ప్రకృతిలో శబ్దం వున్నంత వరకు తెలుగు భాష దేదీప్యమానంగా వెలుగుతుంది!
*************
అవును..!ఇదినిజం!జంతువులు,పక్షులు,క్రిమి,కీటకాలు వున్నంత వరకుకూడా తెలుగు భాష దేదీప్యమానంగా వెలుగుతుంది!నీకు నమ్మకం లేదా?అయితే..
ఒక సారి క్షుణ్నంగా..పరిశీలిస్తే నీకే అర్థం అవుతుంది.
ఉరిమితే..."చర..చర"పిడుగు పడితే..."ఢాం"అని తెలుగు భాష శబ్దాలే పలుకు తాయి.రెండు చేతులతో గట్టిగా చప్పట్లు కొడితే.."చ"అని తెలుగు భాష శబ్దమే పలుకు తుంది.ఇలా...ఎన్నెన్నో...
ఉదాహరణలు చెప్పవచ్చు.
జంతువులు,పక్షులు,క్రిమి, కీటకాలు ప్రపంచంలో ఏ ప్రాంతంలో,మూలలో వున్నా
అవి పలికే పలుకుల్లో తెలుగు భాష పదాలే వుంటాయి!అవు"అంబా"అని,కుక్క"భౌ"అని
కాకి"కావ్"అని చిలక"కిల..కిల,కోయిల"కూ.. కూ"మేక"మే...మే"అని ఈ గ"జుయ్"అని, దోమ"గుయ్య్"అని, కీచురాళ్లు "కీచ్"అని,ఒక చిన్న పిట్ట అదే ట్విట్టర్ పైకి ఎగిరి ఏడు రకాల స్వరాలతో అరుస్తుంది. ప్రతి వాటి అరుపుల్లో తెలుగు భాష పదాలే వుంటాయి!
మరి తెలుగు భాష మృత భాష ఎలా...అవుతుంది?ఒకసారి విజ్ఞులు ఆలోచించాలి?కాకపోతే...నేటి తరం ఆంగ్లభాష మోజులో పడి,తెలుగు భాషను
నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతే?
ప్రకృతికి,జంతువులు,పక్షులకు,క్రిమి ,కీటకాలకు లేనిది, జగతి ప్రజల్లోనే వుంది!
దేశానికి ఒక భాష,ప్రాంతానికి ఒక యాస,పలుకు బడి అయిపోయి,భాషలన్నీ
గజి బిజి గందర గోళానికి గురి అయి పోతున్నాయి.కాబట్టి ప్రపంచ ప్రజలు మా భాషయే గొప్పంటే...లేదు...లేదు ?మా భాష యే గొప్పని, వాదులాడుతూ... పిడి వాదం చేస్తున్నారు.అది ఎంత మాత్రం సరియైన
పద్ధతి కాదు?
ప్రపంచంలో ఏ స్త్రీ అయినా..?ప్రసవ వేదనలో "అమ్మా"అని అరుస్తుంది.కాని,మరో..విధంగా అరవదు?
పుట్టిన బిడ్డ కూడా "ఆ... ఆ"కేర్..కేర్"అని
అరుస్తుంది.ఎవరికి ఎలాంటి దెబ్బతగిలి నా
"అమ్మా"అని అరుస్తారు.ఇది తెలుసుకుంటే
తెలుగు భాష ఉచ్చారణ ప్రపంచ భాషలకు
మాతృక అని తెలిసిపోయింది కదా?
ఆంగ్ల భాషలో ఏ అక్షరం పలికినా...?తెలుగు భాష లోని,ఆకారాలు, ఇకారాలు,ఎకరాలు, ఉకారాలు వుంటాయి.
అది ఒక సారి గమ నించండి చాలు!
అంతెందుకు...?మనకు వున్న ఖండాల పేర్లు ఒక్కసారి చూడండి.వాటి పేర్లలో మన
తెలుగు భాష లోని మొదటి అక్షరాలు ఉన్నాయి చూడు!అమెరికా,ఆసియా,ఆప్రీకా,
ఆస్ట్రేలియా, అంటార్క్ టికా,యూరప్, ఐరోపా.ఇలా...ఎన్నెన్నో ఉదాహరణలు
పేర్కొనవచ్చు.ఇక...?తెలుగు భాష పై దిగులెందుకు?
ప్రకృతిలో మానవుడు ఏదేశంలో కాని, ఏ ప్రాంతంలో కాని,జనిమిస్తే...అతనికి ఆ ప్రాంతం అమ్మ ఒడి,బడి అవుతుంది. ఆ బిడ్డకు అక్కడి మట్టితో అనుబంధం ఏర్పడుతుంది!అక్కడి పరిసరాల స్ఫూర్తితో
విజ్ఞానం వికసిస్తుంది.అక్కడి సంస్కృతి ,సంప్రదాయాలు,ఆచారాలు ఆలవడి పోతాయి.పాకులాడిన నేల,పరుగెత్తిన ప్రదేశాలు,కలిసి ఆడుకున్న ఆటలు అతని మనో ఫలకంమీద ముద్రపడి పోతాయి.అవే..అతను జీవితంలో ఎదగడానికి దోహద పడతాయి.కాబట్టి, ఎవరి ప్రాంతం వారికే ముద్దై,ఎవరి పలుకు బడి వారికే అందం.ఆరాద్యం.అనే...విషయం మరిచి పోకూడదు?మిగితా వారి భాషను,యాసను
హేళన చేయకూడదు?
ప్రపంచంలో ఏ ప్రాంతం మనిషి అయినా..?
ఆ ప్రాంతం భాష అతన్ని తీర్చి దిద్ది విజ్ఞాన
వంతున్ని చేస్తుంది.అతను పలుకు బడితో
రాణిస్తే చక్కని విద్యావంతుడు కాగలడు.
లేనిచో మౌకిక భాష మాట్లాడే వాడుగా,అవిద్యాపరుడుగా మిగిలి పోతాడు.అయినా..? ఆ అవిద్యాపరుడు అక్కడి పరిసరాలు నేర్పిన విజ్ఞానంతో ఎంతో...తెలివైన వాడుగా రానిస్తాడు. ఒక సారి అతను కూడి,గుణించి,తీసివేసి లెక్కలు కట్టే విధం చూడండి మీకే అర్థం అవుతుంది.నాణేలను గుర్తు పట్టే విధం చూడండి.మీకే తెలుస్తుంది.అట్టి అవిద్యాపరులు వారి యొక్క భాషకు ఎన్నడూ...ద్రోహం చేయరు.వారు వారి భాషను సరళంగా,సులువుగా,చాలా అందంగా మాట్లాడుతారు. చదువరులే..
వారి భాషను కూని చేసి ,మాటల్లో,చేతల్లో,
వ్రాతల్లో రక రకాల ప్రయోగాలు చేసి కలుషితం చేస్తున్నారు. సంకరం చేస్తున్నారు.
భాషావేత్త లతోటే...ప్రపంచ భాషలకు ముప్పు వాటిల్లింది!ప్రజలు అది గమనిస్తే
మంచిది?
ప్రాంతీయ భాష ఆ ప్రాంతంలో జీవనం సాగించే వాళ్లకు సరే...సరి.కాని, ఆ ప్రాంతాన్ని వదిలి ఎప్పుడైతే...వలస బాట పడతారో...అప్పుడే...అక్కడి భాషతో..అలవాటు పడి పోతారు.లేనిచో..
అక్కడ బతకడం చాలా...కష్టం అవుతుంది.
అలాంటి వలస దారుల వలనే మన తెలుగు భాష సంస్కృతి,సంప్రదాయాలు,ఆచారాలు
మారిపోతున్నాయి.ఇది అక్షర సత్యం!
ఆంగ్లేయులు ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాల వరకు పరిపాలించి,పోతూ ...పోతూ..ఆంగ్ల భాషను గజ్జిలా తగిలించి
వెళ్లారు.అని వారి మీద నిందెలు వేస్తున్నాం
తప్ప మనం ఒరగబెట్టింది ఏమి లేదు?
కాల గర్భంలో కలిసి పోయిన తెలుగు భాష ను తిరగదొడిన బ్రౌన్ దొర వేమన శతకం పునర్ ముద్రించి,దాన్ని ఆంగ్లంలో అనువాదం చేశాడు.ఏకంగా ఒక నిఘంటువుని రూపొందించి మనకు అందించాడు.అలాంటి ముందు చూపు మన
తెలుగు వాళ్లకు ఎక్కడుంది? నేటికి మన సాహిత్యం లండన్ మ్యూజియంలో భద్రపరిచారు. అది భాషాభిమానులకు వుండే విజ్ఞత!
కాటన్ దొర ఏకంగా...గోదావరి, కృష్ణా నదులపై ఆనకట్టలు నిర్మించి ఆంధ్ర రాష్ట్రం ను అన్నపూర్ణగా నిలిపాడు.
ఆంగ్లేయులు భారత దేశ ప్రజలను ఎందరినో...విద్యావంతులుగా తీర్చిదిద్దారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద పార్లమెంట్
భవనం నిర్మించి ఇచ్చారు.కాశ్మీరు నుండి కన్యాకమారి వరకు రైలు మార్గం,ఎన్నో వంతెనలు నిర్మించారు.నేటికి ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. వాళ్ళ కింద తొత్తులుగా వున్న మనలో కొందరు కమీషన్ల
కక్కుర్టితో మనల్ని హింసించారు తప్ప ,వారు ఎప్పుడూ...అన్యాయంగా ప్రవర్తించ
లేదు.
ఇకనైనా...?మించి పోయింది లేదు.మనల్ని మనం .మన భాషను, యాసను తీర్చి దిద్దు కుంటే చాలా మంచిది!
జైహింద్.
ఆకుల.రాఘవ
No comments:
Post a Comment