Wednesday, 18 April 2012

పుస్తకం చదవండి
స్పందన తెలపండి
ప్రింటింగ్ కి
స్పాన్సర్ చేయండి.

1 comment:

  1. కవికిరణాల సంకలనంలోప్రచురితం
    --------------------------------------
    తెలుగుభాష
    ***********కవిత
    మేఘాల పల్లకిలో ఊరేగే సూర్యుడు
    జగమేలు రాజులా వర్దిల్లుతున్నట్లు !-
    భాషలపల్లకిలో ఊరేగే తెలుగుభాష
    సాహితిజగతిలో రాజులా వర్ధిల్లుతుంది !-
    చుక్కల తోటలో విహరించేచంద్రుడు
    జగమంతా వెన్నెల పిండి ఆరబోసినట్లు !-
    భాషల తోటలో విహరించే తెలుగుభాష
    సాహితిలోగిల్లో మాటల మధువులరాభోస్తుంది !-
    కెరటాల గొంతుతో గళ మెత్తే సంద్రం
    జగమంత నాదాల జల్లులై కురుస్తున్నట్లు !-
    భాషల గొంతులో గళ మెత్తే తెలుగుభాష
    సాహితి జగతిలో కంచుల మ్రోగుతుంది !-
    గల గల రాగల్లో పల్లవించేసేలయేరు
    జగమంత గానమై ప్రవహించు తున్నట్లు !-
    భాషల రాగాల్లో పల్లవించే తెలుగుభాష
    సాహితి క్షేత్రాల్లో శ్రావ్య గానమై సాగుతుంది !-
    అవనిలో వికసించే తేనెలొలుకు పుష్పాలు
    జగమంత పరిమళాలు గుభాలించుతున్నట్లు !-
    భాషల్లోవికసించే తేనెలొలుకే తెలుగుభాష
    సాహితివనంలో కవితల పరిమళాలు గుభాళిస్తుంది !
    జైహింద్ *

    ReplyDelete