"గుఱ్ఱం జాషువ కథల పోటీ లో బహుమతి పొందిన కథ"
_____________________________________________
"అంబటాల్లైంది.గట్ల బిగుసుకొని,వాకిట్లో
కూసుంటే,ఎలా...?బావ!అక్కా నువ్వు గూడా గట్ల కూసుంటే,ఎట్లా..?మీతో పాటు
నా అల్లుడు,అచ్చిన పెద్దమనుషులు
ఎంత సేపని మోకాళ్ళ మీద కూసుంటరు?
కాళ్ళు తిమ్మిరిఎక్కుతై! జరలెండ్లి. కాళ్ళు సేతులు మొఖాలు కడుకొండ్లి.కల్లో సల్లో
కడుపుల సల్ల బడ్డంక,మాట్లాడు కుందాం.
లెండ్లి, లెండ్లీ."తన వియ్యంకుడిని,వియ్యపు
రాలు రెక్కలు పట్టుకొని, బతిమి లాడు
తున్నాడు మల్లయ్య.
"మేము కడుపులు కడుక్కోడానికి నీ ఇంటికిరాలేదు?నీ బిడ్డ చేసిన పని కి ఏ మొఖం పెట్టుకొని,నీ గడప దాటాలే?నీ బిడ్డ దొంగనాత్రి లేసి,సెంబడక పోతననీ గుడుజెంబునిండా నీళ్లు పట్టుకొని, బయిటి కొచ్చింది.
ఇగ రాదు? అగరాదు?ఎడబోయిందొనని,
ఏబాయిలోపడిందొనని, తెల్లందాకఎతకరాని
సోటు లేదు?నువ్వు మనిషిని తోలి మా పిల్ల
మా ఇంటి కొచ్చిందని, తెలిపి నావు కాబట్టి
సరిపోయింది!లేకపోతే...?నీ బిడ్డ కోసం మేమంతా గాయి,గాయి తిరిగిఆగమయ్యే
టోల్లం!నీ బిడ్డ చేసిన పని కి మా ఇజ్జత్
బోయింది?నీ బిడ్డనే మైనా...?కొట్టినమా?
తిట్టినమా?కడుపు నిండా బువ్వ పెడ్త లేమా?నాలుగేండ్ల పిల్లని నా కొడుకుకు
చేసుకొని,కంట్లో పెట్టుకొని,గోగు రెప్పోలే
పెంచిన!పిల్ల తోట కూర లెక్క ఎదిగింది.
సమర్త అయింది గప్పుడు ఏమన్నా..? తక్కువ జేసిన్నా .?ఫలహారాలు జేసి పెట్టిన
మంచిగ ఓడినింపిన!ఏదో... నాత్రి మంచి
రోజువుందని,పంతులుసేపితే,పిల్లను,పిలగాన్ని ఒకటి సేసిన!గా నాత్రి నా కొడుక్కు చెయ్యి ఇయ్యకుండా, వాడి మీద పడి కోతి లెక్క బర, బర గీకి పెట్టింది ఇదిగో...!సూడుండ్లి. గోర్ల గీతలు.ఎట్ల పడ్డయ్యో!"తన కొడుకు ఒంటిపై అంగి ఇడిపించి,అక్కడున్న వాళ్లకు చూపించింది.చంద్రమ్మ.
అక్కడ వున్న వాళ్ళందరూ చూశారు.
తిరిగి చంద్రమ్మ చెప్పటం మొదలు పెట్టింది.
"మగ పిలగాడు.కాయ కష్టం చేసేటోడు!కాబట్టి,పిలగాడు దాని లెక్క లావుగా,ఎత్తుగా ఎదగలేదు!కొద్దిగా నలక
పడిపోయాడు.అంత మాత్రాన మొగుడు
గాకుండా పోతాడా? అది వాడికి పెండ్లాం
గాకుండా పోతుందా?ఏం..?పిలగాడు కన్ను
గొట్టి నట్లులేడా?ఎంతపని జేసింది?కాపుదనపు పుట్టుక పుట్టలేదా?ఇలా...
దెంక్కొచ్చి మా పరువు మంట గలిపింది!
ఏదో...పిల్ల ఎర్రగా, బర్రగా వున్నదని,పని
బాగా చేస్తదని,సంబారపడ్డం!ఇంత పని
చేస్తదని,కలలో కూడా ఊహించలేదు!ఇదిగో"
ప్రక్కనున్న చెట్టు ఆకులు తెంపి,నెత్తి మీద
పెట్టుకొని,"ఈ పచ్చనాకుల సాక్షిగా పమానం
చేసి సెపుతాన. నీ పిల్లకు,మాకు సరిపోయింది!ఇగ తాడో,పేడో తెలిపోవాలి!
ఎందయ్య?గట్ల గూసున్నవు? అవుతల వరి
కోసి, మెదల మీద వున్నది గా పెద్దమనుషుల తోటి ఇడుపు కాయితం
చెయ్యమని చెప్పు?"మొగుడిని తొందర
పెట్టింది. చంద్రమ్మ.
ఆ పుక్కిటి పురాణమంతా వాకిళ్ళలో నిల
బడి వింటున్న చుట్టు పక్కల ఇండ్లల్లో వాళ్ళు మల్లయ్య వాకిట్లోనికి వచ్చి గుమి
గూడి పోయారు.
"అక్కా..!గట్ల తొందర పడితే,ఎట్లనే?ఏదో..
చిన్న పిల్ల!అజ్ఞానంలో వుంది. నేను సముదాయించి,మంచిగ బుదుగరించి,నీ ఇంటికి తోలు తానులే!వాకిట్లో లొల్లి సెయ్య
కుండా ఇంటిలోనికి రాండ్లీ.గిప్పటికే అందరూ
వచ్చి,వాకిట్లో చేరి ఈ బాగోతం ఇంటున్నారు!"తిరిగి బతుమి లాడుతున్నాడు.మల్లయ్య.
"ఏందమ్మ..?మీ అన్న గంతగనం బతిమిలడుతుంటె,ససేమిరా అంటున్నవు?
ఏదో...పిల్ల ఎడ్డితనంలో, అట్ల జేసింది. గంత
మాత్రాన తొందర పడితే ఎలా?అత్త గల్ల ఇల్లు జర సంజాయించు కోవాలే?బుద్ధి జ్ఞానం జెప్పు కోవాలి?పిల్ల సమర్తయి పది
హేను రోజులు కాలేదు?గప్పుడే ఏం... తొందర అచ్చింది? పిలగాడే మన్న గోడలు
దూకు తాండా?గుడ్లకొచ్చిన కోడి పెట్ట కాళ్ళకు నులక దారం కట్టి,పుంజు ముందర
ఇసిరినట్లు ఇసిరితే,ఎట్లా?చిన్న పిల్ల జడుసు
కోదా?నాలుగు రోజులు ఓపిక పడితే ఏమై
తాంది?తాడో...?పేడో..?ఆటో, ఇటో తేలి పో
వాలి. ఇడుపు కాయితం కావాలి, అని లొల్లి
లొల్లి జెత్తానవు?తెంపి ముడి వేస్తే కుర్చ కాదా? గీ బుద్ధి జ్ఞానం నాలుగేండ్ల పిల్లని
జేసుకున్నప్పుడు ఏమైంది? లెండ్లి,లేండ్లి.మీ
అన్న మాట ఇని ,ఇంట్లకు పోండ్లి.కడుపుల
సల్ల బడ్డంక మీ పిల్లను మీరు తీసుకు పొండ్లి."అక్కడికి వచ్చిన ఓ పండు ముసలావిడ అన్నది.
"ఏం దమ్మ నువు సెప్పొచ్చేది?కాపురం అంటే ఒక్క రోజుతో పోయ్యేదా?వందెండ్ల
బంధం! మాటి,మాటికి గిట్లైతే, బాగనే?"మూతి మూడు వంకర్లు తిప్పుతూ
దబాయించింది చంద్రమ్మ.
వచ్చిన వాళ్లంతా తల ఒకరకంగా,సమాధానం చెబుతున్నారు.కొందరు"ఏంది గీ పిల్ల గిట్ల జేసింది? కన్నొడి పేరు, కొన్నొడి పేరు
వాకిట్లో అమ్ముతాంది? ఓ...మల్లయ్య!నీ
బిడ్డను జర బయిటికి పిల్వరాదు.అసలు
సంగతేందో....తెలుసుకుందాం."అన్నారు
కొందరు పెద్ద మనుషులు.
వాళ్ళ మాటలకు మల్లయ్య ఇంటిలోనికి
వెళ్ళాడు."ఓ...రమక్క!వాకిట్లో గా లొల్లి ఏం
దే?నువ్వు గిట్ల, నిట్యాడుకు కాలు నిర్ర దన్ను
కొని,నిల్చుంటే...ఎట్లా?జర వాకిట్లో నికి వచ్చి
ఏం జరిగిందో...సెప్పు?"అడిగాడు మల్లయ్య.
"ఏం సెప్పుడో...సెప్పుడు."తన మనసులో
అనుకుంటూ... వెక్కి,వెక్కి ఏడుస్తుంది.ఏడ్చి,
ఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయి.కళ్ళల్లో నీళ్ళు ధారలా
కారుతూనే వున్నాయి.మనసు అదోలా ...అయిపోయి,గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది.
*****
"మూడేండ్ల పిల్ల ముంత కాసరన్నట్లు!సెప్పిన పని సిటికిలో సేసిన.పోసిన గంజి తాగిన. నా పని సురుకు దననం సూసిన నా
మేనత్త నన్ను కోడలుగా అడగటం.కాదంటే,
ఆస్తి ఎక్కడ పోతుందో...నని,మా నాయిన
ఆస్తులకు ఆశపడి,నాలుగేండ్ల పిల్లని సూడకుం
డా,నన్ను కట్ట బెట్టి ,ఒంటరి పక్షి లెక్క అత్త
గల్ల అడివిలో ఇడిసి పెట్టిండు!ఆడుకునే, వయసు!పాడుకునే మనసు! ఓ ఆట లేదు?
ఓ పాట లేదు?కాకి గూట్లో కోయిల పిల్లనైన!
నన్ను కాకిలాగ పొడుస్తూ...రాచి రంపాన పెట్టింది.ఎన్నో పనులు చేయించింది.చెయ్య
కుంటే,అవ్వగారింటికి చెడ్డ పేరు అత్తదని అన్ని పనులు చేసిన అన్ని కష్టాలు భరించిన.ఒక్కనాడు చెంబెడు నీళ్ళు పెయ్యి
మీద పొయ్య లేదు?తల సిక్కులు దీసి నూనె రాసి జడ ఏసింది లేదు?నాలుగేండ్లు
ముడ్డికింద బెట్టుకొని నాకు సెప్పుతావే?అని
గదిరించేది.గిప్పుడు పచ్చనాకులు పట్టి ఎట్ల
సెప్పుతాందో... సూడు!పుట్టి నేర్చిందో..లేక,
పుట్టక నేర్చిందో...? ఆటగోలు పిలగాండ్లం!
అప్పుడప్పుడు పిలగాడు నేను కలిసి ఆడు
కుంటు...పాడుకుంటూ...పనులు చేసేది.
మంచిగ ముచ్చట్లు పెట్టుకునేది!కథలు సెప్పుకుంట మురిసేది!గవ్వి జూసి చిన్న పిల
గాండ్లు ఆడుకుంట, పాడుకుంటపని జేస్తున్నరని మెచ్చుకోవాలి. గానీ, ఏమే..?
గప్పుడేపిలగాడు వయసొడై పోయినట్లు!
వాడితో సయ్యట్లు ఆడుతానవు?నలుగురు
సూత్తే ఏమనుకుంటారు?సమర్త అయ్యే
దాక ఆగలేవా?మొన్న పిలగాడు కాడెట్ల కట్టు కొని,చేను కాడికి పోతాంటే,సద్ది గంప
నెత్తిన ఎత్తుకొని,వాడి ఎనకాల వాడి కొంకులు దొక్కుకుంట పోయినవట? మీద,
మీద పడి ఇగిలిచ్చుకుంట నవ్విన వట?గదంతా మీ ఎన్కాల అత్తున్న పక్కింటి
మల్లమ్మ సూసిందట. ఏం...పిల్ల !ఏం...
కాలమో!అని,నాతోపాటు ఊరంతా... గీ...
ఇషయం ఊదింది!అందరూ...గిదేం ఇచ్చిత్రం!ముక్కుల మీద ఏలు ఏసుకొని,
నన్ను వైనం బెట్టిండ్లు!నాలుగు ముద్దలు
తినంగనే,కావుర మొచ్చిందా? గింత లేవు.
పిలాగాని కొంక్కులు తొక్కుతవా? ఇగిలిచ్చు
కుంట సయ్యట్లు ఆడుతవా?"బెదిరించి, ఇద్దర్ని ఆమడ దూరం వుంచింది. అమ్మ మాటకు భయపడిన పిలగాడు,నేను ఇంట్లో
వుంటే,అతను బయట. నేను బయట వుంటే,అతను ఇంట్లో!పిల్లదాన్ని తోడు లేక,
మాట్లాడే వాళ్ళు లేక,ఎంతలా...బెంగ పడి
పోయిన!
ఒక్కదాన్నే, పెండ తట్ట ఎత్తుకొలేక కింద పడి పోయిన. చేద బాయి నీళ్ళు తోడ లేక,
కడువతో మోయలేక, చేతులన్ని పొక్కులచ్చి,పుండ్లై ఎడువ లేక సచ్చిన.గీక ష్టం పడలేక,నాయిన ఎప్పుడు అత్తడని ఎదురు సూసి,ఎదురు సూసి కండ్లు కాయలు
కాసినై!రోజు గోడ మీద కర్రబొగ్గుతో గీతలు గీసి, నేను అచ్చి ఎన్ని రోజులైంది అని లెక్క
పెట్టుకునేది!నెలలు గడుస్తున్నా...నాయిన
రాకపోయేది.ఏదో...పదక్కో,పబ్బానికో నాయిన తీసుకు పోవడానికి అత్తే, "ఏం దన్నా!గిట్లొచ్చినవు? నేను పరాయిదాన్నా?
నా ఇంట్లో నలుగురున్నరా?ఇక్కడ చాన పని
వున్నది.నీ బిడ్డను మంచిగానే అరుసుకుంటున్న! దసరా పండుక్కి, సంక్రాంతి పండుక్కి మాత్రమే తోలుతాను.
మధ్యలో అత్తే తోలను."అని బుద్గరించి నాయినను తిప్పి పంపించేది. గిప్పుడుసూడు సిల్కపలుకులు ఎలా పలుకుతాందో...!
గా నాత్రీ పిలాగాన్ని పిలిచి బిడ్డా!నీ పెండ్లాం
సమర్తయింది!గిప్పుడు నువ్వు ఒంటరిగా,
పండుకో కూడదు.నీ పెండ్లాంతో కలిసి పండుకోవాలి! లేండ్లి... లేండ్లి.గా అర్రల పండు కోండ్లి. ఇద్దరిని లేపి అర్రలకు పొమ్మన్నది.
పిలగాడు నేను కలిసి మాట్లాడితేనే తప్పంటివి?ఊరంతా...నిన్ను వైనం బెట్టిండ్లని తిట్టి దూరంగా వుంచితివి.గిపుడు
కలిసి పండు కొండ్లి అంటే,ఊరంతా వైనం
బెట్టరా? అని అడగగానే...
ఏందే సమర్తగాంగానే, పెద్దదానివి అయినట్లు నామాటలు నాకే అజెప్పుతు...
నన్నే దెప్పి పొడుత్తానవు?రాజన్నా! సూ త్తాన వెంది బిడ్డా?దాన్ని రెక్క పట్టి అర్రలకు
లాక్క పో... బిడ్డా! అనగానే...పిలగాడు "ఏం
దే...?మా అమ్మ నే దెప్పి పోడు త్తానవు?"
రెక్క పట్టి అర్రలకు లాగిండు! నేను నా రెక్క
విదిలించుకొని,దూరంగా... తోసిన. నేను
సిన్నప్పుడు నీకొంకులు తొక్కిన్నట!మీద,మీద
పడి ఇగిలిచ్చుకుంటా సయ్యట్లు ఆడిన్నట!
ఊరంతా మీ అమ్మను వైనం బెట్టిండ్లట! గిప్పుడు నీతో అర్రల బంటే వైనం బెట్టరా?
అనగానే...
"ఈ డొచ్చిన కోడి ఇల్లేక్కి కూసినట్లు! సమర్త
గాంగానే దెప్పి పోడుత్తాంది? ఏంది బిడ్డా దానికి భయపడుతానవు? గది నీ పెండ్లాం
గదా?దాని మెడలో నువ్వు తాళి కట్ట లేదా?
పట్టు అని ఇద్దరు కలిసి నన్ను అర్ర లోనికి
గొడ్డును లాక్క పోయినట్లు, లాక్కుని పోయిండ్లు!అత్త జెప్పున బయిటికి ఎల్లి గెడేసింది.
పిలగాడు"రావే"అని మంచం మీదకి లా గిండు. నేను రానని మొరాయించిన.కోపంతో నన్ను కొట్టిండు.
నేను తిరగబడి కొట్టిన గంతే!"అమ్మా, అమ్మా!తలుపు తియ్యివే "పిలిచాడు."ఏంది
బిడ్డా!"అని అమ్మ వచ్చి తలుపు తియ్యంగానే,"దాని పాడుగాను.అది ఎంతకు
చెయ్యి ఇయ్యటం లేదు!ససేమిరా దగ్గరికి రానివ్వడం లేదు.సిన్నప్పుడు నువ్వు అన్న
మాటలు మనసులో పెట్టు కుంది."బుర్ర,బుర్ర
ఎల్లి గడంచేవాల్చుకొని పన్నడు!
"బిడ్డా...రాజన్నా!నువ్వు గిప్పుడుదాన్ని లొంగ దీసుకోక పోతే,అది రేపు నిన్ను కోతిని
ఆడించినట్లు ఆడిస్తది!దాన్ని చూసి భయప డ్తవా బిడ్డా?ఉడుత తాటి చెట్టు బాకటం లేదు!గిది గంతే... బిడ్డా!లే...లే."అంది.
"ఏందమ్నా!మనసు లేనిదానితో ఎట్లా ఏడ్చేది?"అన్నాడు.
"నువ్వు గిట్లనే అనుకుంట సూసి న వానుకో?రేపు నీకు మగతనం లేదని ఊరంతా చెప్పి ఉడాయిస్తది!లే బిడ్డా!లే,లే
వెళ్ళి దాన్ని మంచానికి కట్టేసి ఆకార్యమేదో..
కానియ్యి!"పెద్ద తాడు తెచ్చి ఇచ్చింది.పిలగాడు తాడుతో అర్రలకు రాంగనే,నాకు ఎక్కడ లేని భయం ఏసింది.
నేను సేంబడక పొయ్యి అత్తనని,బయిటికి
అచ్చిన.గుడుజెంబు నిండా నీళ్లు ముంచుకుని,చీకట్లో పెరట్లోనికి ఎల్లిన.
"ఏంది బిడ్డా! గదిగట్ల చెంబు పట్టుకొని పోతాంది"అడిగింది.
"గాదా..!గది గీతాడు సూడంగనే, సెంబడక
అచ్చింది! సెంబడక పొయ్యత్తదట!పొయ్యి రానియ్యి దాని సంగతి చెప్తా"అన్నాడు.
ఇక నేను ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా
గా నాత్రే మా ఇంటికి అచ్ఛిన.మనసునర్తతం
చేసుకొని దాని ఇంట్లో ఉండడం దండగని,మాటలతో చంపే దాని ఇంట్లో క్షణం కూడా ఉండ కూడా దని నిర్ణయించుకున్న.చిన్న పిల్లను చేసుకొని, ఆ
పిల్ల మనసు అర్థం చేసుకొనే దానింట్లో ఎట్లా
నెగ్గేది?అవసరమైతే,నాలుగు తన్నినా పడ్తా!
మాటలతో చంపితే ఎట్లా?పైగా నన్ను తాడు
తో మంచానికి కట్టేసి ఆ కార్యం చెయ్యమంటదా?ఇప్పుడు చూడు వాకిట్లో
కోసోని,ఎలా...?సెప్పుతుందో సూడు." వెక్కి,
వెక్కి ఏడ్వసాగింది.
*****
"అరె...ఏందే..?ఎంత సేపని మొత్తు కోవాలి?జర బయిటికి అచ్చి నోరిప్పే"రమ రెక్క పట్టి గట్టిగా లాగాడు మల్లయ్య.
రమ కుడికాలు నిట్యాడుకు నిర్ర దన్ని రెండు చేతులు వెనక్కి గట్టిగా పట్టుకుని వున్నందున,ఎంత లాగినా రావడం లేదు.
"దీని మీద మన్ను పొయ్య!ఎంత లాగినా
రావటం లేదు.నోరు విప్పి పల్లెత్తు మాట
మాట్లాడక పాయే?అచ్చినోళ్లకు ఏమని సమాధానం చెప్పాలి?వాకిట్లో ఇజ్జతికి ఎట్ల
సచ్చేది?"రెండు చేతులతో నొసలు మీద
కొట్టుకో సాగాడు.
"ఎందయ్యా..!దాన్నేమో, మెల్లగ బుడ్గరిత్తానవు?అది నీ లాగం దొబ్బింది!గిపుడు నీ మాట ఎట్ల ఇంటది?నలుగుర్ని
పిలిచి,దాన్ని లాక్కుని పోయి కాళ్ళు,రెక్కలు
కట్టి కావడికి తగిలించుకొని,మోసుకొని వెళ్ళ
మని చెప్పు!గప్పుడు గాని ఊరంతా...తూ అని ఉమ్మి ఎత్తే,దానికి సిగ్గత్తది!మల్లెప్పుడు
దెంకరాదు!"సలహా ఇచ్చింది.భార్య లచ్చమ్మ.
"ఇప్పటికే...రెండు సార్లు దెంకొస్తే,ఒక్కసారి
రెక్కలు పట్టి లాక్క పోయిరి.మరోసారి బండ్లో
కట్టుకు పోయిరి. గిప్పుడు కావడికి ఏసుకు
పోతే... సిగ్గత్తదా?అది నలుగురి ముందు
నోరు ఇప్పితే,ఏదైనా..?మాట్లాడ వచ్చు.దాని
పీనుగెళ్ల!నోరు విప్పి పల్లెత్తు మాట మాట్లాడక పాయె. నేను ఎట్ల సచ్చేది?"
కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు మల్లయ్య.
"అరె...అది వేరు ఇదివేరు! నేను చెప్పినట్లు
చెయ్యరాదు.దెబ్బకు దాని తిక్క కుదురు తుంది."తిరిగి అదే మాట గుర్తు చేసి సింది.
లచ్ఛమ్మ.
"సరే...గట్లనే చేద్దాం."బిన, బిన వాకిట్లో నికి
వచ్చి ," అక్కా,బావ! నాది తప్పిపోయింది. ఇ డుపు కాయితం అద్దు.ఏమద్దు.దాన్ని లాక్కుని వచ్చి కాళ్ళు ,రెక్కలు కట్టి కావడికి
ఎత్తు కొని పోండ్లి! గప్పుడుగాని,దాని ఇజ్జత్
బోయి జన్మలో ఇగ దెంక రాదు!"అక్క,బావ
అల్లుడి ,వచ్చిన పెద్ద మనుషుల కాళ్ళు మొక్కి,దోషిగా నిలబడిపోయాడు మల్లయ్య.
మల్లయ్య అలా చెప్పగానే,వచ్చిన పెద్ద మనుషులు,"చంద్రక్క!మీ అన్న చెప్పింది
బాగానే వున్నది.గీసారికి,మాట ఇను.మళ్లీ
ఇంకోసారి ఏదైనా జరిగితే... గప్పుడు,నువ్వు
అన్నట్లు ఇడుపు కాయితం చేద్దాం."నలుగురు పెద్దమనుషులు నచ్చ చెప్పారు.
"సరే...మీరంతా గట్ల సెప్పినంక నేనేమీ చేసేది? గట్లనె కానియ్యిండ్లి."అంది చంద్రమ్మ.
"ఓ...రాజన్న!దా...నువ్వెళ్ళి నీ పెండ్లాం రెక్క పట్టి లాగు .తరువాత మేము లాక్కొని
వత్తం.ముందు నువ్వు రెక్క పట్టక పోతే,మా
మీద తప్పు అత్తది.రా...రా...తొందరగా"
అన్నాడు ఓ పెద్ద మనిషి.
రాజన్న లేచి ముందుగా ఇంటిలోనికి వెళ్తుంటే,అతని వెనకాల నలుగురు యువకులు వెళ్లారు.
రాజన్న రమ రెక్క పట్టి"రావే మన ఇంటికి
పోదాం."అని లాగగానే, అతని వెనకాల వెళ్ళిన నలుగురు యువకులు రమ రెక్కలు
కాళ్ళు పట్టుకొని,బయటికి ఎత్తుకొని వచ్చారు.చేతులు, కాళ్లకు తాడుతో,గట్టిగా
కట్టి,పెద్ద కర్రకు తగిలించుకొని,అటు వైపు ఒక ఇద్దరు,ఇటు వైపు ఒక ఇద్దరు ఎత్తుకొని
బయలు దేరారు.
రమ "వామ్మో..!వాయ్యే..!"అని గట్టిగా అరుస్తూ...ఎడవసాగింది.రమ ఏడుపులు
ఎవరు పట్టించుకునే వారే లేరు.
ఊరంతా... ఈ వార్త పాకింది.చిన్న పిల్లాడి
నుండి పండు ముసలి వరకు రమను చూ
డ డానికి వచ్చారు.
"దీని పాడుగాను!బుద్ధిగా వచ్చిన మొగడి
తో వెళ్తే బాగుండేది కదా? గిప్పుడుసూడు
సచ్చిన గొడ్డును కర్రకు కట్టి తగిలించు కొని
వెళ్లినట్లు ఉన్నది!"నవ్వుతూ...ఎగతాళి చేస్తూ..వున్నారు.
మరి కొందరు "గిప్పుడు దీని ఇజ్జత్ బోయింది!ఇగ సచ్ఛిన అవ్వాగారింటికి, దెంక
రాదు!మంచి గైంది,మంచి గైంది. నవ్వుతున్నారు.
మరి కొందరు "కన్నోడి పేరు, కొన్నోడి పేరు,
మన ఊరు పేరు మంట గలిపె గదరా!దొంగ
ముండ సిగ్గులేకుండా,ఎలా...? ఏడు తాందో...సూడు!"అని కోప గించు కొంటున్నారు.
రమను కావడితో మోసుకొని వెళ్తుంటే,వెనకాల ఆమె తల్లిదండ్రులు,అత్త
మామలు,మొగుడు,ఊరిలో కొందరు జనం
వెళ్లుతున్నారు.
వాళ్ళు ఊరి పొలిమేర దాటారు.ఏడుస్తున్న
రమ ఏడుపు ఆపి,"నాకు సెంబడక,ఒంటెలుగు అత్తాంది.కావడి దించి,
కట్లు ఇప్పుండ్లి."అని చెప్పింది.
గా మాటలు విన్న అత్త చంద్రమ్మ "దాని మాటలు నమ్మ కండి.దాన్ని దించి కట్లు ఇప్పారో...జింక పిల్ల లెక్క తుర్రున ఎగిరి గంతేసి,ఉరుకు తుంది!"అని అన్నది.
"గట్లైతే... నేను గీచీరలోనే పోత."అని అన్నది రమ.
"చీ...చీ..!దీని పాడుగాను! గిది అన్నంత
పనె చేసే తట్టుంది. గట్ల జెత్తే,మన మానం
పొద్ది!రేపు లోకమంతా మన మొఖాల మీద
ఉమ్మి ఎత్తరు.దించుండ్లి... దించుండ్లి."అని
ఒకడు అనగానే,మిగితా వాళ్ళు వెంటనే కావడి దించి,"చంద్రక్కా..!దీని కట్లు ఇపుతానం.జర దీని రెక్క పట్టుకొని,గా చెట్టు
చాటుకు తీసుకొనిపో."అని,కట్లు విప్పదీసారు. చంద్రమ్మ రమ రెక్క పట్టి ఒక
పొదచాటుకు తీసుకు పోతుంది.
రమ వెళ్తూ...వెళ్తూ... ఒక్క సారే అదను చూసి,చంద్రమ్మను తోసి,పరుగు అందుకుంది.
"అయ్యే... అయ్యో..!ఎంత పని జేసింది. నేను అక్కడికి చెపుతూనే వున్నాను. నా
మాట ఇన్నరు గదు?అది ఎట్ల ఉరుకుతాందో
సీడుండ్లి.అది ఆడదా..?అడివిలో బుట్టిన
సింహమా!ఉరుకుండ్లి...ఊరుకుండ్లి."అని చెప్పుతూ...క్రింది నుండి లేచి,"అమ్మా..!దీని
కడుపు కాల!నడుం ఇరిగినట్లుంది."ఆయాసంతో రొప్పుతూ నిల్చుంది.
నలుగురు యువకులు రమ వెనక పడి
పరుగు అందుకున్నారు.
రమ జింకలా పరుగు దీస్తుంటే,ఆమె వెనకాల యువకులు సింహల్లా పరుగు దీస్తున్నారు!
తన వెనకాల వాయు వేగంతో,వస్తున్న యువకులను చూసిన రమ,"అమ్మో..!వీళ్ళు
నన్ను వదిలేలా లేరు"అని అనుకున్న రమ
వెంటనే,కనిపించిన గడ్డివాం చాటుకు దూరి
తన చీర,జాకెట్ విప్పి బయిటికి విసిరి వేసింది!
ఊహించని హఠాత్ పరిణామానికి, యువకుల మతి పోయినంత పనైంది.వెంటనే,ఆగి పొయి వంగి మోకాళ్లు
పట్టుకొని,ఊపిరి తీస్తూ... వుండి పోయారు.
రమ ఊహించని రీతిలో అలా... ప్రవర్తించిన నందులకు,అందరూ..నిర్ఘాంత
పోయి శిలా విగ్రహాల లాగా నిలబడి పోయారు.
"గిట్ల భరితెగించిన దాంతో ఎవ్వడు ఎగుతాడు? నేను ఇడుపు కాయితం చెయ్యంటే, ఇనక పోతిరి. గిప్పుడు మానం
పోయింది. గీమచ్చఊరికనే పొద్దా?"
లబో...దిబో అని ఆరవ సాగింది.చంద్రమ్మ.
ఎవవ్వరు ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడి,ఏం చేయాలో అర్థం కాక దిక్కులు
చూస్తూ... వుండి పోయారు.
ఇంతలో చేను కాడి నుండి ఇంటికి వస్తున్న
పెద్దమనిషి రామస్వామి విషయం తెలుసు
కొని,"ఎంత పని చేశారు?లోకం పుట్ట నున్నది. పెరుగనున్నది. సచ్చిన గొడ్డుని
కావడి కి కట్టు కొని వెళ్తున్నట్లు, వయసులో
వున్న ఆడ దాన్ని కావడికి కట్టు కొని వెళ్తే ఎట్ల?అందుకే,అది ఇలాంటి నిర్ణయం తీసుకుంది.అసలు దాని మనసులో మాట
తెలుసుకొని,అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే బాగుండేది? సచ్చిన గొడ్డుకు వేసినట్లు శిక్ష వేశారు.బాల్యంలో పెళ్లి చేస్తే పరిస్తితి ఇలాగే
వుంటుంది.దాని మనసు ఎప్పుడో విరిగి పోయింది.ఇప్పుడు నగ్నంగా,గడ్డి వాము చాటుకు కూర్చోని సభ్య సమాజాన్ని తల
దించుకునెలా చేసింది.ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు,అత్త మామలు ఆమె వద్దకు వెళ్లగలరా?మొగుడే వెళ్ళి తీసుకు రాగలడు.
కాని, ఆ అర్వత మొగుడు ఎప్పుడో...కోల్పోయాడు!మనసు విరిగిన చోట మనిషి మనలేడు!దీన్ని ఇంకా పొడిగించ కుండా ఇడుపు కాయితం చేసుకోవటమే ఇద్దరికి మంచిది."అని తన
అభిప్రాయం చెప్పాడు.
"మీరు చెప్పింది నిజమే.మీ సూచనలు మేము శిరసా వహిస్తాము."ఇరువురు ఒప్పు
కున్నారు.
వెంటనే వచ్చిన పెద్ద మనుషుల తోటి ఆ పెళ్లి రద్దు అయినట్లు ఇడుపు కాయితం రాయించి,ఇరువురి సంతకాలు చేయించాడు.
ఇంతలో ఓ ముసలావిడ రమకు చీర జాకెట్ కట్టించుకొని తీసుకోని వచ్చింది. రమ
చేత కూడా ఆ ఇడుపు కాయితం మీద సంత
కం చేయించారు.ఎవరి కాగితాలు వాళ్లకు
ఇచ్చారు.
ఇప్పుడు రమ మనసు పంజరం లోనుండి
బయిటికి ఎగిరిన పక్షిలా వున్నది.
భర్త రాజన్నకు, అతని తల్లదండ్రులకు తల
తీసినట్లు వున్నది.
పెద్ద మనిషి రామస్వామి"గ్రామస్తులారా!
బాల్య వివాహాల వలన ఎలాంటి పరిస్థితులు తలెత్తు తాయే చూశారు కదా?
ఇకనైనా..?బాల్యవివాహాలు చెయ్యమని,
ప్రమాణం చెయ్యండి"అని చెప్పగానే, అందరూ "ఇక మీదట మేమెవ్వరం బాల్య
వివాహాలు చేయ్యం.మేము మా ప్రమాణ
పూర్వకంగా చెప్పు తానం!"అని ప్రమాణం
చేశారు.
జైహింద్.
ఆకుల.రాఘవ.
ఇది నలభై సంవత్సరాల క్రితం మా గ్రామంలో జరిగిన
యధార్థ సంఘటనకు అక్షర రూపం ఈ కథానిక.
No comments:
Post a Comment