Thursday, 17 July 2014
Friday, 4 July 2014
పాటకు జోహార్ !
-------------
ఎవరు పురుడు పోసినారో ?
ఎవరు గళం విప్పినారో ?
పాట వైవెలసినావు !
గానమై సాగుతావు !
సంద్రములో కెరటమై
నింగి కెగురుతుంటావు !
మేగాల్లో జల్లువై
నేలరాలుతుంటావు !
మలయమారుతమై
మరులుగోలుపు తుంటావు !
జానపదుల గొంతుల్లో
జాతరైసాగుతావు !
కర్షకుల సాగుబడిలో
సిరులసరాలైతావు !
శ్రామికుల స్వేదాల్లో
గానామృత మవుతావు !
చేతి వృత్తుల అల్లికలో
రాగలహరి వవుతావు !
కులవృత్తుల నర్తించే
గానకచ్చేరివవుతావు !
కవిగాయక చెలిమితో
శ్రోతల మురిపించేవు !
సకల ప్రాణుల మేలుకొలిపే
గానతరంగి నవుతావు !
మానవత్వ మనుగడకు
నాంది వాచకమవుతావు!
తరం తరం మారుతున్న
పాటగానే వెలుగుతావు !
జైహింద్
Saturday, 7 June 2014
Friday, 18 April 2014
Akula Raghava Poet: ఎన్నికల వర్షం కురుస్తుంది !నోట్ల వరద పొంగుతుంది !...
Akula Raghava Poet: ఎన్నికల వర్షం కురుస్తుంది !
నోట్ల వరద పొంగుతుంది !...: ఎన్నికల వర్షం కురుస్తుంది ! నోట్ల వరద పొంగుతుంది ! నాయకులు చేపల్లా అటు ,ఇటు ఎగిరి దూకుతున్నారు ! ఓ ట ర్లంతా కొంగలైతే పీడ విరగడవుతుంది ...
నోట్ల వరద పొంగుతుంది !...: ఎన్నికల వర్షం కురుస్తుంది ! నోట్ల వరద పొంగుతుంది ! నాయకులు చేపల్లా అటు ,ఇటు ఎగిరి దూకుతున్నారు ! ఓ ట ర్లంతా కొంగలైతే పీడ విరగడవుతుంది ...
Subscribe to:
Posts (Atom)