Friday, 1 October 2021

తప్పెవరిది..?



తప్పెవరిది..?
************
సిటీ బస్సు క్రిక్కిరిసిన ప్రయాణికులతో, "రయ్యి... రయ్యి"మంటూ...వెళ్తుంది.
  బస్సులోపల ప్రయాణికులు ఒంటి కాలు మీద నిలబడివున్నారు.అడుగు తీసి అడుగు ముందుకు వేసే స్థలం లేక,ఉక్కిరి
బిక్కిరి అవుతూ...చెమటలు కక్కుతూ..
ఉన్నారు.
  ఫుట్ బోర్డులో కుర్రాళ్ళు కమ్మీలు పట్టుకొని
వెళాడుతున్నారు.
  డ్రైవర్,కండక్టర్ కు ఇది రోజు మామూలే!
  కండక్టర్ సొరంగంలో దూరి...దూరి సాగి నట్లు సాగుతూ..."టికెట్...టికెట్"అరుస్తూ...
టిక్కెట్లు ఇస్తున్నాడు.
  రోడ్ గుంతలతో...స్పీడు బ్రేక్ లతో ఉండడంవలన డ్రైవర్ కు చాలా కష్టంగా వుంది.బస్సు పురిటి నొప్పులు తీసే తల్లిలా
ఆయాసపడుతూ...వెళ్తుంది. గుంతలకు,
స్పీడు బ్రేక్ లకు బస్సు కుది పేసుస్తూ...
వుంది.
  బస్సులో ప్రయాణికులు కూడా బస్సు తోపులకు ఒకరి మీద ఒకరు పడిపోతూ...
చాలా ఇబ్బంది పడుతున్నారు."ఎప్పుడు
గమ్య స్థానం చేరుకుంటామురా బాబు?" అనిబాధ పడుతున్నారు.
  వెళుతున్న బస్సు ఒక గుంతలో దిగగానే,
బస్సు ఒక కుదుపు కుదిపేసి ,పైకి కిందకి ఎగిరింది.ఆ కుదుపుకు ఫుట్ బోర్డ్ లో కమ్మీ
లు పట్టుకొని వేలాడుతున్న కుర్రవాడు, పట్టు
తప్పి పడిపోయాడు.బస్సు వెనక చక్రాలు 
కుర్రవాడి పైనుండి వెళ్ళగానే,కుర్రవాడు
"అమ్మా"అని గట్టిగా అరిశాడు.డ్రైవర్ వెంటనే,సడెన్ బ్రేక్ వేసి,క్రిందికి దిగిపోయాడు
  కుర్రవాడి ప్రాణాలు ఎప్పుడో... గాలిలో కలి
సి పోయాయి.
  "ఏదో...కొంపలు ముంచుకు పోయినట్లు
అందరూ...ఒకే బస్సులో క్రిక్కిరిసినట్లు ఎక్కు
తారు.లోపలికి జరగమన్నా, ఎవరు వినిపించు కోరు.వీడి చావు నా చావుకు వచ్చి నట్లుంది?"తల పట్టుకొని విసుక్కున్నాడు.
  బస్సులో ఉన్నవాళ్లు కూడా క్రిందికి దిగి పోయారు."అయ్యో...ఎంత ఘోరం జరిగిపోయింది."అని కొందరు బాధపడుతున్నారు.
  మరికొందరు"కుర్రవాళ్ళకు కమ్మీలు పట్టుకొని వేలాడడం ఒసోకైపోయింది.బస్సు చక్రాల కింద పడి ప్రాణాలుపోగొట్టు కొనే?డ్రైవర్ మాత్రం ఏం చేయగలడు?ఆయన తప్పేముంది?డ్రైవర్ కండక్టర్ చెబితే వినే తరమా? ఏ కన్న తల్లిబిడ్డో..!ఆ తల్లి కడుపు కాల్చే!"అని కొందరు బాధపడుతున్నారు.
  ఇంకొందరు"అప్పుడే...క్రొత్త రోడ్లు వేస్తారు.
ఆవెంటనే...కరెంట్ వాళ్ళు,డ్రైనేజ్ వాళ్ళు
తవ్వి పడేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని,
తవ్విన గుంతలు పూడచ్చ కుండానే వెళ్తారు. ఇలా...ఎవరికి వారు తమ పని తాము చేసుకొనివెళ్తే అడిగే వారుండరు?
ప్రభుత్వంలో ఒక శాఖకు ఒక శాఖ సమన్వయంతో ఎప్పుడు పనిచేయవు?
ఈ దేశానికి పట్టిన దరిద్రం ఇదే!"అని కొందరు
తిట్టుకుంటవున్నారు.
 "పోయేప్రాణంఎలాగూ...పోయింది.బాధపడుతూ...తిట్టుకుంటూ... ఉంటే పోయిన వాడి ప్రాణం తిరిగి వస్తుందా?జరగ వలసిన
పని పోలీసులు వచ్చి చూసుకుంటారు. పద
పదండి."అని కొందరు అనగానే,అందరూ...
కండక్టర్ తో టికెట్ మీద రాయించుకోని,
వేరే బస్సు కోసం వెళుతున్నారు.
  అదే... బస్సులో కొత్తగా ఉద్యోగానికి వెళుతున్న రవి చని పోయిన కుర్రవాడిని
చూస్తూ...కంట తడి పెట్టుకున్నాడు."మాన
వుడు తన అవసరానికి బస్సును తయారు
చేసుకున్నాడు.అదే...బస్సు కొరత వల్ల ఒక
నిండుప్రాణం బలి!"తన మనసులో అనుకుంటూ..వుండగా,"ఓ...బాబు!టికెట్
ఇలాఇవ్వు రాసిస్తాను."అనగానే,రవి ఈ
లోకంలోనికి వచ్చి ,టికెట్ తీసి కండక్టర్ కు
ఇచ్చాడు.కండక్టర్ టికెట్ మీద రాసి రవికి
ఇవ్వగానే, రవికి తను వెళ్ళ వలసిన పని
గుర్తుకు రాగానే ,మరో బస్సు కోసం బయలు
దేరాడు.
*****
  రవి బస్సుకోసం ఎదురు చూస్తున్నాడు.ఒక
ప్రక్క టైం దాటి పోయేలా వుంది.
"సమయానికిచేరుకో గలనా?"అన్న సందేహంతో అటు,ఇటు తిరుగుతూ... ఆందోళన పడుతున్నాడు.
  "శుభమాంటూ...క్రొత్తగా ఉద్యోగానికి వెళుతుండగా...చావు ఎదురైంది?ఈ ఉద్యో
గం రాక పోతే,బతకడం చాలా కష్టం.ఎలాగైనా...చేరుకోవాలి"ఇంట్లో పరిస్థితులు తలచుకున్నాడు.
  ఎట్ట కేలకు ఒక బస్సు వచ్చింది.రవి వెంటనే ఆ బస్సు ఎక్కాడు.ఆ బస్సు కూడా
ఏ మాత్రం కాలి లేదు.ఎలాగో... లాగ తోసుకొని లోపలికి వెళ్ళినిల్చున్నాడు.బస్సు
బయలు దేరింది.
*****
  అదే...రోడ్ లో కొందరు అల్లరి మూకలు షాపులు మూయిస్తూ... కని పించిన వస్తువుల విరగకొడుతూ...వస్తున్నారు.వారి
దౌర్జన్యానికి,భయపడిన వాళ్ళు తప్పించు కొని పారిపోతున్నారు.
  రవి ఎక్కి వస్తున్న బస్సు వారి కంట పడింది.వెంటనే బస్సును ఆపివేసి, అందర్ని
క్రిందికి దింపారు.కొందరు బస్సుపై దాడి చేస్తుండగా... ఇంకొందురు బస్సుపై పెట్రోలు
పోసి నిప్పు అంటించారు.ఒక్కసారే మంటలు భగ్గు మని ఎగిసిపోయాయి.
 అది చూసిన ప్రయాణికులు భయంతో ఎవరికి దొరికినదిక్కు వారే పరిగెత్తు కొని పారిపోతున్నారు.
  క్షణంలో బస్సు కాలి బూడిదై పోయింది.
  "ఇందాక...బస్సు ఒక మనిషి ప్రాణం బలి
తీసుకుంది.అని,అనుకున్నాను.కాని,ఇప్పుడు ఆ మనుషులే,బస్సునుబలితీసు కున్నారు.  
  అనాగరీకుడిగా,వున్న మానవుడు,నాగరీకుడిగా మారిపోయి,ప్రగతి పథంలో పయనిస్తూ... తిరిగి,అనాగారీకుడిగా మారి పోతున్నాడు.ఇది... ఏ సంకేతానికి నాంది?
అనుకుంటూ...వుండగా,అల్లరి మూకల్లో
ఒకడు ఒరేయ్?అందరూ...భయంతో పారి పోతుంటే, నువ్వు వేడుక చూస్తున్నావా?"వాడి చేతిలో వున్న కర్రతో
పిర్రలపై గాట్టిగా కొట్టాడు.
  "అమ్మా"అంటూ...రవి అక్కడ నుండి పరుగు తీశాడు.
  ఆ వార్తలు పోలీసులకు చేరిపోయాయి. పోలీసు బలగాలు, సైరన్ మ్రో తలతో "రయ్యి...రయ్యిన "వచ్చి చేరాయి.
అల్లరి మూకల చెదర గొడుతువున్నాయి. రెచ్చి పోయిన అల్లరి మూకలు పోలీసుల పై
రాళ్లు రువ్వారు.ఆ రాళ్ళతో పోలీసులకు గాయాలు అయ్యాయి.పోలీసులు వెంటనే
లాఠీలకు పనిచెప్పారు.ఐనా...? అల్లరి మూకలు అదరలేదు.బెదరలేదు.తిరగబడి
రాళ్లు రువ్వుతూనే వున్నారు.
  పోలీసులు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఐనా...?ఫలితం లేదు.వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు.ఆ కాల్పుల్లో అల్లరి మూకలు కొందరు చనిపోయారు.ఆ భయంతో మిగితా
వారు తలో దిక్కుగా పారిపోతున్నారు.
  ఏం...జరుగు తుందో అర్థం కాని,రవి తన వైపు పరుగెత్తుకొని వస్తున్న ఒకరిని "అసలు
అల్లరికి కారణం ఏమిటి"అడిగాడు.
  "ఒక ప్రముఖ నాయకుడిని ఎవరో అత్య చేశారు.ఆ కోపంతో తన అనుచరులు ఈ
విధ్వం సానికి పాలు పడ్డారు.పోలీసులు కాల్పులు జరుపు తున్నారు.ఆ కాల్పుల్లో
కొందరు మరణించారు. పద... పదా"అంటూ
అతను పరుగెడుతూ...వెళ్ళాడు.
  రవి వైపు కొందరు పోలీసులు ఏకే 47పట్టుకొని పరుగెడుతూ...వస్తున్నారు.
వారిని చూడగానే రవి భయంతో, పరుగెత్తి
ఆ ప్రక్కనే వున్న పబ్లిక్ టాయ్ లెట్ లో దాక్కున్నాడు.
  పోలీసులు మైక్ లో "కనిపిస్తే కాల్చి వేత ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఎవరు రోడ్ పై
కనిపించకూడదు?"చెప్పుకుంటూ...వెళ్తున్నారు.
  అది నాలుగు రోడ్ల కూడలి అయినందున
ఓ నలుగురు పోలీసులు ఏకే47గన్నులు పట్టుకొని కాపలాగా వున్నారు.ఎవరైనా కని
పిస్తే చాలు పిట్టను కాల్చి చంపినట్లు,కాల్చి
చంపాలన్నట్లు ఉన్నాయి వారి చూపులు.
*****
టాయ్ లెట్ లో దాక్కున్న రవి ఒక సారి బయటకు తొంగి చూసాడు.అక్కడ వున్న 
పోలీసులను చూడగానే,"వామ్మో...ఇప్పుడు
నేను అడుగు బయట పెడితే బతక గాలనా?వాళ్ళ తుపాకి తూటాలకు ఒళ్ళు
జల్లెడ తూట్లు పడినట్లు పడిపోదు. ఏం...?
ఉద్యోగం...ఉద్యోగం?నా ప్రాణం మీదికి వచ్చి
పడింది?"బాధపడి పోతూ...లోనికి వెళ్లి నిల్చున్నాడు.
  ఐదు నిమిషాలకు ఒక సారి పెట్రోలింగ్ వాహనం సైరన్ మోతలతో,తిరుగుతూ...
"వన్ పార్టీ సెక్షన్ విధించ బడింది.కనిపిస్తే కాల్చి వేత ఉత్తర్వులు ఉన్నాయి.ఎవ్వరూ..
రోడ్ మీదకు రాకూడదు."మైక్ లో హెచ్చ రిస్తూ...తిరుగు తున్నారు.
  ఆమాటలు విన్న రవి గుండె జారిపోయింది."ఇక్కడ నుండి ఎప్పుడు బయట పడాలిరా బాబు?అసలే...పబ్లిక్
టాయ్ లెట్!కంపు కొడుతున్నది.ముక్కు పుటలు పగిలి పోయేలా వున్నాయి?పగ వాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు."
అనుకుంటూ...నిల్చున్నాడు.
  పొద్దున కాస్త తిని బయలు దేరాడు రవి.
ఇప్పుడు రాత్రి అయిపోయింది.ఆకలితో కడుపు మండి పోతుంది.ఏం చేయాలో అర్థం కాక తల్లడిల్లి పోతున్నాడు.ఒక ప్రక్క
దుర్గంధం వాసన భరించ లేక,ముక్కులు జేబు రుమాలుతో మూసుకున్నాడు.ఐనా...
ఏం లాభం?కడుపులో దేవినట్లు అయ్యి భళ్ళున వాంతి చేసుకున్నాడు. నోరు కడుక్కుందా మంటే టాయ్ లెట్ లో నీళ్ళు
రావడం లేదు.బయిటికి వెళ్లే అవకాశం లేదు. అసలే కంపు అంటే,పైగా వాంతి చేసుకున్న వాసన.రెండు కలిసి కంపు కొడుతున్నవి.
  నిలబడి నిలబడి కాళ్ళు మొద్దు బారీ తిమ్మిరి పట్టాయి.నిలువలేక,మోకాళ్ళ మీద
కూర్చున్నాడు.
  బయటపోలీస్ వాహనం సైరన్ మ్రోతలతో
తిరుగుతూనే...వుంది.
  కాపల వున్న పోలీసులు నిద్ర పోకుండా ,
కాపల కాస్తున్నారు.
  కాళ్ళ మీద కూర్చున్న రవి కునికి పాట్లు పడుతున్నాడు.
  తెల...తెల వారుతుంది. కాపలవున్న ఒక పోలీసు టాయ్ లెట్ కు వచ్చాడు.బూట్ల చప్పుడుకు ఉలిక్కిపడిన రవి పోలీసును
చూడగానే,భయంతో లేచి బయటికి పరుగు తీశాడు.
  ఆ హఠాత్ పరిణామానికి పోలీస్ అతను
భయపడి,"దొంగ...దొంగ"అని అరిచాడు. బయటకాపల కాస్తున్న మరో పోలీస్ ఆ అరుపులు విని అటుగా చూశాడు.అతనికి
పరుగెడుతున్న రవి కనిపించాడు.వెంటనే తుపాకి రవి వైపు గురిపెట్టి కాల్చాడు.
  బుల్లెట్స్ రవి వీపు భాగం లోంచి దూరి గుండె లోంచి బయటికి దూసుకు వచ్చాయి.రవి దబాల్న నేల మీద పడి పోయాడు.గాయాలోంచి రక్తం చిమ్మి నేల మీద కారుతుంది.
  తూర్పున సూర్యుడు ఎర్రగా మెరుస్తున్నాడు.నేల మీద పడి కారుతున్న
రవి రక్తం ఆ ఎరుపులో కలిసి , మిల.. మిల 
మెరుస్తుంది!
జైహింద్.   


Wednesday, 29 September 2021

కలంఎంచుకొని నేను


కలం ఎంచుకొని నేను
తప్పుచేసినానేమో?
బుర్రనిండ అక్షరాల
రాశులేన్నో ఉన్నగాని?
జెబులోన డబ్బు లేక
ఎన్నాళ్లీ పోరాటం?!

అక్షరాలు కాగితాల్లో
రాశులుగా పోసేసి
అంగళ్ళలో కూర్చుండి
బేరానికి పెట్టినా?
చిల్లిగవ్వ కు గొరగాక?
పేరుకుపోయి ఇల్లు నిండే!
ఎలుకలకు పురుగులకు
భలే మేతగా మిగిలే!
నా కడుపు కాల్చిన అక్షరాలతో
ఎన్నాళ్లీ పోరాటం?!

అక్షరాలతో అల్లుకున్న
అనుబంధం కాబోలు!
ఎన్ని జన్మల ఋణ బంధమో?
పేనుకొని ముడివేసే!
కలం దించ నివ్వదు?
పైస రాల్చ నివ్వదు?
ఆకలి మంటలు నీకే కాదు?
పూట గడవనోల్లెందరో?
కలం పట్టి దారి చూపు?
నీకు ఒక దారి దొరుకు!
వెనకా ముందు తేడా అంతే?
ప్రస్థానం సాగించు!?
జైహింద్
ఆకుల రాఘవ.

Monday, 27 September 2021

తెగి అతికెసంబంధం!


తెగి అతికే సంబంధం!
*******************

బొడ్డు పేగు తెగగానే?
సంబంధం తెగుతుంది!
చనుబాలతో ఆ బంధం
తిరిగి పుంజుకుంటుంది!
అది తల్లి బిడ్డల సంబంధం!
జన్యుపర ఋణబంధం!

యుగాలెన్నో గడిచినా?
తరతరాలు మారుతున్న
తల్లి బిడ్డల సంబంధం
సాగుతుంది కల కాలం!
విడదీయుని మమకారం!
ముద్దు మురిపాల అనుబంధం!
సకల ప్రాణుల్లో ఇదే సూక్తి!
మానవతకు పరమార్థం!
తల్లిదండ్రుల విధి ధర్మం!
పాటించుటే సృష్టి కార్యం!

చదువు సంధ్యలతో పిల్లలు
తమకు దూరముంటున్నా?
బతుకు దెరువుకు తమ బిడ్డలు
ఇల్లు విడిచి దూరమైనా?
పెళ్లిళ్లతో తమ పిల్లలు
మెట్టి నింటికి పుట్టి నింటికి
దూరమై బతుకు తున్నా?
పండుగలకు పబ్బాలకు
వేడుకలకు వేదనలకు
కలిసి మెలిసి వారంతా?
పాలు పంచుకొంటూనే
బంధాల అమృతాన్ని
మది నిండా సేవిస్తూ
మురిసి ముద్దై పోతరు!
జైహింద్.
ఆకుల రాఘవ,
సెల్:7382441792.

వరంగల్ వెలుగు!


వరంగల్ వెలుగు..!
****************
వరంగల్ జిల్లా
వాసికెక్కిన గడ్డా
లెంకపెళ్లి గ్రామం
రేయి లేని ఖ్యాతి
వరంగల్ వెలుగు
మణి హారపు కీర్తనం!
చ:_మూడు రంగుల నేల
మణులు దొర్లే దరహాసం
కాకతీయుల ముందు చూపు
నిండు కుండ తటాకములు
ఎడమ కొంగు గోదావరి
సిరులు చిందే చైతన్యం!
చ:_వేయి స్థంబాల వెలుగు
రాతి కోట రాజసం
తోరణాల సోయగం
రాళ్ళలో రమణీయం
శృంగారాల రామప్ప
భద్రకాళి భద్రత!
చ:_అడవి బిడ్డ సమ్మక్క
బంగారపు తూకాలు
శివసత్తుల పూనకాలు
జంపన్న యేటి ఘోష
కోర మీసాల కొమురన్న
ఐనవోలు ఆచారం!
చ:_ఆది మానవుల సమాధులు
పాండవుల గుట్ట చిత్రాలు
పెంబర్తి కాంశ్యాలు
చేర్యాల కలంకారి
చేతి వృత్తుల ఘన కీర్తి
వరంగల్ వైభవం!
చ:_పోతన పాళి లోన
భాగవతం లీల లెన్నో
పాలకుర్తి సోమన
ద్విపద వెలుగు లెన్నో
బూద రాజు పరిశోదన
జానపద వాంగ్మయం!
చ:_దాశరధీ అగ్ని ధార
కాళోజీ గొడవ గొడవ
గడీల ఆలయాల్లో
చిల్లర దేవుళ్ళఆట కట్టు
రంగాచార్య దీశాలి
వేదాల తెలుగు కర్త!
చ:_అడుగడుగున కవిత్వం
వెళ్ళి విరిసే సాహిత్యం
కుల వృత్తు గళాల్లో
ఉద్యమాల పాటల్లో
జాలువారే తెలుగు పాట
తెలంగాణ పద సంపద!
చ:_వైద్యులను తీర్చి దిద్దే
కాక తీయ కాలేజీ
రోగులకు ఇలవెలుపు
గాంధీ దవాఖాన
విజ్ఞానపు నిధులున్న
కాకతీయ విద్యాలయం!
చ:_రజాకార్ల రక్త దాహం
పిండారీల పైచాచికం
సాయుధ పోరాటంతో
తెగనరికిన ధీరత్వం
వరంగల్ తెగువ అది
జయశంకర్ ఓ సాక్ష్యం!
చ:_ఏనుమావుల మార్కెట్టు
పేరెన్నిక రైతులకు
రాష్ట్రాలను కలుపు బాట
ఖాజీపేట రైలు మార్గం
నిత్య అంగల్లతోటి
తిరణాల్లా వర్ధిల్లు!
చ:_పచ్చ నైన అడవులు
దట్ట మైన కొండలు
వన్య మృగాల పరుగులు
ప్రాణి కోటి నడయాడే
జిల్లాకే సౌభాగ్యం!
చ:_మలి ఉద్యమ తరంగం
అహింసకే పరమార్థం
ఎగసి పడిన జన జాతర
ఉలికి పడిన కేంద్రము
సిద్ధించిన తెలంగాణ
వరంగల్ కీలకం!
జైహింద్.
ఆకుల.రాఘవ.


Friday, 28 May 2021

అప్పగింతలు!


 అప్పగింతలు!
*************
కన్న కడుపు తెంచుకొని
మెట్టి నింటికి పంపుతున్నం!
ఓ... బంగరు కూతురా?
అత్తమామలు తల్లిదండ్రులు
తుది వరకు నీకు రక్ష!
తెలుసుకొని మసలుకొంటే?
నీ బతుకు స్వర్గమవును!

కని పెంచి పెద్ద చేసి
విద్య బుద్దులెన్నో నేర్పి
తీర్చి దిద్దిన అమ్మానాన్న
రెండిండ్లా పేరు మోసే
బహుమానం ఆ బ్రహ్మ
నా కిచ్చిన వరమా?
స్త్రీ జాతికి శిక్షనా?!

సృష్టికి నువ్వు మూలమమ్మ?
పున సృష్టికి దైవమమ్మ!
అందుకే ఆ బ్రహ్మ
రెండిండ్లా పేరు మోసే
బాధ్యత నీ కప్పగించి
దీపంగా వెలగ మనీ
నిన్ను తీర్చి దిద్దాడు!

కన్న ఇంటిలోన బతుకు 
స్వేచ్చా విహంగ మైతే?
మెట్టి నింటిలోన బతుకు
హద్దుల చట్రంలో బందీ!
ఎన్నాళ్ళని ఈ బతుకు
స్త్రీ జాతి మోయగలదు?
మార్పు ఎప్పుడో...బ్రహ్మ?

పెగుతెంచి నీ మెడలో
వేసినాము చూడయ్య!
చెయ్యి తీసి నీ చేతిలో
పెట్టినాము కనవయ్య!
నూరేళ్ళు తోడుగా...
బతుకంతా నీడలా...
చూసుకో...అల్లుడా!?
పది వేల దండాలు!!
జైహింద్.