కారల్ మార్క్స్,లెనిన్, మావోల ఆలోచనకుముందే...తపస్సు అనే సమ్మె మన భారతావనిలో..సమ్మె హక్కుగా కొనసాగింది!
ఒకసారి కృతయుగం,త్రేతాయుగం, ద్వాపారాయు గములను పరిశీలించి నట్లైతే..తపస్సు ద్వారా తమ హక్కులను
ఎలా... నెరవేర్చు కున్నారో తెలుస్తుంది.
పురాణ కాలంలో దేవ,దానవ,మానవులకు
ఎవరికైనా ...తీరని కష్టం,బాధలు కలిగి నప్పుడు,లోకాలను ఏలుతూ...తమను పరిపాలిస్తున్న వారిని,తమ తపస్సు శక్తి ద్వారా తమ వద్దకు రప్పించుకొని,తమ పనులు చక్క దిద్దు కొనేవారు.
తపస్సు అంటే...తను చేస్తున్న విధులను
బహిస్కరించి,అన్న పానీయాలు ముట్టు కోకుండా,ఒక ఏకాంత ప్రదేశంలో తమ సమస్యలు ప్రభువులకు మొర పెట్టు కోవటం. ఆ తపస్సు ఆనాడు ఓ సమ్మెనే!అది ఆతని జన్మ హక్కుగా వుండేది!
సమ్మె ప్రభావాన్ని గుర్తించిన ప్రభువులు తక్షణమే స్పందించి సమ్మె చేస్తున్న వారి వద్దకు వచ్చి వారి సమస్యకు సరైన పరిష్కారం చూపించి , సమ్మె విరమింపచేసిపంపించే వారు.నాడు అది వరముగా...భావించ బడింది.
ఒక వేళ తపస్సు చేసే వారి సమస్యలు పరిష్కారముచేయకుండా..భీష్మిమిం
బాధ్యతా రహితంగా జరిగిందని,లోకం నిందిస్తుంది.బాధ్యతలు సక్రమంగా నిర్వహించని ప్రభువులు వున్న ఒకటే,లేకున్నా ఒకటే.తక్షణమే... పదవులనుండి తప్పుకొండని,ప్రజలు నిలదీస్తారు.కాబట్టే,లోక రక్షకులు,పాలకులు
తపస్సు చేసే వారి సమస్యలు పరి ష్కరించి
పంపిస్తూ...వుంటారు.అది ధర్మ నీతి!పాలకుల బాధ్యత!
నాడు ముల్లోకాలను ఏలిన త్రిమూర్తులు,ఎందరికో...వరాలు ఇచ్చి సమస్యలు పరిష్కారం చేశారు.ఒకొక్క సారి అలవి కాని,వరములు ఎన్నో ఇచ్చి సమస్యలు కొనితెచ్చుకోవడం.ఎలాగో..లాగ,
వాటిలోంచి బయట పడి పోవటం జరిగింది. సమస్యకు పరష్కారాన్ని చూపటమే కాదు?
వాటిలో తను చిక్కు కోకుండా ,పరిష్కరించు కోవాలి.అప్పుడే ఆ పాలకుల లౌక్యం లోకానికి తెలుస్తుంది.కీర్తి ప్రతిష్టలు పెరుగు తాయి.
తపస్సు దేవ,దానవ, మానవులకే కాదు?
జంతు పక్షులకు కూడా హక్కుగా కొనసాగింది.గజేంద్ర మోక్షము కథ తెలుసు కదా?మొసలి చేతుల్లో చిక్కుకున్న ఏనుగు
ఎలా? విష్ణువును వేడుకొని,బయట పడి ప్రాణాలు దక్కించుకున్నదో!అది తపస్సు కున్న గొప్ప శక్తి!
సరే.. సరే.అవి పురాణ కథలు. జరిగాయో?లేదో?ఎవరికి తెలుసు ?అనుకోని, కొట్టి పారేసినా...పర్లేదు!కాని,ఒకసారి మన భారత దేశ గ్రామీణవ్యవస్థనుక్షుణ్నంగా...
అప్పుడు తెలుస్తుంది. సమ్మెహక్కు ఎంత బలంగా కొనసాగింది.
గ్రామ వ్యవస్థ ఏర్పడి నప్పుడు ప్రతి గ్రామానికి కుల వృత్తుల వారు తప్పని సరిగా
ఉండేవారు.కుల వృత్తుల వారు లేక పోతే ఏపని
జరిగేదికాదు.కులవృత్తులవారుఅనగా
అట్టి వారితో,గ్రామ ప్రజలు పని కిందా సంవత్సరం పాటు చేసే వృత్తి పనికి గాను దాన్యం, లేదా?డబ్బులు ఒప్పందం చేసు కొని,సకాలంలో ఇచ్చేవారు.ఒక వేళ ఆ గ్రామ ఆసామి,సకాలంలో వృత్తి పని వారికి చెల్లించ వలసిన ధాన్యం,డబ్బులు చెల్లించని యెడల ,వృత్తి పని వారు అట్టి ఆసామి పనిని బహిష్కరించి,సమ్మె చేసే వారు.
ఆ ఆసామి తను నియమించుకున్న అతనితో,కాకుండా...వేరే వారి వద్ద కు వెళ్లి
పని చేయించు కోవాలి అనుకున్నా,అతనికి
వేరే వృత్తి పని వారు,పని చేసే వారు కాదు.
ఆ ఆసామి మరో ఊరి వారితో, ఆ పని చేయించు కోవాలి అనుకున్నా,ఆ ఊరి వారు కూడా అతనికి పని చేసే వారు కాదు.నాడు వృత్తి పని వారు అలా సంఘటితంగా ఉండేవారు.
సకాలంలో పనులు పూర్తి కాక పోతే...ఇరువురు నష్ట పోవాల్సిందే.కాబట్టి అట్టి సమస్యను ఆ గ్రామ పెద్ద పరిష్కరించి,ఆ గ్రామ కట్టు బాటు నిబంధన ప్రకారం ఇరువురు నడుచు కునేలా చేసే వాడు.అది అనాదిగా గ్రామ వ్యవస్థలో వేళ్లూనుకుని పొయి,సమ్మె హక్కుగా వర్ధిల్లింది.
నేడు మన వ్యవస్థ యాంత్రిక మైపోయింది.
కుల వృత్తులు చెయ్యి జారి పోయాయి.అన్ని
యంత్రాల ద్వారా తయారైన వస్తువులు సులువుగా అంగల్లలో దొరుకుతున్నాయి.
నేడు సాంకేతిక విప్లవం ద్వార ప్రతి వస్తువు
ఒక పోను కొడితే వచ్చి, ఇంటి ముందు వాలి
పోతుంది.
ఏనాడైనా?మనం మన శాస్త్రాలను అధ్యయనం చేయకుండా...పురాణాలను
పరిశీలిం చకుండా,విదేశీయులు చెప్పిందే వేదంగా పాటిస్తూ...వస్తున్నాం. విదేశీయులు మన శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి,అందులోని జ్ఞాన సంపదను సేకరించి,మనకే తమదిగా చెబుతూ...అందిస్తువున్నారు.ఒక నాడైనా?మన గ్రామీణ మూలాలను క్షుణ్నంగా... పరిశీలించారా?లేదు.
ఈ నాడు సమ్మె చేస్తున్న వారంతా...ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తూ...రోడ్లను నిర్బందిస్తూ...ప్రయాణికులకు నరకం చూపిస్తున్నారు.సమ్మె అనేది, ఎవరి హక్కులకు భంగం కలగకుండా...శాంతియుతంగా ,అహింసా పద్ధతిలో చేసి ,తమ సమస్యలు పరిష్కరించు కోవాలి.అప్పుడే సమ్మెకుసంపూర్ణ సిద్ధి లభిస్తుంది.
జైహింద్.