Monday, 28 July 2014

పల్లె మేలుకుంటే
-----------------
పల్లెమేలుకుంటే
ప్రగతివెల్లి విరియు !
ప్రగతి వెల్లి విరిస్తే
కండపుపుష్టి ఈ దేశం !
                    / పల్లె /
  పల్లెకొక్క చెరువు
  జలంజీవ చలనం !
  ఇంటికొక్క చెట్టు
   పచ్చదనం పెంచు !
   మోట బావి చేదబావి
   కలిగివుంటేలు జలంపొంగు !
                    /పల్లె /
సాగుబడి కూలిపని
కలసిసాగిపోతుంటే
సిరులు దొర్లి ఇండ్లునిండు !
కులవృత్తులు చేతి వృత్తులు
పురుడు పోసుకుంటుంటే
పల్లెకళ లు కాంతులు చిందు !
                    /పల్లె /
   చినుకు ఒడిసి పడితే
   పుడమి తాగి ఊట చిమ్ము !
   సాగునీరు తాగునీరు
   సమృద్ధిగనిల్వవుండు !
   కరువు పటాపంచలై
   పల్లె అన్నపూర్ణగవెలుగు !
                     /పల్లె /
పశులు గొర్లు మేకలు
మందలుగా పల్లె నుంటే
కోళ్ళు పక్షులు పల్లెల్లో
గుంపులుగా తిరుగాడితే
పాదిపొంగే పల్లె పసిడి !
                  /పల్లె /
కాలుష్యం పాతిపెట్టి
పల్లెపరి శుభ్రమైతే
ఆరోగ్యం మహాభాగ్యం
పల్లె నిండ వెలుగొందు !
తరతరాల మనుగడకు
పల్లె మార్గదర్శిగ నిలచు !
                   /పల్లె /
పల్లెవాసులంత కలసి
కమిటీలుగజతకట్టి
పల్లె పురోభివృద్ది కి
ప్రణా లికలు వేసుకుంటే
పాలనతలవంచదా ?
కలిసి పల్లెతో నడవదా ?
             / పల్లె /
జైహింద్
-------------

Friday, 4 July 2014

పాటకు జోహార్ !
-------------
ఎవరు పురుడు పోసినారో ?
ఎవరు గళం విప్పినారో ?
పాట వైవెలసినావు !
గానమై సాగుతావు !
     సంద్రములో కెరటమై 
      నింగి కెగురుతుంటావు !
      మేగాల్లో జల్లువై 
      నేలరాలుతుంటావు !
      మలయమారుతమై 
      మరులుగోలుపు తుంటావు !
జానపదుల గొంతుల్లో 
జాతరైసాగుతావు !
కర్షకుల సాగుబడిలో 
సిరులసరాలైతావు !
శ్రామికుల స్వేదాల్లో 
గానామృత మవుతావు !
       చేతి వృత్తుల అల్లికలో 
       రాగలహరి వవుతావు !
       కులవృత్తుల నర్తించే 
       గానకచ్చేరివవుతావు !
       కవిగాయక చెలిమితో 
       శ్రోతల మురిపించేవు !
సకల ప్రాణుల మేలుకొలిపే 
గానతరంగి నవుతావు !
మానవత్వ మనుగడకు 
నాంది వాచకమవుతావు!
తరం తరం మారుతున్న 
పాటగానే వెలుగుతావు !
       జైహింద్ 
 


ధనలక్ష్మి రూపేణ పాలయమాం

ధనలక్ష్మి రూపేణ పాలయమాం

Saturday, 7 June 2014

మన పిల్లలు
మనింట్లో
మనకు ముద్దే !
బైటి ప్రపంచంలో
వాళ్ళ విశ్వరూపం
ఎలాఉందో ?
మనకేం తెలుసు /!

Friday, 18 April 2014

Akula Raghava Poet: ఎన్నికల వర్షం కురుస్తుంది !నోట్ల వరద పొంగుతుంది !...

Akula Raghava Poet: ఎన్నికల వర్షం కురుస్తుంది !
నోట్ల వరద పొంగుతుంది !...
: ఎన్నికల వర్షం కురుస్తుంది ! నోట్ల వరద పొంగుతుంది ! నాయకులు చేపల్లా అటు ,ఇటు ఎగిరి దూకుతున్నారు ! ఓ ట ర్లంతా కొంగలైతే పీడ విరగడవుతుంది ...