Friday, 19 September 2014

విప్లవం 
--------
ఉదయమే విప్లవం !
మానవులను మేలుకొలిపి 
శ్రమ కొరకు పురికొలిపి 
బతుకు బాటపైన డిపే 
ఉదయమే విప్లవం !
               /  ఉ /
తూరుపు సింధూరం 
చీకటి తెరచింప గా 
ఆమని ధరహాసం 
కాంతులు వెదజల్లగా 
పక్షుల పలుకుల్లో 
సరాగాలు దొర్లగా 
జంతువుల అరుపుల్లో 
ఉల్లాసం పొంగగా 
మానవులు శ్రమ కొరకు 
నడుములు బిగించగా 
పొలాలన్నీ చిగురించే 
గని ఖని మారుమ్రోగే 
ఉత్పత్తుల రాశులే 
ఇండ్లనిండ తొణికిసలాడే!
                       /ఉ /
ఉదయమే మనుగడకు 
మార్గ దర్షిగా సాగగా 
ఆమార్గంలో మనిషి 
ప్రగతి రధం పైసాగగా 
చీకటి తన కడ్డుపడి 
అణిచి వెస్తున్నకాని 
ఉదయాన్ని ఒడిసి పట్టి 
చీకటిని పారద్రోలి 
ముప్పొద్దుల మానవుడు 
శ్రమ సమరం చేస్తుండే 
విజయం సాదిస్తువుండే 
సౌభాగ్యం వెల్లివిరియా 
సుఖశాంతుల తోడ మనిషి 
నిత్యం వర్దిల్లుతుండే !
              /ఉ /
జైహింద్ 

No comments:

Post a Comment