Friday, 4 July 2014

పాటకు జోహార్ !
-------------
ఎవరు పురుడు పోసినారో ?
ఎవరు గళం విప్పినారో ?
పాట వైవెలసినావు !
గానమై సాగుతావు !
     సంద్రములో కెరటమై 
      నింగి కెగురుతుంటావు !
      మేగాల్లో జల్లువై 
      నేలరాలుతుంటావు !
      మలయమారుతమై 
      మరులుగోలుపు తుంటావు !
జానపదుల గొంతుల్లో 
జాతరైసాగుతావు !
కర్షకుల సాగుబడిలో 
సిరులసరాలైతావు !
శ్రామికుల స్వేదాల్లో 
గానామృత మవుతావు !
       చేతి వృత్తుల అల్లికలో 
       రాగలహరి వవుతావు !
       కులవృత్తుల నర్తించే 
       గానకచ్చేరివవుతావు !
       కవిగాయక చెలిమితో 
       శ్రోతల మురిపించేవు !
సకల ప్రాణుల మేలుకొలిపే 
గానతరంగి నవుతావు !
మానవత్వ మనుగడకు 
నాంది వాచకమవుతావు!
తరం తరం మారుతున్న 
పాటగానే వెలుగుతావు !
       జైహింద్ 
 


No comments:

Post a Comment