన్లు, ప్రాఫిట్ ఈక్వేషన్లు, హీరో‘చిత సన్నివేశాలూ బలంగా దెబ్బతీయడమే. తెగింపును పూర్తిగా తెంచేసేంతగా -్భరీ బడ్జెట్ సినిమా తెరలు బర్రున చిరిగిపోవడమే. ఇప్పుడు -పరిశ్రమ పైకి కనిపించని అయోమయంలో కొట్టుమిట్టాడుతుంది. ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన, అనుమానించాల్సిన పరిస్థితికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో కథను నమ్మాలో, జిమ్మిక్కుల హీరోయిజానే్న అమ్ముకోవాలో తేల్చుకోలేక సినీ వ్యాపార జనం తలలు పట్టుకుంటున్నారు. అలాగని -కాలం ఆగదుగా. దాని మానాన అది సాగిపోతోంది. ఆనందానికి అలవాటుపడిన ప్రేక్షకులు -వారికి అందుబాటులోవున్న టీవీల్లోనో, నెట్లోనో దాని అడ్రస్ వెతుక్కుంటూనే ఉన్నారు. దొరికినంత వరకూ ఆస్వాదిస్తూనే ఉన్నారు. ** ఎన్నాళ్ళీ నిరీక్షణ? చిత్ర పరిశ్రమను నమ్ముకొన్న సగటు సాంకేతిక నిపుణుడి కళ్లముందు ఎవరెస్ట్‌లాంటి ప్రశ్న ఇది. ఎందుకొచ్చాంరా దేవుడా ఈ రంగానికి అంటూ గోల పెడుతున్నారు. చెయ్యిసాగే పని, కడుపునిండా తిండి లేదు. కనీసం వేరే పని చేసే శక్తీ లేదు అంటూ గగ్గోలు పెడుతున్నారు. జీవితం చిత్ర పరిశ్రమకే అంకితమైపోయిందన్న ఆవేదనతో రోజులు లెక్కపెడుతున్నారు. పని దొరక్కపోతుందా? అన్న ఆశతో రేపటిలోకి తొంగి చూస్తున్నారు. సినిమా సెంటర్లలో తిరుగుతూ కాలం గడిపేస్తున్న సాంకేతిక నిపుణులు ఎందరో? *** తెలుగు రాష్ట్రం రెండు ముక్కలైంది. పరిశ్రమలోని బడా నిర్మాతలు, వారసత్వ హీరోలు అధికశాతం ఒక రాష్ట్రంవాళ్లే అయినా, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయోనన్న సందిగ్దంతో సతమతమవుతున్నారు. ఒకవేళ సొంత రాష్ట్రం వెళ్తే -అక్కడ పరిశ్రమకు వరాలు దక్కుతాయో లేదోనన్న భయాలు వెంటాడుతున్నాయి. రాజధాని నిర్మాణానికే భూములకు దిక్కులేని ప్రస్తుత పరిస్థితుల్లో - చిత్ర పరిశ్రమకు భూముల కేటాయింపు సాధ్యమేనా? అన్న డౌట్లు వెంటాడుతున్నాయి. కోట్లు పలుకుతున్న భూముల ధరలు చూసి నిర్మాతల గుండెలు గుభేల్‌మంటున్నాయి. రాష్ట్రం దాటితే వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలిస్తాయా? ఒకవేళ ధైర్యం చేసి అడుగువేస్తే -తెలంగాణ రాష్ట్రం చిత్ర పరిశ్రమకు కేటాయించిన భూములపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్న సందేహాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏదైనా -కేటాయించిన స్థలంలో పరిశ్రమ సాగాలి. నలుగురికీ పని కల్పించాలి కదా! ఎలా? అనే తలంపుతో తలలు పట్టుకుంటున్నారు. హాలీవుడ్ స్థాయిలో స్టూడియో నిర్మాణాలు చేపట్టి చిత్ర పరిశ్రమను కాపాడతానన్న సిఎం కెసిఆర్ మాటలపై నమ్మకంతో -చూద్దాంలే అనే ధోరణితో ముందుకు సాగుతోంది. ఈ పరిస్థితుల్లోనే -కొందరు నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు తాత్కాలికంగా బుల్లితెరకు అంకితమైపోతున్నారు. మరికొందరు రియాల్టీ షోలు వెతుక్కుంటున్నారు. ఎటొచ్చీ పరిశ్రమను నమ్ముకున్న కార్మికులే కన్నీళ్ళతో కాలం గడుపుతున్నారు. ** ఉన్నవాళ్ల పరిస్థితి ఇలావుంటే, కొత్తవాళ్లూ ముందుకొచ్చే వాతావరణం కనిపించడం లేదు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారులు పరిశ్రమ ప్రవేశం చేసి సినిమాలు నిర్మించారు. సినిమా విడుదల కాకున్నా, శాటిలైట్ రైట్స్ పుణ్యాన పెట్టుబడి వచ్చి, వాళ్ళ సినీ మోజు తీరేది. ఇప్పుడదీ లేదు. ఒకరో ఇద్దరో కొత్తవాళ్ళు సినిమా నిర్మాణం కోసం అడుగులేసినా -ప్రాజెక్టు పూర్తి చేయాలంటే నరకప్రాయం అవుతోంది. ఎన్నో కష్టాలకోర్చి తీసిన సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. శాటిలైట్ రైట్స్ రావనే ఉద్దేశంతో వచ్చినవాళ్లే వెనుతిరిగి వేరే వ్యాపకాల్లోకి వెళ్లిపోతున్నారు. ఒక్కసారి ప్రదర్శన నిమిత్తం సినిమా రైట్స్ రాసుకొని షేరింగ్ పద్ధతిలో ప్రసారం చేయడానికి చానెల్స్ ముందుకొస్తున్నా, కొత్త నిర్మాతలు ఉత్సాహం చూపలేకపోతున్నారు. కొత్త సినిమాలు నిర్మించలేక పోతున్నారు. కారణం -టీవీల్లో షేరింగ్ పద్ధతి లావాదేవీలు ఎలా ఉన్నాయో ఎవరికి తెలుసు? పాపం దర్శకుల పరిస్థితీ ఇందుకు భిన్నంగా లేదు. కాపీ కొట్టడానికి ప్రపంచ భాషల సినిమాలన్నీ అయిపోయాయి. కొత్తగా ఇక ఏం మిగిలి ఉన్నాయోనని అనుక్షణం ఆరాటపడుతూనే ఉన్నారు. అయినా, ఏ భాషలో కొత్త సినిమా వచ్చినా వదిలి పెట్టకుండా చూస్తునేవున్నారు. పనికొచ్చే మాల్‌ను ఏరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా లాభం లేదు. ఎందుకంటే -స్టార్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయిన మన హీరోలకు అలాంటి కథలు ఎప్పుడు నచ్చాలి? ఎప్పుడు సినిమా మొదలుకావాలి? ఇదే పెద్ద ప్రశ్న. ప్రతిభ కలిగిన కథారచయితలు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు. అయినా -దర్శకులకు, హీరోలకు వారిమీద నమ్మకం లేదు. ఎవరి ధోరణి వారిది. అందుకే చెప్పేది -సినిమా వ్యవస్థది ప్రస్తుతం కొక్కిపట్టిన కోడి అవస్థ అని. **

Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi

Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi
బంగారు తెలంగాణ
-----------------------
గ్రహణం వీడిన తెలంగాణలో
నవకాంతు లు వెల్లి విరిసే !
ఉద్యమించిన శక్తులే
ప్రభుత్వంగ గెలుపొంది 
నవతెలంగాణ నిర్మానంకు 
పుత్తడి పునాదులు వెస్తుండే !
                 / గ్రహణం/
అరవై ఏండ్ల పాలనలో 
దోపిడై న తెలంగాణ 
అక్రమాలు తిరగదోడి
ప్రజల కళ్ళముందు పెట్టి
తెలంగాణ నల్లు కున్న
సీమమాంధ్ర సాలెగూడు
చీపురు పట్టి దులుపుతుంటే
అంతస్తుల చెదపుట్టలు
కుప్పకూలి పోతుండే !
           /  గ్రహణం /
మూత బడిన పరిశ్రమల 
తలుపులన్నీ తెరుస్తుంటే 
ఉత్పత్తుల రాశులు 
పొంగిపొర్లి పోవునులే !
ఆగిపోయీన ప్రాజెక్టుల 
ఆనకట్టలు కడుతుంటే 
తెలంగాణ పొలాలన్నీ 
పసిడిరాశులు చిందులే !
గొలుసు కట్టు చెరువుల 
పూడికలు తోడివేస్తే 
తెలంగాణ నిండు కుండే !
              /గ్రహణం/
చదువురాని పిల్లలని 
పాలన చంక నెత్తుకుంటే 
తెలంగాణ యువతంతా 
విజ్ఞాన జ్యోతులే !
నిరుద్యోగ యువతకు 
ఉద్యోగం కలిపిస్తే 
కుటుంబాల కడుపులు నిండి 
సుఖశాంతులు వర్ధిల్లు !
/గ్రహణం /
కళ్యాణ లక్షిమి కల 
దళిత వధువుల ముకాల్లో 
దవలకాంతులు వెల్లి విరిసి 
కాపురాలు పచ్చగుండు !
వికలాంగుల వృద్ధుల 
చేతికర్ర ప్రభుత్వమైతే 
కడుపు నిండ బువ్వలే !
కంటినిండా కునుకులే !
            /  గ్రహణం /

            
ఆహార భ ద్రతతో 
నిరుపేదల కడుపు నిండ 
బుక్కెడు బువ్వ పెడితే 
దారిద్ర్యం తొలిగి పోయీ 
సౌభాగ్యం వెల్లి విరియు !
నీడలేని బీదలకు 
ప్రభుత్వమే గూళ్ళు కడితే 
సేదతీరు బీద జనం !!
           /గ్రహణం/
జైహింద్ 

తంగేడు పువ్వు 
-------------
చెట్టమ్మ చెట్టు తంగేడుచెట్టు 
పువ్వమ్మా పువ్వు తంగేడు పువ్వు 
చెట్టు చేసిన మేలు పువ్వుచేసిన పూజ 
కనరండి !కనరండి !మానవుల్లారా !!
                       /  చేట్టమ్మ /
మట్టిగోలెం నిండా సున్నం నీళ్ళు కలిపి 
తంగేడు తొక్క ఒల్చి మెత్తంగా దంచి 
గోలెం నిండాకలిపి పశువుల తోలు ముంచి 
పదిహేను రోజులు మాదిగ నానబెడితే 
తోలుకున్న బొచ్చు శుభ్రంగా రాలిపోయీ 
కాళ్ళకు చెప్పు లయ్యె నీళ్ళకు తిత్తిగా మారే 
మోటా బొక్కేండ్లాకు తొండాలుగా మారే 
తాడుగా పేనుకొని బంధాలు ముడివేసే
 తంగేడు తోక్కకున్న గుణ మెంతో మెండు 
మనిషి మేలుకోరి సేవలెన్నో చేసే 
                             /చెట్టమ్మ /
గండ్రగొడ్డలి పట్టి పరశురాముడు పడితే 
తాళలేక తల్లీ లందగోలెంలో దాగే 
తంగేడు తొక్క నీళ్ళు పవిత్రు రాలిని చేసి 
దివికి సాగనంపి తన పవిత్రతనిచాటే 
కంపుగోలెంలో రేణుక పవిత్ర మయ్యెనని 
ఆడపడుచుగమాదిగ ఆతల్లి నెంచి 
ఇలవెలుపుగ కొలుస్తుండే రేణుక మాతను 
దుర్గమ్మ మల్లన్న పట్నాల కొలువులో 
తంగే డాకుపిండి పసుపు బియ్యపు పిండి 
ఆదేవతల పెళ్ళిలలో పోలు ముగ్గైపోయీ 
కళ్యాణం జరిపించి తన వైభవము చాటే 
                                  /చేట్టమ్మ /
గౌ రమ్మ కొలువులో బతుకమ్మ సిగలోదూరి 
బంగారువన్నేల్లో తంగేడు పువ్వు మెరిసి 
బతుకు బంధాలను ప్రతి యేటా కలుపుతు 
బతుకు పాటలెన్నో పాడిస్తూ ఆడిస్తూ 
తీపి రుచులెన్నో కమ్మంగ పంచిపెడుతు 
చెరువుల్లో వాగుల్లో నీళ్ళల్ల పడిపోతు 
వచ్చే యేడు మళ్లీ తిరిగి వస్తాననుచు 
దీవనలెన్నో ఇచ్చి బతుకు దారి చూపే 
బందాలనుకలిపిన తంగేడు పువ్వు పూజ 
రాష్ట్రం గుర్తించి రాష్ట్ర పువ్వుగ నెంచే 
                     /చెట్టమ్మ /
జైహింద్ . 

Tuesday, 2 December 2014

రహదారులు
రక్తం త్రాగే
రక్కసులైయ్యె !
జాగ్రత్త గా వెళ్ళటం
ప్రయాణికుల
విధి !

Tuesday, 18 November 2014

ప్రభుత్వం
దేవుళ్ళకు
సేక్యురీటి ఐతే ?
భక్తులకు
ఇక్కట్లే !

Wednesday, 22 October 2014

మాఊరి చెరువు మాకన్నతల్లి!
-----------------------------
 మాఊరిచెరువు మాకన్నతల్లి !
మేఘాల కోక అందంగా కట్టి 
మిల మిల మెరిసేటి పగడాల పైటేసి 
తూర్పు సింధూరం తిలకంగా దిద్ది 
విరిసిన తామరలు సిగలోన తురిమి 
అలల ఊయల్లో హాయిగా ఊగే ను !
                         /  మా /
మేఘాల జల్లులు గిలిగింత పెడుతుంటే 
ఊరి చెరువు నిండి నిండు ఘర్భిణి లాఉండే !
మత్తడి పడుతుంటే సుఖప్రసవ బాలింత !
మత్తడి వరదెంట ఎగిరొచ్చి చేపలు 
ఊరి చెరువులో చేరి ఎగిరెగిరి పడుతుండే !
పారేటి వరదకు వలలన్నీ అడ్డేసి 
ఎగిరోచ్చే చేపల ముదిరాజులు పట్టేది 
కొత్త చేపలపులుసు ఎంతో కమ్మగనుండు !
రంగురంగుల కప్పలు ఊరి చెరువునిండా 
బెక బెక రాగాలు గొంతు చించుకుపాడే !
ఏ అడవి పక్షులో ఊరి చెరువులో వాలి 
బతుకు దెరువు పాటలుపా డు కొనుచుండే
ఓర చూపుకొంగ ఒంటికాలుపై నిల్చి 
మెడవంచి నీళ్ళల్లో కప్పనుపట్టేసి 
గుటుక్కున మింగేసిఎరుగనట్లుండే !
రివ్వున ఎగిరొచ్చి చెరువులోన మునిగి 
చేపను పట్టితినే లకు ముఖి పిట్ట !
                       /మా/
మీసాలు ముందేసి గూనిముసలిలాగా 
నడుస్తుసాగెను నత్తగుల్ల !
నత్తవదిలినగుల్ల సమశంఖమయ్యె !
గునగున నడుస్తు ముసిముసి నవ్వుతు 
ఊరి చె రువులోఆడు ఎండ్రి కా యలెన్నో!
ఎండ్రి కాయల పులుసు మగసిరిని మేలుకొలుపు !
తనువు విల్లుగ వంచి చెరువులోన ఈదు 
చెడు రక్తం పీల్చు మంచి డాక్టరు జలగ !
చెరువు పొట్టనిండా వేలకొలది ప్రాణులు 
మనుగడ సాగిస్తు మనిషికేన్నో నేర్పు !
పిల్లలమంతా కలసి నిండు చెరువులోన
 ఆటలెన్నోఆడి ఈతలెన్నో కొట్టి 
రేగడి మట్టితో టి తల రుద్ది కడిగితే 
తల చుండ్రు రాలి పెళ్లన్ని చచ్చేవి !
చెరువు మట్టికి సాటి ఇలలోన కల దా ?!
ఊరి చెరువు నీళ్ళు తల్లి చనుబాలు !
మనుషుల పశువుల పక్షుల దాహన్ని తీర్చే !
                           /మా/
కట్టసింగా రించి కంక ణం కట్టి 
కట్ట మైసమ్మకు పొట్టేలును కోసి 
చెరువంత బలి చల్లి తూములుతీస్తే 
అమ్మ పాల లెక్క పొలాలు తాగేసి 
పచ్చగా పైరెదిగి సిరులు రాశులు చిందే !
చెరువును నమ్మి రైతు రాజుగా వర్దిల్లె !
చెరువుకు చాకలికి తల్లి కొడుకుల బంధం !
కొడుకు రాకకోసం ఎదురు చూస్తున్నట్లు 
దిగులు పడుతూ చెరువు ప్రతి రోజు చూసే !
ప్రతి రోజు చాకలి మైల బట్టల మూట
 ఊరి  చెరువుకు తెచ్చి నీళ్ళల్లో ముంచేసి 
 సోయ్ సోయ్ బండపై బాదేసి నీళ్ళల్లో జాడిస్తే 
మైల మింగి చెరువు బట్టల తళ తళ  లాడించే !
బైరు భూమికి వచ్చే ఊరి ప్రజల నందర్నీ 
శుభ్రంగ కడిగేసి సాగనంపు చెరువు !
కర్మకాండకు చెరువు కాశీ గంగాయమునే !
                                /మా/
ఊరి చేరువుకూడా దృశ్యాలను చిత్రించు !
తలక్రిందులుగ ఎన్నో బొమ్మలను చిత్రించే !
చెరువు ఘనత మనిషి గమనించి నాడే 
ఊరి కొక్కచెరువు తవ్వుకొని బతికే !
రాజ్యాలు ఏ లిన రాజులు సైతం 
చెరువులు తవ్వించి ప్రజల మేలుకోరే !
రియల్ భూతం నేడు చేరువులమింగేసి 
ఆకాశం ఎత్తుగా ఎదిగిపోయీ చూస్తుండే !
కన్నతల్లిని కొడుకు వీధిలో తోసినట్లు 
ఊరి ప్రజలు చెరువును ఎప్పుడో వదిలేసే !
సమైక్య పాలనలో ఊరి చెరువు గుర్తు 
నాయకులు వదిలేసి బోరు బావులుకు సిగోలిపే !
కన్నతల్లి లాంటి చెరువు జాడ లేక 
బతక లేకజనులు వలస బాటపట్టే 
నవ తెలంగాణాలోజనులు చెరువు ఘనతకని 
చేయి చేయి కలిపి చెరువులను తవ్వుకొని 
పూర్వ వైభవంతోటి చెరువుల కళ కళ లాడిస్తూ 
పాడి పంటలతోటి పసిడి రాశు లతోటివర్ధిల్ల వలే !!
                              /మా/
 జైహింద్ 
ఆకులరాఘవ ,కవి ,సినీ రచ యి త ,దర్శకుడు /
8-3-228/878/5-1,
వీడియో గల్లి ,
రహమత్ నగర్ ,
హైదరాబాద్ -500045'
సెల్ -9440971792   మాఊరి చెరువు మాకన్నతల్లి!
-----------------------------
 మాఊరిచెరువు మాకన్నతల్లి !
మేఘాల కోక అందంగా కట్టి 
మిల మిల మెరిసేటి పగడాల పైటేసి 
తూర్పు సింధూరం తిలకంగా దిద్ది 
విరిసిన తామరలు సిగలోన తురిమి 
అలల ఊయల్లో హాయిగా ఊగే ను !
                         /  మా /
మేఘాల జల్లులు గిలిగింత పెడుతుంటే 
ఊరి చెరువు నిండి నిండు ఘర్భిణి లాఉండే !
మత్తడి పడుతుంటే సుఖప్రసవ బాలింత !
మత్తడి వరదెంట ఎగిరొచ్చి చేపలు 
ఊరి చెరువులో చేరి ఎగిరెగిరి పడుతుండే !
పారేటి వరదకు వలలన్నీ అడ్డేసి 
ఎగిరోచ్చే చేపల ముదిరాజులు పట్టేది 
కొత్త చేపలపులుసు ఎంతో కమ్మగనుండు !
రంగురంగుల కప్పలు ఊరి చెరువునిండా 
బెక బెక రాగాలు గొంతు చించుకుపాడే !
ఏ అడవి పక్షులో ఊరి చెరువులో వాలి 
బతుకు దెరువు పాటలుపా డు కొనుచుండే
ఓర చూపుకొంగ ఒంటికాలుపై నిల్చి 
మెడవంచి నీళ్ళల్లో కప్పనుపట్టేసి 
గుటుక్కున మింగేసిఎరుగనట్లుండే !
రివ్వున ఎగిరొచ్చి చెరువులోన మునిగి 
చేపను పట్టితినే లకు ముఖి పిట్ట !
                       /మా/
మీసాలు ముందేసి గూనిముసలిలాగా 
నడుస్తుసాగెను నత్తగుల్ల !
నత్తవదిలినగుల్ల సమశంఖమయ్యె !
గునగున నడుస్తు ముసిముసి నవ్వుతు 
ఊరి చె రువులోఆడు ఎండ్రి కా యలెన్నో!
ఎండ్రి కాయల పులుసు మగసిరిని మేలుకొలుపు !
తనువు విల్లుగ వంచి చెరువులోన ఈదు 
చెడు రక్తం పీల్చు మంచి డాక్టరు జలగ !
చెరువు పొట్టనిండా వేలకొలది ప్రాణులు 
మనుగడ సాగిస్తు మనిషికేన్నో నేర్పు !
పిల్లలమంతా కలసి నిండు చెరువులోన
 ఆటలెన్నోఆడి ఈతలెన్నో కొట్టి 
రేగడి మట్టితో టి తల రుద్ది కడిగితే 
తల చుండ్రు రాలి పెళ్లన్ని చచ్చేవి !
చెరువు మట్టికి సాటి ఇలలోన కల దా ?!
ఊరి చెరువు నీళ్ళు తల్లి చనుబాలు !
మనుషుల పశువుల పక్షుల దాహన్ని తీర్చే !
                           /మా/
కట్టసింగా రించి కంక ణం కట్టి 
కట్ట మైసమ్మకు పొట్టేలును కోసి 
చెరువంత బలి చల్లి తూములుతీస్తే 
అమ్మ పాల లెక్క పొలాలు తాగేసి 
పచ్చగా పైరెదిగి సిరులు రాశులు చిందే !
చెరువును నమ్మి రైతు రాజుగా వర్దిల్లె !
చెరువుకు చాకలికి తల్లి కొడుకుల బంధం !
కొడుకు రాకకోసం ఎదురు చూస్తున్నట్లు 
దిగులు పడుతూ చెరువు ప్రతి రోజు చూసే !
ప్రతి రోజు చాకలి మైల బట్టల మూట
 ఊరి  చెరువుకు తెచ్చి నీళ్ళల్లో ముంచేసి 
 సోయ్ సోయ్ బండపై బాదేసి నీళ్ళల్లో జాడిస్తే 
మైల మింగి చెరువు బట్టల తళ తళ  లాడించే !
బైరు భూమికి వచ్చే ఊరి ప్రజల నందర్నీ 
శుభ్రంగ కడిగేసి సాగనంపు చెరువు !
కర్మకాండకు చెరువు కాశీ గంగాయమునే !
                                /మా/
ఊరి చేరువుకూడా దృశ్యాలను చిత్రించు !
తలక్రిందులుగ ఎన్నో బొమ్మలను చిత్రించే !
చెరువు ఘనత మనిషి గమనించి నాడే 
ఊరి కొక్కచెరువు తవ్వుకొని బతికే !
రాజ్యాలు ఏ లిన రాజులు సైతం 
చెరువులు తవ్వించి ప్రజల మేలుకోరే !
రియల్ భూతం నేడు చేరువులమింగేసి 
ఆకాశం ఎత్తుగా ఎదిగిపోయీ చూస్తుండే !
కన్నతల్లిని కొడుకు వీధిలో తోసినట్లు 
ఊరి ప్రజలు చెరువును ఎప్పుడో వదిలేసే !
సమైక్య పాలనలో ఊరి చెరువు గుర్తు 
నాయకులు వదిలేసి బోరు బావులుకు సిగోలిపే !
కన్నతల్లి లాంటి చెరువు జాడ లేక 
బతక లేకజనులు వలస బాటపట్టే 
నవ తెలంగాణాలోజనులు చెరువు ఘనతకని 
చేయి చేయి కలిపి చెరువులను తవ్వుకొని 
పూర్వ వైభవంతోటి చెరువుల కళ కళ లాడిస్తూ 
పాడి పంటలతోటి పసిడి రాశు లతోటివర్ధిల్ల వలే !!
                              /మా/
 జైహింద్ 
ఆకులరాఘవ ,కవి ,సినీ రచ యి త ,దర్శకుడు /
8-3-228/878/5-1,
వీడియో గల్లి ,
రహమత్ నగర్ ,
హైదరాబాద్ -500045'
సెల్ -9440971792   మాఊరి చెరువు మాకన్నతల్లి!
-----------------------------
 మాఊరిచెరువు మాకన్నతల్లి !
మేఘాల కోక అందంగా కట్టి 
మిల మిల మెరిసేటి పగడాల పైటేసి 
తూర్పు సింధూరం తిలకంగా దిద్ది 
విరిసిన తామరలు సిగలోన తురిమి 
అలల ఊయల్లో హాయిగా ఊగే ను !
                         /  మా /
మేఘాల జల్లులు గిలిగింత పెడుతుంటే 
ఊరి చెరువు నిండి నిండు ఘర్భిణి లాఉండే !
మత్తడి పడుతుంటే సుఖప్రసవ బాలింత !
మత్తడి వరదెంట ఎగిరొచ్చి చేపలు 
ఊరి చెరువులో చేరి ఎగిరెగిరి పడుతుండే !
పారేటి వరదకు వలలన్నీ అడ్డేసి 
ఎగిరోచ్చే చేపల ముదిరాజులు పట్టేది 
కొత్త చేపలపులుసు ఎంతో కమ్మగనుండు !
రంగురంగుల కప్పలు ఊరి చెరువునిండా 
బెక బెక రాగాలు గొంతు చించుకుపాడే !
ఏ అడవి పక్షులో ఊరి చెరువులో వాలి 
బతుకు దెరువు పాటలుపా డు కొనుచుండే
ఓర చూపుకొంగ ఒంటికాలుపై నిల్చి 
మెడవంచి నీళ్ళల్లో కప్పనుపట్టేసి 
గుటుక్కున మింగేసిఎరుగనట్లుండే !
రివ్వున ఎగిరొచ్చి చెరువులోన మునిగి 
చేపను పట్టితినే లకు ముఖి పిట్ట !
                       /మా/
మీసాలు ముందేసి గూనిముసలిలాగా 
నడుస్తుసాగెను నత్తగుల్ల !
నత్తవదిలినగుల్ల సమశంఖమయ్యె !
గునగున నడుస్తు ముసిముసి నవ్వుతు 
ఊరి చె రువులోఆడు ఎండ్రి కా యలెన్నో!
ఎండ్రి కాయల పులుసు మగసిరిని మేలుకొలుపు !
తనువు విల్లుగ వంచి చెరువులోన ఈదు 
చెడు రక్తం పీల్చు మంచి డాక్టరు జలగ !
చెరువు పొట్టనిండా వేలకొలది ప్రాణులు 
మనుగడ సాగిస్తు మనిషికేన్నో నేర్పు !
పిల్లలమంతా కలసి నిండు చెరువులోన
 ఆటలెన్నోఆడి ఈతలెన్నో కొట్టి 
రేగడి మట్టితో టి తల రుద్ది కడిగితే 
తల చుండ్రు రాలి పెళ్లన్ని చచ్చేవి !
చెరువు మట్టికి సాటి ఇలలోన కల దా ?!
ఊరి చెరువు నీళ్ళు తల్లి చనుబాలు !
మనుషుల పశువుల పక్షుల దాహన్ని తీర్చే !
                           /మా/
కట్టసింగా రించి కంక ణం కట్టి 
కట్ట మైసమ్మకు పొట్టేలును కోసి 
చెరువంత బలి చల్లి తూములుతీస్తే 
అమ్మ పాల లెక్క పొలాలు తాగేసి 
పచ్చగా పైరెదిగి సిరులు రాశులు చిందే !
చెరువును నమ్మి రైతు రాజుగా వర్దిల్లె !
చెరువుకు చాకలికి తల్లి కొడుకుల బంధం !
కొడుకు రాకకోసం ఎదురు చూస్తున్నట్లు 
దిగులు పడుతూ చెరువు ప్రతి రోజు చూసే !
ప్రతి రోజు చాకలి మైల బట్టల మూట
 ఊరి  చెరువుకు తెచ్చి నీళ్ళల్లో ముంచేసి 
 సోయ్ సోయ్ బండపై బాదేసి నీళ్ళల్లో జాడిస్తే 
మైల మింగి చెరువు బట్టల తళ తళ  లాడించే !
బైరు భూమికి వచ్చే ఊరి ప్రజల నందర్నీ 
శుభ్రంగ కడిగేసి సాగనంపు చెరువు !
కర్మకాండకు చెరువు కాశీ గంగాయమునే !
                                /మా/
ఊరి చేరువుకూడా దృశ్యాలను చిత్రించు !
తలక్రిందులుగ ఎన్నో బొమ్మలను చిత్రించే !
చెరువు ఘనత మనిషి గమనించి నాడే 
ఊరి కొక్కచెరువు తవ్వుకొని బతికే !
రాజ్యాలు ఏ లిన రాజులు సైతం 
చెరువులు తవ్వించి ప్రజల మేలుకోరే !
రియల్ భూతం నేడు చేరువులమింగేసి 
ఆకాశం ఎత్తుగా ఎదిగిపోయీ చూస్తుండే !
కన్నతల్లిని కొడుకు వీధిలో తోసినట్లు 
ఊరి ప్రజలు చెరువును ఎప్పుడో వదిలేసే !
సమైక్య పాలనలో ఊరి చెరువు గుర్తు 
నాయకులు వదిలేసి బోరు బావులుకు సిగోలిపే !
కన్నతల్లి లాంటి చెరువు జాడ లేక 
బతక లేకజనులు వలస బాటపట్టే 
నవ తెలంగాణాలోజనులు చెరువు ఘనతకని 
చేయి చేయి కలిపి చెరువులను తవ్వుకొని 
పూర్వ వైభవంతోటి చెరువుల కళ కళ లాడిస్తూ 
పాడి పంటలతోటి పసిడి రాశు లతోటివర్ధిల్ల వలే !!
                              /మా/
 జైహింద్ 
ఆకులరాఘవ ,కవి ,సినీ రచ యి త ,దర్శకుడు /
8-3-228/878/5-1,
వీడియో గల్లి ,
రహమత్ నగర్ ,
హైదరాబాద్ -500045'
సెల్ -9440971792   

Friday, 17 October 2014

విప్లవం 
--------
ఉదయమే విప్లవం !
మానవులను మేలుకొలిపి 
శ్రమ కొరకు పురికొలిపి 
బతుకు బాటపైన డిపే 
ఉదయమే విప్లవం !
               /  ఉ /
తూరుపు సింధూరం 
చీకటి తెరచింప గా 
ఆమని ధరహాసం 
కాంతులు వెదజల్లగా 
పక్షుల పలుకుల్లో 
సరాగాలు దొర్లగా 
జంతువుల అరుపుల్లో 
ఉల్లాసం పొంగగా 
మానవులు శ్రమ కొరకు 
నడుములు బిగించగా 
పొలాలన్నీ చిగురించే 
గని ఖని మారుమ్రోగే 
ఉత్పత్తుల రాశులే 
ఇండ్లనిండ తొణికిసలాడే!
                       /ఉ /
ఉదయమే మనుగడకు 
మార్గ దర్షిగా సాగగా 
ఆమార్గంలో మనిషి 
ప్రగతి రధం పైసాగగా 
చీకటి తన కడ్డుపడి 
అణిచి వెస్తున్నకాని 
ఉదయాన్ని ఒడిసి పట్టి 
చీకటిని పారద్రోలి 
ముప్పొద్దుల మానవుడు 
శ్రమ సమరం చేస్తుండే 
విజయం సాదిస్తువుండే 
సౌభాగ్యం వెల్లివిరియా 
సుఖశాంతుల తోడ మనిషి 
నిత్యం వర్దిల్లుతుండే !
              /ఉ /
జైహింద్   

Sunday, 12 October 2014

కాలరధం 
-------
కాలరధం పై కూర్చున్నాను !
సవ్వారి చేస్తూ వెళ్తున్నాను !
రాత్రి -పగలు 
రోజులు -వారాలు 
నెలలు -సంవత్స రాలు 
యుగము -యుగాలు 
దాటుతు దాటుతు వెళ్తున్నాను !
               /కాల /
ప్రకృతి ఒడిలో నేకళ్ళు తెరచి 
ప్రాణుల నడతను నేననుకరించి 
ప్రకృతి పెట్టిన అన్నం తింటు 
ప్రకృతి ఎదపై నే పవళించి 
ప్రకృతి ఒడిలో పాటాలు నేర్చి 
విజ్ఞాన జ్యోతిగ నేవెలుగొంది 
ప్రకృతి శక్తుల నేచేతపట్టి 
శక్తుల సేవలు నేవాడుకుంటు 
మానవమనుగడకు విధాత నేనై 
మానవాలిని ముందుకు నడుపుతు 
కాలరధం పైకూర్చున్నాను !
సవ్వారి చేస్తూ వెళ్తున్నాను !
               /కాల /
అడవులలోన ఆడుతు పాడుతు 
పర్వతాలను ఎక్కుతు దిగుతు 
నదులలోన మునుగుతు ఈ దుతు 
సముద్రాలలో తేలుతు దాటుతు 
గాలిలోన నింగిలో ఎగురుతు 
గ్రహాలతోటి బంతులు ఆడుతు 
విశ్వంలోన విజేత నేనై 
ఎల్ల లోకాలు తిరుగుతు వున్నా 
గమ్యం దొరకని దారుల్లో 
కాలరధం పై సవ్వారి చేస్తూ
సాగుతు సాగుతు వెళ్తున్నాను !
అంతే దొరకని ప్రస్తానంలో !
               /కాల /
మరోప్రపంచం మనుషుల కోసం 
విశ్వాన్నే జల్లెడ పడుతు 
ఆధా పాతాళం లోతులు తోడుతు 
సృష్టి మొదలు తుదిని వెదుకుతు 
పుట్టుక గిట్టుక మూలాలు లాగుతు 
అలసట ఎరుగని అన్వేషణలో 
అణువణు వును పరిశోదిస్తూ 
లక్ష్య సాధనకై పరుగులు దీస్తూ 
వైజ్ఞానిక కాలవీధిలో 
భువన భాండవ ములు కలియదిరుగుతు 
అంతేదో రకని కాలవీధిలో 
సాగుతు సాగుతు వెళ్తున్నాను !
                 /కాల/
భగ భగ మండే కాలవీధిలో 
ముందుకు సాగని నాప్రస్తానం 
వెనక్కి తిరిగి నేచూ సుకుంటే  
ఎన్నో దశల పరిణామాల్లో 
ఎన్నో జాతుల జగడాల్లో 
ఎన్నో కూలాల కురు క్షేత్రాలలో 
ఎన్నో మతాల మారణ హోమాల్లో 
బతుకు సమరాల రక్తపు టేరుల్లో 
మానవత్వం మట్టిలో కలిపిన 
వైజ్ఞానిక మానవుడిని నేనేనా ?
దేవుడికి దెయ్యానికి పురుడే పోసి 
వేడుక సలిపే వైజ్ఞానిక మానవుడిని నేనేనా ?
                 /  కాల/
జైహింద్ 

Friday, 26 September 2014

పరిహారం 
----------
పరిహారం ఇచ్చుడెంది ?
పన్నులు పెంచుడేంది ?
ప్రభుత్వాల మర్మాలు 
తెలుసుకోర పౌరుడా ?!
                /  ప /
పంటలు ఎండిన పరిహారం 
పంటలు మునిగిన పరిహారం 
ఇండ్లు కూలిన పరిహారం 
మనుషులు చచ్చిన పరిహారం 
ప్రతిదానికి పరిహారం 
ప్రభుత్వాల పల్లవయ్యే !
                /ప /
పరిహారపు నూకలు 
ప్రభుత్వాలు వెదజల్లి 
నిత్యం నువ్వు వాడుకునే 
సరుకుల రేటెంతో పెంచే 
వీసానికి ఆశ పడితే 
ముప్పావుల  పన్నుపోటే 
                   /ప /
ప్రకటించిన పరిహారం 
అధికారుల చేతులెన్నో 
మారి మారి నీచేతికి 
వచ్చేవరకు ఎంతమిగిలే ?
తెలుసుకున్న నీకింకా 
జ్ఞా నమే రాకపాయే ?
            /   ప /
పరిహారపు నూకలకు 
ఎదురు చూస్తూ ఆశపడక 
నిన్ను నువ్వు నమ్ముకొని 
కాలాన్ని గుర్తెరిగి 
సాగిపోతే జయం !జయం !!
దేశం సౌభాగ్యమేరా !!
              /ప /
జైహింద్ 

Thursday, 25 September 2014

పరిహారం 
----------
పరిహారం ఇచ్చుడెంది ?
పన్నులు పెంచుడేంది ?
ప్రభుత్వాల మర్మాలు 
తెలుసుకోర పౌరుడా ?!
                /  ప /
పంటలు ఎండిన పరిహారం 
పంటలు మునిగిన పరిహారం 
ఇండ్లు కూలిన పరిహారం 
మనుషులు చచ్చిన పరిహారం 
ప్రతిదానికి పరిహారం 
ప్రభుత్వాల పల్లవయ్యే !
                /ప /
పరిహారపు నూకలు 
ప్రభుత్వాలు వెదజల్లి 
నిత్యం నువ్వు వాడుకునే 
సరుకుల రేటెంతో పెంచే 
వీసానికి ఆశ పడితే 
ముప్పవుల పన్నుపోటే 
                   /ప /
ప్రకటించిన పరిహారం 
అధికారుల చేతులెన్నో 
మారి మారి నీచేతికి 
వచ్చేవరకు ఎంతమిగిలే ?
తెలుసుకున్న నీకింకా 
జ్ఞా నమే రాకపాయే ?
            /   ప /
పరిహారపు నూకలకు 
ఎదురు చూస్తూ ఆశపడక 
నిన్ను నువ్వు నమ్ముకొని 
కాలాన్ని గుర్తెరిగి 
సాగిపోతే జయం !జయం !!
దేశం సౌభాగ్యమేరా !!
              /ప /
జైహింద్ 

Tuesday, 23 September 2014

నెచ్చలి నాతోడుండగా చలిచప్పున చల్లారే !
----------
చలి చల్లగనే వచ్చింది 
మంచుదుప్పటి కప్పింది 
చెలివేచ్చగనే వచ్చింది 
యవ్వన కుంపటి కప్పింది 
హాయ్ హాయ్ కౌగిట్లో 
చలిచాల్లరే ముద్దుల్లో !
                /చ /
చలి చంకలో చుట్టేసి 
ఏద పొత్తిల్లో పడకేసి 
కౌగిలి దుప్పటి కప్పేసి 
గుండె సుస్వరాల పాటలతో 
ఏద లో ఊయలలూపేస్తూ 
మురిపించే మైమరపించే 
నెచ్చలి నాతోడుండగా 
హాయ్ హాయ్ వెచ్చనలే !
                   /చ /
విచ్చిన యవ్వన పువ్వుపై 
రాలినవిరహపు ముత్యాలు 
తళ త ళ మెరుపులు 
పొగజిగి సెగలలో 
పొంగిన మగసిరి సమ్మేటలో 
పదునెక్కిన వలపుల కొలిమిలో 
విర జిమ్మే అగ్గిరవ్వలలో 
హాయ్ హాయ్ వెచ్చనలే !
జైహింద్ 

Sunday, 21 September 2014

ఆరాధన 
-------
ఏమని కొలిచెదను 
ఏమని వేడెదను 
తనవొడిలో నన్ను 
కాచేటి ప్రకృతిని !
           /ఏ /
అడగనిదే గాలి 
ఊపిరి పోస్తుండే 
వేడనిదే వెలుగు 
కళ్ళకు వెలుగిచ్చే 
కోరనిదే నీరు 
దాహాన్ని తీర్చే 
మ్రొక్కనిదే నేల 
ఆకలిని తీర్చే 
ఒడిలోన ఆడిస్తూ 
ఎదలోన పడకేసే 
ప్రకృతి కాంతను !
          /ఏ /
పురుడోసుకున్న 
ప్రకృతిలో నాకు 
శబ్దాల పలుకులు 
మాటలుగానేర్పించి 
శోధించు సాధించు 
నాఅంతరంగం 
విజ్ఞాన నిదులెన్నో 
శక్తుల మేలేంతో 
కనిపెట్టి చేపట్టి 
సుఖించు ఇలలో 
శ్రమించు నిత్యం 
అనినుడివే ప్రకృతిని !
           /ఏ /
జైహింద్ 

Friday, 19 September 2014

విప్లవం 
--------
ఉదయమే విప్లవం !
మానవులను మేలుకొలిపి 
శ్రమ కొరకు పురికొలిపి 
బతుకు బాటపైన డిపే 
ఉదయమే విప్లవం !
               /  ఉ /
తూరుపు సింధూరం 
చీకటి తెరచింప గా 
ఆమని ధరహాసం 
కాంతులు వెదజల్లగా 
పక్షుల పలుకుల్లో 
సరాగాలు దొర్లగా 
జంతువుల అరుపుల్లో 
ఉల్లాసం పొంగగా 
మానవులు శ్రమ కొరకు 
నడుములు బిగించగా 
పొలాలన్నీ చిగురించే 
గని ఖని మారుమ్రోగే 
ఉత్పత్తుల రాశులే 
ఇండ్లనిండ తొణికిసలాడే!
                       /ఉ /
ఉదయమే మనుగడకు 
మార్గ దర్షిగా సాగగా 
ఆమార్గంలో మనిషి 
ప్రగతి రధం పైసాగగా 
చీకటి తన కడ్డుపడి 
అణిచి వెస్తున్నకాని 
ఉదయాన్ని ఒడిసి పట్టి 
చీకటిని పారద్రోలి 
ముప్పొద్దుల మానవుడు 
శ్రమ సమరం చేస్తుండే 
విజయం సాదిస్తువుండే 
సౌభాగ్యం వెల్లివిరియా 
సుఖశాంతుల తోడ మనిషి 
నిత్యం వర్దిల్లుతుండే !
              /ఉ /
జైహింద్