Wednesday, 29 September 2021

కలంఎంచుకొని నేను


కలం ఎంచుకొని నేను
తప్పుచేసినానేమో?
బుర్రనిండ అక్షరాల
రాశులేన్నో ఉన్నగాని?
జెబులోన డబ్బు లేక
ఎన్నాళ్లీ పోరాటం?!

అక్షరాలు కాగితాల్లో
రాశులుగా పోసేసి
అంగళ్ళలో కూర్చుండి
బేరానికి పెట్టినా?
చిల్లిగవ్వ కు గొరగాక?
పేరుకుపోయి ఇల్లు నిండే!
ఎలుకలకు పురుగులకు
భలే మేతగా మిగిలే!
నా కడుపు కాల్చిన అక్షరాలతో
ఎన్నాళ్లీ పోరాటం?!

అక్షరాలతో అల్లుకున్న
అనుబంధం కాబోలు!
ఎన్ని జన్మల ఋణ బంధమో?
పేనుకొని ముడివేసే!
కలం దించ నివ్వదు?
పైస రాల్చ నివ్వదు?
ఆకలి మంటలు నీకే కాదు?
పూట గడవనోల్లెందరో?
కలం పట్టి దారి చూపు?
నీకు ఒక దారి దొరుకు!
వెనకా ముందు తేడా అంతే?
ప్రస్థానం సాగించు!?
జైహింద్
ఆకుల రాఘవ.

Monday, 27 September 2021

తెగి అతికెసంబంధం!


తెగి అతికే సంబంధం!
*******************

బొడ్డు పేగు తెగగానే?
సంబంధం తెగుతుంది!
చనుబాలతో ఆ బంధం
తిరిగి పుంజుకుంటుంది!
అది తల్లి బిడ్డల సంబంధం!
జన్యుపర ఋణబంధం!

యుగాలెన్నో గడిచినా?
తరతరాలు మారుతున్న
తల్లి బిడ్డల సంబంధం
సాగుతుంది కల కాలం!
విడదీయుని మమకారం!
ముద్దు మురిపాల అనుబంధం!
సకల ప్రాణుల్లో ఇదే సూక్తి!
మానవతకు పరమార్థం!
తల్లిదండ్రుల విధి ధర్మం!
పాటించుటే సృష్టి కార్యం!

చదువు సంధ్యలతో పిల్లలు
తమకు దూరముంటున్నా?
బతుకు దెరువుకు తమ బిడ్డలు
ఇల్లు విడిచి దూరమైనా?
పెళ్లిళ్లతో తమ పిల్లలు
మెట్టి నింటికి పుట్టి నింటికి
దూరమై బతుకు తున్నా?
పండుగలకు పబ్బాలకు
వేడుకలకు వేదనలకు
కలిసి మెలిసి వారంతా?
పాలు పంచుకొంటూనే
బంధాల అమృతాన్ని
మది నిండా సేవిస్తూ
మురిసి ముద్దై పోతరు!
జైహింద్.
ఆకుల రాఘవ,
సెల్:7382441792.

వరంగల్ వెలుగు!


వరంగల్ వెలుగు..!
****************
వరంగల్ జిల్లా
వాసికెక్కిన గడ్డా
లెంకపెళ్లి గ్రామం
రేయి లేని ఖ్యాతి
వరంగల్ వెలుగు
మణి హారపు కీర్తనం!
చ:_మూడు రంగుల నేల
మణులు దొర్లే దరహాసం
కాకతీయుల ముందు చూపు
నిండు కుండ తటాకములు
ఎడమ కొంగు గోదావరి
సిరులు చిందే చైతన్యం!
చ:_వేయి స్థంబాల వెలుగు
రాతి కోట రాజసం
తోరణాల సోయగం
రాళ్ళలో రమణీయం
శృంగారాల రామప్ప
భద్రకాళి భద్రత!
చ:_అడవి బిడ్డ సమ్మక్క
బంగారపు తూకాలు
శివసత్తుల పూనకాలు
జంపన్న యేటి ఘోష
కోర మీసాల కొమురన్న
ఐనవోలు ఆచారం!
చ:_ఆది మానవుల సమాధులు
పాండవుల గుట్ట చిత్రాలు
పెంబర్తి కాంశ్యాలు
చేర్యాల కలంకారి
చేతి వృత్తుల ఘన కీర్తి
వరంగల్ వైభవం!
చ:_పోతన పాళి లోన
భాగవతం లీల లెన్నో
పాలకుర్తి సోమన
ద్విపద వెలుగు లెన్నో
బూద రాజు పరిశోదన
జానపద వాంగ్మయం!
చ:_దాశరధీ అగ్ని ధార
కాళోజీ గొడవ గొడవ
గడీల ఆలయాల్లో
చిల్లర దేవుళ్ళఆట కట్టు
రంగాచార్య దీశాలి
వేదాల తెలుగు కర్త!
చ:_అడుగడుగున కవిత్వం
వెళ్ళి విరిసే సాహిత్యం
కుల వృత్తు గళాల్లో
ఉద్యమాల పాటల్లో
జాలువారే తెలుగు పాట
తెలంగాణ పద సంపద!
చ:_వైద్యులను తీర్చి దిద్దే
కాక తీయ కాలేజీ
రోగులకు ఇలవెలుపు
గాంధీ దవాఖాన
విజ్ఞానపు నిధులున్న
కాకతీయ విద్యాలయం!
చ:_రజాకార్ల రక్త దాహం
పిండారీల పైచాచికం
సాయుధ పోరాటంతో
తెగనరికిన ధీరత్వం
వరంగల్ తెగువ అది
జయశంకర్ ఓ సాక్ష్యం!
చ:_ఏనుమావుల మార్కెట్టు
పేరెన్నిక రైతులకు
రాష్ట్రాలను కలుపు బాట
ఖాజీపేట రైలు మార్గం
నిత్య అంగల్లతోటి
తిరణాల్లా వర్ధిల్లు!
చ:_పచ్చ నైన అడవులు
దట్ట మైన కొండలు
వన్య మృగాల పరుగులు
ప్రాణి కోటి నడయాడే
జిల్లాకే సౌభాగ్యం!
చ:_మలి ఉద్యమ తరంగం
అహింసకే పరమార్థం
ఎగసి పడిన జన జాతర
ఉలికి పడిన కేంద్రము
సిద్ధించిన తెలంగాణ
వరంగల్ కీలకం!
జైహింద్.
ఆకుల.రాఘవ.