Tuesday, 11 June 2013

వర్షం 
రైతుకు వరం 
వర్షం 
వ్యాపారికి నష్టం !

Wednesday, 5 June 2013

సముద్రం విషం
వర్షం అమృతం !
గాలిచిలుకుతుంది
విషాన్ని అమృతంగా !

Friday, 10 May 2013

ప్రపంచం
గుప్పెడైంది !
పలుకు
బారెడైంది !
బంధాలన్నీ
గాలిలోనే !!

Wednesday, 24 April 2013

నింగిలో నిప్పు
నీటిలో నిప్పు
వాడే విదం బట్టి
మండుతూ
ఉంట్టుంది !

Saturday, 20 April 2013

కావడి
కాలం
రోజుల
మోస్తుంది !
మనిషి
బతుకును
మోస్తుంది !

Sunday, 31 March 2013

పట్నం ఇరుకుల గల్లీ
కుమ్మరి వాంలో కుండలు
కాలిపోతున్నట్లు
కాలుష్యపు కంపుతో
కాలిపోతువున్నది !

Friday, 29 March 2013

మతాది పతులు
భక్తులకు
బతుక నేర్పాలి !
దేవుళ్ళ మహిమలుకాదు ?