Wednesday, 8 January 2020

అన్ని వెల్డిగ్ కథలే..!

అన్నీ వెల్డింగ్ కథలే!

-ఆకుల రాఘవ07/01/2016
నేడు తెలుగు చిత్రసీమలో వెల్డింగ్ సినిమా కథల హోరు జోరుగా కొనసాగుతుంది. కారణం తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చే యువతరం అందరూ ఆంగ్లంలో ఇంజనీర్లు, డాక్టర్లు చదివిన వారైనందున వారికి పూర్తిగా తెలుగు భాష తెలియక, తెలుగు సాహిత్యంతో పరిచయంలేక, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఏమాత్రం అర్థంగాక, అనుభవంలేని వారైనందున వెల్డింగ్ కథల హోరు కొనసాగుతుంది!
అలాంటి యువత ఏదోవిధంగా రచయితలుగా, దర్శకులుగా తెలుగు చిత్రపరిశ్రమలో నిలదొక్కుకునే సంకల్పంతో పరిశ్రమకు వస్తున్నారు. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంజనీర్లు తమ వృత్తిలో ప్లాన్లుగీసి ఆ ప్లాన్లలో ఎక్కడ అతకాలో, ఎక్కడ తెగ్గొట్టాలో సంపూర్ణ అవగాహన కలిగివుంటారు. అదే విధానాన్ని ఇక్కడ అవలంభిస్తున్నారు. డాక్టర్లు కూడా తమ వృత్తిలో ఒక రోగికి ఎలా శస్తచ్రికిత్సలు చేసి కొయ్యాలో, అతకాలో అదే విధానాన్ని ఇక్కడ అవలంభిస్తున్నారు.
నేడు వీరికి అనుభవంతో పనిలేదు. ఒక ఇంటర్‌నెట్‌తో ఉన్న కంప్యూటర్‌కాని, స్మార్ట్ఫోన్‌కాని ఉంటే చాలు. ప్రపంచ భాషలోవున్న చిత్రాలను యూ ట్యూబ్ ద్వారా డౌన్‌లోడు చేసుకొని చూస్తూ.. వారికి నచ్చిన సినిమాలోని సన్నివేశాలను ఏరుకొని, ఒకదానితో ఒకటి పేర్చి వెల్డింగ్ చేస్తున్నారు. సన్నివేశాలే కాదు, మాటలు, ఫ్రేమ్స్, గ్రాఫిక్స్, షాట్స్ అన్నీ మక్కికిమక్కి కాపీచేస్తూ ఒక సినిమాలా అతుకుతున్నారు. అలా అతికినది ఒక సినిమా కథలా, బౌండ్‌స్క్రిప్టులా తయారవుతుంది. అంతే!
నిర్మాతలు, హీరోలు కూడా కథ ఎలా తయారైతే ఏమిటి? అలా కాపీకొట్టి వెల్డింగ్‌లాగ అతికినవాడే మొనగాడు! అదే క్రియేటివిటి! అదే నేటితరం విజువల్ వండర్ అంటూ చంకలు గుద్దుకొని, వాటిని సినిమాలుగా మలుస్తున్నారు. అవి హిట్టయితే ఢంకా బజాయించి కేరింతలు కొడుతున్నారు. ఫట్‌మంటే దర్శకుల మీద, రచయితలమీద ఆ నెపంతోసి కుళ్లికుళ్లి ఏడుస్తున్నారు.
విమర్శలు ఎక్కువైతే వే
మే వెల్డింగ్ కథలు అందిస్తున్నామా? దర్శకత్వం చేస్తున్నామా? పూర్వపురోజుల్లో కూడా నాటి రచయితలు, దర్శకులు కాపీలు కొట్టలేదా? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు.
నాడు దర్శకులైనా రచయితలైనా ఏదేని భాషలో వచ్చిన సినిమా నచ్చితే, ఆ మూల రచయిత పర్మిషన్‌తో ఆ కథను కొని, తెలుగు నేటివిటీకి సరిపోయేలా మార్పులుచేర్పులు చేసి, తెలుగుభాష ఉట్టిపడేలా తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. నటీనటులు కూడా చక్కగా ఒదిగిపోయి నటించి తమ సత్తాచాటుకున్నారు. ప్రతి సన్నివేశం ఎంతో భావోద్వేగాలతో రసవత్తరంగా నవరసాలు ఉట్టిపడేలా వుండేవి. సంగీతం కూడా వీనులకు విందుగా అద్భుతంగా అమరేది. అది నాటి దర్శకులకున్న మర్యాద, జిజ్ఞాస!
ఆమాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు వెల్డింగ్ కథలతో సినిమాలు నిర్మించటం, ఆంగ్ల చిత్రాల్లోని యుద్ధ సన్నివేశాలను, అదేవిధంగా షాట్స్‌గాతీస్తు ప్రతిభమాదే! కంప్యూటర్ టెక్నాలజీ మాదేనని విర్రవీగితే ఎలా?!
నాడు ట్రిక్ ఫొటోగ్రఫీ ద్వారానే ఎన్నో అద్భుతాలు మనవాళ్ళు సృష్టించారు. ఎన్నో ప్రయోగాలుచేసి విజయాలందుకున్నారు. అది వారి గొప్పతనం! అలాంటివారి పాత సినిమాల్లోని సన్నివేశాలు, మాటలు, పాటలు, షాట్స్ కలిపి తెగగొట్టి వెల్డింగ్ చేస్తూ.. మేమో నవీన సాంకేతిక పరులమని విర్రవీగితే ఎలా? ప్రేక్షకులకు ఎవరు ఏమిటో తెలియదా? అందుకే స్టార్ హీరోల, స్టార్ డైరెక్టర్స్ చిత్రాలు కోట్లు కుమ్మరించి చిల్లర డబ్బులు ఏరుకున్న చందంగా ఉంది. ఇకనైనా తెలుగు కథ తెలుగులో పునర్నిర్మితమైతే మేలు!

Log in or register to post comments

Tuesday, 7 January 2020

సాంకేతిక విప్లవం..!


సాంకేతిక విప్లవం..!
*****************
సాంకేతిక విప్లవమిది
ఆపలేవు సోదరా?
ప్రపంచం గుప్పిట్లో
కదలాడు తున్నది
బతుకులన్ని వలసలై
తిరుగుతూనే వున్నవి!

నేటి మార్పు బంధాలను
తుంచి వేసే సోదరా?
డబ్బుకొరకు ఎంతకైన
తెగించి సాగు తుండే
కన్నవాళ్ళ వీధిలోన
వదిలేసి పోతుండే!

మీకేమీ తెలియదంటు
విర్ర వీగుతుండేరా?
అనుభవ ముంటే చాలదు?
కోట్లు కూడా బెట్టారా?
గంజి నీళ్లతో గడిపే
మీ కాలం మాది కాదు?

డబ్బు మయం నేటి తరం
విచ్చల విడి చేష్టలు
పెడ ధోరణి పద్ధతులు
విష సంస్కృతి పోకడలు
కాలుష్యపు అలవాట్లు
ఈ తరం సిద్ధాంతం!
జైహింద్.
ఆకుల.రాఘవ.


వింత కాపురం..!


వింత కాపురం..!
**************
  ప్రపంచంలో ఈయన లాంటి మనిషి ఎక్కడైనా...ఉంటాడా? ఏమో..? నాకైతే ఎక్కడ తారసపడలేదు. ఇప్పుడు మాత్రం
నేను ఈయనతో అనుభవిస్తున్నాను.
  అతనితో నా పెళ్లి జరిగే వరకు ఆయనేంటో
నా కెలాతెలుస్తుంది? అతని చిన్న నాటి జీవితం ఎలావుందో...కాని,పెళ్లి అయిన తరువాత తెలిసి వచ్చింది!ఎప్పుడు ఎలా
ఉంటారో?ఎప్పుడు ఎలా మారుతారో?ఆయనను సృష్టించిన ఆ బ్రహ్మ దేవుడుకి కూడాతెలియదు కాబోలు! నేను మాత్రం
ప్రత్యక్షంగా చూడటం ఆయనకు భార్యగా
అయిన నాటి నుండి.
  ఆయన అంత కటినాత్ముడా?ప్రతి రోజు
కొట్టి చంపుతున్నాడా? లేదే? మరి ఎందుకు
ఆయన గురించి ఇలా వాపోతున్నాను.
ఆయన మౌ నాన్నీ భరించ లేక పోతున్నాను. ఆ నిశబ్దం మహా విస్పోటనం
లా తోస్తుంది! అది భరుంచటం నావల్ల కావట్లేదు?కాపురం అన్నప్పుడు,ఏవో...చిన్న,
చిన్న గొడవలు.మాటకు మాట అనుకోవటం
జరుగుతుంది. అంత మాత్రాన అలిగి కూర్చుండి పోతాడా?ఎంత బతిమి లాడినా?
తినడా? పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉంటాడా? ఓ మూడు రోజులు పస్తు లుండి,నాలుగు రోజుల తరువాత తనకు తాను వండుకొని తినడం.
తన పనులు తాను చేసుకోవటం,చివరికి
తన బట్టలు కూడా తానే ఉతుక్కొనిఆరేసుకుంటాడు.ఇక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనంగా
 ఉండి పోతాడు.ఒక పొయ్యి రెండు వంటలు.పోని, నా తరుపు వాళ్లకు, ఆయన తరుపు వాళ్లకు చెప్పుకుంటాడా, అంటే అది
వుండదు.అది నాలుగు గోడల మధ్య నే ఉండి పోవాలి!ఇరుగు,పొరుగు వాళ్లకు కూడా తెలియదు.ఆయన,నేను లోకానికి
చూడ ముచ్చటగా ఉండి పోతాం!కాని, నా
అంతరంగంలో రగిలే జ్వాల ఎవరికి తెలుసు? ఇది అప్పుడే అయి పోయే
బాగోతం కాదులే!ముడి వేసుకున్నాక తప్పుతుందా? అనుకొని అలవాటు పడి
పోయాను! మౌనం సరే..!పక్క విషయానికి
వస్తే ...అది మాత్రం జరిగి పోవలసిందే!పోని
ఆప్పుడన్నా పెదవి విప్పి నాలుగు మాటలు
మాట్లాడు తాడా అంటే... అది లేదు? నిశబ్ద
రతి సమరమే! ఆ అనుభవాల్లో కూడా ఆనంద మయ అనుభూతే! ఆ ఒక్క దానికే
నేను బానిస నయ్యను కాబోలు!లేక పోతే
ముడి విప్పి ముఖాన కొట్టి వెళ్ళే దాన్ని.అయినా. ?తెంపి ముడి వేస్తే కురుచే 
కదా?ఇతనే ఇలా ఉన్నాడు అనుకొంటే...మరొకడు ఎలా ఉంటాడో?
ఒకర్ని విడిచి ఒకర్ని కట్టు కోవటం అంటే...
వేశ్యకు నాకు ఉన్న తేడా ఏమిటి? ఆ శీలమే
నన్ను అతనితో...కాపురం చేసేలా చేస్తుంది!
ఇక తను మౌనం వీడితే మహా రాజే!కాని,అతని గుణం ఎందుకిలా మారుతుందో
అర్థం కావటం లేదు.
  అతను కూడా తన మానసిక పరిస్థితి గురించి ఆలోచించడు. నేను అడిగినా...
చెప్పడు.పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది.
ఇప్పుడు పిల్లలు పుట్టారు. ఐనా..?ఆయన
పద్ధతి మారలేదు.
  పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళు అయిపోయారు.
కాని,ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు.
పిల్లలు కూడా నాలాగే అలవాటు పడి పోయారు."ఆయన అంతేలే!మనలను బాగానే చూసుకుంటున్నారు కదా? మనతో
ఆయనేప్పడు గొడవ పడింది లేదు.అడగ
కుండానే అన్ని సమకూర్చి పెడుతున్నాడు.
ఎంతోప్రేమగాచూసుకుంటున్నాడు.చాలాచక్కగా చదివిస్తున్నాడు".అనుకుంటున్నారు.
తప్ప అమ్మకు, మీకు ఈ గొడవ ఎందుకు?
నీ మౌన సంగ్రహమెంటి?మా ముందేమీరు
ఇలా ప్రవర్తించటం బావుందా?ఎందుకు
అలుగి పోతారు.మా ముందే వేరుగా ఉండి,
అలా ఎందుకు వండుకు తింటారు?మీ పనులు మీరెందుకు చేసుకుంటారు?అని,
ఒక్కనాడు అడిగింది లేదు.ఆయన అలిగితే
బతిమిలాడి ఇంత తినిపించింది లేదు.
  పిల్లలు ఆలిగితే, తట్టుకునేవాడు కాదు!
దానికి కారణం తెలుసుకొని,క్షణంలో తీర్చేవాడు.ఇప్పుడు పిల్లలకు పెళ్ళిలు అయి
పోయాయి.వాళ్లకు పిల్లలు కలిగారు.వాళ్ళ 
బతుకు వాళ్ళు బతుకు తున్నారు.ఐనా..?
మా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు.
అదే పద్ధతి అదే దోరణి!
  కాలంలో ఎన్నో రకాల మార్పులు!ఈ తరంలో ఎన్నో రకాల మార్పులు!ప్రపంచం
గుప్పిట్లో ఒదిగి పోయింది!సాంకేతిక విప్లవం
తో... పరుగులిడుతుంది!కాని,ఆయన గుణంలో మార్పు రాలేదు.
  పిల్లల కాపురాలు వెరయ్యాయి.ఆస్తులు
పంపకాలు జరిగాయి.ఇప్పుడు మేమిద్దరం.
మాలో మాకు వేరు కుంపటి తప్పటం లేదు!
ఇన్నాళ్లు కొట్టుకున్నామో? తిట్టు కున్నామో?
ఎప్పుడు వీధికి ఎక్కింది లేదు మాలో మేమే
సర్దుకు పోయాము.ఎవ్వరూ ఓదార్చింది
లేదు.దగ్గరకు చేర్చింది లేదు.కాని,ఈ వయసులో... నేను ఆయన మౌనాన్ని భరించలేక పోతున్నాను.పిల్లలతో సహా
వాళ్లకు పుట్టిన పిల్లలు ఆయన్నే కలవరిస్తారు. తాత...తాత!అని,ప్రేమ కురిపిస్తారు!
  పోనీ... ఇతన్ని వదిలేసి పిల్లలతో ఉండి
పోదాం అనుకుంటే,ఈయనే ఇప్పుడు
పిల్లవాడై పోయే?!ఇన్నాళ్లు ఆయన మౌ న
విస్పోటనాన్ని భరించిన దాన్ని ఇప్పుడు 
భరించ లేనా..?భూదేవికి వున్నంత ఓపిక
స్త్రీకి ఉందంటారు!అది ఇదే కాబోలు!
జైహింద్.
ఆకుల.రాఘవ.


Sunday, 5 January 2020

మనిషి


మనిషి
------
చక్కర పరిశ్రమగా
మారిపోతున్నాడు !
పక్షవాతంతో
వంకర్లు తిరుగుతున్నాడు !
మూత్ర పిండాల్లో
రాళ్లు ఏరుకోలేక చస్తున్నాడు !
నరాలకాలువలు పూడుకుపోయి
గుండెతడి ఆరి పోతున్నాడు !
మోకాళ్ళ నొప్పులతో
కీలు గుఱ్ఱంలా నడుస్తున్నాడు !
తనువు రోగాల పుట్టగా
మారిపోతున్నది !
అన్నింటికి కారణం
ఆహారపు అలవాట్లే !
కల్తీల కాలుష్యమే !
మందుపదార్థాల
మాయాజాలమే !
మనిషి త్వరగా మేలుకుంటే
ఆరోగ్యం
మహా భాగ్యాంగా వెలుగుతుంది !
        జైహింద్ 

Saturday, 4 January 2020

అత్తగారు కొత్త కోడలు..!



అత్తగారు... కొత్త కోడలు..!
**********************
               రచన:_ఆకుల.శరనిధి.
అంకం:_1.
ఇందులో వచ్చు పాత్రలు.
1.సత్యవతి .4.లక్ష్మీ.
2.సనత్. 5.రాఘవయ్య.
3.సంధ్యా.
అంకం:_1.
*********
(సనత్,సంధ్యా ఫోన్స్ తో చాటింగ్ చేస్తూ వుండటం.సత్యవతి రావటం .వాళ్ళను చూసి)
సత్యవతి:_అబ్బబ్బా..!ఇందాక,టీవీ సీరియల్స్ తో,ఏడుపులు,పెడబొబ్బలు!ఇప్పుడు, ఫోన్లతో చాటుంగులు!రాత్రి ఒంటి గంట అవుతుంది. ఎప్పుడు భోంచేస్తారు?ఎప్పుడు నిద్ర పోతారు?లేచి భోంచేసి నిద్ర పోండిరా?
సనత్:_ఆకలిగా లేదమ్మా?నిద్రకూడా రావటం లేదు. నువ్వెళ్లి పడుకో అమ్మా?
సత్యవతి:_మనుషులఅలవాట్లు,మారిపోయి,దయ్యాలఅలవాట్లు,అలవర్చుకు
న్నారు.ఏం తరమో?ఏం సాంకేతిక విప్లవ మో?అర్థం
కావటం లేదు?ఎప్పుడు మనుషులుగా మారుతారో...ఏమో?!
సంధ్యా:_అత్తగారికి,ఎప్పుడు, ఏదో...ఒక దెప్పి పొడుపు లేందే...నిద్ర రాదు కాబోలు!
సత్యవతి:_నేను నిజాలు మాట్లాడితే...నీకు
నిష్టూరంగా వుందామ్మా?!
సనత్:_ఎందుకమ్మా... అయినదానికి,కాని దానికి పెడర్తాలు తీసి మాట్లాడుతావూ?
నీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకో రాదు?
సత్యవతి:_నేను ఏం పెడర్తాలు తీసి మాట్లాడుతున్నాను!సమయానికి భోంచేసి,
నిద్ర పొండి అంటున్నాను. అది తప్పా?మీరు నిద్ర పోరు. నన్ను నిద్ర పోనివ్వురు.ఎలా...ఏడ్చేది?!
సంధ్యా:_మేము...దయ్యాలుగా మారిపోయి
నిన్ను పీక్కు తింటున్నాముగా..!
సత్యవతి:_అయ్యో...కోడలా! నేను చెప్పేది
ఒకటి?నువ్వుఅర్థం చేసుకుంది మరొక్కటి?
సనత్:_ఇందాక...నువ్వే కదమ్మా,దయ్యాల
అలవాట్లు వచ్చాయని?
సత్యవతి:_ఓ... అదా! మనుషు లైతే...ఎంత పనిలో వున్నా...సమయానికి భోంచేసి,నిద్ర పోతారు.పన్నెండు గంటలుదాటితే...ఎవ్వరు భోంచేయరు?పన్నెండు గంటలు దాటితే...అది దయ్యాలు, భూతాలు తినే సమయం !అది మీకు తెలిసి చస్తే కదా?
సంధ్యా:_ఓయమ్మో..!అత్తగారు...భలే నీతి
సూత్రము కని పెట్టిందండి!
సత్యవతి:_ఇది నేను కని పెట్టినది కాదమ్మా?మన పూర్వీకులు చెప్పిందే?!
మనుషులు పొద్దంతా...పని పాటు చేసి,సమయానికి,భోంచేసి నిద్ర పోతారు.దయ్యాలు,పొద్దంతా...నిదురపోయి
రాత్రంతా...తిరుగుతూ ... వాటికి దొరికింది
తింటాయి.మనుషులకు, దయ్యాలకు వున్న
తేడా అదే...నమ్మా?!మనుషుల అలవాట్లు
మారి పోయాయి కాబట్టే...తనువులు రోగాల పుట్టలుగా మారి పోతున్నాయి!
సంధ్యా:_గుడ్డి దీపం...కాలంలో గడిపిన మీకు,వైజ్ఞానిక క్రాంతిలో కాలం గడిపే మమ్ముల్ని చూస్తే...కడుపు మంట!అందుకే...ఏదో...ఒకవంకతో..దెప్పిపొడస్తూకథలు చెపుతుంటావు?ఇది మీ కాలం కాదు?కంప్యూటరుకాలం!భూమ్మీదనే...కాదు?
గ్రహాల మీద కాపురాలు వుండే కాలం!
ఎప్పుడు,ఎలా... మారాలో.. మాకు తెలుసు
లేండి.
సత్యవతి:_గుడ్డి దీపం కాలంలో వేసిన పునాదులపైన నేకదమ్మా?మీకాలం వెలుగులో తిరుగాడుతుంది!మూలాలను మరిచి మిడిసి పడే వాళ్లకు నేనేం చెప్పినా..?
తప్పుగానే తోస్తుంది! నా సొమ్మేం పోతుంది?
రెండు గంటలకే తిని!పొద్దున పద కొండు గంటల వరకు పడుకోండి!(కోపంగా లోపలికి వెళ్ళి పోవటం)
సంధ్యా:_చూశారా ..!మీ అమ్మగారు,ఎలా..?
మాట్లాడి వెళ్ళి పోతున్నారో..?
సనత్:_చూడు...సంధ్యా!మా అమ్మ కష్టాల
కాయల్ని తిని కాపురాన్ని నెట్టు కొచ్చింది!
ఈ జనరేషన్ గురించి ఆవిడకేం తెలుసు?ఆవిడ చెప్పేది,ఈ చెవిన విని, ఆచెవిన వదిలి పెట్టాలి! అంతే..?
సంధ్యా:_అరె...ఆవిడ కాలంలో...కష్ట పడి నట్లు మన మెందుకు కష్ట పడాలి?ప్రతి పనికి
యంత్రాలు వున్నాయి కదా?ఆమాత్రం ఆవిడకు తెలియదా?ఎప్పుడు,ఏదో...నస పెడుతూ...విసిగిస్తుంది?మనం హాయిగా,జాలిగా, గడుపుతుంటే...ఓర్వలేక
పోతున్నది.ఇలా... అయితే... నావళ్ళకాదు
బాబు?
సనత్:_అబ్బా...ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే...హ్యాపీగా ఉండలేం సంధ్యా!
అవిషయంవదిలెయ్ ?
సంధ్యా:_అరె...లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి,
ఎన్నో చదువులు చదివి,ఉద్యోగం చేసే మనల్నే...అలా...అంటే,కోపం రాదా?
సనత్:_కష్ట పడి పకి వచ్చిన వాళ్లకు అదే...ధ్యాస వుంటది?తమ లాగే...కష్ట పడి బతకాలి.అన్న తపన వుంటది.సరే...టైం రెండు గంటలు అవుతుంది.వెళ్ళి భోంచెద్దాం
పదా?(ఇద్దరు లేచి వెళ్ళటం)
                    అంకం:_2.
(లక్ష్మీ సత్యవతి వద్దకు రావటం)
లక్ష్మీ:_సత్యవతి గారు!సత్యవతి గారు!
సత్యవతి:_రా... లక్ష్మీ!రా... నేను వంటింట్లో
వున్నాను.రా...రా!
లక్ష్మీ:_అలాగే... నండి వస్తున్నాను.(లోపలికి
వెళ్ళటం)
లక్ష్మీ:_ఇంకా ...వంటల పని కాలేదాండి?
సత్యవతి:_ఇదో...ఇప్పుడిప్పుడే,అవుతున్నాయి! నేను మిక్సిలు, గ్రైండర్లు వాడను లక్ష్మీ!
రొట్లోనే,దంచుతూ...నూరుతూ వండుతాను.దాని వలనే...కాస్త ఆలస్యం
అవుతుంది.
లక్ష్మీ:_మిషన్స్ వుండగా ,కష్ట పడటం ఎందుకండీ?
సత్యవతి:_మిషిన్స్ లో ఏది నూరినా రుచి రాదు.రోలు అయితేనే....ఘుమ,ఘుమ లాడుతూ... ఎంతో రుచి వస్తుంది!రుచిగా
వుంటేనే కదా?కడుపు నిండా తిండి తినేది!
లక్ష్మీ:_మీరు చెప్పింది నిజమే!కాని,మా కోడలు ఎప్పుడు రోలులో నూర నివ్వదు.దంచ నివ్వదు.నలుగురు చూస్తే...
నవ్వుతారు!మా పరువు తియ్యకు?అని చెప్పగానే...ఆవిడకు భయపడి మిషన్స్ మీదనే నూరుతున్నాను.
సత్యవతి:_నలుగురు నవ్వుతారని,మన ఆరోగ్యం పాడుచేసు కుంటామా?ఇదిగో...
కాఫీ తీసుకో లక్ష్మీ!(కాఫీ ఇవ్వటం.లక్ష్మీ అందుకోవటం.)
లక్ష్మీ:_టైం పదకొండు గంటల వుతుంది.కోడలు నిద్ర లేచి నట్లు లేదు?
సత్యవతి:_ఆవిడకేం...మహారాణి!దాసి దానిలా నేను చెయ్యటానికి వున్నాను కదా?
లక్ష్మీ:_కొత్త కోడలు!కొత్త కాపురం!అచ్చట్లు,ముచ్చట్లు,సరసాలు!రాత్రంతా...నిద్ర ఉండదు కదా?ఈ వయసులో...కాక పోతే,పిల్లలు కలిగిన తరువాత ఆసుఖం అనుభవిస్తారా? అనుభవించ నివ్వండి!
సత్యవతి:_అయ్యో...లక్ష్మీ! ఆ సంబరం కూడానా?
లక్ష్మీ:_భార్య,భర్త లిద్దరూ గొడవేమైనా... పడిపోయారా?
సత్యవతి:_అదేం...లేదు.ఇద్దరు ఉద్యోగాలు
చేస్తున్నారు కదా?ఒకరు రాత్రి పూట డ్యూటీ చేస్తే...మరొకరు పగటి పూట డ్యూటీ చేస్తున్నారు.ఇంటికి వచ్చారా... టీవీల
ముందు.ఆతరువాత,ఫోన్లు పట్టు కొని చాటింగులు.సమయానికి తిండి లేక,నిద్ర లేక,దాంపత్య సుఖం అమావాస్యకు ఒకసారి, పున్నానికి ఒకసారి అనట్లు వుంది.
నేను ఏమైనా...చెబితే,నన్నే చివాట్లు పెడుతున్నారు.
లక్ష్మీ:_నాకొడుకు, కొడలుది అదే... పరిస్థితి!
ఏదేవుడు కరుణించాడో...?కాని,ఇద్దరు పిల్లలు కలిగినారు.ఐనా...? ఏం లాభం?చిన్న పిల్లల నిద్దర్ని హాస్టల్లో వేశారు.ఒక్కదాన్ని బిక్కు,బిక్కు మంటూ...
ఏకాల క్షేపం లేక ఒంటరిగా...చస్తున్నాను.
ఏదో...మీరు ఉన్నారు కాబట్టి కాస్త మన శాంతి దొరుకు తుంది!మన కాలంలో ఇలా...
చేశామా సత్యవతి గారు!
సత్యవతి:_మూడేండ్ల పిల్ల ముంత కాసరానట్లు,మన తల్లి దండ్రులు చిన్నప్పుడే
పెళ్ళి చేసి అత్త వారింటికి పంపిస్తే... ఆ ఉమ్మడి కుటుంబం లో,అందరి నోళ్ళల్లో
నాలుకలా...మెదులుతూ... ఇంటేడు చాకిరి
చేస్తూ...పొలం పనులు చేస్తూ... తూమెడు
వడ్లు దంచి, తూమెడు జొన్నలు విసిరి వండి
వార్చే వాళ్ళం! ముందునోల్లకు తిండి దొరికితే... వెనకవాళ్ళకు తిండే దొరికేది కాదు?ఉన్న నాడు తిని,లేని నాడు నీళ్ళు తాగి బతికాం! పది మంది నుండి ఇరవై మంది దాకా పిల్లలను కనిపెంచి, పెద్ద చేసేవాళ్ళం!ఆనాడు ఆపరేషన్స్ ఉన్నాయా?
అన్ని నార్మల్ డెలివరీలే కదా?మన లాగా
మన పిల్లలు మొద్దు కష్టం పడకూడదని,
చక్కగా చదివించి ఉద్యోగం వచ్చేలా చేస్తే,
ఏసి గదుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని,
పని చేయలేక పోతున్నారు.మన అలవాట్లు
ఎప్పుడో...మార్చి పోయారు.అన్ని దయ్యాల
అలవాట్లకు మారి పోయారు!ఏం తరమో?
ఏం బతుకులో?అర్థం కావటం లేదు లక్ష్మి?
లక్ష్మి:_చదివిస్తే,వున్న మతి పోతుంది అంటారు!అది ఇదే...కాబోలు!మనం ఏం
చేయగలం లేండి?
సత్యవతి:_కొడుకులు చేతి కందారు.హాయిగా...సుఖ పడి పోవచ్చు అని
తలిస్తే...వాళ్ళ పద్ధతులు ఇలా...ఏడ్చి చచ్చే!
ఇంకా ఎన్నాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకోవాలో...?
లక్ష్మీ:_మన తనువు వున్నంత వరకు ఈ కష్టం తప్పదు లేండి?
సంధ్యా:_(లేచి అక్కడికి రావటం) ఆంటీ!
ఇంకా...వంటల పని కాలేదా?
సత్యవతి:_ఇదో...అయిపోతున్నాయి.మీరు
వెళ్ళి తయారై రండి.
సంధ్యా:_పనులు పక్కన పెట్టి,లక్ష్మితో...
సోది పెడితే...ఎలా?పనులు అవుతాయి!
సత్యవతి:_మీరు తయారు అయి రండి. నా
పని ఎంత సేపు?
సంధ్యా:_మన ఇంట్లో...మిక్సీలు, గ్రైండరులు వున్నాయి కదా?రోట్లో...దంచుడు నూరుల్లేంది?పైగా...పక్కింటి ఆంటీ ముందు నీ పాత కాలపు అలవాట్లతో...మా పరువు తీస్తున్నావు?
సత్యవతి:_దంచుడు, నూరుడు నాకేం కష్టం
కాదమ్మా? నా పుట్టుకతో...అలవాటైన పనులే!
సంధ్యా:_వేలు వేలు పెట్టి కొన్న ఆ మిషన్స్ ఏం చేయాలి?అవి వాడకుండా వుంటే పాడై
పోవా? నీ లేకి బుద్దులతో చస్తున్నాను.ఏమండీ!ఇలా...రండి.మీ అమ్మగారు మన పరువు పెంట పాలు చేసేలా...వుంది!
సనత్:_ఆ...వస్తున్నా!(రావటం)ఏం సంధ్యా!
సంధ్యా:_త్వరగా ఓ పని మనిషిని చూడండి. మీ అమ్మగారి పద్ధతులతో...వేగ లేక చస్తున్నాను.పని మనిషి అయితే...అన్ని
పనులు మిషన్స్ మీదనే చిటికెలో...చేసి వెళ్తుంది!
సనత్:_అమ్మ వుంది కదా?పని మనిషి ఎందుకు?జీతం దండగా!
సంధ్యా:_ఆవిడకు పెట్టే ఖర్చుతో...పని మనిషి వస్తుంది!మీరు చూస్తారా?నన్ను చూసుకో మంటారా?
సనత్:_అమ్మా!మిషన్స్ వాడితే... నీ సొమ్మేం పోతుంది?నీకు కష్టంగా వుండదు కదా?పనులు కూడా చిటికెలో అయిపోతవి.
సత్యవతి:_రోట్లో అయితే...చాలా రుచిగా ఉంటాయి!కడుపు నిండా తిండి తింటారని
నా ఆశ బాబు!కాని, నా అలవాట్లు, లేకి బుద్ధులు మీకు నచ్చ నప్పుడు మీ వద్ద నాకేం
పని? నాకు పెట్టే ఖర్చు పని మనిషి కి పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేయించుకోండి. నేను
ఊరు వెళ్ళి పోతాను.
లక్ష్మీ:_నేనేదో...కాలక్షేపానికి వచ్చి మీకు గొడవ పెట్టినట్లు అయ్యింది.నన్ను క్షమించండి? నేను వెళ్ళి వస్తాను.(వెళ్ళి పోవటం)
సనత్:_అమ్మా!నిన్ను ఊరు వెళ్ళి పొమ్మన్నానా?అలా...మాట్లాడుతున్నావు?
పాత అలవాట్లు మరిచి పోయి,కొత్త అలవాట్లు నేర్చుకో మంటున్నాం!
సంధ్యా:_పోతే... పోనివ్వండి.మన మొక్కరమే ఉన్నామా!నలుగురు కొడుకులు
వున్నారు.ఆవిడ పద్ధతులు నచ్చిన వాళ్ళు ఉంచుకుంటారు.
సత్యవతి:_నేనేం గతిలేక,మీ దగ్గరికి రాలేదమ్మ?కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు!కొ త్తకాపురం! నేను సహాయంగా,వుంటే బావుంటుందని వచ్చాను అంతే?ఇక..మీ
వద్ద క్షణం కూడా వుండను.వెళ్తున్నాను (వెళ్ళిపోవటం)
సనత్:_ఏమిటి?సంధ్యా!ఊరికే నోరు జారి
తివి? అమ్మ అలిగి ఊరు వెళ్తుంది.నలుగురు ఏమనుకుంటారు?
సంధ్యా:_అబ్బా...ఆవిడ నస భరించలేక పోయాను.ఎప్పుడు ఏదో... సోది.మనకు.
ప్రైవసీ లేకుండా చేసింది.ఎవ్వరు ఏమి అనుకోరు.పదండి టైం అవుతుంది.
                  అంకం:_3.
(సత్యవతి ఊరిలోకి వస్తూ ఉండటం.ఆమెను,రాఘవయ్య చూడటం.)
రాఘవయ్య:_సత్యవతి!ఇదేనా...రావటం?
సత్యవతి:_అవును...రాఘవయ్య!
రాఘవయ్య:_మీరు...చివరి జీవితం చిన్న కొడుకు దగ్గరే గడుపు తానని వెళ్లారు. పది
రోజులకే తిరిగి వస్తున్నారు.అక్కడ ఏమి
జరిగిందేమిటి?
సత్యవతి:_మీరు చెప్పింది నిజం!కాని, ఆ పట్నంలో నేను వుండలేక పోయాను!ఎప్పుడు...ఇంట్లో కట్టి పడేసి నట్లు ఒంటరిగా
ఉండాలి.ఎవరు మాట్లాడే వారు ఉండరు.దాంతో...మహా చెడ్డ చిరాకు!పైగా
పెళ్ళైన కొత్త జంట!పానకంలో పుడక లాగా
వాళ్ళ మధ్య లో నేను వుండే సరికి మోహ
మాట పడిపోతున్నారు!వాళ్ళ ఏకాంతానికి
నేను ఎందుకు భంగం కలిగించాలి,అన్న ఆలోచనతో...తిరిగి వచ్చాను!
రాఘవయ్య:_నీ ముఖం చూస్తే...అలా..అనిపించటం లేదు. నీ మనో స్థితి నీ ముఖంలోనే కనిపిస్తుంది!ఏం జరిగిందో... చెప్ప కూడదా?
సత్యవతి:_అయ్యో...రామ!అలాంటిది ఏమీ లేదు.రాఘవయ్య!
రాఘవయ్య:_మీరు దాచిపెట్టినంతమాత్రాన
దాగిపోతుందా...ఏమి?
సత్యవతి:_మీరు ఎలా...ఊహించుకుంటే...అలానే ఊహించు
కోండి?
రాఘవయ్య:_నలుగురు కొడుకులను కన్నావు.నలుగురు నాలుగు రాజ్యాలయ్యారు!వాళ్ళ చుట్టు మీరు తిరగ
లేక చస్తున్నారు.మీ ఆయన బతికి వుంటే
ఈ బాధలు వుండేవి కావు?
సత్యవతి:_ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు.ఎక్కడ డ్యూటీ వుంటే అక్కడే వుండాలి కదా? వ్యవసాయదారు లైతే,అందరూ... నా చుట్టే వుండేవారు.మా
ఆయన చాలా అదృష్టవంతలు!ముందే
వెళ్లిపోయారు.(కళ్ళ నీళ్ళు పెట్టుకోవటం)
రాఘవయ్య:_మిమ్మల్ని పలకరించి బాధ పెట్టాను.ఎప్పుడు బయలు దేరారో...వెళ్ళి
విశ్రాంతి తీసుకోండి.
                  అంకం:_4.
(సనత్,సంధ్యా చాటింగ్ చేస్తూ వుండటం.)
సంధ్యా:_చూశావా...సనత్!ఫేస్ బుక్ లో
నాకున్న ఫాలోయింగ్!లక్షల్లో లైక్ లు,కామెంట్స్!(చూపించటం.సనత్ చూసి)
సనత్:_ఎంతైనా...నువ్వు అందమైన అమ్మాయి వి కదా!నీకున్న ఫాలోహింగ్ నాకెక్కడ వుంటుంది?హెని వే కంగ్రాజులేషన్స్!
సంధ్యా:_థాంక్స్!ఇప్పటికైనా...ఒప్పుకుంటారా?ఆడవాళ్ళు
ఆరాధ్య దేవత లని!
సనత్:_సరె... సరే...గాని,అమ్మ ఊరు వెళ్ళిన వెంటనే...ఫోన్ కూడా చెయ్య లేదు.
ఆమె కోపం చల్లారి నట్లు లేదు.ఒకసారి
ఫోన్ చేసి పాలక రిస్తాను.
సంధ్యా:_ఎందుకు...బాబు! ఆ నస మళ్లీ నాకు తగిలిస్తావా? ఆవిడేం,చిన్న పిల్ల కాదు
భయ పడి పోవడానికి?
సనత్:_ఎంతైనా... నా కన్న తల్లి కదా?
ఫోన్ చేసి పలకరిస్తే... నీ సొమ్మేం పోతుంది?
సంధ్యా:_నువ్వీ ప్పుడు,అమ్మ పక్కలో..పడుకునే,వయసు వాడివి కాదు?
ఆలి పక్కలో పడుకునే,వయసు వాడివి!
అమ్మ కావాలో...ఆలి కావాలో తేల్చుకో..?
సనత్:_అమ్మ నా పెళ్ళామా?గురి చూసి,మగసిరి మీద భలే దెబ్బ కొట్టావే! సరే
పదా...వయసుల సయ్యాట లాడుకుందాం!
సంధ్యా:_ఓయమ్మో...అంటే ఆగడు.పడుకుంటే లేగడన్నట్లు వుంది అయ్యగారి యవ్వారం!
సనత్:_పడుకున్న వాడిని నిద్ర లేపి, బజ్జో అని జోకొడుతే... నిద్రపోతాడా?పద..పదా!
సంధ్యా:_కోరికలు బుస కొడుతున్నాయని,
కోలాటం వేస్తే... కేర్..కేర్ మని ఇల్లంతా అరుపులు!ఈ వయసులో పిల్లలు వద్దు బాబు? ఇంకొన్నాళ్లు లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి.
సనత్:_ఓసినా...మొద్దు!వయసులో వున్నప్పుడే పిల్లల కన్నామనుకో...త్వరగా
చేతికి అందివస్తారు!వయసు అయిపోయిన
తర్వాత కన్నామానుకో...నువు నేను పుట్టిన
వాళ్లకు తాత అమ్మలుగా మిగిలి పోతాం!
సంధ్యా:_ఇప్పుడు మీరు చేతికి అందివచ్చి ఏం చేస్తున్నారు?ఎప్పుడు ఎవరి జీవితం
ఎలా మలుపు తిరుగుతుందో...ఎవరు చెప్పలేరు?బుద్ధిగా బజ్జో?
సనత్:_నీ భయమంతా...పిల్లలు పుడతారనే కదా?పిల్లలు పుట్ట కుండా మార్గాలు ఉన్నాయి కదా?పద..పదా.
సంధ్యా:_అనవసరంగా...గుర్తు చేశాను.తప్పుతుందా...ఏమి?(బెడ్ రూమ్ లోనికి వెళ్ళటం)
                    అంకం:_5.
(రాఘవయ్య,సత్యవతి ఇంటికి రావడం.)
రాఘవయ్య:_సత్యవతి! ఏం చేస్తున్నావు?
సత్యవతి:_ఏముంది రాఘవయ్య!తిని కూర్చోవట మే కదా మన పని!
రాఘవయ్య:_అది సరె...గాని,పిల్లలు ఫోన్ చేశారా?
సత్యవతి:_వాళ్ళ పనుల్లో వాళ్ళు.తీరిక ఎక్కడ దొరుకు తుంది?
రాఘవయ్య:_ఈ తరం ధ్యాస అంతా డబ్బు చుట్టూ తిరుగు తుంది.మనం ఎక్కడ గుర్తుంటాము?
సత్యవతి:_పోనీలే...వాళ్ళు చల్లగా వుంటే
అంతే చాలు.మన కిక్కడ వుండడానికి ఇల్లు
బతక డా నికి భూమి వున్నది కదా?మట్టిలో
గుప్పెడు గింజలు చల్లితే...ఇంట్లోకి పుట్టెడు
ధాన్యం వస్తుంది.హాయిగా...కాలుమీద కాలు వేసుకొని బతక వచ్చు!
రాఘవయ్య:_నీ అంత గుండె దైర్యం వుంటే
ఏ ఆశ్రమాలు ఎందుకు?నువ్వు బతుకుతూ..నలుగుర్ని బరుకించ గలవు. నీ
ద్యైర్యానికి జోహార్!
సత్యవతి:_కడుపున పుట్టిన వాళ్ళు కాదు?
ఎప్పుడు మన చుట్టు పక్కల వాళ్ళతో...చక్కగా కలసి మెలసి వుంటే...అదే...స్వర్గం రాఘవయ్య!
రాఘవయ్య:_మహా బాగా చెప్పారు. నేను
అలా...పొలానికి వెళ్లి వస్తాను.
సత్యవతి:_అలాగే...రాఘవయ్య!
         జైహింద్.



Friday, 3 January 2020

పెళ్లెందుకు..?


ఫ్లాట్ ఫాం పైన ఎవరో పడిపోయి వున్నారు.ఒంటిపై బట్టలు నల్లగా మాసి,చిరిగిపొయివున్నాయి.గడ్డం,జుట్టు,
బాగాపెరిగి,కాకి గూడులా రేగిపోయివున్నది.
ఒళ్లంతా మురికి పట్టి చాలా అసయ్యంగా
వున్నది.
ఆ దారిన వెళ్ళే వాళ్లంతా,ఆతన్ని చూస్తూ..."ఏదైనా..?వాహనం గుద్దిచావలేదు కదా?"అన్న అనుమానంతో...దగ్గరగా వెళ్ళి చూస్తూ వున్నారు.
అతను ఊపిరి తీస్తువుండగా...పొట్ట పైకి ఉబుకుతూ...కిందికిపోతున్నది."అంటే...
అతను ఏవాహనం గుద్ది చావ లేదన్న మాట? మరెందుకు,ఇలా...ప్లాట్ ఫాంపై పడిపోయాడు.?"అని కొందరు అనుకుంటూ...వున్నారు.
ఇంకొందరు,దగ్గరగా వెళ్ళి చూస్తూ...వుండగా,ఆతని నోట్లో నుండి గుప్పు మని మందు వాసన ముక్కు పుటలు
పగిలి పోయేలా వస్తున్నది.ఆ వాసన భరించలేని వారు దూరంగాజరిగి,"తాగు బోతు నాయాలు!పొద్దున్నే ,పీకల దాకా తాగి
నడవలేక,ప్లాట్ ఫాంపై పడిపోయాడు కాబోలు! చీ... చీ!సిగ్గు లేని బతుకు ఎందుకు బతుకు తున్నాడో..?"తిట్టు కుంటున్నారు.
"అడుగడగునా...మందుదుకాణాలేనాయే!తాగుడుకు అలవాటు పడిన వాళ్ళు పీకల దాకా తాగి,రోడ్ మీదపడకుండా...ఎలా?ఉంటారు?"
ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం సూపర్ మార్కెట్లు,కిరాణా షాపుల్లోమందుఅమ్మించాలనిఅనుకుంటుందిగా,ఇక...మత్తుగా...తాగి,
అక్కడేపడుకేస్తారుకాబోలు!"ముక్కులమీదవేళ్ళువేసుకుంటున్నారు.
"ఇంకేం..?మూడు సీసాలు,ఆరు బాటిల్లై పొంగుతుంది మందు!"అని మరికొందరు పెదవి విరిచారు.
"తాగి అతను లోకం తెలియని స్థితిలో జోగుతుంటే...అతని గురించి ఆలోచిస్తూ...ఇక్కడే నిలబడి పోతే...
మన పనులకు వేళ దాటి పోతుంది.పదండి...పదండి"అని కొందరు
అనగానే...అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్న వారు,ఎవరి దారిన వాళ్ళు వెళ్లి పోయారు.
పదహారేళ్ళ పవిత్ర అదే దారిలో...స్కూటీ మీద వస్తూ...ప్లాట్ ఫాంపైన పడుకున్న అతన్ని చూసింది.వెంటనే...
స్కూటీ ఆపి ,దిగి ఆతని దగ్గరగా...వెళ్ళి చూసింది.తను, అతన్నిఎక్కడో...చూసినట్లు
గుర్తుకు వచ్చింది."ఎక్కడ చూసానాబ్బా!"
ఆలోచించ సాగింది.వెంటనే...తన హ్యాండ్ బాగు తీసి అందులో వున్న పర్స్ తీసి అందులో వున్న ఫోటో తీసి చూసింది.ఆ ఫోటో లో వున్న వ్యక్తి,అక్కడ పడుకొని వున్న
వ్యక్తి ఒకేలా వున్నారు.పవిత్ర వెంటనే...అటుగా వెళ్తున్న ఆటోను ఆపి అతని సహాయంతో,అతన్ని లేపుకొని, ఆటోలోఎక్కించి,"నావెనకాలే...రా!"అంటు,తను స్కూటీ మీద ముందు బయలు దేరింది.ఆటో డ్రైవర్ కూడా ఆమె వెనకాలే
బయలు దేరాడు.
***
మధురా నగర్ కాలనీ.తన ఇంటి ముందు స్కూటీ ఆపి దిగింది పవిత్ర. ఆటో డ్రైవర్ కూడా ఆమె వెనకాలే వచ్చి ఆటో ఆపి,దిగాడు.పవిత్ర డ్రైవర్ సహాయంతో...
అతన్ని దింపి లోనికి తీసుకు పోయింది.అతనికి ఏమాత్రం మెళకువ రాలేదు.మత్తులోనే వున్నాడు.అతన్ని హాల్లో వున్న సోఫా పై పడుకో బెట్టింది. ఆటో డ్రైవరుకు డబ్బులు ఇచ్చి,"నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు!"నమస్కరించింది.
ఆటో డ్రైవర్ డబ్బులు అందుకుంటూ..."ఇలాంటి కేసులు మామూలే...మేడమ్!ఐనా..? ఆ తాగేదేదో...ఇంట్లోనే...ఏర్పాటు చేయం డి.లేనిచో...తాగి తూలుతూ... ఏ వాహనం కింద నైనా..?పడిపోతే...చాలా కష్టం.వస్తాను."తను వెళ్ళి పోయాడు.
పవిత్ర తను వెళ్ల వలసిన పనిని వాయిదా వేసుకుంది.బాత్ రూమ్ లోనికి వెళ్లి బకెట్లో నీళ్ళు తెచ్చి , ఈటర్ పెట్టి, ఆన్ చేసింది.వంటింట్లోకి వెళ్ళి భోజనం
వండు తుంది.
"దాహం...దాహం!"సోఫా మీద పడుకున్న అతను అరుస్తున్నాడు.అతని అరుపులు విన్న పవిత్ర మంచి నీళ్ళ బాటిల్
పట్టుకొని వచ్చి,"ఇదిగో...మంచి నీళ్ళు. లేచి
తాగండి "అతనికి అందించింది.
అతను లేవలేక,అలానే...నోరు తెరిచాడు.పవిత్ర అతని మెడ కింద ఎడమ
చెయ్యి వేసి,కాస్త పైకి లేపి,కుడి చేత్తో బాటిల్
నోట్లో పెట్టి మెల్లగా ... తాగిస్తుంది.అతను కడుపు నిండా నీళ్లు తాగి",బ్రేవ్"మని తిరిగి
పడుకొని పోయాడు.
"మీరిప్పుడు పడుకోకూడదు.లేవండి.స్నానం చేసి భోజనం చేసి పడుకుందురు."
"నా వల్ల కాదు?దయచేసి నన్ను పడుకోనివ్వు"
"అదేం...కుదరదు?ఒళ్లంతా నీచు కంపు కొడుతోంది.లేచి స్నానం చెయ్యి.నీళ్ళు కూడా మరిగి పోతున్నాయి. పదా?"అని గట్టిగా చెప్పే సరికి అతను ఏమి మాట్లాడ కుండా పైకి లేచి నిలబడ లేక ,తూలి పడిపోయాడు.పవిత్ర అతన్ని గట్టిగా పట్టుకుని,నెమ్మదిగా లేపి,బాత్ రూమ్ లోనికి
తీసుకుపోయింది.స్టూల్ పైన కూర్చో బెట్టి,తలకు షాంపుతో రుద్దికడిగింది.ఒళ్లంతా సబ్బుతో రుద్ది ,శుభ్రంగా స్నానం చేయించి,"ఇదిగో... నేను బయిటికి వెళుతున్నాను. ఆ ప్యాంట్ ఇడ్చి శుభ్రంగా కడుక్కోవాలి!తెలిసిందా?"
ఆతను"ఆ... ఆ...!"తల ఊపాడు.
పవిత్ర బయిటికి వచ్చి తలుపు దగ్గరకు
వేసి వంటింట్లోకి వెళ్ళింది.
ఆతను స్నానం చేసి టవల్ కట్టుకొని
బయిటికి వచ్చాడు.
పవిత్ర ఒక లుంగీ,టీషర్ట్ తెచ్చి అతనికి ఇచ్చింది.అతనుఅవి తీసుకొని,కట్టుకున్నాడు.
"రా...రా!భోజనం వడ్డిస్తాను."
"అలాగే"వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు.
పవిత్ర అతనికి భోజనం వడ్డించింది.అతను కలుపుకొని,తింటున్నాడు."ఏ కన్న తల్లి బిడ్డవో..! తాగి రోడ్ మీద పడితే...తీసుకొని వచ్చి శుభ్రంగా...తల స్నానం చేయించి,కట్టు
కోవడానికి బట్టలు ఇచ్చి,కడుపు నిండా కమ్మని భోజనం వడ్డించావు. పది కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి!"రెండు చేతులు
పైకి లేపి దండం పెట్టాడు.అప్పుడు అతని కళ్ళల్లో నీళ్ళు జల,జల రాలి పడిపోతున్నాయి.
"పెద్ద వాళ్ళు చిన్న వాళ్లకు దండం పెట్ట
కూడదు.ఊరుకోండి.అన్నం తింటూ... ఏ డవ కూడదు."
"అలాగే తల్లి!"కళ్ళు ఎడమ చేతితో
తుడ్చుకొని,కడుపు నిండా తిని,చెయ్యి కడుక్కొని ,వచ్చి సోపాపై కూర్చున్నాడు.
అతని చూపులు ఎదురుగా... వున్న గోడపై,
దండ వేసి వేళ్ళాడుతున్న ఫోటో పై పడిపోయాయి."ఈపోటోలో వున్న ఆవిడను ఎక్కడో... చూసినట్లు వున్నది.ఎక్కడబ్బా?"అని గుర్తు చేసుకో సాగాడు.
***
సుశీల!సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది.ఆమెకు అదే కంపెనీలో,మోహనతో
పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది! ఆ స్నేహం ప్రేమగా మొగ్గ తొడిగింది!దాంతో...ఇద్దరు ఒకర్నొకరు
చూడకుండా వుండలేక పోయారు.సమయం
చిక్కిన ప్పుడల్లా సినిమాలు,షికార్లు, షాపింగ్,పబ్బులంటు..కాలం గడుపుతూ...ఎంజాయ్ చేస్తూ...వున్నారు.
"మోహన్!ఇలా...ఎంత కాలం దొంగ చాటుగా...ప్రేమ పేరుతో కలిసి తిరుగు తాం?ఎవరైనా...చూస్తే ఏమనుకుంటారు?
మన ఇంట్లో వాళ్ళకి మన ప్రేమ విషయం
చెప్పి వాళ్ళను ఒప్పించి,వాళ్ళ సంక్షంలో
పెళ్లి చేసుకొని,హాయిగా...కాపురం చేసుకుందాం!జీవితాన్ని హాయిగా..ఎంజాయ్ చేద్దాం!ఏమంటావు?"
పెళ్లి ప్రస్తావన ముందుకు తెచ్చింది.
"పెళ్ళా..!పెళ్లెందుకు?నువ్వింకా...
పాత తరం లోనే వున్నావు సుశీ!ఈ తరం
సహజీవన సంస్కృతి!మనం కూడా సహజీవనం చేద్దాం!జీవితం హాయిగా...వుంటుంది.ఎవరి ఈ రష్యా ద్వేషాలకు ఇబ్బంది రాదు?ఇద్దరం హాయిగా
ఎంజాయ్ చేద్దాం!సరేనా?"తన మనసులో
మాట ఆమె ముందు పెట్టాడు.
"మోహన్!సహజీవనం అనేది,వేశ్యా
ప్రవృత్తి లాంటిది.పెళ్లి అనేది,గౌరవ ప్రదమైన
జీవన యానం!ఇద్దరి మధ్య కుదుర్చుకునే
ఒప్పందం!కష్ట సుఖాలు కలిసి పంచుకునే
అనుబంధం!సహజీవన మనే మాట మర్చిపోయి,మన పెళ్ళి గురించి ఆలోచించు?"
"పెళ్లి..పెళ్లి...పెళ్లి?అది కోరి తెచ్చుకొనే జీవిత ఖైది! నేను ఆ జైలు జీవితం గడపలేను సుశీ! నా మాటవిను.
సుశీ! సహజీవనమే మనకు శ్రేయస్కరం!
ఎవరి స్వేచ్ఛను సారం వాళ్ళు హాయిగా..
జీవించ వచ్చు!ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించే,కట్టు దిట్టమైన కట్టు బాట్లు
వుండవు! ఐన దానికి,కాని దానికి చీటికి ,మాటికి గొడవలు పడే వీలుండదు సుశీ!"
తిరిగి అదే చెప్పాడు.
"సరే...మోహన్!పశు సంస్కృతి సహజీవనమే,మేలు అని నువ్వు భావిస్తే
అది చక్కగా కలకాలం సాగుతుందని,నువ్వు
హామీ ఇవ్వగలవా?పుట్ట బోయే పిల్లల భవిష్యత్ కు ఎవరు బాధ్యత వహించాలో
నువ్వు చెప్ప గలవా?"ఆవేశంగా అడిగింది.
"అదిగో...నువ్వు మళ్ళీ మొదటికే వచ్చావు?అక్కడికి , నేను చెబుతూనే...వున్నాను. ఒప్పందాలని, బాధ్య తలని,ఎలా?పైచేయి సాధించటానికి
చూస్తున్నావో... చూడు?సుశీ!స్వెచ్చామయ
జీవితం గురించి ఆలోచించు?"తిరిగి అదే...
వాదన.
"మోహన్!రెండు జీవితాలు కలిసి సాగాలంటే,కట్టు దిట్టమైన నమ్మకం ఉండాలి కదా?ఒకరిపై ఒకరికి నమ్మకం లేనప్పుడు, అది సహజీవన మైనా?పెళ్లి ఐనా!వ్యర్థమే కదా?నన్ను విడిచి నువ్వు
నిన్ను విడిచి నేను ఎలా...?జీవనం సాగించ
గలం?అలా...ఐతే..?జంతువులకు,మనకు
తేడా...ఏముంది? అలాంటి జీవితం మనకు
అవసరమా?ఒక సారి ఆలోచించు మోహన్?"తిరిగి వివరంగా చెప్పింది.
"సుశీ!నీ వాదన నీదే... కాని, నా మాట
వినిపించు కునేలా లేవు?ఇలా...ఐతే...మనం కలిసి సాగటం చాలా కష్టం?ఇక... ఎవరి దారి వాళ్ళు చూసు కోవటం మంచిది."నిర్మొహమాటం లేకుండా చెప్పాడు.
"మోహన్! నా కిప్పుడు, మూడో నెల!మనం పెళ్లి చేసుకుంటున్నాము అనే నమ్మకంతో...కలిసి సుఖం పంచు కున్నాం!
ఇప్పుడు, ఎవరి దారివారిదే...అంటే,ఎలా?"
కళ్ళల్లో నీళ్ళు తిరుగు తుండగా...అసలు
విషయం చెప్పింది.
"సుశీ! నేను నిన్ను కాదనటం లేదు.సహజీవనం చెద్దామంటున్నాను.దానికి నువ్వు ఒప్పుకోవటం లేదు. నేను ఏం చేయాలి?"
"పెళ్లి చేసుకోవాలి"
"అది మాత్రం కుదురదు?"
"కడుపు వచ్చిన తరవాత కాదంటే...
ఎలా?"
"తాపం ఆపుకోలేక,ఇద్దరం కలిసి
కాలు జారాం!నీకు ఇష్టం లేక పోతే,ఎబార్షన్
చేయించుకో? నేను కాదనను?పెళ్లి మాత్రం
చేసుకో...అని అడిగకు? సహజీవానికి నేను
ఎప్పుడు సిద్ధమే!"
"ఓ... హొ...అలాగా...మోహన్?ఈ కడుపుకు కారణ మైన నిన్ను చట్ట పరంగా
శిక్షించి ,నిన్ను పెళ్లి చేసుకో వచ్చు.కాని,నువ్వనట్టు ఇందులో నా తప్పుకూడా వుంది.కాబట్టి,నిన్ను ఏమిచేయకుండా,వదిలి పెడుతున్నాను.
పెళ్లి అనేది ఎందుకో...నీకు జీవితంలో
తెలిసి వచ్చేలా చేస్తాను.చూడు!"అని అతన్నిహెచ్చరించి,కోపంగా...వెళ్ళి పోయింది.
ఏమాత్రం కూడా బాధ్యత,బాధ లేని
మోహన్ అక్కడ నుండి వెళ్ళి పోయాడు.
***

గోడ మీద వెలాడు తున్న ఫోటో నుచూస్తూ...ఆమెను గుర్తు చేసుకున్న అతను,ఆవిడ గుర్తుకు రాగానే...ఈ లోకం
వచ్చిన అతను, ఇమే...సుశీల!అవును...
సుశీ!ఆమెకు ఏమైంది. ఆ ఫోటో ఇక్కడెందుకు వున్నది?అన్న సందేహం వచ్చి,"ఏం తల్లి!ఈ ఫోటోలో ఉన్న ఆవిడ
పేరు సుశీల కదు?"పవిత్రను అడిగాడు.
"అవును"తల ఊపింది.
"ఆవిడ ఎలా...చనిపోయింది. తల్లీ?"
"యాక్షిడెంట్ లో..."
"అలాగా...!ఆవిడ నీకు ఏమవుతుంది. తల్లీ!"ఎడమ చేత్తో కళ్ళ నీళ్లు
తుడ్చుకున్నాడు.
"ఆమె నా కన్న తల్లీ!"ఉద్వేగానికి లోనైన పవిత్ర ఎడవ సాగింది.
" నన్ను క్షమిచు తల్లీ! నేను మహా పాపిని!మీ అమ్మకు ద్రోహం చేసిన మనిషిని
నేనే? నా పేరు మోహన్ తల్లీ!"తను కూడా
వెక్కి వెక్కి ఎడవ సాగాడు.వంగి పవిత్ర కాళ్ళ మీద పడి పోయాడు.
"మీరు... నా కన్న తండ్రి.కాబట్టే...రోడ్ మీద పడి పోయిన నిన్ను గుర్తు పట్టి ఇంటికి తీసుకొని వచ్చాను.
లేవండి...లేవండి"పైకి లేపి,కూర్చో బెట్టింది.
"చూడు నాన్నా!మీరు మీ తప్పు తెలుకున్నారు పశ్చ త్తాపంతో,కుమిలి పోతూ...వున్నారు.అదేచాలు.మా అమ్మ కోరిక ఎలా...? నెరవేరుతుందని,చాలా బాధ
పడుపోయేదాన్ని .ఇన్నాళ్లకు మా అమ్మ కోరిక నెర వెరినందులకు చాలా సంతోషంగా
ఉన్నది.మీరు ఆడదానిలా ఎందుకు ఏడుస్తున్నారు?ఊరుకోండి."అతన్ని ఓదార్చింది.
మోహన్ ఏడుపు మాని దోషిలా సిగ్గుతో.... పవిత్రముందు మౌనంగా...నిలబడి పోయాడు.
అతని పరిస్థితిని గమనించిన పవిత్ర
"చూడు నాన్నా!మనిషి తప్పు చేయటం సహజము!కాని, ఆ తప్పును సరిదిద్దుకున్న
ప్పుడే ఉత్తమ వ్యక్తి కాగలడు. ఆలాంటి మనిషి,ముందు తరాలకు మార్గదర్శిగా...మిగిలి పోతాడు.మీరు ప్రేమ
పేరుతో....మోసం చేశారని అమ్మ ,ఎప్పుడు బాధ పడిపోలేదు నేనెందుకు మోహవేశంలోపడి పొయి,అతనితో...సంగమించాను. ఆ ఫలితమే ఈగర్భం కదా?తప్పు నాది కూడా
వుంది కాబట్టి తలదించు కున్నాను.చేసిన తప్పును సరి దిద్దుకుని,తల ఎత్తు కొని నలుగురిలో గౌరవంగా...బతకాలి!అనే...పట్టు దలతో... తల్లీ దండ్రులు,బంధువులు,ఇరుగు,పొరుగు వారు
నువ్వు ఎబార్షన్ చేయించుకో...అన్నా...మరో, పెళ్లి చేసుకో...ఎంతో,ఒత్తిడి తెచ్చినా...కాకుల్లా పొడుచుకు తిన్నా...స్త్రీ అనుభవం అనేది ఒకరుతోనే పంచుకోవాలి!
నలుగురితో...పంచుకుంటే,అది ఉత్తమ వ్యక్తిత్వం ఎలా..?అవుతుంది? తెలిసో,తెలియకో...తప్పు చేశాను . ఆ ఫలితం నేనే... అనుభవిస్తాను.అని,మరో పెళ్లి మాట ఎత్తకుండా... అమ్మ ,నన్ను కని,పెంచి,విద్యాబుద్ధులు నేర్పించి,నన్ను ప్రయెజకు రాలిగా తీర్చిది ద్దింది.నలుగురిలో...గౌరవంగా...తల ఎత్తు కొని బతికింది.కాని, ఆమె ఎప్పుడూ...మీగురుంచే ఆలోచిస్తూ...అతనికి పెళ్లెందుకు?అనే మాట
గుర్తు వచ్చేలా చేయాలని,తపిస్తూ...వుండేది. ఆ ఆలోచనే
ఆవిడ మనసులో అలజడి రేపుతూ...కుదురుగా...వుండనిచ్చేది కాదు?ప్రతి పని ఆవిడే చేస్తూ...వుండేది.నన్ను ఏపని చేయనిచ్చేది కాదు.
ఓరోజు పొద్దున్నే... మార్కెట్ కి వెళ్ళింది.మీ ధ్యాసలో పడి రోడ్ దాటుతూ...వుండగా...లారీ వచ్చి కుద్దేసింది. అంతే ఎగిరి దూరంగా పడి పోయిందట.తలకు బలమైన గాయం అయిన కారణంగా...రక్త స్రావం జరు గు తుండ గానే,అక్కడ వున్న వాళ్ళు అమ్మను హాస్పటల్లో చేర్చారు. ఆవిషం తెలియగానే,నేను పరుగె త్తుకోని,వెళ్లే సరికి ,అమ్మ చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతూ వుంది. నేను బోరుమని ఎడవగానే,
ఎడవకు తల్లి.నేను ఎలాగూ...బతకలేను.కాని, నా
చివరి కోరిక తీరకుండానే,వెళ్లి పోవడం,నాకుచాలా బాధగా వుంది.అని బోరుమని ,ఎడవసాగింది. నువ్వు ఎడవకమ్మ.నిన్ను బతికించుకుంటాను.అని,ధైర్యం చెప్పాను. "నేను
బతక లేను తల్లి.కాని,నువ్వు నాకు ఒక సహాయం
చెయ్యాలి తల్లి.ఇదిగో...అంటూ తన పరుసులో వున్న ఒక ఫోటో తీసి, నా చేతిలో పెడుతూ...ఇతనే తల్లి మీ నాన్న! ఆయన ఎక్కడ,ఎప్పుడు కనిపించిన ,ఆతనికి పెళ్లెందుకో...
గుర్తు వచ్చేలా చెయ్యాలి!అతను చేసిన తప్పుకు
సిగ్గుతో తల దించుకునే లా చెయ్యాలి?అప్పుడే నా ఆత్మ శాంతి స్తుంది. నా చావు గురించి ఎలాంటి పోలీస్ కేసులు పెట్టకు తల్లి".అంటూ... ఈ లోకం విడిచివెళ్ళింది.
"ఆమె లేని లోటు ఒక ప్రక్క నన్ను బాధించు
తున్నా... అమ్మ అనుభవమే నాకు కొండంత
ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతో నేను ఉద్యోగం సంపాదించుకొని, నా కాళ్ళ మీద నేను నిలబడ గలిగాను.మీకు కూతురిగా...పుట్టినందుకు, నా బాధ్యతను, విధి ధర్మాన్ని నిర్వహించాను.ఇప్పుడు మా
అమ్మ ఆత్మ ఎంతో సంతోషిస్తుంది."
కళ్ళ నుండి ఆనంద భాష్పాలు జల జల రాలగా విన్న వించింది.
"చూడు... తల్లీ! పెళ్లెందుకో...? నాకు ఇప్పుడు అర్థమైంది! ఏ బంధం లేక,కన్న పిల్లలు లేకపోతే...మనిషి బతుకు వీధి కుక్క లాగే...వుంటుంది! నా కళ్ళు తెరిపించి,నన్ను
మనిషిని చేశావు.నువ్వు నా లాంటి వాడికి ఆదర్శంగానిలిచావు." పవిత్రను ఆలింగనం చేసుకుని, ఆమె తల ఆప్యాయంగా...నిముర సాగాడు. జైహింద్.
ఆకుల.రాఘవ..


Thursday, 2 January 2020

దోమలు..!


దోమలు..!
*********
చంప లేరు దోమల?
మనల చంపుతుండెను!

దోమ కాటు వలన ఎన్నెన్నో రోగాలు!
ప్రాణాంతక వ్యాధులోచ్చి
జగతి ప్రజలు చస్తుండెను!
మందు లెన్నో కని పెడుతూ
దోమలపై చల్లుతున్నా?
మరణించక దోమలు
లక్షల్లో పుడుతుండెను!

ప్రకృతిలో ప్రాణులెన్నో
కను మరుగై పోతున్నా?
చిరంజీవులై దోమలు
మనల పీక్కు తింటున్నవి
కాలుష్యమే కారణము
అపరి శుభ్రతే మూలము
కళ్ళు తెరచి శుభ్రమైతే
కొంతైనా మేలులే!
జైహింద్.
ఆకుల.రాఘవ.