కాలరధం
-------
కాలరధం పై కూర్చున్నాను !
సవ్వారి చేస్తూ వెళ్తున్నాను !
రాత్రి -పగలు
రోజులు -వారాలు
నెలలు -సంవత్స రాలు
యుగము -యుగాలు
దాటుతు దాటుతు వెళ్తున్నాను !
/కాల /
ప్రకృతి ఒడిలో నేకళ్ళు తెరచి
ప్రాణుల నడతను నేననుకరించి
ప్రకృతి పెట్టిన అన్నం తింటు
ప్రకృతి ఎదపై నే పవళించి
ప్రకృతి ఒడిలో పాటాలు నేర్చి
విజ్ఞాన జ్యోతిగ నేవెలుగొంది
ప్రకృతి శక్తుల నేచేతపట్టి
శక్తుల సేవలు నేవాడుకుంటు
మానవమనుగడకు విధాత నేనై
మానవాలిని ముందుకు నడుపుతు
కాలరధం పైకూర్చున్నాను !
సవ్వారి చేస్తూ వెళ్తున్నాను !
/కాల /
అడవులలోన ఆడుతు పాడుతు
పర్వతాలను ఎక్కుతు దిగుతు
నదులలోన మునుగుతు ఈ దుతు
సముద్రాలలో తేలుతు దాటుతు
గాలిలోన నింగిలో ఎగురుతు
గ్రహాలతోటి బంతులు ఆడుతు
విశ్వంలోన విజేత నేనై
ఎల్ల లోకాలు తిరుగుతు వున్నా
గమ్యం దొరకని దారుల్లో
కాలరధం పై సవ్వారి చేస్తూ
సాగుతు సాగుతు వెళ్తున్నాను !
అంతే దొరకని ప్రస్తానంలో !
/కాల /
మరోప్రపంచం మనుషుల కోసం
విశ్వాన్నే జల్లెడ పడుతు
ఆధా పాతాళం లోతులు తోడుతు
సృష్టి మొదలు తుదిని వెదుకుతు
పుట్టుక గిట్టుక మూలాలు లాగుతు
అలసట ఎరుగని అన్వేషణలో
అణువణు వును పరిశోదిస్తూ
లక్ష్య సాధనకై పరుగులు దీస్తూ
వైజ్ఞానిక కాలవీధిలో
భువన భాండవ ములు కలియదిరుగుతు
అంతేదో రకని కాలవీధిలో
సాగుతు సాగుతు వెళ్తున్నాను !
/కాల/
భగ భగ మండే కాలవీధిలో
ముందుకు సాగని నాప్రస్తానం
వెనక్కి తిరిగి నేచూ సుకుంటే
ఎన్నో దశల పరిణామాల్లో
ఎన్నో జాతుల జగడాల్లో
ఎన్నో కూలాల కురు క్షేత్రాలలో
ఎన్నో మతాల మారణ హోమాల్లో
బతుకు సమరాల రక్తపు టేరుల్లో
మానవత్వం మట్టిలో కలిపిన
వైజ్ఞానిక మానవుడిని నేనేనా ?
దేవుడికి దెయ్యానికి పురుడే పోసి
వేడుక సలిపే వైజ్ఞానిక మానవుడిని నేనేనా ?
/ కాల/
జైహింద్