పలుకుబడి
-----------
ప్రకృతినిండా పదములే !
ఆలాపిస్తే భోదనే !
పదములె భాషకుమూలము !
మానవమనుగడకర్తము !
/ ప్రకృతి /
ప్రక్రుతినిండా సర్వ ప్రాణులు
జంతు -పక్షుల అరుపులకేకలు
క్రిమి కీటకాల కిచ కిచ గోలలు
ఆలాపించిన మాటలే !
తెలుగుభాషకు సంపదే !
/ప్రకృతి /
సాగరపవన కెరట విన్యాసం
చినుకుల నదుల గల గల రావం
తరువుల గిరుల మౌన భాషణం
ఆలాపించిన యోగ సూక్తము
తెలుగు భాషకు మహాభూషణం !
/ ప్రకృతి /
జగతిలో ఉన్న సర్వ ప్రాణులు
పలికే గళ ములో ఒకటే తీరు
ఆపలుకులలోనే తెలుగు ధారనే
జగతిలో ఉన్న మానవులంతా
పలికే పదములు పలు పలు విధము !
/ప్రకృతి /
ప్రక్రుతినిండా తెలుగు భాషనే
ప్రాణుల గళ ములో తెలుగు ధారనే
మనుషుల్లోనే అనేక భాషలు
మాదే గొప్పనే ఆదిపత్యము
కనురా ప్రకృతిలో తెలుగు పలుకుబడి !
జైహింద్
No comments:
Post a Comment