Monday, 18 January 2021

మట్టి తోనే పరిమళం


మట్టితోనే పరిమళం!
******************
మట్టితోనే అల్లుకున్న
అనుబంధం రైతుది!
బతుకంతా సాగుతోనే
గడుపుతున్న ఋణ బంధం!
అదే రైతు జీవితం!
మట్టితోనే పరిమళం!!

మట్టిని నమ్మిన రైతుకు
వాన తోడు నిల్వగా
ఎండ తన వెంట రాగా
గాలి ఊపిరి పోయగా
చెమట రాలుస్తు రైతు సదా
విత్త నాలు విత్తుతూ...
పంట చేళ్లు పెంచుతూ...
కంటికి రెప్పల కాచి
సిరుల రాశు లెన్నో పోసు!

కాలం పగ పట్టినా?
భూమి నష్ట పరిచినా?
రెక్క లిరిగి ముక్కలైన
రాలింది చెమటే కదా?
అనుకున్నా రైతన్నా
హలం పట్టి ప్రతి రోజు
శ్రమ సమరం చేస్తు రైతు
పగలు రేయి చేళల్లో
పొద్దు పొడుపై వెలుగును!
అదే రైతు జీవితం!
మట్టితోనేపరిమళం!!
జైహింద్.

Wednesday, 23 December 2020

కాలానికి తలవంచని దీపం..!


కాలానికి తల వంచని దీపం!
************************
దీపం!
మానవుడు కనుగొన్న
మొట్ట మొదటి
ప్రత్యాన్మయ వెలుగు!
అది చీకట్లో...
మిణుకు మిణుకు మంటూ...
వెలుగుతూ... కాంతినిస్తుంది!
అది తళతళ వెలుగులు చిమ్ముతూ...
పగలును తలపించక పోవచ్చు?
కాని,కొండంత ధైర్యాన్నిస్తూ...
కాంతిని పంచుతుంది!
దీపం నుండి కాగడా
లాంతరు పెట్రోమాక్స్
ఇలా...ఎన్నెన్నో..?
రూపాంతరాలు చెందినా?
అవి కాలానికి తలవంచక తప్పలేదు?
దీపం మాత్రం కాలానికి
తల వంచ లేదు?
అది నేటికి ప్రతి ఇంట్లో
దేవాలయాల్లో
దేదీప్య మానంగా
వెలుగుతూనే వుంది!
కొన్ని ఆలయాల్లో
సంవత్సరం పొడవునా
గండ దీపంగా వెలుగుతూ...
దాని ప్రతిభను బాధ్యతను
చాటుతూ వెలుగు తుంది!
మానవుడు బొగ్గు నుండి
అణువిద్యుత్తును
జలం గాలి నుండి
జల పవన విద్యుత్తును
సృష్టించుకొని
ఎన్నెన్నో తళుకు బెళుకుల
రంగు లీనుతు...
చీకట్లో పగలను పంచినా?
కాలమాన పరిణామాల మార్పులకు
ఇట్టే ఆగిపోతుంది!
ప్రపంచాన్ని చీకట్లో
మగ్గెలా చేస్తుంది!
అది కాలానికి తల వంచక తప్పదు?
దీపం ఒక్కటే
కాలానికి తల వంచక
చీకట్లో కాంతి పుంజమై
తన వెలుగును పంచుతూ...
మన వెన్నంటి సాగుతుంది!
అదే దీపానికి వున్న గొప్పదనం!
దీపమా నీకు జోహారు!!
జైహింద్
ఆకుల.రాఘవ.

Monday, 12 October 2020

నవయవ్వన జావారాలు!


నవయవ్వన జవరాలు!
********************
గాలిలోన గంధమై
పరిమళాల నవ్వులతో
కళ్ళల్లో దృశ్యమై
మది గోడకు వెలాడిన
నవయవ్వన జవరాల!

శ్యాసనిండ నీ ఊపిరి
కౌగిళ్లసరాగాల్లో
అధరాల అమృతాలు
జాలువారే అభిషేకం!
చెక్కిల్లో గులాబీలు
దారపొస్తు నిను కొలిచా!
నవయవ్వన జవారాల
ధన్యమయ్యే నా జన్మ!

వెలుగులోన నీడలా
నదిలాగా నేను సాగి
యవ్వనాల కడలిలోన
కెరటాల్లా ఊయలూగి
విరహాల దాహలు
తనివి తీర సేవిస్తూ
నీలోన ఏకమై
నన్ను నేను మరచి పోయ!!
జైహింద్.
ఆకుల.రాఘవ.



Saturday, 10 October 2020

కలం ఎంచుకొని నేను!


కలం ఎంచుకొని నేను!
*******************
కలం ఎంచుకొని నేను
తప్పు చేసినానేమో?
బుర్ర నిండ అక్షరాల
రాశులెన్నో వున్నగానీ
జెబులోన డబ్బు లేక
ఎన్నాళ్ళీ పోరాటం?

అక్షరాలు కాగితాల్లో
రాశులుగా పోసేసి
అంగళ్ళలో కూర్చుండి
బేరానికి పెట్టినా?
చిల్లి గవ్వకు గొరగాకా?
పేరుకు పోయి ఇల్లు నిండే!
ఎలుకలకు పురుగులకు
భలే మేతగా మిగిలే!
నాకడుపు కాల్చిన అక్షరాలతో
ఎన్నాళ్ళీ పోరాటం?

అక్షరాలతో అల్లుకున్న 
అనుబంధం కాబోలు!
ఎన్ని జన్మల ఋణ బందమో?
పేనుకొని ముడి వేసే!
కలం దించ నివ్వదు?
పైస రాల్చ నివ్వదు?
ఆకలి మంటలు నీకే కాదు?
పూట గడవ నోలెందరో?
కలం పట్టి దారి చూపు!
నీకు ఒక దారి దొరుకు!
వెనకా ముందు తేడా అంతే?
ప్రస్థానం సాగించు!
జైహింద్.
ఆకుల.రాఘవ.


Sunday, 13 September 2020

వీణా వాణి

వీణా వాణి వినయ విదేహిని
కరుణా వాణి స్వరఝరివర్షిణి

అక్షర జలదిత కెరట విన్యాసిని
శ్రుతి లయ స్వరముల గాన వినోదిని
శబ్ద భూషణి పద గళ భాషిని
అక్షర జ్ఞానం నొసగే జననీ

సరిగమ పదనిస శ్రావ్య సుధామృత
రస రమ్య పదముల తేనెల వాణి
నీ పదములె పలికి గానము చేయుచు
నిను కొలిచెదము సదా స్వరామి
చదువుల తల్లి భాషల భూషని

జైహింద్.