Thursday, 4 December 2014

తంగేడు పువ్వు 
-------------
చెట్టమ్మ చెట్టు తంగేడుచెట్టు 
పువ్వమ్మా పువ్వు తంగేడు పువ్వు 
చెట్టు చేసిన మేలు పువ్వుచేసిన పూజ 
కనరండి !కనరండి !మానవుల్లారా !!
                       /  చేట్టమ్మ /
మట్టిగోలెం నిండా సున్నం నీళ్ళు కలిపి 
తంగేడు తొక్క ఒల్చి మెత్తంగా దంచి 
గోలెం నిండాకలిపి పశువుల తోలు ముంచి 
పదిహేను రోజులు మాదిగ నానబెడితే 
తోలుకున్న బొచ్చు శుభ్రంగా రాలిపోయీ 
కాళ్ళకు చెప్పు లయ్యె నీళ్ళకు తిత్తిగా మారే 
మోటా బొక్కేండ్లాకు తొండాలుగా మారే 
తాడుగా పేనుకొని బంధాలు ముడివేసే
 తంగేడు తోక్కకున్న గుణ మెంతో మెండు 
మనిషి మేలుకోరి సేవలెన్నో చేసే 
                             /చెట్టమ్మ /
గండ్రగొడ్డలి పట్టి పరశురాముడు పడితే 
తాళలేక తల్లీ లందగోలెంలో దాగే 
తంగేడు తొక్క నీళ్ళు పవిత్రు రాలిని చేసి 
దివికి సాగనంపి తన పవిత్రతనిచాటే 
కంపుగోలెంలో రేణుక పవిత్ర మయ్యెనని 
ఆడపడుచుగమాదిగ ఆతల్లి నెంచి 
ఇలవెలుపుగ కొలుస్తుండే రేణుక మాతను 
దుర్గమ్మ మల్లన్న పట్నాల కొలువులో 
తంగే డాకుపిండి పసుపు బియ్యపు పిండి 
ఆదేవతల పెళ్ళిలలో పోలు ముగ్గైపోయీ 
కళ్యాణం జరిపించి తన వైభవము చాటే 
                                  /చేట్టమ్మ /
గౌ రమ్మ కొలువులో బతుకమ్మ సిగలోదూరి 
బంగారువన్నేల్లో తంగేడు పువ్వు మెరిసి 
బతుకు బంధాలను ప్రతి యేటా కలుపుతు 
బతుకు పాటలెన్నో పాడిస్తూ ఆడిస్తూ 
తీపి రుచులెన్నో కమ్మంగ పంచిపెడుతు 
చెరువుల్లో వాగుల్లో నీళ్ళల్ల పడిపోతు 
వచ్చే యేడు మళ్లీ తిరిగి వస్తాననుచు 
దీవనలెన్నో ఇచ్చి బతుకు దారి చూపే 
బందాలనుకలిపిన తంగేడు పువ్వు పూజ 
రాష్ట్రం గుర్తించి రాష్ట్ర పువ్వుగ నెంచే 
                     /చెట్టమ్మ /
జైహింద్ . 

No comments:

Post a Comment