Sunday, 3 December 2017

లంచం ఒక అంటువ్యాధి ..!
================
లంచం ఒక అంటువ్యాధి !
అరికట్టే వైద్యుడేడి ?
జగమంతావ్యాపించి
పీడించి చంపుతుంది !
పుడమి పైన ప్రతి మనిషి
జన్మించిన నాటినుండి
పెన వేసుకు పుడుతూనే
చావకుండా బతుకుతుంది !
యుగాలన్ని గతించినా ?
తరాలెన్నో మారుతున్నా ?
ప్రగతి పథంలో మనిషి
వైజ్ఞానిక దారుల్లో
సాంకేతిక విప్లవాల్తో
విజ్ఞానిగా వెలుగుతున్నా ?
లంచమనే అంటువ్యాధి
చావకుండ నేటికి
చిరంజీవిగ బతుకు తుంది !
వైభవంగ వెలుగుతుంది !
నవ సిద్ధాంతాలెన్నో వచ్ఛే
ప్రజాప్రభుత్వాలు వెలసే
చట్టాల సంకెళ్ళు ఎన్నెన్నో అడ్డేసి
శిక్షించి అరికట్టిన
ఆలంచమే ఎరగా మారి
చట్టాలను చుట్టాలుగ
మలుచుకొని బయటపడి
మీసాలు మెలివేసి తిరిగే !
మనిషి ప్రకృతిని జయించి
ప్రాణాంతక వ్యాధులెన్నో
అరికడుతు సాగుతున్నా?
లంచమనే వ్యాధిని
అరికట్టలేక పాయే ?
తల్లి దండ్రులే ఈవ్యాధికి
మూలపురుషులై పోయే !
మేలుకొని వారిప్పుడు
తమపిల్లలకు సోకకుండ
అరికడితే కొంతమేలు !
జైహింద్ .

No comments:

Post a Comment