Thursday, 20 December 2012

విజ్ఞత విచక్షణ కలిగించాలి !
మతం మార్గం చూపాలి !
భక్తి బతుకు నేర్పాలి !
దేవుడి పేరుచెప్పి
కానుకలు దండుకోవడంకాదు ?

Thursday, 13 December 2012

pata

నీచూపుల చేతబడి
నామది చెడి వెంటబడి
నీదారికి అడ్డుబడి
కూర్చుంటినితీరుబడి
ననుచుడవే మనసుబడి
నువ్వుచేయ్యవే తిరుగుబడి -తిరుగుబడి
        నాదారికి ఎదురుబడి
        వేదించకు వెంటబడి
        మనసుంటే కట్టుబడి
        బతుకంతా అతుకుబడి
        నడిపించు ముందుబడి
       మనసింకాతిరుగుబడి -తిరుగుబడి
పదహారు పైబడితే పరువాలేగారడి లే
మైమరుపే మనసంతా కళ్ళింకా ప్రేక్షకులే
ఎదపైన వేదికలే ఒడిలోన వేడుకలే
అందాలమాయలు ముద్దుల్లగమ్మతు
మోజు బడి నీముందుబడి
చూచే నామది తుళ్ళిపడే -తుళ్ళిపడే
       ఎగబడి చూసే రసక్రీడా వడివిడి ఆడే సిగ్గంతా
       ఉసిగొలిపే కౌ గిట్లో తిరిగి ఆడే ఎదపైన
       గిల్లాడే పొంగులలో అల్లాడే తమకాలే
       యవ్వనాల పెరడిలో మరచిపోని గారడిలే
      మనసుబడి అతుకుబడి వయసులు ఆడితే తిరుగుబడి -తిరుగుబడి


Sunday, 9 December 2012

సంఘర్షణ
---------
జీవితం ఒక సమరం !
శ్రమే ఆయుధం !
బతుకంతా పోరాటమే !!

Thursday, 29 November 2012

అబివృద్ధి ఒకప్రక్క 
విధ్వంసం మరోప్రక్క 
భూగోళం పైన 
మనిషి చేసే పని !

Friday, 23 November 2012

మనో సృష్టి !
---------కవిత
ప్రకృతి
మనిషిని
సృష్టించింది !
మనిషి
ఇద్దరిని సృష్టించాడు !
ఒకరు దేవుడు !
మరొకరు దెయ్యం !

Thursday, 22 November 2012

aasti

ఆస్తి

అక్షరం
నా ఆస్తి !
పదం
నా పయనం !
వాక్యం
నా వాదం !
అక్షరాలతో
కవితలు వండి
లోకమంతా
వడ్డిస్తున్నాను !

Wednesday, 18 April 2012

పుస్తకం చదవండి
స్పందన తెలపండి
ప్రింటింగ్ కి
స్పాన్సర్ చేయండి.