Wednesday, 6 January 2016

సృష్టి తత్వం !
-------------
ప -పుట్టడమొక రణరంగం !
    పెరగడమొక దినగండం !
    బతకడ మొక భారతం !
    ఈ మనిషి జీవితం !
    ఈ మనిషి జీవితం !!
చ -రణరంగం దినగండం 
    మనిషి జన్మ తత్వమా ?!
    బతుకంతా సంగ్రామం 
    మనిషి బతుకు నైజమా ?!
    ఇది ప్రకృతి ధర్మమా ?!
    కాల చిత్రమా ?!
    అర్థం  కాని స్త్రీ పురుషుల 
     కామవాంచ ఫలితమా ?!
చ -క్షణిక కామ వాంచ కేళి 
    బతుకు నెరుగునా ?
    తనువులు కౌగిట్లో చుట్టి 
    వయసుల రణరంగ మెట్టి 
    స్వర్గపు టంచులు చూపుతూ 
    మధుపాలు దొర్లించగా 
    మరోజన్మ కారంభం !
    పుట్టడమొక రణరంగం !
                    /  పుట్టడ /
         జైహింద్ 

No comments:

Post a Comment