Sunday, 21 September 2014

ఆరాధన 
-------
ఏమని కొలిచెదను 
ఏమని వేడెదను 
తనవొడిలో నన్ను 
కాచేటి ప్రకృతిని !
           /ఏ /
అడగనిదే గాలి 
ఊపిరి పోస్తుండే 
వేడనిదే వెలుగు 
కళ్ళకు వెలుగిచ్చే 
కోరనిదే నీరు 
దాహాన్ని తీర్చే 
మ్రొక్కనిదే నేల 
ఆకలిని తీర్చే 
ఒడిలోన ఆడిస్తూ 
ఎదలోన పడకేసే 
ప్రకృతి కాంతను !
          /ఏ /
పురుడోసుకున్న 
ప్రకృతిలో నాకు 
శబ్దాల పలుకులు 
మాటలుగానేర్పించి 
శోధించు సాధించు 
నాఅంతరంగం 
విజ్ఞాన నిదులెన్నో 
శక్తుల మేలేంతో 
కనిపెట్టి చేపట్టి 
సుఖించు ఇలలో 
శ్రమించు నిత్యం 
అనినుడివే ప్రకృతిని !
           /ఏ /
జైహింద్ 

No comments:

Post a Comment