Monday, 20 March 2017

Ugadhi

ఉగాది 
 ****** 
 భూమిపుట్టిననుండి 
వస్తుందిపోతుంది 
 ఉగాదికాంత! 
 ఎన్నితరములోయేమో?
 చరిత్రనులెక్కలుకట్టే
 వారికేఎరుక?! 
 యుగారంభంనుండి
 ఉగాదికాంత !
 నిప్పులఎండను
 నెత్తినఎత్తుకొని 
 వడివడిగావచ్చి
 తెలుగులోగిళ్ళలో
 నిల్చుండిపోతుంది ! 
 నిప్పులఎండతో
 తానమాడినతరులు
 పచ్చనిపరిమళాల
 స్వాగతాలుపలుకు
 ఉగాదికాంతకు!
 కొమ్మల్లోకోయిలలు
 కమ్మనిరాగాల
 గానకచ్చేరిచేయు
 ఉగాదికాంతకు! 
 పచ్చనిచిలుకలు
 కొమ్మలవింజామరలతో
 విసురుతునుండు
 ఉగాదికాంతకు ! 
 మండేఎండలోఆమని
 వసంతగీతమై 
 నర్థించిమురిపించు
 ఉగాదికాంతను!
 పల్లెజనులంత
 వాకిళ్ళుశుభ్రపరిచి
 రంగవల్లులుదిద్ది
 మామిడితోరణాలు 
 గుమ్మాలకుగట్టి 
 షడ్రుచులపచ్చడి
 బహుకమ్మగాచేసి 
 ఉగాదికాంతకు
 సమర్పించివారంత
 చల్లంగచూడాలి
 సంవత్సరమంతమమ్ము 
 వేడుకొనిమ్రొక్కి
 సేవించుజనమంత !
 కాలగతులనుతెలిపే
 పంచాంగశ్రవణము
 ఆలకించిజనమంత 
 రాశులఫలితాల 
 రహష్యాలనుకని 
 భవిష్యత్తుకాలానికి
 బాటలువేసుకొను ! 
 ఆధాయవ్యయాల
 ప్రణాలికలతోజనం 
 బతుకులుదిద్దుకొని
 సంవత్సరమంతసాగు 
 ప్రగతిపథాన ! 
 జైహింద్.

No comments:

Post a Comment