Wednesday, 17 September 2014

బాల్యం మట్టిముద్ద !
మలిచేవిదానం బట్టి 
రూపుదిద్దు కుంట్టుంది !
యవ్వనం రబ్బరుబంతి !
ఆడేఒడుపును బట్టి 
గెలుపు వుంట్టుంది !
కౌ మారం రైలింజేను !
సాగేవిదానం బట్టి 
గమ్యం చేరుతుంది !
వృధ్యాప్యం నీటిబుడుగ!
చూచే విదానం బట్టి 
నిలిచివుంట్టుంది !
జైహింద్ 

Monday, 15 September 2014

పలుకుబడి 
-----------
ప్రకృతినిండా పదములే !
ఆలాపిస్తే భోదనే !
పదములె భాషకుమూలము !
మానవమనుగడకర్తము !
                        / ప్రకృతి /
ప్రక్రుతినిండా సర్వ ప్రాణులు 
జంతు -పక్షుల అరుపులకేకలు 
క్రిమి కీటకాల కిచ కిచ గోలలు 
ఆలాపించిన మాటలే !
తెలుగుభాషకు సంపదే !
                       /ప్రకృతి /
సాగరపవన కెరట విన్యాసం 
చినుకుల నదుల గల గల రావం 
తరువుల గిరుల మౌన భాషణం 
ఆలాపించిన యోగ సూక్తము 
తెలుగు భాషకు మహాభూషణం !
                         / ప్రకృతి /
జగతిలో ఉన్న సర్వ ప్రాణులు 
పలికే గళ ములో ఒకటే తీరు 
ఆపలుకులలోనే తెలుగు ధారనే 
జగతిలో ఉన్న మానవులంతా 
పలికే పదములు పలు పలు విధము !
                           /ప్రకృతి /
ప్రక్రుతినిండా తెలుగు భాషనే 
ప్రాణుల గళ ములో తెలుగు ధారనే 
మనుషుల్లోనే అనేక భాషలు 
మాదే గొప్పనే ఆదిపత్యము 
కనురా ప్రకృతిలో తెలుగు పలుకుబడి !
జైహింద్ 

Sunday, 31 August 2014

మనవ శరీరానికి
ఇంద్రియాలు
ఎంతముక్యమో ?
మానవజాతికి
భాష అంతేముక్యము !
తల తెలుగైతే
కళ్ళు రెండు రాష్ట్రాలు
వాక్కు
తెలుగే కదా ?!
విదిపోయామనే
వివక్ష ఎందుకు ?

Saturday, 2 August 2014

శబ్దం
నాజీవం
ఆలాపన
నాభాషణం !

Monday, 28 July 2014

పల్లె మేలుకుంటే
-----------------
పల్లెమేలుకుంటే
ప్రగతివెల్లి విరియు !
ప్రగతి వెల్లి విరిస్తే
కండపుపుష్టి ఈ దేశం !
                    / పల్లె /
  పల్లెకొక్క చెరువు
  జలంజీవ చలనం !
  ఇంటికొక్క చెట్టు
   పచ్చదనం పెంచు !
   మోట బావి చేదబావి
   కలిగివుంటేలు జలంపొంగు !
                    /పల్లె /
సాగుబడి కూలిపని
కలసిసాగిపోతుంటే
సిరులు దొర్లి ఇండ్లునిండు !
కులవృత్తులు చేతి వృత్తులు
పురుడు పోసుకుంటుంటే
పల్లెకళ లు కాంతులు చిందు !
                    /పల్లె /
   చినుకు ఒడిసి పడితే
   పుడమి తాగి ఊట చిమ్ము !
   సాగునీరు తాగునీరు
   సమృద్ధిగనిల్వవుండు !
   కరువు పటాపంచలై
   పల్లె అన్నపూర్ణగవెలుగు !
                     /పల్లె /
పశులు గొర్లు మేకలు
మందలుగా పల్లె నుంటే
కోళ్ళు పక్షులు పల్లెల్లో
గుంపులుగా తిరుగాడితే
పాదిపొంగే పల్లె పసిడి !
                  /పల్లె /
కాలుష్యం పాతిపెట్టి
పల్లెపరి శుభ్రమైతే
ఆరోగ్యం మహాభాగ్యం
పల్లె నిండ వెలుగొందు !
తరతరాల మనుగడకు
పల్లె మార్గదర్శిగ నిలచు !
                   /పల్లె /
పల్లెవాసులంత కలసి
కమిటీలుగజతకట్టి
పల్లె పురోభివృద్ది కి
ప్రణా లికలు వేసుకుంటే
పాలనతలవంచదా ?
కలిసి పల్లెతో నడవదా ?
             / పల్లె /
జైహింద్
-------------

Friday, 4 July 2014

పాటకు జోహార్ !
-------------
ఎవరు పురుడు పోసినారో ?
ఎవరు గళం విప్పినారో ?
పాట వైవెలసినావు !
గానమై సాగుతావు !
     సంద్రములో కెరటమై 
      నింగి కెగురుతుంటావు !
      మేగాల్లో జల్లువై 
      నేలరాలుతుంటావు !
      మలయమారుతమై 
      మరులుగోలుపు తుంటావు !
జానపదుల గొంతుల్లో 
జాతరైసాగుతావు !
కర్షకుల సాగుబడిలో 
సిరులసరాలైతావు !
శ్రామికుల స్వేదాల్లో 
గానామృత మవుతావు !
       చేతి వృత్తుల అల్లికలో 
       రాగలహరి వవుతావు !
       కులవృత్తుల నర్తించే 
       గానకచ్చేరివవుతావు !
       కవిగాయక చెలిమితో 
       శ్రోతల మురిపించేవు !
సకల ప్రాణుల మేలుకొలిపే 
గానతరంగి నవుతావు !
మానవత్వ మనుగడకు 
నాంది వాచకమవుతావు!
తరం తరం మారుతున్న 
పాటగానే వెలుగుతావు !
       జైహింద్