పరిహారం
----------
పరిహారం ఇచ్చుడెంది ?
పన్నులు పెంచుడేంది ?
ప్రభుత్వాల మర్మాలు
తెలుసుకోర పౌరుడా ?!
/ ప /
పంటలు ఎండిన పరిహారం
పంటలు మునిగిన పరిహారం
ఇండ్లు కూలిన పరిహారం
మనుషులు చచ్చిన పరిహారం
ప్రతిదానికి పరిహారం
ప్రభుత్వాల పల్లవయ్యే !
/ప /
పరిహారపు నూకలు
ప్రభుత్వాలు వెదజల్లి
నిత్యం నువ్వు వాడుకునే
సరుకుల రేటెంతో పెంచే
వీసానికి ఆశ పడితే
ముప్పావుల పన్నుపోటే
/ప /
ప్రకటించిన పరిహారం
అధికారుల చేతులెన్నో
మారి మారి నీచేతికి
వచ్చేవరకు ఎంతమిగిలే ?
తెలుసుకున్న నీకింకా
జ్ఞా నమే రాకపాయే ?
/ ప /
పరిహారపు నూకలకు
ఎదురు చూస్తూ ఆశపడక
నిన్ను నువ్వు నమ్ముకొని
కాలాన్ని గుర్తెరిగి
సాగిపోతే జయం !జయం !!
దేశం సౌభాగ్యమేరా !!
/ప /
జైహింద్