Thursday, 16 November 2017

కనిపించే దేవుళ్ళు ..!
=============
నెత్తిమీద దేవుడు !
కాళ్ళ క్రింద దేవతా!
ఆదేవుడు సూర్యుడు
ఈదేవత భూదేవి
కనిపించే దేవుళ్ళ
చెయ్యెత్తి మొక్కకుండ
కానరాని దేవుళ్ళ
గుళ్ళ చుట్టు తిరుగుతూ
ఇల్లు గుల్ల చేసుకునే
మానవుడా !ఓపామరుడా !?
సూర్యుడే ప్రాణ దాత !
భూదేవి అన్నదాత !
గాలి నీరు నీజీవం
శ్రమయే నీఆస్తి పాస్తి
శ్రమిస్తే నీకు ముక్తి !
బతుకంతా జయం !జయం !!
ఆ దేవతల కరుణ లేందే
బతుకలేవు ఒక్క క్షణం !
చెయ్యెత్తి మొక్కారా?
ప్రతినిత్యం తల్చుకోరా ?
మానవుడా!ఓపామరుడా!
సూర్యుడంటే సూన్యం కాదు?
సకల సృష్టికి మూలము!
భూదేవి అంటే మట్టి కాదు?
సిరులు చిందే లక్ష్మీరా!
గాలినీరు దయ్యాలు కావు?
నీఆయుష్షుకి ప్రాణము !
ఈసత్యం నీకుతెలుసు !
ఎందుకింక ఆలస్యము ?
చెయ్యెత్తి మొక్కారా!
ప్రతినిత్యం తల్చుకోరా!
ప్రకృతియే నీకువరం !
నీబతుకు ధన్యము !!
జైహింద్ . 

No comments:

Post a Comment