Thursday, 13 December 2012

pata

నీచూపుల చేతబడి
నామది చెడి వెంటబడి
నీదారికి అడ్డుబడి
కూర్చుంటినితీరుబడి
ననుచుడవే మనసుబడి
నువ్వుచేయ్యవే తిరుగుబడి -తిరుగుబడి
        నాదారికి ఎదురుబడి
        వేదించకు వెంటబడి
        మనసుంటే కట్టుబడి
        బతుకంతా అతుకుబడి
        నడిపించు ముందుబడి
       మనసింకాతిరుగుబడి -తిరుగుబడి
పదహారు పైబడితే పరువాలేగారడి లే
మైమరుపే మనసంతా కళ్ళింకా ప్రేక్షకులే
ఎదపైన వేదికలే ఒడిలోన వేడుకలే
అందాలమాయలు ముద్దుల్లగమ్మతు
మోజు బడి నీముందుబడి
చూచే నామది తుళ్ళిపడే -తుళ్ళిపడే
       ఎగబడి చూసే రసక్రీడా వడివిడి ఆడే సిగ్గంతా
       ఉసిగొలిపే కౌ గిట్లో తిరిగి ఆడే ఎదపైన
       గిల్లాడే పొంగులలో అల్లాడే తమకాలే
       యవ్వనాల పెరడిలో మరచిపోని గారడిలే
      మనసుబడి అతుకుబడి వయసులు ఆడితే తిరుగుబడి -తిరుగుబడి


No comments:

Post a Comment