శ్రమ సౌందర్యమే సంగీతము
-------------------------పాట
మట్టిలో రాగాలు తియ్యంగా
గింజలే మొలకెత్తి మురువంగా
రాళ్ళల్లో తాళాలు వేయంగా
అవి బొమ్మలై నాట్యమాడంగా
శ్రమ సౌందర్యమే సంగీతం
బ్రతికేటి ప్రాణుల కానందం
తొలిపొద్దు కిర ణాల రాగాల్లో
చిరుగాలి తాళాల నాదాల్లో
ఆమని మేల్కొని హాయీ గా ఆడంగా
జగతి జనులంతా దిన చర్య మొదలెట్టే
స్రమలోని పలితాలు ఆకలి తీర్చంగా
ఆనంద మానందమే జగమంత ఆనందమే
కెరటాల నాట్యాల తుళ్ళింత లో
మేఘాల మెరుపుల కవ్వింతలో
ముత్యాల జల్లులు పువ్వులై పొంగగా
మట్టిలో గింజ్జలు నేల తన్నుకొని
తల ఎత్తి ఆడుతూ పచ్చదనం పంచె
పచ్చదనమే జగతి జనుల బతికించు
జైహింద్