Tuesday, 26 May 2015

పరిజ్ఞానం
---------
చదువుకొనే రోజుల్లో బలపం ,పెన్సిల్ ,ఆపైన పెన్ను వాడేది . ఐతే అప్పుడు ఇంకు పోయాలటే ఐదు పైసలకు పోసేవారు . అప్పుడు ఇళ్ళల్లో దాన్యం తప్ప డబ్బులు ఉండేవికావు . ఏపనికైనా దాన్యమే ఇచ్చి పనులు చేయించే వారు . చూచి వ్రాత రాయక పొతే టీచర్ కొట్టేవాడు . ఒకరోజు మాఇంటి వెనకాల పాత బావిలో పులిచేరు పండ్లు తెంపి తినుచుండగా ,అందులో నుండి ద్రవం నీలంగా కారింది . నేనువెంటనే చాలా పండ్లు తెంపి రసం పిండి దానిని పెన్నులో పోసి రాశాను . ఇంకేముంది ఇంకులాగానే రాసింది . నాకు ఒకటే ఆనందం !ఒక ఆలోచన పరిజ్ఞానం ఎంత మేలుచేసిందో ?చూడండి . అది నేను అందరికి చెప్పి అందరి చేత ఆలా చేయించాను .
     ఇంకు లేనప్పుడు అందరం అదేపని గా నోట్స్ రాసేవాళ్ళం . గుర్తుకొచ్చినప్పుడల్లాభలే ఆనందం వేస్తుంది . పరిసరాలెకదా పసివాళ్ళకు మేధ !

Sunday, 17 May 2015

ర్యాగింగ్
-----
ర్యాగింగ్ అనేది స్కూల్ లో ,కాలేజిలో మాత్రమే చేసేది కాదు . పల్లెల్లో ,పట్టణాల్లో మన చుట్టు ప్రక్కల ఉన్నవాళ్ళు
అప్పుడప్పుడు మనల ర్యాగింగ్ చేసి మనం ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతూ ఆనందిస్తుంటారు . నా అనుభవం ఒక
సారి చెబుతాను వినండి .
    నేను 1972సంవత్సరం ఐదవ తరగతి చదువుతున్నాను . బడి ఐపోగానే ,రోజు సాయంత్రం చేనుకాడికి కావలి
వెళ్ళాలి అది మాడ్యుటి . ఒక రోజు సాయత్రం నేను చేనుకాడికి కావలి వెళ్ళాను . అక్కడ మాజీతగాడు ,మా పెద్ద
నాన్న కొడుకు ఇంకా కొందరు పశువుల మేపుతూ కాపలా వున్నారు .
    నన్ను చూడగానే పిలిచి ,నువ్వు చలి చీమ ముడ్డి మోయగలవా ?నువ్వు మోస్తే మేము మీచేను కాపలా
కాస్తాము . మేముగేలిస్తే మాపశువుల నువ్వు కాపలా కాయాలి . మేము చిర్ర గొనె ఆడు కుంటాము . శరత్
పెట్టారు . నేను ఆచిన్నదాన్ని మోయలేనా ?నేనురేడి అన్నాను . ఓయ్ నువ్వు మోయలేవు . అది పుట్టెడు
వడ్ల బరువు వుంటుంది !అంటే ఎనబై కుంచాలు ఐతే పుట్టెడు . అంటే ?ఎనబై క్వింటా ల్లు అన్నమాట !ఏయ్
నువ్వు మోయలేక ఓడిపోతావు అన్నారు . అయినా ?నేను పట్టుబట్టాను . వాళ్ళు చలిచీమను పట్టుకొని
నడుం వరకు విరిచి ,ముడ్డి భాగం నా కుడి చేయి మడతలోపెట్టి ,మడచి పట్టుకోమన్నారు . అంతే . ఒక్కసారే
తేలుకుట్టినట్లు భ గ్గున మంట పుట్టి ,లబో ,దిబో అని చేయి విదిలిచి కొట్టాను . అయినా ?దాని ముడ్డిరాలి
కిందపడలేదు . నేను గట్టిగా దాన్ని పట్టి పీకాను . అది దాని ముళ్ళు శరీరంలో దింపింది . దాని విషానికి చర్మం
పొంగ్గి బొబ్బలేక్కి ఒక్కటే మంట . నేను ఏడుస్తుంటే ,వాళ్ళు ఒక్కటేనవ్వు నవ్వుతున్నారు .
     చీమలు తలలో వున్న కొండ్ల తోకుడుతాయని అనుకున్ననుకాని ,ముడ్డి భాగంలో ముళ్ళు తో కుడుతాయని ,
నాకు అప్పటివరకు తెలియదు . తేనె టీగ ,చలి చీమ ,కందిరీగ ,తుమ్మెద లాంటికొన్ని ముడ్డి వద్ద వున్న కొండితో
కుడుతాయి . నేటికి కూడా ఇలా మన ప్రక్కవాళ్ళు రాగింగ్ చేస్తూనే వుంటారు . అది ప్రాణాంతకమై నప్పుడే చట్టం
జ్యోక్క్యం చేసుకుంటుంది . 

Thursday, 14 May 2015

నేను 8వ తరగతి చదువు తున్నప్పుడు మా క్లాస్ లో కాజమోహిద్దిన్ అనే ముస్లీం అబ్బాయి
ఉండేవాడు . మాతరాగతిలో ,అతనే చాలపోడుగ్గా ,లావుగా ఉండేవాడు . అతనికి మీసాలు కూడా
వచ్చాయి . ఐతే అందరు బడే బాయి ,బడె బాయి అని ఏడిపించేవారు . నర్సింగం అనే టీచర్
ఐతే సాహేబుకు సాడేతీన్ ,నాకు మూడున్నర అని ఏడిపిస్తూ ,ఎప్పుడు అతన్నే ప్రశ్న లడుగుతూ ,
చదవమని అనేవాడు . పాపం అతనికి తెలుగు సరిగా చదువరాక ,ప్రశ్నలు తెలియక బాధపడుతుండేవాడు .
ఐతే ,అతనికి అన్నింటికీ మూలకారణం మీసాలె అని వాటిని రాకుండా ఏం చెయ్యాలని ఒకడిని అడిగాడు .
 వాడు ఏం లేదు . పడుకునే ముందు సున్నం ,జీడి నూనె కలిపి పెదాల పై రాయి అంతే . తెల్లారేసరికి
వచ్చిన మీసాలుకూడా రాలిపో తై ,అనగానే అతడు అలానే చేసేశాడు .
   ఇంకేముంది ?పై పెదవులు ఎర్రగా పొంగి పుండై పోయింది . తెల్లారి మూతికి కర్చిప్ కట్టుకొని రాగానే
అందరు అదేమిటని అడిగారు . అతను చెప్పిన విషయం విని అందరు ఒకటే నవ్వు. న రసింగంటీ చరైతే
పడిపడి నవ్వాడు . పాపం అతనికి సున్నం ,జీడి నూనె పెడితే పుండు అవుతుందని తెలియదు .
అదిగుర్తు కొచ్చినప్పుడల్లా ,రాగింగ్ ఇలా కూడా చేసి కసి దీర్చుకుంటా రా అని అనిపిస్తుంది .    

Sunday, 10 May 2015

ఆటల్లో కళా నైపుణ్యం!
---------------
బాల్యంలో ఆడే ప్రతి ఆటలో కళా నైపుణ్యం ఉండేది . తాటి ఆకులతో బూరలుచేసి ఊ  దుకోవడం,పాడుకోవడం ,
గిరకలు చేసి గాలికి గిర్రున తిప్పుకోవడం ,ఆకులతో గడియారాలు చేసి చేతికికట్టుకోవడం ,చిన్న మట్టలతో
రెండుగా చీరి చెటాల్ అంటే టిక్కు టిక్కుకొట్టటం ,ముంజలు తీసిన కాయలతో ఎడ్ల బండి చేసి ఆడటం ,పెద్ద
మట్టలతో బండి లాగడం ,చెప్పులుచేసి కాళ్ళకువేసుకొని తిరగడం !అమ్మో!ఒక్కటా ,రెండా ఎన్నెన్నో చేసి
ఆడేది. రేగడి మట్టితో జంతువుల ,పక్షుల ,మనుషులబొమ్మలు చేసి ఆడుకోవడం . చొప్పబెండ్లతో బండ్లు ,
అగ్గిపెట్టేలతోరైళ్ళు ,కాగితాలతో పడవలు చేసిఆడు కునేది . నాడు ఒక్కపైసాకూడ కర్చులేకుండా ,చుట్టు
ఉన్నపరిసరాలలో దొరికే వాటి తోనేఎవరికీవారే తయారు చేసుకొని ఆడేది. రానివాడు సైతం చూసి నేర్చుకునే వాడు .
ఆనైపున్యమేవేరు !ఈ తరానికి అవితెలుసా?

Friday, 8 May 2015

గొలీల ఆటలు
---------------
చిన్నప్పుడు గొలీల ఆటలంటే పడిచచ్చేది మేమంతా . సీసం గోలీలు కొనాలంటే డబ్బు ఉండేది కాదు ,
ఎండిపోయిన జామకాయలు ,సున్నం రాయిని గుండ్రంగా చేసి ఆడేది . అప్పుడు జానలు ,మూరలు
అనే ఆట ఆడేది . చిన్న బద్ది అంటే గుంట తవ్వి దానికి ,పదిఅడుగుల దూరం ఒక గీత గీసి ,బద్ది దగ్గర
నుండి ఆగీత దగ్గర గోలివేయాలి . ఎవరిది ముందువుంటే వారే మొదలు ఆడాలి . గెలిచినవాడు బద్ది
దగ్గరనుండి గోలీని కొడితే ఓడినవాడు మోచేయి మడతపెట్టి గోలీని బద్దిలోకి నెట్టాలి . నెట్టే టప్పుడు
వాడి మోచేయి నెలకు చెక్కుకొని పోయి రక్తం కారేది .
         ఆదిచూసి మేము పడిపడి నవ్వుకోనేవాళ్ళం . అప్పుడప్పుడు నాకుకూడా ఆతిప్పలు తప్పేది
కాదు . ఆటలంటే అదోసరదాకదా ?!గోలీలతో లక్కు అనే ఆట కూడా ఆడేది . నాలుగు మూలల
బాక్స్ లా గీసి ,అందులో గోలీలు పోసి గోలీతో కొట్టాలి . గోలీలు గీత దాటితే అవివాడు గెలిచినట్లు లెక్క .
ఇప్పుడు ఆలాంటి ఆటలు ఈ తరానికి తెలుసా ?

Wednesday, 6 May 2015

పురాణ కథల్లో నమ్మలేని నిజజాలు!
-------------------------------------
కృత యుగంలో హిరణ్యాక్షుడు అనే రక్కసుడు ఉండేవాడు .
అతనికి ఇంద్రుడి సింహాసనం ఎక్కి లోకాలను ఏలాలని కోరికా !
కాని ,అతనికి విష్ణువు అడ్డు పాడుతుండేవాడు . దానితో రక్కసుడికి
కోపం వచ్చి భూమిని చాపల చుట్టి సముద్రంలో వేశాడు .
     వెంటనే విష్ణువు వరహా అవతారం ఎత్తి భూమిని పైకి లేపాడు .
 ఇది వినటానికి బాగానే వున్నా ,భూమిని సముద్రంలో విసిరివేస్తే
హిరణ్యా క్షుడు అతని పరివారం ,సంపద ఎక్కడ నిల్చుండి వున్నట్లు ?
విష్ణువు ఎక్కడ నిలబడి భూమిని పైకి ఎత్తి నట్లు ?సముద్రం వున్నది
భూమి పైనెకదా ?!ఆనడురాసిన రచయితలకే తెలియాలి !?
    వామనుడు భలి ని మూడు వరాలు అడిగాడట ,అవి మూడడుగుల
స్తలం . సరెభలి ఒప్పుకున్నాడు . మూడు అడుగులు తీసుకో అనగానే ,
ఒక అడుగు నేలమీద ,మరోఅడుగు ఆకాశం పైన పెట్టాడు . మూడో అడుగు
అనేసరికి తన తలచూపాడు . వినటానికి బాగానేవున్నది . ఐతే భలి ఎక్కడ
కూర్చున్నట్లు ?తన పరివారం ఎక్కడ వున్నట్లు ?నేటికీ అర్థంకాని విషయాలే
ఒక్కొక్క సారి నవ్వాలో ,ఏడవాలో అర్థం కాదు ఆకథలనె వల్లెవేస్తాం !

Friday, 1 May 2015

ఆటల్లో నాటకీయత
--------------

చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందటే చాలు ,పిల్లలమంతా చింత,వేపచెట్ల క్రింద చేరి,

ఆటలు ఆడుకునేటో ల్లం. ఒక్కొక్కప్పుడు దొర ,దొంగలు అనే ఆట ఆడె టోల్లం . అప్పుడు
ఒకడు దొరగా వుంటేకొందరం దొంగలుగా వుండేటోల్లం . మేముదొరపచ్చజొన్న చేల్లోకంక్కులు
ఊస బియ్యం కోసందొంగ తనంగా ,దొరచెండ్లోకో సినట్టు చేసేటో ల్లం. దొర మమ్ములపట్టుకొని ,
కొట్టాలి . అదిఆట. ఐతేమేము వాయిలిపుల్లలు గజంపొడుగుగావిరుచుకొని ,వాటికి
మలం పూసుకొని ,కంకులుకోసినట్టు ఆడేటో ల్లం. మమ్ముల పట్టుకోనడానికిదొర గా ఆడే
వాడు వచ్చీ పట్టుకొండటుండ  గా ఆకర్రలకుఉన్న మలం వాడికి అంటేది . అది వాడు గమనించే
వాడు కాదు. మేము ఒకటే నవ్వు నవ్వు తుంటే,వాడు ఇంకారెచ్చి పోయిమా కర్రలు
లాగుకుంటూ కొట్టేలాఆడేటో డు . దొర అంటేమజాకానా?అది వాడి దీమ. ఒరేయ్  నీ
చేతులు చూసుకోరా?అని పడిపడి నవ్వు తుంటే ,అదిచూసి వాడు అంతాతొండి అని
మలం ఆకులతోతూడుచుకుంట ఏడిచే టో డు .అదిఇప్పుడు గుర్తు కొస్తే భలె నవ్వు
వస్తుంది .