పల్లె మేలుకుంటే
-----------------
పల్లెమేలుకుంటే
ప్రగతివెల్లి విరియు !
ప్రగతి వెల్లి విరిస్తే
కండపుపుష్టి ఈ దేశం !
/ పల్లె /
పల్లెకొక్క చెరువు
జలంజీవ చలనం !
ఇంటికొక్క చెట్టు
పచ్చదనం పెంచు !
మోట బావి చేదబావి
కలిగివుంటేలు జలంపొంగు !
/పల్లె /
సాగుబడి కూలిపని
కలసిసాగిపోతుంటే
సిరులు దొర్లి ఇండ్లునిండు !
కులవృత్తులు చేతి వృత్తులు
పురుడు పోసుకుంటుంటే
పల్లెకళ లు కాంతులు చిందు !
/పల్లె /
చినుకు ఒడిసి పడితే
పుడమి తాగి ఊట చిమ్ము !
సాగునీరు తాగునీరు
సమృద్ధిగనిల్వవుండు !
కరువు పటాపంచలై
పల్లె అన్నపూర్ణగవెలుగు !
/పల్లె /
పశులు గొర్లు మేకలు
మందలుగా పల్లె నుంటే
కోళ్ళు పక్షులు పల్లెల్లో
గుంపులుగా తిరుగాడితే
పాదిపొంగే పల్లె పసిడి !
/పల్లె /
కాలుష్యం పాతిపెట్టి
పల్లెపరి శుభ్రమైతే
ఆరోగ్యం మహాభాగ్యం
పల్లె నిండ వెలుగొందు !
తరతరాల మనుగడకు
పల్లె మార్గదర్శిగ నిలచు !
/పల్లె /
పల్లెవాసులంత కలసి
కమిటీలుగజతకట్టి
పల్లె పురోభివృద్ది కి
ప్రణా లికలు వేసుకుంటే
పాలనతలవంచదా ?
కలిసి పల్లెతో నడవదా ?
/ పల్లె /
జైహింద్
-------------