Friday, 12 February 2016

మృత్యువు
--------------
తల్లి గర్భంలోన 
మొలకెత్తినప్పుడే 
నీడలా మృత్యువు 
నీతోనే పుడుతుంది !
క్షణం క్షణం అది 
నిన్ను మింగాడానికి
 నోరు బారుగ తెరచి
కోరలు ముందుకు ఛాచి
నీమీద పడుతుంది !
మృత్యువు దాడి కని
లౌక్యం తోఎదిగితే
మృత్యుం జయుడవే !
నవమాసాల పిదప
గర్భలోకం వీడి
పుడమి పడిననిన్ను
వదలక మృత్యువు
నీవెంట వస్తుంది !
దినదిన గండాల
మృత్యువును మోస్తూ
బతుకు సమరంలోన
సాగుతున్నా నిన్ను
నరకయాతన పెడుతూ
అవకాశం కోసం
దాడికై వేచి వుండు !
సమస్యల వ వలయంలో
బతుకంతా అలసి
చిక్కి శల్యమై
కృంగి కృషిస్తే చాలు
మృత్యువు నీపై
పైచేయి సాదించి
హతమార్చి నిన్ను
విజయానంద మొందు !
జననం మృత్యువు
కలసి కట్టుగ సాగే
అనుబంధ బంధము !
విడదీయ లేరెవరు
జనన మృత్యువు
అనుబంధాన్ని
కలసిసాగవలె
ఊ పిరి ఉన్నంతవరకు !!
       జైహింద్

ఆకుల రాఘవ ,
9440971792.

Friday, 8 January 2016

అన్నీ వెల్డింగ్ కథలే!

-ఆకుల రాఘవ07/01/2016
నేడు తెలుగు చిత్రసీమలో వెల్డింగ్ సినిమా కథల హోరు జోరుగా కొనసాగుతుంది. కారణం తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చే యువతరం అందరూ ఆంగ్లంలో ఇంజనీర్లు, డాక్టర్లు చదివిన వారైనందున వారికి పూర్తిగా తెలుగు భాష తెలియక, తెలుగు సాహిత్యంతో పరిచయంలేక, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఏమాత్రం అర్థంగాక, అనుభవంలేని వారైనందున వెల్డింగ్ కథల హోరు కొనసాగుతుంది!
అలాంటి యువత ఏదోవిధంగా రచయితలుగా, దర్శకులుగా తెలుగు చిత్రపరిశ్రమలో నిలదొక్కుకునే సంకల్పంతో పరిశ్రమకు వస్తున్నారు. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంజనీర్లు తమ వృత్తిలో ప్లాన్లుగీసి ఆ ప్లాన్లలో ఎక్కడ అతకాలో, ఎక్కడ తెగ్గొట్టాలో సంపూర్ణ అవగాహన కలిగివుంటారు. అదే విధానాన్ని ఇక్కడ అవలంభిస్తున్నారు. డాక్టర్లు కూడా తమ వృత్తిలో ఒక రోగికి ఎలా శస్తచ్రికిత్సలు చేసి కొయ్యాలో, అతకాలో అదే విధానాన్ని ఇక్కడ అవలంభిస్తున్నారు.
నేడు వీరికి అనుభవంతో పనిలేదు. ఒక ఇంటర్‌నెట్‌తో ఉన్న కంప్యూటర్‌కాని, స్మార్ట్ఫోన్‌కాని ఉంటే చాలు. ప్రపంచ భాషలోవున్న చిత్రాలను యూ ట్యూబ్ ద్వారా డౌన్‌లోడు చేసుకొని చూస్తూ.. వారికి నచ్చిన సినిమాలోని సన్నివేశాలను ఏరుకొని, ఒకదానితో ఒకటి పేర్చి వెల్డింగ్ చేస్తున్నారు. సన్నివేశాలే కాదు, మాటలు, ఫ్రేమ్స్, గ్రాఫిక్స్, షాట్స్ అన్నీ మక్కికిమక్కి కాపీచేస్తూ ఒక సినిమాలా అతుకుతున్నారు. అలా అతికినది ఒక సినిమా కథలా, బౌండ్‌స్క్రిప్టులా తయారవుతుంది. అంతే!
నిర్మాతలు, హీరోలు కూడా కథ ఎలా తయారైతే ఏమిటి? అలా కాపీకొట్టి వెల్డింగ్‌లాగ అతికినవాడే మొనగాడు! అదే క్రియేటివిటి! అదే నేటితరం విజువల్ వండర్ అంటూ చంకలు గుద్దుకొని, వాటిని సినిమాలుగా మలుస్తున్నారు. అవి హిట్టయితే ఢంకా బజాయించి కేరింతలు కొడుతున్నారు. ఫట్‌మంటే దర్శకుల మీద, రచయితలమీద ఆ నెపంతోసి కుళ్లికుళ్లి ఏడుస్తున్నారు.
విమర్శలు ఎక్కువైతే వే
మే వెల్డింగ్ కథలు అందిస్తున్నామా? దర్శకత్వం చేస్తున్నామా? పూర్వపురోజుల్లో కూడా నాటి రచయితలు, దర్శకులు కాపీలు కొట్టలేదా? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు.
నాడు దర్శకులైనా రచయితలైనా ఏదేని భాషలో వచ్చిన సినిమా నచ్చితే, ఆ మూల రచయిత పర్మిషన్‌తో ఆ కథను కొని, తెలుగు నేటివిటీకి సరిపోయేలా మార్పులుచేర్పులు చేసి, తెలుగుభాష ఉట్టిపడేలా తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. నటీనటులు కూడా చక్కగా ఒదిగిపోయి నటించి తమ సత్తాచాటుకున్నారు. ప్రతి సన్నివేశం ఎంతో భావోద్వేగాలతో రసవత్తరంగా నవరసాలు ఉట్టిపడేలా వుండేవి. సంగీతం కూడా వీనులకు విందుగా అద్భుతంగా అమరేది. అది నాటి దర్శకులకున్న మర్యాద, జిజ్ఞాస!
ఆమాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు వెల్డింగ్ కథలతో సినిమాలు నిర్మించటం, ఆంగ్ల చిత్రాల్లోని యుద్ధ సన్నివేశాలను, అదేవిధంగా షాట్స్‌గాతీస్తు ప్రతిభమాదే! కంప్యూటర్ టెక్నాలజీ మాదేనని విర్రవీగితే ఎలా?!
నాడు ట్రిక్ ఫొటోగ్రఫీ ద్వారానే ఎన్నో అద్భుతాలు మనవాళ్ళు సృష్టించారు. ఎన్నో ప్రయోగాలుచేసి విజయాలందుకున్నారు. అది వారి గొప్పతనం! అలాంటివారి పాత సినిమాల్లోని సన్నివేశాలు, మాటలు, పాటలు, షాట్స్ కలిపి తెగగొట్టి వెల్డింగ్ చేస్తూ.. మేమో నవీన సాంకేతిక పరులమని విర్రవీగితే ఎలా? ప్రేక్షకులకు ఎవరు ఏమిటో తెలియదా? అందుకే స్టార్ హీరోల, స్టార్ డైరెక్టర్స్ చిత్రాలు కోట్లు కుమ్మరించి చిల్లర డబ్బులు ఏరుకున్న చందంగా ఉంది. ఇకనైనా తెలుగు కథ తెలుగులో పునర్నిర్మితమైతే మేలు!

Wednesday, 6 January 2016

సృష్టి తత్వం !
-------------
ప -పుట్టడమొక రణరంగం !
    పెరగడమొక దినగండం !
    బతకడ మొక భారతం !
    ఈ మనిషి జీవితం !
    ఈ మనిషి జీవితం !!
చ -రణరంగం దినగండం 
    మనిషి జన్మ తత్వమా ?!
    బతుకంతా సంగ్రామం 
    మనిషి బతుకు నైజమా ?!
    ఇది ప్రకృతి ధర్మమా ?!
    కాల చిత్రమా ?!
    అర్థం  కాని స్త్రీ పురుషుల 
     కామవాంచ ఫలితమా ?!
చ -క్షణిక కామ వాంచ కేళి 
    బతుకు నెరుగునా ?
    తనువులు కౌగిట్లో చుట్టి 
    వయసుల రణరంగ మెట్టి 
    స్వర్గపు టంచులు చూపుతూ 
    మధుపాలు దొర్లించగా 
    మరోజన్మ కారంభం !
    పుట్టడమొక రణరంగం !
                    /  పుట్టడ /
         జైహింద్ 

Wednesday, 23 December 2015

చరిత్ర
------
నిన్న 
అభివృద్ధి !
నేడు 
ప్రసిద్ధి !

Sunday, 6 December 2015

                            బడి
   --------------------------------
నాదేహం అక్షరాల బడి !
నాగుండె నిరంతరం
అక్షరాల ఆలాపన చేస్తూ వుంది !
నానాడులు దేహమంతాఆడుతూ
అక్షర గానం చేస్తూ వున్నాయి !
నా ఇంద్రియాలు అక్షర
 జపం చేస్తూ వున్నాయి !
నా ఉచ్వాశ నిశ్వాస
అక్షరాల ఊపిరి తో అలరారుతుంది !
నా అణువణువు దేహపు బడిలో
నిత్య విద్యార్థులే !విజ్ఞాన విధాతలే !
నాదేహపు బడిని మించిన బడి
జగతిలో వేరెందు కలదు ?!
         జైహిందు

Tuesday, 1 December 2015

నమ్మకాలు 
--------------
దేవుడనినమ్మే టోడు 
దేవుడనినమ్మనోడు 
ఇద్దరు బతికేది పుడమిపైనే !
తుదకు ఇద్దరు కలిసేది 
మట్టిలోనే .... ఈ మట్టిలోనే !!
     నిత్య పూజచేస్తునోకడు భక్తి బాటలో 
     పూజ చేయకుండ నొకడుబతుకు బాటలో 
     ఎవరిదారి వారిదైన,నమ్మకాలు వేరైనా 
     ఇరువురుబతికేది పొట్ట కూటికే 
     అది జగమెరిగిన సత్యమనితెలుసుకొండిరా !
దైవమని ఒక వర్గం లేడు అని ఒక వర్గం 
వాదులాడి వాదులాడి గొడవలెందుకు ?
వర్గాలుగ విడిపోయి చచ్చు డెందు కు ?
ఎవడి నమ్మకాల్లో వారే బతుకు గడపరా !
అదే పరమార్థమని తెలుసుకొండిరా !
          జైహింద్ 

Monday, 2 November 2015

వ్యవసాయం
-------------
ఎండిపోతుంది !
రియల్ సేద్యం
మహావేగంగా పండుతుంది !
పంట భూముల్లో
అంతస్తుల రాశులు
ఆకాశం ఎత్తు పెరిగి పోతున్నాయి !
నేడు రైతులంతా
కూళిలుగా మారిపోయి
అంతస్తుల పంటలను
ఏ పుగా పెంచుతున్నారు !
కార్పోరేట్ సంస్తల
కబంద హస్తాలు
భూమిని గట్టిగా
కౌగిలించు కుంట్టున్నాయి !
వేలకొలది ఎకరాల భూమి
ఫాం హౌసులుగా ,రిసర్ట్ లుగా
వర్దిల్లు తున్నాయి !
భూములు కోల్పోయిన రైతులు
ఫాం హౌసుల ,రిసర్ట్ ల గేట్లముందు
దిష్టి బొమ్మల్లా కాపల కాస్తున్నారు !
భూమితో అనుబంధాన్ని
విడలేని కొందరు రైతులు
భూమిని పట్టుకొని వెడులా డు తున్నారు
కాలం తోచే తోపులతో
రైతులు దిక్కు తోచక చస్తువున్నారు !
అతి వృష్టి ,అనా వృష్టి తో
తాళలేక రైతులంతా పురుగుల మందు
పుణ్య తీర్థం సేవిస్తున్నారు !
రసాయన ఎరువులు
ఎప్పుడైతే రాజ్య మేలయో ?
అప్పుడే సేద్యం
చెదలు పట్టిపోయింది !
యంత్రాల రాకతో
పశు సంపద కబెలాల
పాలైపోతుంది !
నేడు రైతులంతా
భూమిని డబ్బుతో కొలుస్తున్నారు !
ఇక రియల్ పంటలు పండకుండా
ధాన్యం పంటలు పండుతాయా ?
తిరిగి రైతులంతా
పూర్వపు పద్దతులు పాటిస్తే
భూములు పచ్చగా పండుతాయి !
భూమిని డబ్బుతో కాకుండా ?
ధాన్యం తో కొలిచి నప్పుడే
సిరుల రాశులు చిందు తాయి !
దేశం అన్నపూర్ణగా వర్ధిల్లు తుంది !!
          జైహింద్