Monday, 13 April 2015


 యుద్దం
-----------

నీకు నాకు ఉన్నది
లింగబేదమే !
నువ్వు నేను కలువకుంటే
సృష్టి లేదు !మానవ సృష్టి లేదు !!
       జాతి కులం మతం వల్ల
      యుద్దాలేఅనుకుంటే
      నీకు నాకు మధ్యన
      యుద్దమే మొదలయ్యే !
      ఆగిపోని పోరాటం
      ఎంతవరకో చెప్పలేం ?!
మెడ వంచితే ముడి వేస్తివి !
గంగి గోవుల వెంటవస్తే
ఇంట్లోనే బంధించి
దాసిగా నన్ను చేస్తివి !
పట్టు పరుపుగ నన్ను చేసి
దొర్లి దొర్లి ఆడితివి !
    పురిటి నొప్పుల బాధను
    నాకంట గడితివి !
   పిల్లల ఎదుగుదలకు
   నన్ను ఎరువుగ వాడితివి !
   ఇల్లే లోకమై
   కృషించి కుంగిపోతి !
మూడు ముళ్ళ సంకేల్లెంది  ?!
నీచేతిలో బంధి నెందుకు ?!
ఇంటి జైలులో నన్ను నువ్వు
ఎన్నాళ్ళు వుంచుతావు ?
ప్రతి రోజు నిలదీస్తూ
యుద్దమే చేస్తుంటివి ?
      నాలుగు  గోడల పంజరంలో
     నాకెందుకు ఈశిక్షా ?
     నీకన్నా రెండురేట్లు
     సంపాదించి తేగలను !
    ఇల్లాలుగ నాలెక్క
   ఇంట్లోనే దాసిగుండు !
పురిటి నొప్పుల బాధేంటో
నువ్వు కని పెంచిచూడు !
కాదంటే నీకు నాకు
రాం ... రాం ... లాల్ సలాం !
మూడు ముళ్ళ ముడివిప్పి
నాముఖం పై విసిరేస్తివి !
    నీకు నాకు కలయిక
  మూడు ముళ్ళతోనే మొదలు !
   ఆముడులే బంధానికి
   కలకాలం గుర్తుగా
   చేసుకున్న ప్రమాణం !
   ముడిపడిన మన బంధం !
సంపాదన నాద్యేయం
ఇంటి బాధ్యత నీధర్మం
అనుకున్న ఒప్పందం
సాగుతున్న సంసారం
ఇప్పుడీ నిందేలేంటి ?
నీకు నాకు యుద్దమేంటి ?
    ప్రకృతి యే కామ కేళీ !
    అదే స్పూర్తి మనలో సాగే !
     పురిటి నొప్పుల బాధకూడా
     ప్రకుతి ధర్మమే !
     అవునన్నా ?కాదన్నా ?
    ఎవ్వరేమి చెప్పలేరు !
ఆడ అయిన మగ అయిన
నీ గర్భ సృష్టియే కదా ?!
ఆడ తనం అంటూ నువ్వు
నీకు నువ్వే చులకనై
నన్ను రచ్చ కీడు చుకుంటూ
యుద్దమే చేస్తుంటివి ?
    నువ్వు నేను ఒంటరై
    ఎన్నెన్ని సాధించిన
    కలయిక లేని మన తనువులు
   ఒంటరిగా మన గలవా ?!
   తిట్టు కున్న కొట్టు కున్న
   సర్దుకు పోతేనే కాపురం !
మేధలోన నువ్వు నేను
ప్రకృతికే తల మానికలం !
శక్తిలోన యుక్తిలోన
ప్రగతి పధ సారదులం !
పరిపాలన దక్షతలో
నువ్వు నేను మహోన్నతులం !
    నీ చేయి పైన అయిన
    నాచేయి పైన అయిన
     కాపురానికి నవ్య క్రాంతి !
     అభివృద్దికి మహా వారధి !
     గుర్తెరిగి నువ్వు నేను
     సాగిపోతే జయం!జయం!!
          జైహింద్ 


 

No comments:

Post a Comment