Monday, 22 December 2014
Thursday, 4 December 2014
అనిర్వచనీయ అవస్థ!
- 05/12/2014
- -ఆకుల రాఘవ
బంగారు తెలంగాణ
-----------------------
గ్రహణం వీడిన తెలంగాణలో
నవకాంతు లు వెల్లి విరిసే !
ఉద్యమించిన శక్తులే
ప్రభుత్వంగ గెలుపొంది
-----------------------
గ్రహణం వీడిన తెలంగాణలో
నవకాంతు లు వెల్లి విరిసే !
ఉద్యమించిన శక్తులే
ప్రభుత్వంగ గెలుపొంది
నవతెలంగాణ నిర్మానంకు
పుత్తడి పునాదులు వెస్తుండే !
/ గ్రహణం/
అరవై ఏండ్ల పాలనలో
దోపిడై న తెలంగాణ
ప్రజల కళ్ళముందు పెట్టి
తెలంగాణ నల్లు కున్న
సీమమాంధ్ర సాలెగూడు
చీపురు పట్టి దులుపుతుంటే
అంతస్తుల చెదపుట్టలు
కుప్పకూలి పోతుండే !
/ గ్రహణం /
మూత బడిన పరిశ్రమల
తలుపులన్నీ తెరుస్తుంటే
ఉత్పత్తుల రాశులు
పొంగిపొర్లి పోవునులే !
ఆగిపోయీన ప్రాజెక్టుల
ఆనకట్టలు కడుతుంటే
తెలంగాణ పొలాలన్నీ
పసిడిరాశులు చిందులే !
గొలుసు కట్టు చెరువుల
పూడికలు తోడివేస్తే
తెలంగాణ నిండు కుండే !
/గ్రహణం/
చదువురాని పిల్లలని
పాలన చంక నెత్తుకుంటే
తెలంగాణ యువతంతా
విజ్ఞాన జ్యోతులే !
నిరుద్యోగ యువతకు
ఉద్యోగం కలిపిస్తే
కుటుంబాల కడుపులు నిండి
సుఖశాంతులు వర్ధిల్లు !
/గ్రహణం /
కళ్యాణ లక్షిమి కల
దళిత వధువుల ముకాల్లో
దవలకాంతులు వెల్లి విరిసి
కాపురాలు పచ్చగుండు !
వికలాంగుల వృద్ధుల
చేతికర్ర ప్రభుత్వమైతే
కడుపు నిండ బువ్వలే !
కంటినిండా కునుకులే !
/ గ్రహణం /
ఆహార భ ద్రతతో
నిరుపేదల కడుపు నిండ
బుక్కెడు బువ్వ పెడితే
దారిద్ర్యం తొలిగి పోయీ
సౌభాగ్యం వెల్లి విరియు !
నీడలేని బీదలకు
ప్రభుత్వమే గూళ్ళు కడితే
సేదతీరు బీద జనం !!
/గ్రహణం/
జైహింద్
తంగేడు పువ్వు
-------------
చెట్టమ్మ చెట్టు తంగేడుచెట్టు
పువ్వమ్మా పువ్వు తంగేడు పువ్వు
చెట్టు చేసిన మేలు పువ్వుచేసిన పూజ
కనరండి !కనరండి !మానవుల్లారా !!
/ చేట్టమ్మ /
మట్టిగోలెం నిండా సున్నం నీళ్ళు కలిపి
తంగేడు తొక్క ఒల్చి మెత్తంగా దంచి
గోలెం నిండాకలిపి పశువుల తోలు ముంచి
పదిహేను రోజులు మాదిగ నానబెడితే
తోలుకున్న బొచ్చు శుభ్రంగా రాలిపోయీ
కాళ్ళకు చెప్పు లయ్యె నీళ్ళకు తిత్తిగా మారే
మోటా బొక్కేండ్లాకు తొండాలుగా మారే
తాడుగా పేనుకొని బంధాలు ముడివేసే
తంగేడు తోక్కకున్న గుణ మెంతో మెండు
మనిషి మేలుకోరి సేవలెన్నో చేసే
/చెట్టమ్మ /
గండ్రగొడ్డలి పట్టి పరశురాముడు పడితే
తాళలేక తల్లీ లందగోలెంలో దాగే
తంగేడు తొక్క నీళ్ళు పవిత్రు రాలిని చేసి
దివికి సాగనంపి తన పవిత్రతనిచాటే
కంపుగోలెంలో రేణుక పవిత్ర మయ్యెనని
ఆడపడుచుగమాదిగ ఆతల్లి నెంచి
ఇలవెలుపుగ కొలుస్తుండే రేణుక మాతను
దుర్గమ్మ మల్లన్న పట్నాల కొలువులో
తంగే డాకుపిండి పసుపు బియ్యపు పిండి
ఆదేవతల పెళ్ళిలలో పోలు ముగ్గైపోయీ
కళ్యాణం జరిపించి తన వైభవము చాటే
/చేట్టమ్మ /
గౌ రమ్మ కొలువులో బతుకమ్మ సిగలోదూరి
బంగారువన్నేల్లో తంగేడు పువ్వు మెరిసి
బతుకు బంధాలను ప్రతి యేటా కలుపుతు
బతుకు పాటలెన్నో పాడిస్తూ ఆడిస్తూ
తీపి రుచులెన్నో కమ్మంగ పంచిపెడుతు
చెరువుల్లో వాగుల్లో నీళ్ళల్ల పడిపోతు
వచ్చే యేడు మళ్లీ తిరిగి వస్తాననుచు
దీవనలెన్నో ఇచ్చి బతుకు దారి చూపే
బందాలనుకలిపిన తంగేడు పువ్వు పూజ
రాష్ట్రం గుర్తించి రాష్ట్ర పువ్వుగ నెంచే
/చెట్టమ్మ /
జైహింద్ .
Subscribe to:
Posts (Atom)