Tuesday, 8 January 2013

విధి విధానము
-------------కవిత
నేటినిజం లోప్రచురితం
కన్నులుతెరిచిన ఆకాశం
అలుసట ఎరుగని భూగోళం
గిర్రు గిర్రున తిరుగంగా
ఇరులు వెలుగులు జని యిం చే !
    ఆకాశం కన్నులుమూస్తే
    ముందుకు సాగదు ఈ లోకం
    భూగోళం తిరుగుడు ఆపితే
    బతుకదులే ఏ ప్రాణం
సాగాలి కాలము
బతకాలిప్రాణులు
అపుడే ప్రకృతి కి అందము
ప్రకృతి కన్నాప్రాణు లము
      కన్నులు తెరిచిన మానవుడు
      ప్రకృతి బడిలో విజ్ఞానుడు
      ఎదిగిన కొలది మానవుడు
      ప్రగతిబాటలో సాగాడు
సాగాలిలోకము
బతుకంతా సుకము
అపుడే మేధకు అందము
మానవమనుగడ కర్తము 

No comments:

Post a Comment