అత్తగారు... కొత్త కోడలు..!
**********************
రచన:_ఆకుల.శరనిధి.
అంకం:_1.
ఇందులో వచ్చు పాత్రలు.
1.సత్యవతి .4.లక్ష్మీ.
2.సనత్. 5.రాఘవయ్య.
3.సంధ్యా.
అంకం:_1.
*********
(సనత్,సంధ్యా ఫోన్స్ తో చాటింగ్ చేస్తూ వుండటం.సత్యవతి రావటం .వాళ్ళను చూసి)
సత్యవతి:_అబ్బబ్బా..!ఇందాక,టీవీ సీరియల్స్ తో,ఏడుపులు,పెడబొబ్బలు!ఇప్పుడు, ఫోన్లతో చాటుంగులు!రాత్రి ఒంటి గంట అవుతుంది. ఎప్పుడు భోంచేస్తారు?ఎప్పుడు నిద్ర పోతారు?లేచి భోంచేసి నిద్ర పోండిరా?
సనత్:_ఆకలిగా లేదమ్మా?నిద్రకూడా రావటం లేదు. నువ్వెళ్లి పడుకో అమ్మా?
సత్యవతి:_మనుషులఅలవాట్లు,మారిపోయి,దయ్యాలఅలవాట్లు,అలవర్చుకు
న్నారు.ఏం తరమో?ఏం సాంకేతిక విప్లవ మో?అర్థం
కావటం లేదు?ఎప్పుడు మనుషులుగా మారుతారో...ఏమో?!
సంధ్యా:_అత్తగారికి,ఎప్పుడు, ఏదో...ఒక దెప్పి పొడుపు లేందే...నిద్ర రాదు కాబోలు!
సత్యవతి:_నేను నిజాలు మాట్లాడితే...నీకు
నిష్టూరంగా వుందామ్మా?!
సనత్:_ఎందుకమ్మా... అయినదానికి,కాని దానికి పెడర్తాలు తీసి మాట్లాడుతావూ?
నీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకో రాదు?
సత్యవతి:_నేను ఏం పెడర్తాలు తీసి మాట్లాడుతున్నాను!సమయానికి భోంచేసి,
నిద్ర పొండి అంటున్నాను. అది తప్పా?మీరు నిద్ర పోరు. నన్ను నిద్ర పోనివ్వురు.ఎలా...ఏడ్చేది?!
సంధ్యా:_మేము...దయ్యాలుగా మారిపోయి
నిన్ను పీక్కు తింటున్నాముగా..!
సత్యవతి:_అయ్యో...కోడలా! నేను చెప్పేది
ఒకటి?నువ్వుఅర్థం చేసుకుంది మరొక్కటి?
సనత్:_ఇందాక...నువ్వే కదమ్మా,దయ్యాల
అలవాట్లు వచ్చాయని?
సత్యవతి:_ఓ... అదా! మనుషు లైతే...ఎంత పనిలో వున్నా...సమయానికి భోంచేసి,నిద్ర పోతారు.పన్నెండు గంటలుదాటితే...ఎవ్వరు భోంచేయరు?పన్నెండు గంటలు దాటితే...అది దయ్యాలు, భూతాలు తినే సమయం !అది మీకు తెలిసి చస్తే కదా?
సంధ్యా:_ఓయమ్మో..!అత్తగారు...భలే నీతి
సూత్రము కని పెట్టిందండి!
సత్యవతి:_ఇది నేను కని పెట్టినది కాదమ్మా?మన పూర్వీకులు చెప్పిందే?!
మనుషులు పొద్దంతా...పని పాటు చేసి,సమయానికి,భోంచేసి నిద్ర పోతారు.దయ్యాలు,పొద్దంతా...నిదురపోయి
రాత్రంతా...తిరుగుతూ ... వాటికి దొరికింది
తింటాయి.మనుషులకు, దయ్యాలకు వున్న
తేడా అదే...నమ్మా?!మనుషుల అలవాట్లు
మారి పోయాయి కాబట్టే...తనువులు రోగాల పుట్టలుగా మారి పోతున్నాయి!
సంధ్యా:_గుడ్డి దీపం...కాలంలో గడిపిన మీకు,వైజ్ఞానిక క్రాంతిలో కాలం గడిపే మమ్ముల్ని చూస్తే...కడుపు మంట!అందుకే...ఏదో...ఒకవంకతో..దెప్పిపొడస్తూకథలు చెపుతుంటావు?ఇది మీ కాలం కాదు?కంప్యూటరుకాలం!భూమ్మీదనే...కాదు?
గ్రహాల మీద కాపురాలు వుండే కాలం!
ఎప్పుడు,ఎలా... మారాలో.. మాకు తెలుసు
లేండి.
సత్యవతి:_గుడ్డి దీపం కాలంలో వేసిన పునాదులపైన నేకదమ్మా?మీకాలం వెలుగులో తిరుగాడుతుంది!మూలాలను మరిచి మిడిసి పడే వాళ్లకు నేనేం చెప్పినా..?
తప్పుగానే తోస్తుంది! నా సొమ్మేం పోతుంది?
రెండు గంటలకే తిని!పొద్దున పద కొండు గంటల వరకు పడుకోండి!(కోపంగా లోపలికి వెళ్ళి పోవటం)
సంధ్యా:_చూశారా ..!మీ అమ్మగారు,ఎలా..?
మాట్లాడి వెళ్ళి పోతున్నారో..?
సనత్:_చూడు...సంధ్యా!మా అమ్మ కష్టాల
కాయల్ని తిని కాపురాన్ని నెట్టు కొచ్చింది!
ఈ జనరేషన్ గురించి ఆవిడకేం తెలుసు?ఆవిడ చెప్పేది,ఈ చెవిన విని, ఆచెవిన వదిలి పెట్టాలి! అంతే..?
సంధ్యా:_అరె...ఆవిడ కాలంలో...కష్ట పడి నట్లు మన మెందుకు కష్ట పడాలి?ప్రతి పనికి
యంత్రాలు వున్నాయి కదా?ఆమాత్రం ఆవిడకు తెలియదా?ఎప్పుడు,ఏదో...నస పెడుతూ...విసిగిస్తుంది?మనం హాయిగా,జాలిగా, గడుపుతుంటే...ఓర్వలేక
పోతున్నది.ఇలా... అయితే... నావళ్ళకాదు
బాబు?
సనత్:_అబ్బా...ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే...హ్యాపీగా ఉండలేం సంధ్యా!
అవిషయంవదిలెయ్ ?
సంధ్యా:_అరె...లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి,
ఎన్నో చదువులు చదివి,ఉద్యోగం చేసే మనల్నే...అలా...అంటే,కోపం రాదా?
సనత్:_కష్ట పడి పకి వచ్చిన వాళ్లకు అదే...ధ్యాస వుంటది?తమ లాగే...కష్ట పడి బతకాలి.అన్న తపన వుంటది.సరే...టైం రెండు గంటలు అవుతుంది.వెళ్ళి భోంచెద్దాం
పదా?(ఇద్దరు లేచి వెళ్ళటం)
అంకం:_2.
(లక్ష్మీ సత్యవతి వద్దకు రావటం)
లక్ష్మీ:_సత్యవతి గారు!సత్యవతి గారు!
సత్యవతి:_రా... లక్ష్మీ!రా... నేను వంటింట్లో
వున్నాను.రా...రా!
లక్ష్మీ:_అలాగే... నండి వస్తున్నాను.(లోపలికి
వెళ్ళటం)
లక్ష్మీ:_ఇంకా ...వంటల పని కాలేదాండి?
సత్యవతి:_ఇదో...ఇప్పుడిప్పుడే,అవుతున్నాయి! నేను మిక్సిలు, గ్రైండర్లు వాడను లక్ష్మీ!
రొట్లోనే,దంచుతూ...నూరుతూ వండుతాను.దాని వలనే...కాస్త ఆలస్యం
అవుతుంది.
లక్ష్మీ:_మిషన్స్ వుండగా ,కష్ట పడటం ఎందుకండీ?
సత్యవతి:_మిషిన్స్ లో ఏది నూరినా రుచి రాదు.రోలు అయితేనే....ఘుమ,ఘుమ లాడుతూ... ఎంతో రుచి వస్తుంది!రుచిగా
వుంటేనే కదా?కడుపు నిండా తిండి తినేది!
లక్ష్మీ:_మీరు చెప్పింది నిజమే!కాని,మా కోడలు ఎప్పుడు రోలులో నూర నివ్వదు.దంచ నివ్వదు.నలుగురు చూస్తే...
నవ్వుతారు!మా పరువు తియ్యకు?అని చెప్పగానే...ఆవిడకు భయపడి మిషన్స్ మీదనే నూరుతున్నాను.
సత్యవతి:_నలుగురు నవ్వుతారని,మన ఆరోగ్యం పాడుచేసు కుంటామా?ఇదిగో...
కాఫీ తీసుకో లక్ష్మీ!(కాఫీ ఇవ్వటం.లక్ష్మీ అందుకోవటం.)
లక్ష్మీ:_టైం పదకొండు గంటల వుతుంది.కోడలు నిద్ర లేచి నట్లు లేదు?
సత్యవతి:_ఆవిడకేం...మహారాణి!దాసి దానిలా నేను చెయ్యటానికి వున్నాను కదా?
లక్ష్మీ:_కొత్త కోడలు!కొత్త కాపురం!అచ్చట్లు,ముచ్చట్లు,సరసాలు!రాత్రంతా...నిద్ర ఉండదు కదా?ఈ వయసులో...కాక పోతే,పిల్లలు కలిగిన తరువాత ఆసుఖం అనుభవిస్తారా? అనుభవించ నివ్వండి!
సత్యవతి:_అయ్యో...లక్ష్మీ! ఆ సంబరం కూడానా?
లక్ష్మీ:_భార్య,భర్త లిద్దరూ గొడవేమైనా... పడిపోయారా?
సత్యవతి:_అదేం...లేదు.ఇద్దరు ఉద్యోగాలు
చేస్తున్నారు కదా?ఒకరు రాత్రి పూట డ్యూటీ చేస్తే...మరొకరు పగటి పూట డ్యూటీ చేస్తున్నారు.ఇంటికి వచ్చారా... టీవీల
ముందు.ఆతరువాత,ఫోన్లు పట్టు కొని చాటింగులు.సమయానికి తిండి లేక,నిద్ర లేక,దాంపత్య సుఖం అమావాస్యకు ఒకసారి, పున్నానికి ఒకసారి అనట్లు వుంది.
నేను ఏమైనా...చెబితే,నన్నే చివాట్లు పెడుతున్నారు.
లక్ష్మీ:_నాకొడుకు, కొడలుది అదే... పరిస్థితి!
ఏదేవుడు కరుణించాడో...?కాని,ఇద్దరు పిల్లలు కలిగినారు.ఐనా...? ఏం లాభం?చిన్న పిల్లల నిద్దర్ని హాస్టల్లో వేశారు.ఒక్కదాన్ని బిక్కు,బిక్కు మంటూ...
ఏకాల క్షేపం లేక ఒంటరిగా...చస్తున్నాను.
ఏదో...మీరు ఉన్నారు కాబట్టి కాస్త మన శాంతి దొరుకు తుంది!మన కాలంలో ఇలా...
చేశామా సత్యవతి గారు!
సత్యవతి:_మూడేండ్ల పిల్ల ముంత కాసరానట్లు,మన తల్లి దండ్రులు చిన్నప్పుడే
పెళ్ళి చేసి అత్త వారింటికి పంపిస్తే... ఆ ఉమ్మడి కుటుంబం లో,అందరి నోళ్ళల్లో
నాలుకలా...మెదులుతూ... ఇంటేడు చాకిరి
చేస్తూ...పొలం పనులు చేస్తూ... తూమెడు
వడ్లు దంచి, తూమెడు జొన్నలు విసిరి వండి
వార్చే వాళ్ళం! ముందునోల్లకు తిండి దొరికితే... వెనకవాళ్ళకు తిండే దొరికేది కాదు?ఉన్న నాడు తిని,లేని నాడు నీళ్ళు తాగి బతికాం! పది మంది నుండి ఇరవై మంది దాకా పిల్లలను కనిపెంచి, పెద్ద చేసేవాళ్ళం!ఆనాడు ఆపరేషన్స్ ఉన్నాయా?
అన్ని నార్మల్ డెలివరీలే కదా?మన లాగా
మన పిల్లలు మొద్దు కష్టం పడకూడదని,
చక్కగా చదివించి ఉద్యోగం వచ్చేలా చేస్తే,
ఏసి గదుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని,
పని చేయలేక పోతున్నారు.మన అలవాట్లు
ఎప్పుడో...మార్చి పోయారు.అన్ని దయ్యాల
అలవాట్లకు మారి పోయారు!ఏం తరమో?
ఏం బతుకులో?అర్థం కావటం లేదు లక్ష్మి?
లక్ష్మి:_చదివిస్తే,వున్న మతి పోతుంది అంటారు!అది ఇదే...కాబోలు!మనం ఏం
చేయగలం లేండి?
సత్యవతి:_కొడుకులు చేతి కందారు.హాయిగా...సుఖ పడి పోవచ్చు అని
తలిస్తే...వాళ్ళ పద్ధతులు ఇలా...ఏడ్చి చచ్చే!
ఇంకా ఎన్నాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకోవాలో...?
లక్ష్మీ:_మన తనువు వున్నంత వరకు ఈ కష్టం తప్పదు లేండి?
సంధ్యా:_(లేచి అక్కడికి రావటం) ఆంటీ!
ఇంకా...వంటల పని కాలేదా?
సత్యవతి:_ఇదో...అయిపోతున్నాయి.మీరు
వెళ్ళి తయారై రండి.
సంధ్యా:_పనులు పక్కన పెట్టి,లక్ష్మితో...
సోది పెడితే...ఎలా?పనులు అవుతాయి!
సత్యవతి:_మీరు తయారు అయి రండి. నా
పని ఎంత సేపు?
సంధ్యా:_మన ఇంట్లో...మిక్సీలు, గ్రైండరులు వున్నాయి కదా?రోట్లో...దంచుడు నూరుల్లేంది?పైగా...పక్కింటి ఆంటీ ముందు నీ పాత కాలపు అలవాట్లతో...మా పరువు తీస్తున్నావు?
సత్యవతి:_దంచుడు, నూరుడు నాకేం కష్టం
కాదమ్మా? నా పుట్టుకతో...అలవాటైన పనులే!
సంధ్యా:_వేలు వేలు పెట్టి కొన్న ఆ మిషన్స్ ఏం చేయాలి?అవి వాడకుండా వుంటే పాడై
పోవా? నీ లేకి బుద్దులతో చస్తున్నాను.ఏమండీ!ఇలా...రండి.మీ అమ్మగారు మన పరువు పెంట పాలు చేసేలా...వుంది!
సనత్:_ఆ...వస్తున్నా!(రావటం)ఏం సంధ్యా!
సంధ్యా:_త్వరగా ఓ పని మనిషిని చూడండి. మీ అమ్మగారి పద్ధతులతో...వేగ లేక చస్తున్నాను.పని మనిషి అయితే...అన్ని
పనులు మిషన్స్ మీదనే చిటికెలో...చేసి వెళ్తుంది!
సనత్:_అమ్మ వుంది కదా?పని మనిషి ఎందుకు?జీతం దండగా!
సంధ్యా:_ఆవిడకు పెట్టే ఖర్చుతో...పని మనిషి వస్తుంది!మీరు చూస్తారా?నన్ను చూసుకో మంటారా?
సనత్:_అమ్మా!మిషన్స్ వాడితే... నీ సొమ్మేం పోతుంది?నీకు కష్టంగా వుండదు కదా?పనులు కూడా చిటికెలో అయిపోతవి.
సత్యవతి:_రోట్లో అయితే...చాలా రుచిగా ఉంటాయి!కడుపు నిండా తిండి తింటారని
నా ఆశ బాబు!కాని, నా అలవాట్లు, లేకి బుద్ధులు మీకు నచ్చ నప్పుడు మీ వద్ద నాకేం
పని? నాకు పెట్టే ఖర్చు పని మనిషి కి పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేయించుకోండి. నేను
ఊరు వెళ్ళి పోతాను.
లక్ష్మీ:_నేనేదో...కాలక్షేపానికి వచ్చి మీకు గొడవ పెట్టినట్లు అయ్యింది.నన్ను క్షమించండి? నేను వెళ్ళి వస్తాను.(వెళ్ళి పోవటం)
సనత్:_అమ్మా!నిన్ను ఊరు వెళ్ళి పొమ్మన్నానా?అలా...మాట్లాడుతున్నావు?
పాత అలవాట్లు మరిచి పోయి,కొత్త అలవాట్లు నేర్చుకో మంటున్నాం!
సంధ్యా:_పోతే... పోనివ్వండి.మన మొక్కరమే ఉన్నామా!నలుగురు కొడుకులు
వున్నారు.ఆవిడ పద్ధతులు నచ్చిన వాళ్ళు ఉంచుకుంటారు.
సత్యవతి:_నేనేం గతిలేక,మీ దగ్గరికి రాలేదమ్మ?కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు!కొ త్తకాపురం! నేను సహాయంగా,వుంటే బావుంటుందని వచ్చాను అంతే?ఇక..మీ
వద్ద క్షణం కూడా వుండను.వెళ్తున్నాను (వెళ్ళిపోవటం)
సనత్:_ఏమిటి?సంధ్యా!ఊరికే నోరు జారి
తివి? అమ్మ అలిగి ఊరు వెళ్తుంది.నలుగురు ఏమనుకుంటారు?
సంధ్యా:_అబ్బా...ఆవిడ నస భరించలేక పోయాను.ఎప్పుడు ఏదో... సోది.మనకు.
ప్రైవసీ లేకుండా చేసింది.ఎవ్వరు ఏమి అనుకోరు.పదండి టైం అవుతుంది.
అంకం:_3.
(సత్యవతి ఊరిలోకి వస్తూ ఉండటం.ఆమెను,రాఘవయ్య చూడటం.)
రాఘవయ్య:_సత్యవతి!ఇదేనా...రావటం?
సత్యవతి:_అవును...రాఘవయ్య!
రాఘవయ్య:_మీరు...చివరి జీవితం చిన్న కొడుకు దగ్గరే గడుపు తానని వెళ్లారు. పది
రోజులకే తిరిగి వస్తున్నారు.అక్కడ ఏమి
జరిగిందేమిటి?
సత్యవతి:_మీరు చెప్పింది నిజం!కాని, ఆ పట్నంలో నేను వుండలేక పోయాను!ఎప్పుడు...ఇంట్లో కట్టి పడేసి నట్లు ఒంటరిగా
ఉండాలి.ఎవరు మాట్లాడే వారు ఉండరు.దాంతో...మహా చెడ్డ చిరాకు!పైగా
పెళ్ళైన కొత్త జంట!పానకంలో పుడక లాగా
వాళ్ళ మధ్య లో నేను వుండే సరికి మోహ
మాట పడిపోతున్నారు!వాళ్ళ ఏకాంతానికి
నేను ఎందుకు భంగం కలిగించాలి,అన్న ఆలోచనతో...తిరిగి వచ్చాను!
రాఘవయ్య:_నీ ముఖం చూస్తే...అలా..అనిపించటం లేదు. నీ మనో స్థితి నీ ముఖంలోనే కనిపిస్తుంది!ఏం జరిగిందో... చెప్ప కూడదా?
సత్యవతి:_అయ్యో...రామ!అలాంటిది ఏమీ లేదు.రాఘవయ్య!
రాఘవయ్య:_మీరు దాచిపెట్టినంతమాత్రాన
దాగిపోతుందా...ఏమి?
సత్యవతి:_మీరు ఎలా...ఊహించుకుంటే...అలానే ఊహించు
కోండి?
రాఘవయ్య:_నలుగురు కొడుకులను కన్నావు.నలుగురు నాలుగు రాజ్యాలయ్యారు!వాళ్ళ చుట్టు మీరు తిరగ
లేక చస్తున్నారు.మీ ఆయన బతికి వుంటే
ఈ బాధలు వుండేవి కావు?
సత్యవతి:_ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు.ఎక్కడ డ్యూటీ వుంటే అక్కడే వుండాలి కదా? వ్యవసాయదారు లైతే,అందరూ... నా చుట్టే వుండేవారు.మా
ఆయన చాలా అదృష్టవంతలు!ముందే
వెళ్లిపోయారు.(కళ్ళ నీళ్ళు పెట్టుకోవటం)
రాఘవయ్య:_మిమ్మల్ని పలకరించి బాధ పెట్టాను.ఎప్పుడు బయలు దేరారో...వెళ్ళి
విశ్రాంతి తీసుకోండి.
అంకం:_4.
(సనత్,సంధ్యా చాటింగ్ చేస్తూ వుండటం.)
సంధ్యా:_చూశావా...సనత్!ఫేస్ బుక్ లో
నాకున్న ఫాలోయింగ్!లక్షల్లో లైక్ లు,కామెంట్స్!(చూపించటం.సనత్ చూసి)
సనత్:_ఎంతైనా...నువ్వు అందమైన అమ్మాయి వి కదా!నీకున్న ఫాలోహింగ్ నాకెక్కడ వుంటుంది?హెని వే కంగ్రాజులేషన్స్!
సంధ్యా:_థాంక్స్!ఇప్పటికైనా...ఒప్పుకుంటారా?ఆడవాళ్ళు
ఆరాధ్య దేవత లని!
సనత్:_సరె... సరే...గాని,అమ్మ ఊరు వెళ్ళిన వెంటనే...ఫోన్ కూడా చెయ్య లేదు.
ఆమె కోపం చల్లారి నట్లు లేదు.ఒకసారి
ఫోన్ చేసి పాలక రిస్తాను.
సంధ్యా:_ఎందుకు...బాబు! ఆ నస మళ్లీ నాకు తగిలిస్తావా? ఆవిడేం,చిన్న పిల్ల కాదు
భయ పడి పోవడానికి?
సనత్:_ఎంతైనా... నా కన్న తల్లి కదా?
ఫోన్ చేసి పలకరిస్తే... నీ సొమ్మేం పోతుంది?
సంధ్యా:_నువ్వీ ప్పుడు,అమ్మ పక్కలో..పడుకునే,వయసు వాడివి కాదు?
ఆలి పక్కలో పడుకునే,వయసు వాడివి!
అమ్మ కావాలో...ఆలి కావాలో తేల్చుకో..?
సనత్:_అమ్మ నా పెళ్ళామా?గురి చూసి,మగసిరి మీద భలే దెబ్బ కొట్టావే! సరే
పదా...వయసుల సయ్యాట లాడుకుందాం!
సంధ్యా:_ఓయమ్మో...అంటే ఆగడు.పడుకుంటే లేగడన్నట్లు వుంది అయ్యగారి యవ్వారం!
సనత్:_పడుకున్న వాడిని నిద్ర లేపి, బజ్జో అని జోకొడుతే... నిద్రపోతాడా?పద..పదా!
సంధ్యా:_కోరికలు బుస కొడుతున్నాయని,
కోలాటం వేస్తే... కేర్..కేర్ మని ఇల్లంతా అరుపులు!ఈ వయసులో పిల్లలు వద్దు బాబు? ఇంకొన్నాళ్లు లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి.
సనత్:_ఓసినా...మొద్దు!వయసులో వున్నప్పుడే పిల్లల కన్నామనుకో...త్వరగా
చేతికి అందివస్తారు!వయసు అయిపోయిన
తర్వాత కన్నామానుకో...నువు నేను పుట్టిన
వాళ్లకు తాత అమ్మలుగా మిగిలి పోతాం!
సంధ్యా:_ఇప్పుడు మీరు చేతికి అందివచ్చి ఏం చేస్తున్నారు?ఎప్పుడు ఎవరి జీవితం
ఎలా మలుపు తిరుగుతుందో...ఎవరు చెప్పలేరు?బుద్ధిగా బజ్జో?
సనత్:_నీ భయమంతా...పిల్లలు పుడతారనే కదా?పిల్లలు పుట్ట కుండా మార్గాలు ఉన్నాయి కదా?పద..పదా.
సంధ్యా:_అనవసరంగా...గుర్తు చేశాను.తప్పుతుందా...ఏమి?(బెడ్ రూమ్ లోనికి వెళ్ళటం)
అంకం:_5.
(రాఘవయ్య,సత్యవతి ఇంటికి రావడం.)
రాఘవయ్య:_సత్యవతి! ఏం చేస్తున్నావు?
సత్యవతి:_ఏముంది రాఘవయ్య!తిని కూర్చోవట మే కదా మన పని!
రాఘవయ్య:_అది సరె...గాని,పిల్లలు ఫోన్ చేశారా?
సత్యవతి:_వాళ్ళ పనుల్లో వాళ్ళు.తీరిక ఎక్కడ దొరుకు తుంది?
రాఘవయ్య:_ఈ తరం ధ్యాస అంతా డబ్బు చుట్టూ తిరుగు తుంది.మనం ఎక్కడ గుర్తుంటాము?
సత్యవతి:_పోనీలే...వాళ్ళు చల్లగా వుంటే
అంతే చాలు.మన కిక్కడ వుండడానికి ఇల్లు
బతక డా నికి భూమి వున్నది కదా?మట్టిలో
గుప్పెడు గింజలు చల్లితే...ఇంట్లోకి పుట్టెడు
ధాన్యం వస్తుంది.హాయిగా...కాలుమీద కాలు వేసుకొని బతక వచ్చు!
రాఘవయ్య:_నీ అంత గుండె దైర్యం వుంటే
ఏ ఆశ్రమాలు ఎందుకు?నువ్వు బతుకుతూ..నలుగుర్ని బరుకించ గలవు. నీ
ద్యైర్యానికి జోహార్!
సత్యవతి:_కడుపున పుట్టిన వాళ్ళు కాదు?
ఎప్పుడు మన చుట్టు పక్కల వాళ్ళతో...చక్కగా కలసి మెలసి వుంటే...అదే...స్వర్గం రాఘవయ్య!
రాఘవయ్య:_మహా బాగా చెప్పారు. నేను
అలా...పొలానికి వెళ్లి వస్తాను.
సత్యవతి:_అలాగే...రాఘవయ్య!
జైహింద్.