Sunday, 17 May 2015

ర్యాగింగ్
-----
ర్యాగింగ్ అనేది స్కూల్ లో ,కాలేజిలో మాత్రమే చేసేది కాదు . పల్లెల్లో ,పట్టణాల్లో మన చుట్టు ప్రక్కల ఉన్నవాళ్ళు
అప్పుడప్పుడు మనల ర్యాగింగ్ చేసి మనం ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతూ ఆనందిస్తుంటారు . నా అనుభవం ఒక
సారి చెబుతాను వినండి .
    నేను 1972సంవత్సరం ఐదవ తరగతి చదువుతున్నాను . బడి ఐపోగానే ,రోజు సాయంత్రం చేనుకాడికి కావలి
వెళ్ళాలి అది మాడ్యుటి . ఒక రోజు సాయత్రం నేను చేనుకాడికి కావలి వెళ్ళాను . అక్కడ మాజీతగాడు ,మా పెద్ద
నాన్న కొడుకు ఇంకా కొందరు పశువుల మేపుతూ కాపలా వున్నారు .
    నన్ను చూడగానే పిలిచి ,నువ్వు చలి చీమ ముడ్డి మోయగలవా ?నువ్వు మోస్తే మేము మీచేను కాపలా
కాస్తాము . మేముగేలిస్తే మాపశువుల నువ్వు కాపలా కాయాలి . మేము చిర్ర గొనె ఆడు కుంటాము . శరత్
పెట్టారు . నేను ఆచిన్నదాన్ని మోయలేనా ?నేనురేడి అన్నాను . ఓయ్ నువ్వు మోయలేవు . అది పుట్టెడు
వడ్ల బరువు వుంటుంది !అంటే ఎనబై కుంచాలు ఐతే పుట్టెడు . అంటే ?ఎనబై క్వింటా ల్లు అన్నమాట !ఏయ్
నువ్వు మోయలేక ఓడిపోతావు అన్నారు . అయినా ?నేను పట్టుబట్టాను . వాళ్ళు చలిచీమను పట్టుకొని
నడుం వరకు విరిచి ,ముడ్డి భాగం నా కుడి చేయి మడతలోపెట్టి ,మడచి పట్టుకోమన్నారు . అంతే . ఒక్కసారే
తేలుకుట్టినట్లు భ గ్గున మంట పుట్టి ,లబో ,దిబో అని చేయి విదిలిచి కొట్టాను . అయినా ?దాని ముడ్డిరాలి
కిందపడలేదు . నేను గట్టిగా దాన్ని పట్టి పీకాను . అది దాని ముళ్ళు శరీరంలో దింపింది . దాని విషానికి చర్మం
పొంగ్గి బొబ్బలేక్కి ఒక్కటే మంట . నేను ఏడుస్తుంటే ,వాళ్ళు ఒక్కటేనవ్వు నవ్వుతున్నారు .
     చీమలు తలలో వున్న కొండ్ల తోకుడుతాయని అనుకున్ననుకాని ,ముడ్డి భాగంలో ముళ్ళు తో కుడుతాయని ,
నాకు అప్పటివరకు తెలియదు . తేనె టీగ ,చలి చీమ ,కందిరీగ ,తుమ్మెద లాంటికొన్ని ముడ్డి వద్ద వున్న కొండితో
కుడుతాయి . నేటికి కూడా ఇలా మన ప్రక్కవాళ్ళు రాగింగ్ చేస్తూనే వుంటారు . అది ప్రాణాంతకమై నప్పుడే చట్టం
జ్యోక్క్యం చేసుకుంటుంది . 

No comments:

Post a Comment