Monday, 18 January 2021

మట్టి తోనే పరిమళం


మట్టితోనే పరిమళం!
******************
మట్టితోనే అల్లుకున్న
అనుబంధం రైతుది!
బతుకంతా సాగుతోనే
గడుపుతున్న ఋణ బంధం!
అదే రైతు జీవితం!
మట్టితోనే పరిమళం!!

మట్టిని నమ్మిన రైతుకు
వాన తోడు నిల్వగా
ఎండ తన వెంట రాగా
గాలి ఊపిరి పోయగా
చెమట రాలుస్తు రైతు సదా
విత్త నాలు విత్తుతూ...
పంట చేళ్లు పెంచుతూ...
కంటికి రెప్పల కాచి
సిరుల రాశు లెన్నో పోసు!

కాలం పగ పట్టినా?
భూమి నష్ట పరిచినా?
రెక్క లిరిగి ముక్కలైన
రాలింది చెమటే కదా?
అనుకున్నా రైతన్నా
హలం పట్టి ప్రతి రోజు
శ్రమ సమరం చేస్తు రైతు
పగలు రేయి చేళల్లో
పొద్దు పొడుపై వెలుగును!
అదే రైతు జీవితం!
మట్టితోనేపరిమళం!!
జైహింద్.